శీర్షిక : సాఫ్ట్ వేర్ జీవితం :
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
జీవితమొక కోడ్, ప్రతి ఉదయం కొత్త లైన్,
సుఖదుఃఖాల బగ్స్ సరిచేస్తూ,
సాగాలి మన ప్రయాణం.
జ్ఞాపకాల డేటాబేస్, అనుభవాల అల్గోరిథమ్,
ప్రేమ, స్నేహాలు వైరస్ లేని యాంటీవైరస్ సిస్టమ్స్.
పుట్టుక ఒక ఇన్స్టాలేషన్, బాల్యంలో అప్డేట్స్,
యువ్వనం ఒక డిజైన్, వృద్ధాప్యం డీబగ్స్.
ఆశలన్నీ ఫీచర్స్, కలలన్నీ అప్లికేషన్స్,
విజయం ఒక లాగిన్, ఓటమి లాగౌట్.
సాఫ్ట్‌వేర్ లాగే జీవితంలో. ఎన్నో వెర్షన్స్,
మార్పులే అప్ గ్రేడ్స్, అనుభవాలే ప్యాచ్‌లు.
నిరాశ ఒక ఎర్రర్, ఆశ ఒక రీస్టార్ట్,
ప్రతి క్షణం ఒక ప్రోగ్రామ్,
నడుపుతూ సాగాలి మన హార్ట్.
కోపం ఒక పాస్‌వర్డ్,
ప్రేమ ఒక యూజర్ నేమ్,
నమ్మకం ఒక ఫైర్‌వాల్,
ద్రోహం ఒక హ్యాకింగ్ గేమ్.
జీవితమనే సాఫ్ట్‌వేర్, ఎప్పటికీ
అప్‌డేట్ అవుతూనే ఉంటుంది,
ప్రతి మనిషి తన జీవితాన్ని
తానే రాసుకోగలిగే ఒక
సాఫ్ట్ వేర్ డవలపర్. !!
------------------------------
No comments:
Post a Comment