14/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం: మన్మధుడు.
శీర్షిక..అందాల చెలికాడు.
ప్రక్రియ: ఇష్టపడి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
మత్స్య పురాణమందు మన్మధుని పలు కథలు
శివపురాణమందున శివునితో బంధమది
తెలుపబడినవి గనుము తేట తెల్లము గాను
ప్రేమ నాయకు డతడు నామ మన్మధు డితడు !!
చిలుక వాహనమెక్కి చిరునవ్వులొలుకంగ
చేత విల్లును బట్టి చెలగు సుమ బాణాల
మదన తాపము లేల మదిని కోర్కెలు రేపి
అందరిని ఆడించు నతడు ప్రేమకు స్ఫూర్తి !!
రతి దేవి సతిగాను రసలీలలకు తోడు.
పూల విల్లుని బట్టు పులకరింతల రేడు.
తారకాసుర వధకు తానె కారణమవగ
హరుని ప్రేరేపించ మరుడు బాణము లేసె !!
తపము భంగము కాగ తాప మెంతయొ రేగ
హరుడు కోపముచెందె అతని శాపము పండె.
మాట తెలియని శివుని కంట మంటలు కురిసె
మహిమ మంటలు ఎగసె మరుడు భస్మంబాయె.!!
మదను చంపగ వద్దు మంచి కోరెను అనుచు
పలుకు పార్వతి వినతి ప్రభువు సాంతము వినగ
అంగ హీనుని గాను అతడు జీవితుడాయె.
సర్వమంగళములకు సఖుడు కారణమాయె !!
No comments:
Post a Comment