[01/04, 1:46 pm]
JAGADISWARI SREERAMAMURTH:
మహతీ సాహితీ కవిసంగమం-
ప్రతిరోజూ కవితా పండుగే.
తేది : 01 /04/2024.
వారం పేరు: సోమవారం.
అంశం: చిత్ర కవిత.
కవితాసంఖ్య : 1
శీర్షిక : అక్షర "శ్రీకారం".
కవి సంఖ్య : 43.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
ప్రక్రియ: వచన కవిత.
------------------
మారుతున్న వ్యవస్థలో మానవత్వం
నలిగి నశించిపోతోంది.
రాజకీయ చదరంగంలో, రక్కసుల అవినీతి నిండిన
రణనీతికి చిక్కిన ప్రజా పావులు, వివసత్వంతో ,
విధిలేక తోలుబొమ్మలాటలాడుతున్నాయి.
కటకటాల వెనకాతల చేర్చబడుతున్న " న్యాయం",
చేయని నేర ఆరోపణలకు చేతులు విరిగిన ,
ఆవేశంతో చెమట్ల కారుస్తోంది.
బెదిరింపుల భయంతో, న్యాయ స్థానాలలో ఇచ్చే
నీరస తీర్పులకు , ధర్మం సంకెళ్ల బరువుతో-
అడుగులు వేయలేక , సతమతమవుతోంది.
రంగుల పులుముకున్న మేకవన్నె పులులు చేస్తున్న
మూకుమ్మడి దాడులకు బడుగు ప్రజానీకం,
బ్రతుకు భయంతో ," బాంచన్ "అంటున్నాయి.
ప్రైవేటీకరణల తో ప్రజాసంపత్తి
పరదేశీయుల పరమౌతోంది.
అమ్ముడుపోతున్న వ్యవస్థలో విద్యా విధానం
పెట్టుబడి కేంద్రాలకు పెన్నిధి అవుతోంది.
దారి తప్పబడిన ధర్మం, , రాజకీయ రణనీతిజ్ఞుల
మధ్య చిక్కి,సామూహిక చిత్రవధలననుభవిస్తోంది.
అటు చదువు లేక ,ఇటు ఉద్యోగాలు రాక,
యువత మాదకద్రవ్యాలకు బానిసౌతోంది.
తను కన్న బిడ్డలలో ఐదుగురు మాత్రమే పాండవులు ,
మిగిలిన వారంతా కౌరవులే ఉండడం చూసి,
ఏమీ చేయలేని భరతమాత ,పగిలిన గుండెతో
పట్టరాని, బాధని భరించలేక భోరున విలపిస్తోంది.
తల్లి భారతి ఆక్రోశానికి ఆవేదన పడిన
చదువుల తల్లి, తన వంతుగా ,
మారిపోతున్న దేశ పరిస్థితులతో
భవిత కానరాని బాలలను , విద్యా
వివేకాలతో తీర్చిదిద్ది, దౌర్భాగ్యంతో నిండిన
దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు,
" సమతా, మమత-శాంతి , ధర్మాలను "
నిలిపే పోరాటకులుగా. తీర్చిదిద్దాలన్న -
ఆకాంక్షతో , అక్షర "శ్రీకారం " చుడుతోంది.
హామీ :
ఈ కవిత ఏ మాధ్యము నందునూ ప్రచురితము కాని,
నా స్వీయ రచన
-----------------------------
[01/04, 9:57 pm]
Porla Venu Gopala Rao:
1️⃣2️⃣✅పుల్లాభట్ల వారు..
మసాకసం..4️⃣3️⃣
*శ్రీకారం* శీర్షికతో మీకవిత విభిన్నంగా సాగింది..
నేటి భారతదేశ యవనికపై..సాగుతున్న తోలుబొమ్మలాటను చూడలేక..
భరతమాత కు సాయంగా
భారతి అడుగిడిన వైనం బాగా చెప్పారు..
ధన్యవాదాలు మరియు అభినందనలు👏👏💐💐🙏🙏
No comments:
Post a Comment