Sunday, March 10, 2024

తపస్వి మనోహరం అంతర్జాల కవితా సంకలనం కొరకు కవిత."ఉగాది పండుగ " సందర్బంగా...కవిత.

06/03/2024.

తపస్వి మనోహరం అంతర్జాల కవితా సంకలనం కొరకు కవిత.
"ఉగాది పండుగ " సందర్బంగా...
కవిత.
-----
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్  : మహారాష్ట్ర.



జీవిత పయనంలో ఎన్నో చిక్కులు
కష్ట సుఖాల మేళ వింపుల ఒడిదుడుకులు.
బ్రతుకు బాటలో సుఖ-దుఃఖాల 
పూల బాటలు. , ముళ్ళ తోటలు !!
రాజకీయ రొచ్ఛులు , అసమంజస ఉచ్చులు.
న్యాయానికి పడ్డ సంకెళ్ళతో....
అన్యాయానికి ఆహుతౌతున్న 
అమాయకుల వెక్కిళ్లు !!
గడచిపోతున్న కాలంలో 
వత్సర కాలం మరుగుపడిపోబోతోంది.
బ్రతుకు ఆశ ,కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తోంది.!!
మారుతున్న కాలంలో ,మళ్లీ వసంతం చిగురిస్తుందని.
కొత్త రాగాలతో కోయిల పాట వినిపిస్తుందని
ఆశల పల్లకిలో "ఆహ్వానాలు" పంపుతున్న
 జనం  నమ్మకానికి భరోసా నిస్తూ...
"క్రోధి"నామ వత్సరం కోటి వెలుగులై  వచ్చి ,
కమ్ముకున్న చీకట్లను పారద్రోలుతుంది.
జనంలో,  నవ చైతన్యానికి నాంది పలుకుతుంది.
క్రోధ ,భేదాలను మరచిన ఉత్సాహంతో
 కొత్త వత్సరం కళకళలాడుతుంది !!

-----------------------------
హామీ:  ఈ కవిత నా స్వీయ రచన.

No comments:

Post a Comment