*30/06/2023.
*తపస్వి మనోహరం కొరకు.
*అంశం : చిత్రకధ.
శీర్షిక : కళ్యాణి.
*రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
కళ్యాణి స్కూల్ గేట్ దాటి బయటకు వచ్చింది.
రోజులాగే రోడ్డు చివరి వరకు చూసింది .అమ్మ వస్తున్న జాడలేదు.
అమ్మ రోజు ఇంతే. ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది.
తన తోటి పిల్లలంతా ఇళ్లకు చేరుకుని , హాయిగా ఆడుకోడానికి వెళ్ళిపోయి ఉంటారు. తను ఒక్కతే ఇక్కడ, ఈ స్కూల్ గేటు పక్కన బెంచి మీద కూర్చుని అమ్మకోసం చూస్తూ ఉంటుంది.
ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఇంచుమించు ఇళ్లకు వెళ్లిపోయారు. స్కూల్ వాచింగ్ అని కూడా ఒక అరగంట సేపు వెయిట్ చేసి స్కూల్ గేటుకు తాళం పెట్టి ,ఇంటికి వెళ్ళిపోతాడు.
అప్పుడైతే తనకు చాలా భయం వేస్తుంది .ఎందుకంటే తను ఆ స్కూల్ అంతటికీ తను ఒక్కతే ఉంటుంది.
ఈ మధ్యన అయితే పది రోజులు బట్టి, ఒక అంకుల్ తనవైపు అదోలా చూస్తూ ,ఆ రోడ్డు చివరన నిల్చుని కనిపిస్తున్నాడు.
మొదట్లో అతను , వాళ్ళ పాపనో బాబునో తీసుకెళ్లడానికి అలా వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంది.
కానీ అతను పిల్లలంతా వెళ్లిపోయిన తర్వాత కూడా అలా
నిల్చుని చూస్తూనే ఉంటున్నాడు.
ఈరోజు కూడా అతను అక్కడే ఉన్నాడు
కళ్యాణి వాళ్ళ అమ్మ ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాది.
కళ్యాణి వాళ్ల నాన్నగారు, కళ్యాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు.
అప్పటినుంచి కళ్యాణి వాళ్ళ అమ్మ ,కళ్యాణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ , తామిద్దరి భారం ఎవరి మీద పడకుండా ఉండడం కోసం ,
ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగంలో జాయిన్ అయింది.
ఆఫీస్ ఒకవైపు, స్కూలు ఒకవైపు ,కావడంతో ఆమె వచ్చేసరికి ప్రతిరోజు లేట్ అవుతూనే ఉంటుంది.
కళ్యాణి వాళ్ళమ్మ కళ్యాణిని ఎవరితోనో కలిసి ఇంటికి వెళ్ళొద్దని, తాను వచ్చేదాకా స్కూలు దగ్గరే వెయిట్ చేయమని రోజు చెప్తూ ఉంటుంది.
తనకైతే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది.
అక్కడ ఒంటరిగా కూర్చోవడానికి కూడా భయంగా ఉంటుంది. అప్పుడు తనకు అమ్మ మీద చాలా కోపం వస్తుంది.
ఇప్పుడైతే శీతాకాలమేమో! సాయంత్రం అయ్యేసరికి చలి కూడా వేస్తూ ఉంటుంది.
కానీ అమ్మ రాగానే తన కోపం అంతా కరిగిపోతుంది
ఎందుకంటే అమ్మ రాగానే తనను దగ్గరికి తీసుకుని," అయ్యో అందరూ వెళ్లిపోయారా ? ఎంతసేపటి నుండి కూర్చున్నావమమ్మా , భయమేసిందా ? ఆకలేస్తుందా .".. అంటూ తనను దగ్గరికి తీసుకుని తనకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది.
తర్వాత అమ్మ వచ్చిన ఆటోలోనే తను, అమ్మ ,ఇంటికి బయలుదేరుతారు.
ఇలా ఆరేళ్ల బట్టి జరుగుతూనే ఉంది.
ఇప్పుడు తను ఏడవ క్లాస్ కి వచ్చింది.
అంతకు ముందు తనకు భయం అన్నది తెలియదు.
కానీ తను పెద్ద అవుతున్న కొద్ది మనసులో భయం చోటు చేసుకుంటున్నాది.
చాలా పుస్తకాల్లో చదివింది .చాలా చోట్ల విన్నాది కూడా.
ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని కొందరు మగ వాళ్ళు ఏదో ఒకలా వలవేసి పట్టుకుని తీసుకుపోతారని, విదేశాలకు అమ్మేస్తారని ,వాళ్ళని పనివాళ్ళుగా ,బిచ్చగాళ్లుగా, మార్చేస్తారని ఇలా ఏదేదో విన్నాది.
అమ్మ కూడా చెప్పింది ఎవరు నీ దగ్గరికి వచ్చినా వాళ్ళతో మాట్లాడొద్దని ,వాళ్ళు ఏమిచ్చినా తీసుకోవద్దని, వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొద్దని.
అమ్మ కూడా అలా చెప్పేసరికి తనలో భయం ఇంకాస్త ఎక్కువైంది.
కానీ ఎన్నాళ్ళు ఇలా ? తనొక్కర్తి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా... తనకు ఇల్లు తెలుసు .నడుచుకుని కూడా వెళ్లిపోగలదు ఇంటికి తాళం ఉంటుంది. కానీ ఇక్కడే కూర్చునే బదులు, తను ఇంటి దగ్గరే కూర్చుంటుందిగా ...కనీసం ఇరుగుపొరుగులతో ఆడుకోవడం కుదురుతుంది కదా.
ఈమధ్య ఎన్ని రోజులైందో.. తను తన స్నేహితులతో కలిసి ఆడుకుని .
కళ్యాణి ఇలా ఆలోచిస్తుండగానే , ఎన్నో రోజుల నుంచి ఇటే చూస్తున్న ఆ అంకుల్ ,కళ్యాణవైపు రాసాగాడు.
కళ్యాణి లో భయం ఎక్కువయింది.
అతను వచ్చి అటూ ఇటూ చూసి మెల్లగా కళ్యాణి పక్కన కూర్చున్నాడు.
ఏం పాపా! "ఈరోజు ఇంకా మీ అమ్మ రాలేదా" అంటూ మాటలు కలిపాడు.
కళ్యాణికి చాలా భయం వేసింది కానీ అతను మెల్లగా నవ్వుతూ భయపడకు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను.
ఇక్కడే పక్క షాపులో పనిచేస్తూ ఉంటాను . రోజు మీ అమ్మ వచ్చేవరకు నువ్వు ఒక్కతే కూర్చుంటావని గమనించాను. అందుకే మీ అమ్మ వచ్చేదాకా నీకోసమే నేను అక్కడ అలా నిల్చుని ఉంటాను .ఎందుకంటే ఒక్కతే ఉంటావు కదా, ఎవరైనా వచ్చి నిన్ను అల్లరి పెడతారేమోనని, అసలే రోజులు బాగా లేవు.
ఎంతైనా మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాను కదా. నువ్వా చిన్న పిల్లవి .అందుకే , మీ అమ్మ రాగానే నేను వెళ్ళిపోతాను.
ఈరోజు మీ అమ్మ రావడం రోజు కన్నా,
ఆలస్యమవుతున్నట్టుంది....
పరవాలేదు నేను అంత దాకా నీ దగ్గరే ఉంటాను లే...
ఇదిగో నీకు ఆకలేస్తుందేమో! ఈ చాక్లెట్లు తిను అంటూ అంటూ కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు.
కల్యానికి అతను చెప్పింది అంతా వింటూ ఉంటే నిజమేమో , అనిపించింది. కానీ కొంతసేపటికి , "ఇతన్ని మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా , ఎప్పుడూ నేను చూడలేదే...
ఇతను అబద్ధాలు చెప్తున్నాడు "
ఇతని మాటలు నేను నమ్మకూడదు అనుకుంది.
అతను కొంతసేపు తర్వాత, పాపా చలి వేస్తుందా.. అంటూ అతను తొడుక్కున్న కోటు తీసి, తన మీద కప్పబోయాడు .
కళ్యాణి ఒక్కసారి విసురుగా లేచింది.
వద్ద అంకుల్ నాకేం చలివేయడం లేదు . ఆకలి కూడా వేయడం లేదు. మా అమ్మ నాకు బాక్స్ లో టిఫిన్ కట్టి ఇస్తుంది. నాకు మా అమ్మ మొబైల్ కొనిచ్చింది తను రావడం ఆలస్యం అయితే ఫోన్ చేయమంది ఇప్పుడే ఫోన్ చేశాను కాసేపట్లో మా మామయ్య నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు.
పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో మా మామయ్య పోలీసుగా పనిచేస్తున్నాడు . రేపటినుండి నేను ఒక్కర్తినీ కూర్చున్నా నాకు భయం ఉండదు. ఎందుకంటే మా మామయ్య పక్క రోడ్డు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు కనుక , నేను ఫోన్ చేయగానే వచ్చేస్తాడు కనుక. మావయ్య రాగానే నేను మా ఇంటికి వెళ్లి పోతాను.
అని కళ్యాణి ధైర్యంగా చెప్పింది. నిజానికి కళ్యాణికి వాళ్ళమ్మ మొబైల్ కొనిచ్చింది లేదు వాళ్ళ మామయ్య పక్క రోడ్డులో పోలీస్ స్టేషన్లో పని చేసేది లేదు .
కానీ కళ్యాణ్ ఎలా చెప్పగానే అతను సరేనమ్మా . నేను వెళ్లి వస్తాను అంటూ గబగబా ఎటు వెళ్లిపోయాడో కూడా తెలియకుండా వెళ్లిపోయాడు.
కళ్యాణి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.
ఇంతలో వాళ్ళ అమ్మ వస్తూ కనిపించింది.
కళ్యాణి ఆనందంగా పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది.
అమ్మడు కళ్యాణి ఈ ఉదంతం అంతా స్కూల్లో మాస్టర్లకు చెప్పింది.
దాంతో స్కూలు యాజమాన్యం అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
కొన్ని నెలల తర్వాత .....
ఆ స్కూల్లో ఇప్పుడు, తల్లిదండ్రులు ఆలస్యంగా వస్తున్న పిల్లలకోసం, ఒక లైబ్రరీ స్టార్ట్ అయింది. అక్కడ బోలెడు పుస్తకాలు ఉన్నాయి చదువుకోడానికి .
అంతేకాదు చిన్న రూంలో. ఇంటర్నల్ గేమ్స్ , కూడా ఏర్పాటు చేశారు .అందులో కావాల్సినప్పుడు పిల్లలు అష్టాచమ్మా ,
చదరంగం, టేబుల్ టెన్నిస్, వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు.
ఈ రకమైన మార్పుకి కారణమైన కళ్యాణిని , పిల్లల తల్లితండ్రులందరూ అభినందిస్తుంటే ,కళ్యాణి వాళ్ళ అమ్మకి చాలా గర్వంగా ఉంది.
అప్పుడు హెడ్మాస్టర్ గారు పిల్లలతో..
చూశారా పిల్లలూ! కళ్యాణి ధైర్యంగా చేసిన చిన్న పని వల్ల ఈరోజు పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో..
"మీరు కూడా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు, కళ్యాణి లాగే ధైర్యంగా, యుక్తితో మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
ఈ కాలంలో ఇది చాలా అవసరం" అంటూంటే,
టీచర్లంతా చప్పట్లు కొట్టారు.
**************"""*"
No comments:
Post a Comment