23/11/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
శనివారం.
అంశం: "న " నిషిద్ధాక్షరి.
శీర్షిక : పిలిచిన పలికే దేవుడు.
కవిత. సంఖ్య: 2.
ప్రక్రియ : పద్యం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి (.43)
కళ్యాణ్ : మహారాష్ట్ర.
--------------------
----------------------------
మహతీ సాహితీ కవి సంగమం.
శనివారం.
అంశం: "న " నిషిద్ధాక్షరి.
శీర్షిక : పిలిచిన పలికే దేవుడు.
కవిత. సంఖ్య: 2.
ప్రక్రియ : పద్యం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి (.43)
కళ్యాణ్ : మహారాష్ట్ర.
--------------------
సీస పద్యం:
బాల ప్రహ్లాదుండు భక్తితో పిలువంగ
వడిగ బ్రోచితివయ్య వాసుదేవ.
వరము బలము తోడ వరలు దైత్యుని బట్టి
వాడియౌ గోర్లతో వరుస జీల్చి.
యుగ్ర రూపము దాల్చి యుక్తి రక్తముపీల్చి
ధరణి దైత్యుల గూల్చు దాసపోష.
సారంగముఖతేజ సకల సంకటమోచ
సకల వేద విహార సామగర్భ !!
ఆటవెలది:
ధరణి నుధ్ధరింప ధర దుష్టుల గూల్చ
యవత రించు హరివి యాది దేవ.
దనుజ పుతృ బ్రోవ తంబము జీల్చొచ్ఛు
ధర్మ పురిసు వాస దనుజ దూర !!
----------------------------
పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు
అక్షరాలను నిషేధించడంలో మెరుగైన మెరుపులాంటి పదాలను రంగరించి రాసి పోసి వాసికెక్కి వన్నె తీర్చిన మీ పద్యం శబ్దాల శస్త్రాలుగా సంధించారు అస్త్రాలుగాసంధానించారు కూడా..🙏🙏👌👌👌
----------------------------------------------------------------.
No comments:
Post a Comment