అంశం : అణుబాంబు:
శీర్షిక : ఒక సామాజిక ఆర్తనాదాం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర. (38).
వచన కవిత : సంఖ్య.. 3
ఎదలో రగిలే అగ్ని కీల,
మానవత్వపు గుండెకోతల జ్వాల.
అణుబాంబు, పేరులోనే ఒక శూన్యం,
భవిష్యత్తుకిది భయంకర సంకేతం.!!.
క్షణంలో కాలాన్ని కరిగించి
వేల ప్రాణాల భస్మరాశిని పెంచి
భూమి గుండె బీటల్లో మిగిల్చి
మానవ బంధాల్లో చీలికలు నింపేది.!!
పట్టపగలే చీకటి కమ్మినా,
ఆకాశం ఎర్రగా మారినా
నిశ్శబ్దం నిక్కి నిక్కి దాగినా
వినిపిస్తున్న ఒక విషాద గీతం !!
పిల్లల నవ్వులు ఆవిరై,
తల్లుల కన్నీరు బూడిదై
ఆశలు సన్నగిల్లిన ఆక్రోశాలతో,
ఒక తరం అంతమైపోతోంది.!!
శక్తి పేరిట విధ్వంసపు ముళ్ళు
జ్ఞానం పేరిట అజ్ఞానపు రాళ్లు
అభివృద్ధి పేరిట వినాశనపు వేళ్లు,
సృష్టికలో పాకుతున్న శాంతి లేని బీజాలు.!!
అణుబాంబు సృష్టించిన నరకం.
తరతరాలకీ మానని గాయాల కూపం.
గుండెల్లో రగిలే దుఃఖం,
ఆరని మంటల్లో చితులు నిండిన శాపం !!
శాంతిని కోరే హృదయాల వేదన
యుద్ధం వద్దు అన్న ఆక్రోశాల ప్రార్థన
అణు విస్ఫోటనం ఆపాలన్న తపన
ఆర్తి నిండిన గొంతుల్లో ఉద్వేగపు నిరీక్షణ !!
.
అణుబాంబు కేవలం ఒక ఆయుధం కాదు,
మానవ సమాజానికి ఓ కనువిప్పు,
ఎవరి స్వార్థం కోసమూ దాగని నిజం,
శాంతి స్థాపనకై పోరాడాలి ఈ సమాజం.!!
అందరూ ఒక్కటై నిలబడి యోచించి
అహింసా మార్గాన్ని అనుసరించి,
అణుయుద్ధ భయాన్ని తొలగిద్దాం,
శాంతియుత ప్రపంచాన్ని నిర్మిద్దాం.!!
భవిష్యత్ తరాలకు బతుకు బాట వేద్దాం.
మన వారసత్వాలకు మానవత్వం నేర్పిద్దాం.
విశ్వ కళ్యాణం కోసం విధ్వంసాల నాపేద్దాం
అందరం ఒక్కటై ఆనంద గీతం పాడేద్దాం. !!.
---------------------------------
ఈ కవిత, నా స్వీయ రచన.
No comments:
Post a Comment