19/03/2024.
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త: శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
అంశము: కవిత్వం అంటే..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
1.
మనసులోని భావాలను వెలికితీసి
అక్షర అరల్లో పొందుపరచబడేది.
కవితలు, కావ్యాలుగా చరితకెక్కేది.
చూడచక్కని తెలుగు సున్నితంబు॥
2.
కలాన్ని హలంగా మార్చి
కల్మషాలను వెలికితీసేది.
నిజాన్ని నిక్కచ్చిగా పండించేది.
చూడచక్కని తెలుగు సున్నితంబు॥
3.
కాగితపు పుటల బాటలో
ఆపలేని ఆశయ బాణమై
మొద్దుబారిన మెదడుకు పదునుపెట్టేది .
చూడచక్కని తెలుగు సున్నితంబు॥
4.
రాజకీయాల రొచ్చును విశదీకరించి
ప్రజల లో చైతాన్యాన్ని మేల్కొలిపేది.
జీవిత సత్యాలను తేటతెల్లపరచేది .
చూడచక్కని తెలుగు సున్నితంబు॥
5.
శ్రీశ్రీ వంటి విప్లవకారుల హృదయాలలో
లయబద్ధమైన ఊపిరై నిలచి
ఆచంద్రార్కముా కవితగా కదంతొక్కేది.
చూడచక్కని తెలుగు సున్నితంబు॥
------------------------------
ఈ సున్నితం నా స్వీయ రచన.
No comments:
Post a Comment