Tuesday, April 11, 2023

కొత్త అలంకారము : యమకాలంకారం

[11/04, 10:04 am] +91 77998 86016: అందరికీ అభివందనం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

                ఇక నేడు ఓ చక్కని అలంకారంలో మన కావ్యాలను విరచిద్ధాం  .

నేటి అలంకారం :- *యమకాలంకారం*

మీ
*ప్రదన్య బృందం*
[11/04, 10:05 am] +91 77998 86016: యమకాలంకారం:- 

                 అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు.


ఉదాహరణ :-:
నే లేనని రాలేనని చెప్పినా వినక 
ఆ రాజీవము జీవము తీసుకునే...

[11/04, 7:25 pm] +91 98482 38453: అంశం..యమకాలంకారం

1
ఓ *ప్రియా* ! *ప్రియ* మారగ
నిను పిలవాలని ఉన్నది...

2
నీ తీయని *తలపు* లే
నా యెద *తలపు* వలపుల్లో
చేరి గమ్మత్తుగా చిత్తుచేస్తూ
మత్తులో తేలిస్తున్నది.

3

*రోజా* వంటి నీ ముఖారవిందాన్ని రోజూ
చూడాలని ఉంది *రోజా*!

4
*నవ* నీతం వంటి నీ మనసులో *నవ* రాగం పలికించాలని కోరికగా ఉంది...!!

డా.మరుదాడు అహల్యా దేవి
హైదరాబాద్
11/4/2023
[11/04, 7:38 pm] +91 90637 22788: ప్రదన్య సాహితీ వేదిక
అంశం:యమకాలంకారము
కట్ల.ప్రతిభారాణి
***********************
కానల నిలిచి కానరావేల
లోకాన శోకాననైనా దేవా!

సిరి కసిరి నిన్నొదలి కొండలనొకొండగ జేసెనా దేవా!

మల్లెలు కొప్పునకొప్పుచున్నవి గదా!

గీతా గీతాన్ని ఆలపించవా!

ఒక విషయం చర్చిలో చర్చించారు.

ఇది భోజరాజు భోజనం కదా!

వాడి వాడికత్తి వాడి కూరగాయలు వాడినవకటా!

ఇది నా స్వీయరచన.
[11/04, 8:17 pm] +91 81475 95455: ప్రదన్య సాహితి వేదిక
అంశము ..యమకాలంకారం
శీర్షిక.. సముద్రం
8147595455
శారద బెంగళూరు
11..4...2023
నీలాల సముద్రంలో నీలాకాశం
అందంగా కనిపిస్తుంది
కడలి లో ఎగిరి ఎగిరి పడే
రంగు రంగుల చేపలే ఒక అందం
అలలు అలలు గా కదిలే సముద్రం చూడటానికే ఒక
అందం
శారద బెంగళూరు 8147595455
[11/04, 8:59 pm] +91 83319 30635: ప్రధన్య సాహితీ వేదిక (M) 
తేదీ: 11/4/2023
అంశం: యమకాలంకారము


1. *లలిత* కళల్లో *లలిత* ఆరితేరిన వనిత  

2. *అమ్మ* కు చెప్పికానీ నా కారు *అమ్మ* ను

3. *కాలు* తడవకుండా *కాలు* వను దాటు

4. *కోడి* తో చేసిన ప *కోడి* చాలా బాగుంది

5. సూట్ *కేసు* తీశానని నాపై *కేసు* పెట్టారు

6. *పాట* పాడుటలో నీ *పాట* వం చూపించు

7. ఆ *గోరు* వంక నా *గోరు* పై వాలింది

8. *శుభ* *శుభ* కార్యానికి వెళ్ళింది

9. *జీవిత* *జీవిత* ములో అబద్ధం చెప్పలేదు 

10. *గోరు* తో *గోరు* చిక్కుడును నేర్పుగా ఒలవాలి

ఎస్. రత్నలక్ష్మి 
అసిస్టెంట్ ఇంజనీర్ 
జలవనరుల శాఖ 
నంద్యాల 

పైవన్నీ  నా స్వీయ విరచితములు

Saturday, April 8, 2023

నా సంపాదన నా యిష్టం...కధ

మనోహరి పత్రిక కొరకు,
విభాగం : వ్యాసం.( కధ)
అంశం: నా సంపాదన నా ఇష్టం.
శీర్షిక : నీలిమ.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .



నీలిమకి ఆరోజు  చెప్పలేనంత ఆనందంగా ఉంది .
తను ఎన్నో రోజులుగా ఎదురుచుాస్తున్న రోజు రానే వచ్చింది. 
తనకు బేంక్ లో మేనేజర్ గా జాబ్ వచ్చింది .
ఎప్పటినుండో ఎదురు చుాస్తున్న ఆనంద ఘడియలివి.

అనందంతో తిరిగిన కన్నీటి తడిలో నీలిమకు  తన బాల్య సంఘటనలన్నీ  ఒకొక్కటిగా కళ్ళముందు తిెరగసాగాయి.
 ---------------------------------------------
తల్లిదండ్రులు  తనను చిన్నప్పటి నుండి చాలా ముద్దుగా పెంచాలనుకున్నారు. కారణం తను వాళ్ళకి ఒక్కర్తే 
సంతానం కావడం. 

తండ్రి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసీవారు. మంచి జీతం . తమ ముగ్గురికి ఆజీతం చాలా ఎక్కువ .
ఎంతో జాలీగా ఉందామనుకుంటున్న సమయంలో 
అనికోకుండా నానమ్మకు "  కేన్సర్  " రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆవిడ ఎనిమిదేళ్ళు ట్రీట్మెంట్ లో ఉండి , మరో రెండేళ్ళు మంచం పట్టి తీసుకు తీసుకు చనిపోయారు. 
నాన్నగారి జీతమంతా  టెష్ట్ లు, మందులు,  కిమొా థెరఫీలు , మంచంపట్టిన నానమ్మకు సేవలు చేసేందుకు 
పెట్టిన మనుషులకు జీతం ఇవ్వడం వంటి ఖర్చులతో 
డబ్బు చాలక  చాలా ఇబ్బందులు పడవలసి వచ్చేది .

దాంతో తన స్కుాల్  లో గానీ కాలేజిలో గానీ 
స్నేహితులతో పిక్నిక్ లు , పార్టీల వంటివి ఎంజాయ్ చేయలేకపోయింది. 
నాన్నని  దేనికి డబ్బులడిగినా ఏదో ఒక కారణం చెప్పేవారు.
తనకు కోపం ఉడుకుమొాత్తనం వచ్చి ఏడుపు వచ్చేది.
అప్పుడే తను నిశ్ఛయించుకుంది.
తను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని.
తనకొచ్చిన జీతం తన యిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలని..
అప్పుడు  తనను ఎవ్వరుా ఏమీ అనలేరు. ...చెప్పలేరు.
ఎందుకంటే " తన జీతం , తన ఇష్టం " ..అంతే...
తన మనసులో నాటుకున్న అదే నిశ్ఛయంతో తను చాలా బాగా చదివింది.
ఫలితం. బేంక్  మేనేజర్ రుాపంలో కాసులు కురిపించబోతోంది...
అదే నీలిమ సంతోషానికి కారణం...
--------------------------

తను ఎమ్ కామ్ : ఎమ్ .బి .యే.  పుార్తి చేసిన తర్వాత నుండే ఇంట్లో అందరుా తనకు పెళ్ళి సంబంధాలు చుాడడం మొదలెట్టేరు. 
తను మాత్రం ఖచ్చితంగా చెప్పింది .తను కనీసం రెండు సంవత్సరాలవరకు  జాబ్ చేసి గాని పెళ్ళి చేసుకోనని ,
తన సంపాదన తన యిష్టం వచ్చినట్టు  ఖర్చు చేసుకొనే 
అధికారం తనకు అప్పుడే వస్తుందని , లైఫ్ ఎంజాయ్
చేసే అవకాశం కోసం తను ఎన్నాళ్ళ బట్టో ఎదురు చుాస్తున్నాదని తెగేసి చెప్పేసింది. 

తర్వాత నీలిమ ఉద్యోగంలో ఆనందంగా చేరింది.
తనకు జాబ్ వచ్చిందని , సేలరీ రాగానే అందరం కలిసి 
ఎక్కడికైనా టుార్ వెళదామని తన తల్లిదండ్రులతో చెప్పింది.
పది రోజులు గడిచేయి ..
తండ్రికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చి  బతికినంత పనైంది.
దాంతో తండ్రి తనను  తను బ్రతికుండగా పెళ్ళి చేసుకోమని , 
మళ్ళీ సడన్ గా గుండెపోటు వస్తే  , తన ముచ్చట చుాడకుండానే ప్రాణాలు పోతాయేమొానని 
ఎమొాషనల్ గా మాట్లాడడంతో సరేనంది.
అంతే ! మొదటి జీతం అందుకుంది. రెండవ జీతం అందకుండానే తనకు వివాహమైపోవడం జరిగిపోయింది..
పెళ్ళికి ముందే వాళ్ళు , ఉద్యోగస్తురాలైన పిల్లే కావాలని చెప్పేరని విని అవాక్కైపోయింది.

పెళ్ళి తర్వాత నుంచి తన జీవితం పుార్తిగా మారిపోయింది. 
అన్నట్టుగానే   నాన్న తన పెళ్ళి చుాసి స్వర్గస్తులయ్యేరు. 
అమ్మ బాధ్యత తనమీద పడింది.
అత్తగారింట  వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు.
  తల్లి బాధ్యతలు తనే నిర్వర్తిస్తున్నా పల్లెత్తు మాట
  అనేవారు కాదు. భర్తకు వచ్చిన జీతం ఇంట్లో ఖర్చులకు  చాలేది కాదు. నలుగురు ఆడబిడ్డల బాధ్యత , వాళ్ళ పెళ్ళిళ్ళు తమకు చాలా బరువనిపించేవి.
ఇంటి ఖర్చులు పోను , ఎంత  దాచినా అది తక్కువే అనిపించేది .దాంతో తన జీతం ఇంట్లో వాడక తప్పేది కాదు.
.ఇద్దరి జీతాలు బొటాబొటిగా సరిపోయేవి.

తనకు ఏది కావలసి వచ్చినా చాలా ఆలోచించవలసి వచ్చేది
 తను చాలా సార్లు "నా జీతం నా యిష్టం " అనుకుంటుా 
 ఖర్చు చేయాలనుకొనేది .
 కనీ బాధ్యతల బరువుకు తల వంచీసేది. 
నీలిమకు  తల నెరిసింది. ఆడ బిడ్డలకు పెళ్ళిళ్ళయ్యాయి .
అదనంగా మరిద్దరు పిల్లల బాధ్యత మీద పడింది.
పేర్లు సంధ్య , పల్లవి. 
ఆడబిడ్డల పురుళ్ళు  పుణ్యాలకు పోను , పిల్లల్ని 
చదివించడం వాళ్ళ అవసరాలు తీర్చడంతో బొటాబొటీగా
గడిపే స్థితికి అలవాటు పడిపోయింది నీలిమ .
ఆమెకు తండ్రి  మరీ మరీ జ్ఞాపకం వస్తున్నాడు.
తెలిసీ తెలీని వయసులో తను తండ్రిమీద ఎంతో కోపం తెచ్చుకునేది కదుా...
తను ఏమడిగినా  "అలాగే  తల్లీ ...కానీ ఇప్పుడు కాదు ...కొన్ని రోజులు పోయాక " ..అంటుాంటే ఎంత కోపం వచ్చేదో...
కనీ ఇప్పుడు తన పిల్లలతో తను అదే మాట చెపుతున్నాది.
ఒకప్పుడు "నా డబ్బులు నా యిష్టం " అన్న తను
అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే ..పుార్తి జీతం
ఇంటికోసం ఖర్ఛు చేస్తున్నాది. 
ఇప్పుడు నాన్నెంత బాధ పడేవారో  తనకు అర్ధమవుతోంది.

రేపు సంధ్య పుట్టిన రోజు కనీసం" కేకు" తెప్పిద్దామన్నా 
ఆలోచించవలసి వస్తోంది అనుకుంటుా నిట్టుార్చింది.

ఇంతలో సంధ్య పరుగెత్తుకుంటుా వచ్చి తన చేతిలో నున్న 
పది రుాపాయలు చుాపించింది...
నీలిమ ఎక్కడివమ్మా..అని ఆడగ గానే సంధ్య ఆనందంగా..
" అమ్మా ! ఆ రాణీ వాళ్ళు లేరుా..
ఆ ఆంటీ ఏదో ఉద్యాపన చేసుకుంటున్నారట
నన్ను పిలిచి  "బాల పుాజ "చేస్తామని చెప్పి...
నాకు ఈ బట్టలు, పుాలు ,పళ్ళు, ఇచ్చి తాంబుాలంలో దక్షిణ
అంటుా ఈ పది రుాపాయలు ఇచ్చేరు...అంది గుక్క తిప్పుకోకుండా.....
నీలిమ అంతా విని,  సరే ఆ డబ్బులు ఇలాతే..నేను దాచుతాను అనడిగింది . పిల్ల ఆడుతుా పారేసుకుంటుందేమొానని...
వెంటనే సంధ్య "అబ్బా ! నేనివ్వను ఇవి "నాడబ్బులు నాయిష్టం"
 అంటుా పిడికెలు  ముాసింది.
 ఆ మాట విన్న నీలిమ  నవ్వుకుంది.

ఒకప్పుడు తను కుాడా ఇలాగే అనుకునేది. అదీ 


 -----------------------------------
 
 హామీ :
 ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన. 

 
 


Tuesday, April 4, 2023

ఉగాది నవలల పోటీ

ఉగాది నవలల పోటీ – 2023

6 లక్షల రూపాయలు విలువచేసే బహుమతులు

ఆన్వీక్షికి ప్రచురణలు – చదువు ఈబుక్ యాప్ సంయుక్త నిర్వహణ

తెలుగు సాహితీ ప్రపంచంలో ఆన్వీక్షికి ప్రచురణలు, చదువు యాప్ ద్వారా మేము చేస్తున్న కృషి సాహితీ ఆభిమానులందరికీ తెలిసిందే. నాలుగేళ్లలో వందకి పైగా పుస్తకాలను ప్రచురించి, యాభైకి పైగా యువ రచయితలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన ప్రచురణ సంస్థఆన్వీక్షికి. క్రమంగా కనుమరుగైపోతున్న తెలుగు పాఠకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారకి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనూ మొదలైన యాప్ – చదువు. ఇప్పటికే పదిహేను వేల మంది సాహిత్యాభిమానులు చదువు యాప్ వినియోగిస్తున్నారు. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మరుగునపడిపోతున్న నవల అనే ప్రక్రియకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో చదువు-అన్వీక్షికి సంయుక్తంగా ఉగాది నవలల పోటీ నిర్వహిస్తున్నాం. లిటరరీ ఫిక్షన్, జాన్రా ఫిక్షన్, యంగ్ అడల్ట్ ఫిక్షన్ అనే మూడు విభాగాల్లో ఈ నవలల పోటీ జరుగుతుంది. 

లిటరరీ ఫిక్షన్ : కథ, కథనం కంటే పాత్రలు,వారి అలోచనల ప్రధానంగా సాగే నవలలను లిటరరీ ఫిక్షన్ అనవొచ్చు. తెలుగులో ’చివరికి మిగిలేది’, ’అసమర్థుని జీవయాత్ర’ లాంటి నవలలను లిటరరీ ఫిక్షన్ గా పిలవొచ్చు. వీటినీ కొంతమంది సీరియస్ సాహిత్యం అని కూడా అంటుంటారు. 

జాన్రా ఫిక్షన్ : Genre అంటే ఒక కోవకు చెందిన సాహిత్యం అని అర్థం. క్రైమ్ ఫిక్షన్. హారర్ ఫిక్షన్, రొమాంటిక్ ఫిక్షన్, ఫ్యాంటసీ – ఇలా ఎన్నో genres సాహిత్యంలో ఉన్నాయి, తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది లాంటి వాళ్ళు ఇటువంటి రచనలు చేసి పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు.

యంగ్ అడల్ట్ ఫిక్షన్ : టీనేజ్‌లో ఉన్న యువతను ఆకట్టుకునే నవలలను యంగ్ అడల్ట్ ఫిక్షన్ అంటారు. హ్యారీ పాటర్ నవలలు, ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ లాంటి నవలలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి నవలలకు విపరీతమైన ఆదరణ ఉంది.

బహుమతులు: 
1) ఈ మూడు విభాగాల్లో వచ్చిన మూడు ఉత్తమ నవలలకు, ఒక్కో నవలకు 100000 రూపాయల చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయల బహుమతులు. 
2) ప్రతి విభాగంలో రెండవ బహుమతికి అర్హమైన నవలకు 50000 రూపాయల చొప్పున మొత్తం లక్షన్నర రూపాయల బహుమతులు. 
3) ఒక్కో విభాగంలో ఎంపిక చేయబడిన మూడు నవలలకు, ఒక్కో నవలకు 10000 రూపాయల చొప్పున మొత్తం 90000 రూపాయల బహుమతులు. 
4) జ్యూరీచే ఎంపిక చేయబడిన కొన్ని ప్రత్యేక నవలలకు 60000 రూపాయల వరకూ ప్రోత్సాహక బహుమతులు.

నియమ నిబంధనలు
1) ప్రపంచంలో ఎక్కడున్న వారైనా, ఏ వయసు వారైనా ఈ నవలల పోటీలో పాల్గొనవచ్చు. 

2) ఈ నవల తమ స్వంతమని, ఏ ఇతర నవలలకు అనుసరణ కానీ, అనువాదం కానీ కాదని, హామీ పత్రం విడిగా జతచేయాలి. 

3) రచయితలు తమ నవలలు తెలుగు యూనికోడ్ లో, అచ్చు తప్పులు లేకుండా టైప్ చేసి పంపించాలి. ఈ నియమం పాటించని నవలలను పరిశీలించబడవు. 

4) మీ నవల వర్డ్ డాక్యుమెంట్‌లో, A4 సైజ్ పేపర్లో, మండలి ఫాంట్, సైజ్ 14 లో 100 పేజీలకు మించి, 200 పేజీల లోపు ఉండాలి. 

5) మీ నవలలు ugadinovels@chaduvu.app కి మెయిల్ చేయాలి.

6) నవలకు సంబంధించిన వర్డ్ డాక్యుమెంట్‌లో ఎక్కడా రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ లాంటి విషయాలు ప్రస్తావించకూడదు.

7) మీరు పంపుతున్న మెయిల్‌లోనే మీ పూర్తి పేరు, ఫోన్ నెం, మీరు ఏ విభాగంలో మీ నవలను సబ్మిట్ చేస్తున్నారనే విషయాలను స్పష్టంగా తెలియచేయాలి.

8) బహుమతికి ఎంపికైన నవలలు చదువు యాప్‌లో ఈబుక్ & ఆడియో బుక్స్‌గా ప్రచురించే హక్కులు చదువు యాప్ నిర్వాహకులకు ఉంటాయి. అలాగే మొదటి రెండు ముద్రణలు ప్రింట్‌లో ప్రచురించే హక్కులు ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ కలిగిఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

1) నవలలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ – సెప్టెంబర్ 22, 2023

2) పోటీ ఫలితాల ప్రకటన – డిశెంబర్, 22, 2023

3) బహుమతుల ప్రధానోత్సవం – ఉగాది 2024

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

Sunday, April 2, 2023

మనోహరి మరియు మనోహరం పత్రికల కొరకు సెలెక్ట్ చేసిన రచనలు:*



#selected గృహశోభ 19-03 

19-03-2023 తపస్వి మనోహరం వారి మనోహరి పత్రిక కొరకు *గృహశోభ/ హౌస్ డెకరేషన్ ఐడియాలు* అనే అంశంపై వచ్చిన రచనలన్నీ పత్రికల కొరకు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. వీలు వెంబడి పత్రికలలో ప్రచురణ చేయటం జరుగుతుంది.

1. సామాన్య గృహిణి - సుజాత కోకిల
2. అందమైన అనుభవం - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి 
3. గృహ శోభ - ప్రియంవద పుతుంబాక.
4. గృహ అలంకరణ - కె.కె.తాయారు
5. గృహశోభ/డెకరేషన్ ఐడియాలు - టి. వి. యెల్. గాయత్రి.

[02/04, 10:56 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: *20-2-23 నుండి 25-2-23 వరకు మహిళా దినోత్సవం పురస్కరించుకొని వచ్చిన ప్రత్యేక రచనలలో.. మనోహరి మరియు మనోహరం పత్రికల కొరకు సెలెక్ట్ చేసిన రచనలు:*

*కథలు*
తారుమారు- టి. వి. యెల్. గాయత్రి (post కార్డు కథ)

*కవితలు*

సకలకళల ప్రవీణ - మక్కువ. అరుణకుమారి 
మాణిక్యాన్ని నేను - DNR.సంతోషి
మేమింతే - మారమంతే- శ్రీమతి మంజీత కుమార్
మగువ(కందపద్యాలు) - పి.వి.వి.యన్.రాజ కుమారి
*వ్యాసాలు:*
ఆర్టికల్ - పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

*Ebook:*
మహిళా నీవో స్ఫూర్తిదీపం - జూపూడి సుధారాణి
ఆదిపరాశక్తి రూపం - కృష్ణ మోహిని ధార్వాడ 
అంతర్మథనం - వసంత ఇంజపురి
ఆమె అవనిలో అద్భుతం - కళావతి కందగట్ల 
ఆడవాళ్ళకి జోహార్లు - అరుణ డేనియల్  ధరిత్రి - వరలక్ష్మి యనమండ్ర 
క్షమయా ధరిత్రి - వింజరపు.శిరీష 
త్యాగానికి వారధులు - కొంటికర్ల లలిత

*కథలు:*
నారీలోకం - వడలి లక్ష్మీనాథ్ మనోహరం 
అలా.. ఊహాపురంలో - విజయాచలం

ష్..ఇది ఆడవారి ప్రపంచం -  మోపిదేవి గౌతమి 
మధులత - సాహు సంధ్య 
మగువలు మగ మహారాజుల గుండెల్లో మహరాణులు- శ్రీ విజయ దుర్గ. ఎల్  
కల నిజమైతే - నాగ నివేదిత. పి
మహిళలూ జిందాబాద్ - అద్దంకి లక్ష్మి
ఆనందభాష్పాలు - సుశీల రమేష్.

కవితలు:
సవ్యసాచి సబల - చంద్రకళ.దీకొండ  
అ నుండి అః వరకు భర్తతో ఆమె ప్రయాణం -  ప్రియంవద పుతుంబాక
మహిళా ఇది తెలుసుకో - మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు)
చిరునవ్వుల ముసుగు వెనుక - జ్యోత్స్న సుబ్బా
ఆడాళ్ళూ మీకు జోహార్లు - ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి

వ్యాసాలు:
ఆడదే ఆదర్శం - చట్టి లక్ష్మి
ప్రతి పాలనలో రుద్రమదేవి కనిపిస్తుంది - ప్రక్షిత ప్రవి 
స్త్రీలే సర్వస్వం - కె. కె. తాయారు

*గమనిక:* పత్రికలో ప్రచురణకు సెలెక్ట్ కాని రచనలన్నీ వెబ్సైటులో అప్లోడ్ చేసి links ఇవ్వబడతాయి.
[02/04, 10:58 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected బాలసాహిత్యం 20&21/03

*20-03-2023 నుండి 21-03-2023 వరకు మనోహరి మహిళా పత్రిక కోసం బాలసాహిత్యం (కథ/కవిత) అనే అంశంపై  సెలెక్ట్ చేసిన రచనల లిస్ట్*

1. మంచి మాట వినరారే ముద్దుల సిరి ముాటలు - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
2. చిన్ని రాముడు - వింజరపు.శిరీష 
3. సంబరమొచ్చినాది - శ్రీసుధ కొలచన 
4. కవిత - DNR. సంతోషి
5. మా ఇంటి సిరి (బాలగేయం ) - టి. వి. యెల్. గాయత్రి
6. బాల సాహిత్యం - ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి
7. ఔదార్యం - కె.కె.తాయారు
8. చిలిపితనం - చట్టి లక్ష్మి
9. అఆ ఇఈ నేర్చేద్దాము - మక్కువ. అరుణకుమారి 
10. బాల గేయం - జూపూడి సుధారాణి

*వెబ్సైటులో లింక్స్ గా ఇచ్చేవి:*
అందమైన రోజా పువ్వులు - అరుణ డేనియల్
రేపటి మహిళా లోకం- సుజాత కోకిల
మా అన్న అల్లరి - అద్దంకి లక్ష్మి
కన్నీటి చుక్కలు - కె.రాధికనరేన్
బంగారు భారతం - కృష్ణ మోహిని ధార్వాడ
క్రమశిక్షణ - కొంటికర్ల లలిత
అచ్చమ్మ - వరలక్ష్మి యనమండ్ర
తెల్లని మల్లెల మనసులు - చంద్రకళ.దీకొండ
మహోజ్వల చరితకు సారధులం - కొత్త ప్రియాంక (భానుప్రియ)
[02/04, 11:01 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected దర్శనీయ స్థలాలు (15-17/03)

*15-03-2023 నుండి 17-03-2023 వరకు "దర్శనీయ స్థలాలు" అనే అంశంపై వచ్చిన రచనలలో అన్ని రచనలు పత్రికల కోసం సెలెక్ట్ చేయటం జరిగింది..* వీలువెంబడి రచనలు మనోహరి మరియు మనోహరం వార, మాస పత్రికలలో ప్రచురించబడతాయి.

1. ఆనంద భాష్పాలు రాల్చే ఆంజనేయుడు - మంజీత కుమార్
2. బాల త్రిపుర సుందరి - మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు)
3. అమ్మపల్లి దేవాలయం - సావిత్రి కోవూరు
4. శ్రీ కోదండరామస్వామి ఆలయం(ఒంటిమిట్ట) -  రామలక్ష్మి సుంకరణం
5. మైసుారు (శ్రీరంగపట్టణం) - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
6. హార్స్లీ హిల్స్ - కె.కె.తాయారు
7. ధర్మపురి గుడి - సుజాతకోకిల  
8. సింగరకొండ - వరలక్ష్మి యనమండ్ర     
9.  ‌మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి, పానకాల స్వామి ఆలయాలు - ప్రియంవద పుతుంబాక.
10. నీలావడి అగ్నిగంగమ్మ - నాగ నివేదిత. P
11. శ్రీ చక్రాలయం - అద్దంకి లక్ష్మీ
12. అలంపురం జోగులాంబ దేవాలయం (ఐదవ శక్తి పీఠం) - జూపూడి సుధారాణి
13. కామాఖ్య శక్తి పీఠం - శ్రీ విజయ దుర్గ. ఎల్.

Saturday, April 1, 2023

పంచాక్షరీ పంచపదులు ...నియమాలు.

22/03/2023.
పంచాక్షరి పంచపది.
అంశం : నవ యుగాది.
శీర్షిక : సంకల్పసిద్ధి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


సంకల్పముల
ఆరు ఋచుల
ఐశ్వర్యముల
సమానతల 
సమ్మేళనము ఈశ్వరీ ॥


*ఈ లంకెతో సమూహంలో చేరి,అక్కడే పోస్ట్ చేయండి*

*పంచాక్షరి పంచపది నియమాలు*

*పాదానికి 5 అక్షరాలు,5 పాదాలు.*
*1 నుండి 4 పాదాలు అంత్య ప్రాసలు.*
*5వ పాదం కవినామంతో ముగించాలి.*