19/05/2025.
(సోమవారం)
మహతీ సాహితీ కవి సంగమం
అంశం : (చిత్ర కవిత. 105.)
వచన కవిత .
శీర్షిక : ముల్లోక సంచారుడు.
రచన , శ్రీమతి , పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
ముల్లోక సంచారి ముని నారదుండు,
మదిని నిరంతర నారాయణ ధ్యానముండు.
లోక కళ్యాణమే అతని నిత్య జీవితము,
అందరిలో వెలుగు నింపు దివ్య తేజము.!!
ముల్లోకముల దారి ముని దివ్య తేజము,
పరికించ లోకముల పయనించు నిత్యము.
కలహ ప్రియుడంచు లోకులు వచియించిన
అంతరంగమున లోక విలువలవనంతము !!
కయ్యాలు రేపేట్టు కనిపించు క్షణములో,
లోతైన అర్థమే దాగియుండు నందులో
ఘర్షణలు ఎన్నైన శాంతి నిడు భువిలో
లోక కల్యాణమే, లక్ష్య మాతని మదిలో.!!
అపార్థపు నీడలు కమ్మేటి మనసులకు,
కొత్త ప్రణాళికల కోరు శాంతిని గూర్చు.
మహతి మీటుచు నతడు మంచి చేసెడు వాడు
సందేహ చీకట్లు తొలగించు వాడు !!
కలహప్రియుడను పేర కలిగించు న్యాయము !!
నారదుని చర్యలో నుండు పరమార్థము,
ముల్లోకముల మేలు కోరు మునిశ్రేష్ఠులు.
కేలుమోడ్చీ జేతు నే కోటి వందనములు
No comments:
Post a Comment