యతి:పద్యపాదములో మొదటి అక్షరాన్ని యతి అంటారు
ఇందులో అచ్చుకు ప్రాధాన్యత ఉంటుంది
యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.
గమనిక:
హల్లుతో పాటు దాని మీది అచ్చుకు కూడా యతిమైత్రి పాటించాలి.
ఉదా:
i)క-కా-కై-కౌ;
ii)కి-కీ-కృ-కౄ-కె-కే;
iii)కు-కూ-కొ-కో.
4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) ర-ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే
(i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ;
(ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే;
(iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ.
ఉదాహరణ:1
U I /I I I /U I / U I I /U U I
*ఆ* ట/వెలది /యందు / *న* ద్భుత/మైనట్టి
U I/ I I I/ U I / U I / I I I
*పద్య* /ములను/ వ్రాయ/ *హృద్య* /ముగను
*క* వులు సిద్దమైరి *క* లములఁజేబూని
*మం* చి యంశములను *మ* లచుటకును
ఉదాహరణ:2
*మా* ట తూట వోలె *మ* రణంబు కలిగించు
*పెద* వి దాటితేను *పృథి* విఁగనగ
*జ* గతిలోన నిదియె *జ* రిగెడు సత్యంబు
*వి* నుము గురువు మాట *వీ* నులార
మరిన్ని ఉదాహరణల కొరకు "వేమన" పద్యాలను పరిశీలించగలరు
No comments:
Post a Comment