మహతీ సాహితీ కవి సంగమం.
27/08/2025.( బుధవారం).
అంశం : గణేశ స్తుతి.
కవితా సంఖ్య : 1.
మ.స.క.స.38.
ప్రక్రియ : ద్వీపద.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
శీర్షిక : ఆది పూజ్యుడు.
ఎలుకనెక్కిన ఘన ఏలుమా వరమ
పలుకు తేనెలు నిండు పచ్చన్ని ఫలమ!!
అమ్మ పార్వతి చేతి అందాల బొమ్మ
ఇమ్మ మా కిల భక్తి ఇభరాజ వదన.!!
గణపతివిగ నీవు గగనాల నేలు
ఘనపతి వగునీవు గురుడవై కావు
అధిపతి వరమిమ్మ ఆదిగా తలతు
నిధిపతి వగునిన్ను నిరతమ్ము గొలతు!!
[28/08, 8:14 am] +91 83412 49673: పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు
ద్విరదముఖుని ద్వైమాతురుని వర్ణించిన తీరు హృదయ రంజితంగా ఉంది
No comments:
Post a Comment