*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితల పండుగే*
*తేదీ: 23-11-2024- శనివారం*
*ఈవారం కవితాసంఖ్య:5*
అంశము: *నిషిధ్ధాక్షరి(న కారం)*
*నృసింహావతారం వర్ణన*
**************************
పేరు: *పొర్ల వేణుగోపాలరావు(మసాకసం:7)*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల*
శీర్షిక:*ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం!*
ప్రక్రియ: *పద్యము(ఆటవెలది)*
**************************
*(1)*
*శాపఫలము తోడ జయవిజయులు బుట్టె*
*పుడమి మీద; హరియె పోరు సలిపె!*
*దితి కొడుకుగ కశిపు తెగువలు జూడరే!*
*బ్రహ్మ వరము లంది పరుగు బెంచె!*
*(2)*
*పరగ దేవతలకు బాధలు కడదేర్చ*
*హరియె యవతరించ సిరులు గురిసె!*
*మాట కొరకు విష్ణు మాయలు పరికించ*
*దైవలీల దెలియు!ధరణి మురియు!*
*(3)*
*ఇంట జంపరాదు!బైటయు సరికాదు*
*పగటి పూట తగదు!వలదు రాత్రి!*
*భూమి మీద కాదు!వ్యోమమందు తగదు!*
*సంహరణము జరుగు సమయమేది?*
*(4)*
*ప్రాణి చేత తగదు! వలదు ప్రాణము లేక*
*ఆయుధములు తగవు! సాయమెవరు?*
*బ్రహ్మ వరములిచ్చి బాగుగా యిరికించె*
*కేలతోడ జంప కేసరి యయె!*
*(5)*
*మర్త్య దేహధారి మరలె సింహముఖుడై*
*కశిపు జంప జేరె కంబమందు!*
*కొడుకు జూప రిపుడు కొట్టగా వెలువడి*
*రణము జేసె హరియె లక్షణముగ!*
*(6)*
*సందె వేళ బట్టి చక్కగా గడపపై*
*తొడలపై భరించి దొలిచె గోర్ల*
*భూమి యాకసముల పోలిక లేకుండ*
*పొట్ట జీల్చి జంపె!పుడమి మురిసె!*
**************************
హామీపత్రము: *స్వీయరచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*వేణుగోపాలుడు*
🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰
No comments:
Post a Comment