Thursday, January 2, 2025

శీర్షిక :: గెలుపు, ఓటమిల నాంది సూత్రం..

శీర్షిక :: గెలుపు, ఓటమిల నాంది సూత్రం..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .



కౌరవులు ఎవరో పాండవులు ,

ఎవరో తెలీని వెర్రి జన లోకం.

అరుపుల బెదిరింపులకు ..

 గొర్రెల్లా మారే మూకలనేకం. 

.సారం లేని సాధింపు నాయకత్వం-

 వికటాట్టహాసంతో చేసే పైశాచిక నృత్యం..!!

అడ్డదారుల్లో శకుని వేసే పాచికల మంత్రం,

 నాయక బలాలు నడిపే రాజకీయ కుతంత్రం.!!

జూదపు ఆటలో ఓడిన ధర్మం 

వనవాసం చేస్తూ వత్సరాలు దాటేస్తున్న శాపం..

 ఐదుగురు భర్తల అవమానిత,

 విధి వంచితల మధ్య తలవంచే శోకం.

సారధి లేని రథాన్ని  కుతంత్రపు టెత్తులతో

దోచుకొన్న, వాడి , బలవంతపు అధికారం-.-

 చెప్పిందే శాసనంగా పాటించే ప్రజల అజ్ఞానం .

పరిపక్వత లేని రాజ్యంలో, రాణీతి నిండిన

 రాక్షసత్వపు ఎత్తుగడలే, 

గెలుపు, ఓటమి ల ప్రణాళికలకు నాంది సూత్రం.

ఇదే  ప్రజా ఓటమి రహస్యం.

---------------------------.


శీర్షిక: చెరసాలకు చిక్కిన న్యాయం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

-----------------------


ఓటు అధికారానికి నోటు రెక్కలు వచ్చాయి. 

నోటు చేసే విశ్వవిహారానికి, సీట్లు పెరిగాయి. 

అధిగమించిన ఆశలు , అధోగతిపాలయ్యాయి. 

అడ్డగించిన ఆవేశంపైకి బుల్డోజర్ లు నడిచాయి.

చేతకానితనం చితిలో  పడి ,బూడిదయ్యింది

సవాలు చేస్తున్న న్యాయం చెరసాలలోకి చేరింది.

--------------------------------------

శీర్షిక : తీనని శాపం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

-----------------------

రాజకీయ రణనీతిలో ,

ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న వారి

 పింఛ మణచే ఓటు అధికారం 

తమ చేతిలో ఉన్నా చేతకాని వారిలా,

 బాంచన్  బ్రతుకుకు తలవంచడం ,

ప్రజల అవివేకానికి  తీరని శాపం. !!

No comments:

Post a Comment