20/03/2024.
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము * ద్విరద గతి రగడ*
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య : 3.
మ.స.క.స...43.
అన్నిటా తానైన ఆగోప బాలునికి
ఎన్ని నామమ్ములో ఎన్ని రూపమ్ములో
కన్నయ్య మ్రోగించ కరమురళి రాగాలు
విన్నట్టి గోపికకు విందాయె నాదాలు !!
మా చిన్ని కృష్ణయ్య మధుర రూపము కన్న
నోచి కన్న యశోద నొనరు భాగ్యము మిన్న.
దోచి పోయేనమ్మ దొంగ యై మావెన్న
వేచి దండించగా వెరపు లేదోయమ్మ !!
------------------------------
హామీ : ఈ రకడలు నా స్వీయ రచనలు .
No comments:
Post a Comment