Saturday, November 21, 2020

యతి మైత్రి అక్షరాలు.

🌺 🌺 మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం 🌺🌺
🌹ప్రతి రోజూ కవితా పండుగే🌹

పర్యవేక్షకులు:డా౹౹అడిగొప్పుల సదయ్యగారు
తేదీ:21/11/2020(శనివారం)
నిర్వహణ: కుందారపు గురుమూర్తి
కవి పేరు:
ఊరు:
నేటిఅంశం: ఐచ్ఛికము

నేటిప్రక్రియ: "పద్యము"(ఆటవెలది మాత్రమే)

కవి మిత్రులు వారికి ఇష్టమైన ఏ అంశంలో నైనను ఆటవెలది పద్యములు అల్ల వలెను

సమయం:ఉదయం 5-00గం౹౹ల నుండి రాత్రి 9-00 గం౹౹ల వరకు
ఫలితాల వెల్లడి:రాత్రి 9-30గంటలకు

నియమములు::
1. కవిత పద్య ప్రక్రియలోనె ఉండాలి.
2. పద్యము పేరును తప్పక సూచించాలి.
3.రెండు అంతకంటే ఎక్కువ పద్యాలు రాయాలి.
4.సవరణ కోరిన పద్యాలను తప్పక సవరించి మరలా పంపవలెను
5.లక్షణాలను చదువుకొని పద్యమును రాయవలెను
6.పాదములు వాక్యాలుగా ఉండరాదు
7.సాధ్యమైనంతవరకు పాదాల మధ్యలో అచ్చు ప్రయోగము లేకుండా సంధిగత పదములు వ్రాసినచో అద్భుతముగా నుండుని గ్రహింపవలెయును
8.పునరుక్తి దోషముండరాదు అనగా ఒకే పదమును అదే అర్థములో పదే పదే వాడరాదు
9.సూచనలు సహృదయముతో స్వీకరించగలరు




   ఆటవెలది పద్య లక్షణాలు:

1.  ఆటవెలది పద్యములో 4 పాదాలు ఉంటాయి
2.  1,3 పాదాలలో వరుసగా 3సూర్య గణాలు 2ఇంద్ర గణాలు ఉంటాయి
3.  2,4 పాదాలలో 5సూర్య గణాలు ఉంటాయి 
4. మొదటిగణం మొదటి అక్షరానికి  4వ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది
5. ప్రాస నియమము ఉండదు. ప్రాసయతి కుదురుతుంది

ప్రాసయతి అనగా
    యతి కుదరనపుడు ప్రాస స్థానములోని అక్షరానికి,(అనగా పాదంలోని రెండవ అక్షరానికి) 
యతిమైత్రి తర్వాత అక్షరానికి(4వ గణం రెండో అక్షరానికి) ప్రాస వేయాలి.
ప్రాసలో హల్లుకు ప్రాధాన్యత ఉంటుంది

           !!గణములు!!
సూర్య గణాలు రెండు

III-నగణము
UI-హగణము లేదా గలము

ఇంద్ర గణాలు ఆరు

నలము       IIII
నగము        IIIU
సలము       IIUI
భగణము    UII
రగణము     UIU
తగణము    UUI

యతి:పద్యపాదములో మొదటి అక్షరాన్ని యతి అంటారు
ఇందులో అచ్చుకు ప్రాధాన్యత ఉంటుంది

యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.

గమనిక:
హల్లుతో పాటు దాని మీది అచ్చుకు  కూడా యతిమైత్రి పాటించాలి. 

ఉదా:
 i)క-కా-కై-కౌ; 
ii)కి-కీ-కృ-కౄ-కె-కే; 
iii)కు-కూ-కొ-కో.

4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) ర-ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే 
(i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ; 
(ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే; 
(iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.

14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ. 

ఉదాహరణ:1
U I  /I  I  I   /U    I   / U I    I /U U I
 *ఆ* ట/వెలది /యందు / *న* ద్భుత/మైనట్టి
U  I/  I     I  I/    U I    /  U  I   / I     I I
 *పద్య* /ములను/ వ్రాయ/ *హృద్య* /ముగను

 *క* వులు సిద్దమైరి *క* లములఁజేబూని
 *మం* చి యంశములను *మ* లచుటకును

ఉదాహరణ:2

 *మా* ట తూట వోలె *మ* రణంబు కలిగించు
 *పెద* వి దాటితేను *పృథి* విఁగనగ
 *జ* గతిలోన నిదియె *జ* రిగెడు సత్యంబు
 *వి* నుము గురువు మాట *వీ* నులార

మరిన్ని ఉదాహరణల కొరకు "వేమన" పద్యాలను  పరిశీలించగలరు



                                   మీ
                       కుందారపు గురుమూర్తి.

!!గమనిక!!
పర్యవేక్షకులు డా౹౹అడిగొప్పుల సదయ్యగారి అధ్వర్యంలో
వ్రాసిన ప్రతి ఒక్కరికీ చిరకాలం గుర్తుండే ప్రశంసాపత్రాలు ఇవ్వబడును.

ఉత్తమ కవిత విజేతలు

🚹🚹🚹🚹🚹🚹🚹🚹
వారం వారం ఉత్తమ కవితలు
అంశం : జీవన పోరాటం.
🔆🔆🔆🔆🔆🔆🔆🔆
🏆🏆🏆🏆🏆🏆🏆
 *అశోక్.జి*
 *అపరాజిత్*
పి.హజరత్తయ్య
మంజిత్ కుమార్ బందెల
పి.జగదీశ్వరి
భారతి గాజుల
షేక్‌నసీమా
డి.వి.రామారావు.
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

Thursday, November 19, 2020

"ఎదలో అలజడి"" రచన విష్ణు సత్య రాజేష్ (డొక్కా సీతమ్మ ).

""ఎదలో అలజడి""

ఎదలోతులలో ఏదో అలజడి తుఫానుగా చెలరేగిపోతోంది..

కనుచూపు మేరలలో ఏవో తెలియని ఆశావహ దృక్పదపు చారలు అల్లుకున్నట్టు కనపడుతున్నాయి

ఆ దిశగా నేను  వేస్తున్న ఒక్కొక్క అడుగు ఆనందపు శిఖరాలు తాకుతున్నాయి
బహుశా...! నా జీవన ప్రయాణంలో మలి అద్యాయం మొదలుకానుందా...

సంద్రపు ఒడ్డున ఎగసి పడే కెరటం ఒక్క నిమిషం ఆగిపోతే...

అలుపులేక తిరిగే సూర్య చంద్రులు ఆగిపోతే
శ్వాస భారంగా సాగి ఇక శెలవు అంతే...

వినడానికి కూడా కష్టంగానే ఉంది కదూ....

రాకూడని స్వప్నాలు,రాకూడని ఆలోచనలతో మదిలో ఎదో అలజడి..

అదే నా జీవితానికి సరికొత్తమలుపని ఊహించలేకపోయా....

తన ఒడిలోకి రమ్మని, సేద తీరమని అడిగినప్పుడు... 

ఆలోచనలను, ఆశయాలను కాదని తానే ప్రపంచంగా బ్రతుకుతుంటే...

మది నిండా నవ్వులతో, అంతకన్నా చక్కటి  మాటలతో మనస్సును కట్టిపడేసేసిన ఆ ప్రేమ

నా జీవితములో ముఖ్యభూమికని పోషిస్తుందని అనుకోలేకపోయా....

నాతో నిత్యం ప్రేమపలుకులు రాయించి నాతోనే జీవితాంతం ఉండిపోవాలని ఆశ...

ఇదేనా ఎదలో మొదలైన అలజడి 

@శిష్టు సత్య రాజేష్

Tuesday, November 17, 2020

ద్విపద పద్యాలు

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతి రోజూ కవితా పండుగే
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ:శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు
కవితా సంఖ్య:17
పేరు: కుందారపు గురుమూర్తి  కడప
అంశము: తిక్కన శిల్పంపు తెలుగు తోట
ప్రక్రియ:పద్యము (ద్విపద)

తిక్కన శిల్పంబు తిరుగులే నిదని
చక్కగ వివరించె చప్పన్న కవులు

హరిహర తత్వంబు నద్భతంబుగను
భారతంబున తీర్చె భక్తితో తాను

అలతి పదముల్చేర్చి యలరించె జనుల
విలువైన పద్యాల వేలల్లొ గూర్చి

తెలుగు సంస్కృతములు తీవోలెఁగలువ
పలు సమాస పదముల్పలికించె నతడు

కవి బ్రహ్మ యనుచును కవిరాజనుచును
భువిఁబినవీరుండు పొగడెఁదిక్కనను

తిక్కన శిల్పంపుఁదెనుగు తోటనుచుఁ
బెక్కుగా పొగిడెను విశ్వనాధుడును

రచనా శిల్పంబు రసరమ్యముగను
రచనలో వైవిధ్య రాజసముండు

నలుగడ తెలికన్ను నలుఁగాలి యనెడి
పలు పద బంధము ల్పట్టుగ వాడె

హిందూ ఋషులు జాబితా

హిందూ ఋషులు జాబితా

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న
ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష
దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టావక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి‎
అమహీయుడు
అజామిళ్హుడు‎
అప్రతిరథుడు‎
అయాస్యుడు‎
అవస్యుడు
అంబరీషుడు
ఇరింబిఠి‎
ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు‎
ఉశనసుడు
ఉత్కీలుడు
ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి
ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి
ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి
కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి‎
కౌశికుడు‎
కురువు
కాణుడు‎
కలి
కాంకాయనుడు
కపింజలుడు‎
కుసీదుడు
గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు‎
గోపథుడు‎
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు
చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు‎
జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు‎
తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి
దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు‎
నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు
పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన‎
ప్రశోచనుడు‎
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ‎
ప్రస్కణ్వుడు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు
భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి‎
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు‎
భగుడు‎
బ్రహ్మర్షి
బృహత్కీర్తి‎
బృహజ్జ్యోతి‎
భర్గుడు
మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు‎
మాతృనామ‎
మయోభువు‎
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు
యాజ్ఞవల్క మహర్షి
యయాతి‎
రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు
వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు‎
వత్సుడు‎
వేనుడు
వామదేవుడు‎
వత్సప్రి
విందుడు
శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు‎
శౌనకుడు
శంయువు‎
శ్రుతకక్షుడు
సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు‎
సుతకక్షుడు‎
సుకక్షుడు‎
సౌభరి
సుకీర్తి‎
సవితామహర్షి సామావేదానికి మూలము.
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి
హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి