శీర్షిక: అనుభవాలు , ఆలోచనలు..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
-----------------------
వేయి కిలోలు ఉన్న ఏనుగును , సన్నపాటి
అంకుశం అదుపులోకి తీసుకుంటుంది.
-------------------------------
ఆరడుగులున్న చలి పాము ప్రాణాలను
చిరు చీమలు, ఐకమత్యంతో తీస్తాయి.
----------------------------------
అదుపుతప్పిన మొండి గుర్రం, మెడలో
కళ్ళెం పడగానే వశం అవుతుంది.
----------------------------
నువ్వు కడుతున్న జి.ఎస్. టి .
అతడు వేసుకుంటున్న "కోట్ల"కు పెట్టుబడి.
------------------------------
న్యాయం, ఇనప కటకటాల పెట్టెలో.
తాళం, నెరవేర్చని వాగ్దానాల బుట్టలో...
-------------------------------
శీర్షిక : కంచే చేనును మేస్తే....
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
మంటల హారంలో మహిళల మానం.
నిర్లక్ష్య విమానంలో , నిర్లజ్జా విహారం.
-------------------------------
వాగ్దానాల జోరుతో, వికాస వసంతాలు..
పెంచుతున్న రేట్లతో, ప్రజలతో చదరంగాలు.
---------------------------------
శీర్షిక : సొమ్మొకడిది సోకొకడిది.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
-----------------------
కోటలు దాటిన మాటలతో ,
అణచి వేస్తున్న ఆకలి కేకలు.
తనది కాని దర్పంతో
సూన్యం చేస్తున్న దేశ సంపదలు.!!
---------------------------
శీర్షిక : సోగ్గాడే చిన్నినాయన.
-------------------------
ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగిరాడట.
ప్రజలను పీడిస్తూ పోగు చేస్తున్న సొత్తు.
వేస్తావు గంటకో కోటు , ఎందుకో ఈ మత్తు.
----------------------------------
శీర్షిక : విన్నవించుకో మా చిన్న కోరిక....
అలవాటులో పొరపాటుగా ఆడబోకు" చాయ" మాట.
అడుగు- బడుగు వారు తాగవస్తే, తీస్తారు నీ తాట.
----------------------------------------
No comments:
Post a Comment