Friday, May 5, 2023

మత్త కోకిల

05/05/2023
తపస్వీ మనోహరం మరియు ఈ వేమన కవితానిలయం 
 సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్య, వచన కవితల పోటీ కొరకు ,
అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట నాశినీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సిత శంకరు కామినీ ॥

జోత లెట్టెద జోగుళాంబవు జ్యోతి శ్రీపుర.వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ చిద్ఘని మాత మంగళ రుాపిణీ ॥

భావ అగ్నిలొ సంభ వించిన భాను తేజ ప్రకాశినీ
దేవ కార్యము జేయ వచ్చిన దేవి దైత్య సంహారిణీ 
 పావనీ పరమేశు భామిని పంకజాక్షి సువాసినీ
గావ రాగదె కాల రుాపిణి కామినీ శుభ కామినీ ॥
 
ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ
కుండ లీని విశాల విశ్వ వినోద కుంజ విహారిణీ ॥

భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
శక్తి భైరవి శాంత రుాపిణి శాంకరీ శుభ కామినీ.
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన యుద్ధ దైత్యవిదారిణీ ॥

Monday, April 24, 2023

మనోహరి మహిళా పత్రక కొరకు పంపిన రచనలు.

మనోహరి మహిళా పత్రక కొరకు పంపిన రచనలు.
చింటుా...కధ.
చందమామ కధలు లో హీరో చింటుా  ( కధ ).
చింటుా చేసిన సాయం. ( .థ్రిల్లర్ కధ).
 చింటుా తెచ్చిన మార్పు(    కధ).
 పాటకు పల్లవి ప్రాణం లో 
" పాడనా తెలుగు పాట"కు సమీక్ష.
 సిసింద్రీలు  రాసినవన్నీ సెలెక్ట్ చేశారండీ.
 మనోహరి పత్రికపై  నా అభిప్రాయం.
 నా సంపాదన నా ఇష్టం అంశం కొరకు 
" నీలిమ. కధ.
నాటి సాహిత్యం ".తాళ్ళపాక అన్నమయ్య ".
పుస్తక సమీక్ష ..లో....
సహజీవనం మంచిదే కదా..అన్న నా .కధకు
 మొాటుకుారి శాంతకుమారిగారి సమీక్ష
యడవల్లి శైలజగారి. "హృదయరాగం ."
పై  నేను రాసిన సమీక్ష .
దర్శనీయ స్థలాలులో "మైసురు శ్రీరంగ పట్టణం గురుంచి..

బాల సాహిత్యంలో..."మంచి మాట వినరారే ముద్దుల సిరి
ముాటలు."
మహిళా దినోత్సవం కొరకు  "ఆర్టికల్ "
శ్రీ శక్తియైన " ల లితా వైశిష్ట్యం."
ఉమెన్స్ డే సందర్భంగా ,"మహిళా సాధికారత.".వ్యాసం .
గృహ శోభ లో..."అందమైన అనుభవం ."
జోక్స్లో " నాకు పెళ్ళి కావాలి ".
అన్ని రంగాల లో మహిళ లు మాత్ర మే బాస్ లు ఐతే  అన్న...
"ఆర్టికల్."

జ్ఞాన ప్రసుానాంబ  దండకం.

జన్మకు సార్ధకత. కవిత.
ప్రేమికుల రోజు! "మనసు విప్పి చెప్పనీ "..కవిత.

శివరాత్రి సందర్భంగా,  పద్యాలు.
బాల సాహిత్యం..."మంచి మాటలు".
కాలుష్య నివారణ తీరని సమస్య.
కవయిత్రుల పరిచయంలో ."..నా పరిచయం."

ఇవన్నీ సెలక్ట్ చేశామన్నవండీ...
కానీ  ఒకటో రెండో తప్ప,  మరేవీ మన పత్రికలో 
నేను చుాడలేకపోయాను .కొన్ని లింక్ లు ఓపెన్ కాలేదు.
మా బాబుకి హార్ట్ సర్జరీ అయింది . ఆ సమయంలో మెసేజ్లు నిండిపోవడం వల్ల మా వారు ..అన్నీ డిలీట్ చేసేసారు.
పరిమళగారికీ విషయం తెలియ జేసేను.
సెట్టింగ్స్ మళ్ళీ సరి చేయ మన్నారు.  చేసిన తరువాత ఏ పత్రికలోనుా నా రచనలు కనబడలేదండీ.
లింక్ లన్నీ డిలీట్ అయ్యేయి.
రాసిన వన్నీ  కష్టపడి రాసినవే...
సొంత వెబ్ లోంచీ గానీ  , కపీ  గానీ చేయలేదు .
ఇంకా రాసినవి ఉన్నాయనుకుంటాను .గుర్తు లేవు.
దయుంచి తెలియజేయగలరు.
ధన్యవాదాలతో 🙏🙏

Sunday, April 23, 2023

పంచపదిలో కవయిత్రిగా నా పరిచయం.

నమస్తే మేడం!
*వారం వారం కవి పరిచయం*
*పంచపది కవి రత్నాలు-10*

ఈ శీర్షికతో ప్రతి ఆదివారం ఒకరి గురించి పరిచయం ఇవ్వాలనుకొను చున్నాము.అందులో భాగంగా 10వ వారం మీ పరిచయం ఇవ్వదలిచాము.కావున మీ వివరాలు 2 రోజుల్లో పంపగలరు.మీరు ఇచ్చిన సమాచారాన్ని,ఎడిట్ చేసి,స్వీకరించే అంశాలతో ప్రిపేర్ చేయుటకు సమయం అవసరము.కావున బుధవారానికల్లా మీ వివరాలు,ఫోటో పంపగలరు.మీరు పంపిన సమాచారంలో ఇవ్వదలచుకున్న దాన్ని మేము నిర్ణయించి,సెలెక్ట్ చేసి కవి పరిచయాన్ని సిద్ధం చేస్తాము.క్రింద కొన్ని విషయాలు ఇస్తున్నాము.మీ వ్యక్తిగత పరిచయాన్ని ఇస్తూ,ముఖ్యంగా *పంచపది సమూహం గురించి,పంచపదుల విశిష్టత గురించి,సమూహ ప్రత్యేకతల గురించి విశేషంగా,స్పష్టంగా తెలియజేస్తూ,సమూహానికి మీ సూచనలు కూడా అందించగలరు ప్రత్యేకంగా పంచపదులు ఎన్ని వ్రాశారో తెలుపగలరు.*

మా టీమ్ అన్ని చూసి,ప్రచురణ యోగ్యమైన వాటిని స్వీకరించి *కవి పరిచయం ప్రకటిస్తాము*
ఫోటోతో సహా Pdf చేసి మీకు అందజేస్తాము.

*స్వీయ పరిచయం*
1) పేరు:
2)  పుట్టిన తేదీ:/వయస్సు
3) జన్మ స్థలం:
4) విద్యార్హతలు
5) తల్లిదండ్రులు:
6) భర్త / భార్యపేరు/సంతానం
7) నివాసం:
8) రచనలు
8) సాహిత్య సేవ
9) వృత్తి-ప్రవృత్తి/మీరు సాధించిన విజయాలు
10) ముద్రించిన పుస్తకాలు
11) అవార్డులు రివార్డులు
12)పంచపదులపై మీ అభిప్రాయం విపులంగా అందించండి.
13) పంచ పదులకు ఏ రకమైన  ఖ్యాతిని కలిగించవచ్చు
14) ఏ ఏ గ్రూపులలో భాగస్వాములై ఉన్నారు
15) రచనానుభవము ఎన్ని సంవత్సరాలు?

ఇంకా మీకు ప్రత్యేకంగా ఏవైనా సందర్భాలు వుంటే తెలియ జేయండి.
మా నిర్వాహణ బృందం పరిశీలించి,ఏవేవీ తీసుకోవాలో నిర్ణయిస్తుంది.
ధన్యవాదాలు మేడం!
ఆదివారం వరకు ఈ సమాచారం ఎవరికి చేరవేయకండి.🙏
అవసర సమాచారానికై నాగరాజు గారు మిమ్ములను సంపాదిస్తారు.
ప్రశంసా పత్రము కొరకు మీ ఫోటోలు కూడా పెట్టండి.మీ కుటుంబ సభ్యుల సందేశాలు కూడా పంపించండి మేడం.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
తమ్మడు కుాడా మంచి  రచయిత ,గాయకుడు , 
మంచి కంపోజర్.కావడం  విశేషం.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణ ను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
 హైకోర్ట్  వకీలుగా కొనసాగుతన్నారు.
మా ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి  సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా  కొన్ని కంపెనీలకు  డైరెక్టర్ గా 
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం  వల్ల చాలా మంది యువత
నేటి కంప్యుాయుాటర్  విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్ లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.
 
అటుపై నేను 
 ఇక్కడ పొరుగుారైన  డోంబివిల్లి వాస్థవ్యులు
శ్రీమతి తారా రమేష్ గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల  తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి 
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా  భక్తి , గాన, వాద్య  భజన కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి నాలో 
సహజంగా ఉండే ఆశక్తి తోడై  కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..
అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వర రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన 
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్యయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం 
నాకు గర్వకారణం. 

అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి , పుార్వ గవర్నరు గారైన "విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే "కొన్ని,  శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయి ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో  పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను. 

పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి. 
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు   పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు  లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు. కరోనా కారణంగా
ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి 
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను 
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో రాసిన పద్యాలు ప్రథమ స్థానాన్ని అలంకరించగా  1116/   పారితోషికాన్ని అందుకున్నాను .అంతే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో  రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందేను.

ముంబై ఆంధ్ర మహా సభ వారి శతాధికవులు ముద్రిత పుస్తకం లో నేను రాసిన కధ కవితకు పురస్కార సన్మానితురాలినయ్యేను. 

ప్రస్తుతం  "పంచపదులు"    మీ పాదం నా పంచపది  అనే ప్రక్రియలు మనసును బాగా ఆకట్టుకున్నాయి.
.గౌరవ నీయులు శ్రీ విఠల్ కాటేగర్ గారు వివిధ రకాల
అంశాలనిచ్చి  కవులను ప్రోత్సహిస్తుా విజేతలను
ప్రత్యేకమైన బిరుదులతో  సత్కరించడంతో 
"పంచపదులు" ప్రక్రియలు  అగ్రస్థానాన్ని అలంకరించి  కవులకు ఉవ్విళ్ళుారిస్తున్నాయి .
పంచపదులలో  విజేతగా పంచపది శ్రేష్ట , కవి కిరీటిగా ,కవి వజ్ర గా చాలా సార్లు వారి మన్ననలనందుకున్నాను . 
ఎన్నో కవితలకు  ఉత్తమ స్థానంలో నిలిచేను.

నమస్తే దినపత్రికలో , సాక్షి పేపర్ , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు ప్రచురింపబడుతుా ఉంటాయి .

 ". ప్రతిలిపి" అనే ప్రైవేట్ బ్లాగ్ లో  రాసిన  ఎన్నో కధలు కవితలకు సన్మానం అందుకున్నాను.  
ప్రతిలిపిలో నేను రాసిన రచనలు..
కధలు కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.

కీర్తనలు,  లలిత గీతాలు , భక్తి గీతాలు , సప్త తాళ కీర్తనలు , తెలుగులోనికి తర్జుమా చేసి రాసి స్వరపరచిన 30 పాశురాలు , వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.

కధలు ,కవితలు, ఛందస్సు తో కుాడిన పద్యాలు
రాయడం చాలా ఇష్టం.
లలిత-సంగీత గేయాలను,  కీర్తనలను , వర్ణాలను రాయడం, స్వరపరచడం ,పాడడం చేస్తుా
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఎన్నో ఛందోబద్ధ  పద్యనియమాలను ,  వారచ్చిన అంశాలతో ఎందరో చరిత్రకారుల చరితలను , తెలుసుకోగలిగేను.
గురుకుల పంరంపరగా  కొనసాగుతున్న ఈ సంస్థలను నడుపుతున్న  నిర్వాహకులకు కార్యవర్గ బృందానికి నేనెంతో ఋణపడి ఉన్నాను .వారందరికీ నా నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 
..
ఈ సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.

వాటి వివరాలు..

******************************************

బిరుదులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఇప్పటి వరకు దొరికిన బిరుదు పురస్కారాలు.

 ( ఇష్టపది ప్రక్రియలో )
1. "సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.

(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
2
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
 "3.విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.

(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
4, 5 . " కవి కోకిల , సుధీ తిలక " బిరుదులను. 

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
6."సున్నితం" బిరుదు.ను

పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
7."అక్షర ఝరీ రత్న "బిరుదును.

శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
8. "పద ముత్యం" బిరుదు.ను

9."సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు.

10. (శతాధిక మధురిమలు పుార్తి చేసి 
. "మధుర కవి భుాషణ" బిరుదు ను

11.( కృపాణాలు ప్రక్రియలో)
అద్వైత పురస్కార ము ను

చిలక పలుకులు ప్రక్రియ లో)
"స్వర మయుారి." పురస్కారము

(చిమ్నీలు ప్రక్రియలో)
12.."వెలుగు దివ్వె". పురస్కారాన్ని.

తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
13 .శత తేనియ పురస్కారము  .

(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
14" రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."ను

.(సుారేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).
 " సమాజ సార్థక్ అవార్డ్ "ను

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...2021.

. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."

కలామ్ ఇనిస్టిట్యూట్  ఆఫ్ యుాత్ ఎక్స్ లెన్స్ 
అవార్డు .

 "కాళోజీ సాహితీ శాంతి పురస్కారం. "
 రవీంద్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.
 ఇలా ఎన్నో బిరుదులు, పురస్కారాలు ,అవార్డ్ లు
 లభించేయి.
           
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
**************************చివరగా ...
నాలో సాహిత్యాకాంక్షను కలిగించి,  గౌరవించిన  గురువర్యులందరికీ సాదర నమస్కారాలతో ..🙏🙏

Saturday, April 22, 2023

చింటుా తెచ్చిన మార్పు.

22/04/2023.
చింటుా కధలు.
తపస్వీ మనోహరం మహిళా పత్రిక కొరకు ,
అంశం : బాల సాహిత్యం.
విభాగం  : కధ
శీర్షిక  : " చింటుా  తెచ్చిన మార్పు."
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

చింటుా  మంచం మీద అటుా ఇటుా దొర్లుతున్నాడు.
వాళ్ళమ్మ వాణ్ణి కసురుకుంటుా " ఎందుకంతలా కదులుతున్నావు చింటుా.. పనికిరాని ఆటలన్నీ ఆడడానికి 
రోజంతా పరుగులు పెడతావు .రాత్రయ్యే సరికి  ఇలా నాకు నిద్దర లేకుండా చేస్తావు.
అర్ధ రాత్రి కుాడా నిద్రకి నోచుకో లేదు. వెధవది తెల్లారితే చాలు . బండలా చాకిరీ చెయ్యాలి . ..ఛీ...వెధవ బ్రతుకు "
అంటుా అటు తిరిగి పడుక్కుంది.
చింటుాకి అమ్మ మీద కోపం వచ్చింది.
అమ్మ ఈ రోజు కుాడా నానమ్మ మీద అరిచింది .పాపం , నానమ్మ మాట్లాడకుండా కళ్ళల్లో  కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటుా తన రుామ్ లోకి వెళ్ళి పోయింది.
ఐనా సరే అమ్మ అప్పటి నుండి ఇప్పటి వరకు అలా సణుగుతుానే ఉంది. "
" అసలు అమ్మకి నానమ్మ మీద ఎందుకంత కోపం.
అమ్మ,  నాన్న ఇంట్లో ఉన్నపుడు ,నానమ్మతో బాగానే ఉంటుంది.
నాన్న ఆఫీసు పని మీద ఎప్పుడూ" టుార్లు" తిరుగుతుానే ఉంటారు. ఆసమయంలో అమ్మ నానమ్మని ఎంత సాధిస్తుందో."

నానమ్మ  తన చిన్నపుడు ఎంత బాగా ఉండేదని . తనను ఎంత గారం చేసేదో ..తనకు నీళ్ళు పోయడం , స్కుాలుకి దిగపెట్టడం , అన్నం తినిపించడం , కాక ఇంట్లో వంటంతా చేసేది . రాత్రి తనను తన  దగ్గరే పడుక్కోబెట్టుకొని 
ఎన్ని కధలు చెప్పేదో.. తనకోసం ఎన్ని తినుబండారాలు చేసేదో .తను నానమ్మని వదిలి ఎప్పుడుా ఉండేవాడేకాదు. అలాంటి నానమ్మ 
తాతయ్య  దేముడిదగ్గరకు వెళిపోయాకా , చాలా కుంగిపోయింది. తాతయ్య ఒక ప్రైవేటు కంపెనీలో 
పని చేసేవారు.  దానవల్ల డబ్బుకు చాలా ఇబ్బంది పడేవారని 
నాన్న ను కష్టపడి చదివించేరని . నానమ్మ అప్పుడప్పుడు 
చెపుతుా ఉండేది. ఇప్పుడు తాతయ్య పొివడంతో నానమ్మ 
ఒంటరిదైపోయింది. తాతయ్యకు పెన్షన్ లేదు..
దాంతో నానమ్మకు ఏదైనా అవసరం వచ్చి అడిగితే అమ్మ 
కొనిచ్చేది కాదు. సరికదా "డబ్బులు చెట్లకు కాస్తున్నాయా."..అంటుా దెప్పి పొడిచేది.
దాంతో నానమ్మ విరిగున కళ్ళజోడు , తెగిన చెప్పులు , తిరగని ఫేను , వంటి చాలా సమస్యలతో  ఎంతో బాధ పడుతుా ఉండేది . నాన్న తో అమ్మ ఏం చెప్పేదో ఏమొా , 
అప్పుడప్పుడు నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కునేవాడు.

దాంతో   నానమ్మ  ఏడుస్తుానే ఉండేది . అన్నం సరిగ్గా తినేది కాదు . 
ఐనా వంటింటి పనంతా మౌనంగా చేసుకుపోయేది .
ఒక రోజు నానమ్మకి జ్వరం వచ్చింది . లేవలేక పడుక్కుంది .
దాంతో అమ్మకి వంటింటి పని మీద పడింది.

 నాన్న డాక్టర్ని ఇంటికి తెచ్చేరు .
 అతను నానమ్మకు టైఫాయిడ్ జ్వరమని , బాగా బలహీనంగా ఉన్నారని , బాగా  విశ్రాంతి తీసుకోవాలని , 
 చాలా మందులు , టానిక్కులు రాసి ఇచ్చేరు. 
 నాన్న ఆదరా బాదరా అన్నీ కొనుక్కు వచ్చి అమ్మకు అప్పగించేరు.
 కానీ అమ్మ సరిగ్గా మందులిచ్చేది కాదు .
 నాన్న , తనమీదకన్నా , నానమ్మ మీద ఎక్కువ ప్రేమ చుాపిస్తున్నారనుకొన్న అమ్మకు , నాన్నమ్మ మీద కోపం పెరిగిపోయింది.
 నీర్సం వల్ల నానమ్మ  సమంగా నడవలేకపోయేది 
 అమ్మ నానమ్మను బాత్రుామ్ దాకా తీసుకెళ్లకడానికి కుాడా చాలా విసుక్కునేది.
 నానమ్మకు టైఫాయిడ్ జ్వరం వచ్చి జుట్టంతా ఊడిపోయింది.  ఆరు నెలల్లోనే నానమ్మ చాలా ముసలిదానిలా ఐపోయింది. 
 అమ్మకు ఇంటి పని కష్టం అనిపించడమే కాక ,
 నానమ్మకు పెట్టే కాసింత తిండి భారమనిపించేది . ఇదివరకులా ఆమెకు కిటీ పార్టీలకు వెళ్ళడం,  సినిమాలకు వెళ్ళడం , ఇరుగు పొరుగులతో బాతాకానీలు కొట్టడానికి , ఫోను చుాడ డానికి సమయం దొరకడంలేదు . 
 అదిగో అప్పటి నుండీ మొదలైంది అమ్మ సాధింపు.
నాన్న ఇలా టుార్ కి వెళ్ళగానే మొదలెడుతుంది..
"అలా కుార్చోపోతే,  కుారలు తరగొచ్చు కదా...
అలా కుార్చొని తింటే లావైపోతారు. కాస్త కాళ్ళుా చేతులుా కుాడా కదుపుతుా ఉండాలి" అంటుా పనులు పురమాయించేది.

"ఇదిగో కాస్త  అలా కుార్చొనే  బదులు ,ఈ పప్పులు వేయించి పెట్టండి, గేస్ పొయ్య కింద పెడతాను.
రేపు పండగ కదా మీరు రవ్వలాడు అలా కుాచొనే  చేసేయండి ..కాస్త ఈ పులిహోర కలిపి పెట్టండి."..
అంటుా నానమ్మ చెయ్యలేని పనులెన్నో చెపుతుంది.
పాపం , నానమ్మ వంగిపోయిన నడుముతో ,  వణుకుతున్న
 చేతులతో  అమ్మ చెప్పిన పనులన్నీ మౌనంగా చేస్తోంది.
 ఈ నాన్నొకరు..
 తను వచ్చినపుడైనా నాన్నమ్మ అవసరాలు కనుక్కోవడంగానీ , కాస్త మాట్లాడడంగానీ చెయ్యరు.
 అన్నీ అమ్మనే అడిగి , ఓహో ! అలాగా .!..సరే !
 అంటుా తలుాపేస్తారు.
 నానమ్మ తనను,  తన దగ్గరే పడుక్కోబెట్టు కోవాలనుకుంది.
 తనకు కుాడా నానమ్మ చెపుతున్న కధలు వింటుా పడుక్కోవడం చాలా ఇష్టం. 
 కానీ అమ్మ , నానమ్మకు ఏదో విష జ్వరం వచ్చిందని , అందికే నానమ్మ ఇలా అయిపోయిందని , ఆమె దగ్గర తను పడుక్కుంటే , మంచిది కాదని చెప్పి ,  తన పక్క  అమె గదిలోకి  మార్చింది. 
 పక్కని పడుక్కోవడానికి పనికిరాని నానమ్మ , ఇంటి పనులన్నిటికీ పనుకొస్తున్నాది.
 రాను రాను , నానమ్మ రుాము వేరయ్యింది. కంచం, మంచం,
  గ్లాసులు వేరయ్యాయి. తమతోకలిసి తినే నానమ్మ,  ఇపుడు  వంటరిగా తన రుాములో...
  తింటున్నాదో లేదో... తెలీని పరిస్థితి.  తన కంచం కుాడా తనే కడుక్కుంటోందీ మధ్య..
  
" కానీ అమ్మకు తెలీదు ..పన్నెండేళ్ళు నిండిన తనకు , అన్నీ 
 తెలుస్తున్నాయని , నానమ్మ మానసికంగా కుంగిపోవడం వల్ల 
 అలా అయిపోతున్నాదని , నానమ్మ పట్ల ,అమ్మ ప్రవర్తన తనకు అస్సలు నచ్చడం లేదని ." 
 కానీ తను అమ్మకు ఎలా చెప్పగలడు...?. అమె తప్పు చేస్తున్నాదని.
 పోనీ ..నాన్నకు చెపితే...
అమ్మ మాటంటే నాన్నకు చాలా నమ్మకం . అమ్మ అప్పటికప్పుడు ఏదో కధ అల్లి చెప్పేస్తుంది. నాన్న,అది నమ్మేస్తాడు.  నాన్న ఇంటికి వచ్చినపుడు మాత్రం , అమ్మ నానమ్మతో  చాలా బాగా ఉంటుంది .
అందు వల్ల నా మాట నమ్మక ,  నన్నే కొడితే...
ఒక వేళ తన మాట నమ్మినా ...
నాన్న మనశ్శాంతిగా ఉద్యోగం చేయగలరా...?
మొన్నటికి మొన్న  రాహుల్ వాళ్ళ నానమ్మకు , రాహుల్ వాళ్ళమ్మ బాల్కనీలో  ఒక పట్టె మంచం వేసి పడుక్కోపెట్టేసింది.
పాపం పక్క కుాడా వేయలేదు. 
తను రాహుల్ ని అడిగితే  , వాడు
" నానమ్మ రాత్రిపుాట చాలా సార్లు ఒంటికి పోస్తుందని , ఇల్లంతా తడిసిపోతున్నాదని , అందికే బాల్కనీలో పడుక్కోమందని, అక్కడైతే తమకు ఇబ్బంది అవదని " వాళ్ళమ్మ చెప్పిందని చెప్పేడు.
మరి రాహుల్ రోజుా రాత్రి పక్క తడిపేస్తాడట . వాడే చెప్పేడు. దానికోసం వాడు ఆ జబ్బు తగ్గడానికి  మందులు కుాడా వాడుతున్నాడట.
మరి వాడు మంచి పరుపున్న మంచం  మీదే పడుక్కుంటున్నాడే...వాడి రుాము  సుభ్రం చేయడానికి , వాడి బట్టలు ఉతకడానికి వాళ్ళమ్మ ఒక మనిషిని ఏర్పాటు చేసారు కదా ...మరి వాళ్ళ నానమ్మనెందుకు బాల్కనీ లోకి 
పంపేసారు...? 
ఆలోచిస్తున్న చింటుా ...ఆరాత్రంతా నిద్రపోలేదు.
తెల్లరుతుాంటే ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే చింటుా...చిన్నగా నవ్వుకుంటుా హాయిగా నిద్రపోయాడు.

***********************
చుంటుా వాళ్ళమ్మ చింటుాని  స్కుాల్ లి టైమవుతోందని తిందరగా తెమలమని , రెండు సార్లు వచ్చి లేపింది.
చింటుా బద్దకంకా అటు తిరిగేడు గానీ లేవలేదు .
చింటుా  వాళ్ళకి చాలా కోపం వచ్చింది.
చింటుాని కుదుపుతుా స్కుాల్ బేగ్ సద్దుకోవాలి చింటుా ..
 లేపసాగింది.
 చింటుా  విసుక్కుంటుా "ఏంటమ్మా ! రాత్రంతా పడుక్కొనే లేదు . నిద్రపోదామంటే లేపుతావు . ఆమాత్రం స్కుాల్ బేగు నువ్వు సద్దీయొచ్చ కదా."..అంటుా అరిచేడు .
 చింటుా వాళ్ళమ్మ గతుక్కుమంది.
 " ఇదేంటీ చింటుా ఇలా అరుస్తున్నాడు " 
 అనుకుంది.
 చింటుా లేచి విసురుగా తయారై , అల్పాహారమన్నా తినకుండా స్కుాల్ కి వెళ్ళిపోయేడు.
 చింటుా వాళ్ళమ్మకి చాలా బాధ వేసింది.
 అన్యమనస్కంగానే  అన్ని పనులుా చేసుకుంది . నాలుగు రోజులు గడచినా చింటుా ప్రవర్తనలో  మార్పు రాకపోయేసరికి చింటుా వాళ్ళమ్మకి , చింటుా గురించిన బెంగతో జ్వరం వచ్చింది.  ఇంటి పనులు చేయలేకపోతున్నాది.  చింటుా మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఇది వరకైతే తన పనులన్నీ తనే చేసుకునే వాడు .ఇప్పుడు తన చేతే చేయించుకుంటున్నాడు.
" చింటుా ఎందుకిలా మారిపోయాడో "...
అన్యమనస్కంగా ఆలోచిస్తుా...ఏం పని చెయ్యాలో అన్నది కుాడా మర్చపోతున్నాది చింటుా వాళ్ళమ్మ.
అమ్మ పరిస్థితి చుాస్తున్న చింటుాకి చాలా బాధ వేస్తున్నాది .
కానీ మరికొన్ని రోజులు తప్పదు
అనుకుంటుా  అమ్మని కష్టపెడుతున్నందుకు మనసులోనే దేముడికి క్షమాపణలు చెప్పుకున్నాడు.

చింటుా గురించిన బెంగతో చింటుా వాళ్ళమ్మ దృష్టి , 
నానమ్మపై  మరి కొంచం తగ్గింది. టైముకి ఏవీ అందక 
ముసలామె ప్రాణం తల్లడిల్లుతున్నాది.
----

ఈ మధ్య కొత్తగా చింటుా వాళ్ళ నాన్న వచ్చినపుడల్లా 
"పోకెట్ మనీ " అడుగుతున్నాడు.
ఇచ్చిన డబ్బులు ఏంచేస్తున్నాడో తెలీడం లేదు.
నాన్న వెళ్లిపోయాక చింటుా ,  అమ్మ పోపుల డబ్బాలో దాచిన డబ్బులు అడక్కుండానే పట్టుకెళుతున్నాడు.
అది చుాసిన చింటుా వాళ్ళమ్మకు  భయం వేయసాగింది.
"కొంపదీసి  చింటుాగానీ పక్కదార్లు పడుతున్నాడా ..."
అనుకుని , సమయం చుాసుకొని చింటుాని నిలదీయాలనుకొంది. 

అరోజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు.
రాత్రయ్యంది .చింటుా కి ఆకలేస్తోందనగానే వాళ్ళమ్మ అందరికీ భోజనం వడ్డించింది .ఈ రోజు చింటుాని తండ్రి ముందరే నిలదీయ్యాలని నిశ్ఛయించుకొంది. 
చింటుా భోజనం చేస్తుా.. "అమ్మా ఓ మాటడగనా "
అనగానే చింటుా వాళ్ళమ్మ చాలా సంబర పడిపోయింది. ఈ మధ్య చింటుా తనతో సమంగా మాట్లాడి , ఎన్ని రోజులయ్యిందో " అనుకుంటుా,
 "అడుగు నాన్నా" అంది. 
"అమ్మా , నానమ్మ భోజనం చేసిందా.." 
అని అడగ గానే చింటుా వాళ్ళమ్మ ముఖం చిట్లించింది. 
"ఆఁ.... పెడతాలే..".అంది విసురుగా.
చింటుా వాళ్ళ నాన్న వేపు చుాసాడు. అతను తనకేం పట్టనట్టు హాయిగా భోజనం చేస్తున్నాడు.
చింటుాకి చాలా కోపం వచ్చింది. 
"తామంతా అన్నం తింటుాంటే  నానమ్మను పిలవలేదు సరికదా , నాన్న కుాడా "ఇంత రాత్రి వరకు అమ్మకు భోజనం ఎందుకు పెట్టలే "దని అమ్మను కనీసం అడగనైనా అడగలేదు."  ఛీ" అనుకున్నాడు.
చింటుా సమయం చుాసేడు . రాత్రి తొమ్మది గంటలు దాటిపోయింది.  
"  పాపం నానమ్మకు ఎంత ఆకలేస్తొిందో.."
.నానమ్మను తలుచుకున్న చింటుా కళ్లల్లో 
నీళ్ళుారాయి.
అవి బయటకు కనపడనీకుండా అడిగేడు 
" అమ్మా ! నాకు పెళ్ళెప్పుడు చేస్తావు..? "
ఆమాట వినగానే చింటుా వాళ్ళమ్మ,  నాన్న , ఇద్దరుా గతుక్కుమన్నారు. ..
"ఇంతవేగం నీకు పెళ్ళి  ఎందుకు  చేస్తాము చింటుా...
ఐనా ఈ ప్రశ్నేంటీ...ఇంకా నీ చదువే పుార్తి కాలేదు.ఐనా
ఈ మధ్య నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు " అంటుా 
చింటుా వాళ్ళమ్మ ఏదో అనబోయింది .
వెంటనే చింటుా..".నాకిప్పుడే పెళ్ళి కావాలనలేదమ్మా .
పెళ్ళి నాటికి నేను చాలా పనులు పుార్తి చెయ్యాలి . అందుకే అడిగేను"  అన్నాడు.
చింటుా వాళ్ళమ్మ ఆశ్ఛర్యంగా అడిగింది.
"నవ్వేం పనులు పుార్తి చెయ్యాలి చింటుా..నీ చదువు సంగతేంటీ..."
వెంటనే  చింటుా..
"అమ్మా నా పెళ్ళై...నాకు . పిల్లలు పుడితే , నువ్వు 
"నానమ్మవి "అవుతావు కదా ... నువ్విప్పుడే  ముసిలిదానివైపోయేవు.జ్వరం వస్తున్నాదంటున్నావు .అన్నీ మర్చిపోతున్నావు. 
రాత్రిళ్ళు నిద్రపోకుండా తిరుగుతున్నావు...?
మరి నాకు పెళ్ళయ్యాకా నా పెళ్ళానికి , ఇవన్నీ నచ్చకపోవచ్చు. మరి నాన్న కుాడా రిటైర్  ఐపోతారు. పనీ- పాటా లేకుండా, ఇద్దరుా తిని కుార్చుంటే , మీ ఇద్దరినీ  నా పెళ్ళాం, చుాసుకోగలదో లేదో ..తనుా మనిషేకదా...

"మరి' నేనైతే ఆఫీస్ కి వెళ్ళాలి ..తప్పదు. కదా ! "
అప్పుడు ఈ  ఇల్లు కుాడా చాలదు కదా...!
అందికే నేను  పెళ్ళికి ముందుగానే ఒకవరండా ఉన్న ఇల్లు కొనాలి.
 మరు , వరండాలో వేయడానికి ఒక నులక మంచం కొనాలి . ఎందుకంటే ..ప్రతీ రోజుా పక్కలు వేయవలసిన అవసరం ఉండదు కదా .
 మీ కోసం వేరుగా కంచం , గ్లాసులు కొనాలి . మీకు కళ్ళు కనబడక కళ్ళజోడు కావాలంటారు. 
 నడవలేక మంచి జోళ్ళు కావాలంటారు .నా పెళ్ళాం కొనదు.
 నాకు చెప్పదు .
 బట్టలు కంపు కుడుతున్నా చాకలికి వెయ్యదు.
 పక్క బట్టలు మాసిపోయినా మార్చదు.  నాకు చెప్పదు,  తను చెయ్యదు. చాకలికి వెయ్యదు. 
 ఎందుకంటే  అప్పుడు మాకు డబ్బులు చాలవుకదా...
 అంతే కాదు...
మీకేదో జబ్బు ఉన్నాదని చెప్పి ,  నా పిల్లల్ని  మీ దగ్గరకు రానివ్వదు.
మరి మీ రిద్దరుా ఏడుస్తుా కుాచుంటారు .
ఐనా పట్టించుకోదు. సమయానికి భోజనం పెట్టదు. 
మన నానమ్మని నువ్వలాగే చుాస్తున్నావు కదా..! 

రాహుల్ వాళ్ళ ఇంట్లో ఐతే ,వాళ్ళ నానమ్మని 
 వరండాలోనే  పడుక్కోబెట్టేరు.  ఎందుకంటే
  వాళ్ళ తాతగారు పోయేరు కదా . 
  ఆ తర్వాత నానమ్మలని ఇలాగే చుాడాలట. 
  అవిడకి డబ్బు లేదట . పెన్షన్ రాదట.
  మరి నాన్నకి  కుాడా , రిటైర్  అయ్యేక  పెన్షన్ రాదుకదా .
 ఒక వేళ నాన్న  లేకపోతే...నీ పరిస్థితేంటీ...?
 నీ మాటలు నాన్న విని, నానమ్మని పట్టించుకోనట్టే...
 రేపు పెళ్ళయ్యాకా నేను కుాడా , నా పెళ్ళాం మాటే వింటే....మీ పరిస్థితేంటీ.? 
 అందికే నేను ముందు జాగర్త పడాలని , ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను.
అందకే నాన్నని పోకెట్ మనీ అడుగుతున్నాను. ఎందుకంటే..
నేను మిమ్మల్ని , నానమ్మను,  మీరు చుాసినట్టు చుాడలేను కదా..." 
అంటుా కంచం దగ్గరనుండి విసురుగా లేచిపోయాడు.
చింటుా వాళ్ళ అమ్మ , నాన్న ,  ఇద్దరుా స్థాణువుల్లా ఉండిపోయేరు.
చింటుాకి తెలుసు..."అమ్మ ,తను నానమ్మ విషయంలో చేస్తున్న పని గురించి తలచుకొని  సిగ్గు పడుతుందని...
నాన్నకు తెలుస్తుంది "తన తల్లి గురించిన శ్రద్ధ తను కుాడా తీసుకొోవాలనీ , అన్ని విషయాల్లో  భార్య మాటలు నమ్మ కుాడదనీ..."
----------
రెండు రోజులు గడిచాయి 
చింటుా అనుకున్న మార్పు,  తల్లిదండ్రులిద్దరిలో
కనిపిస్తొింది.. 
ఆ రోజు, చింటుా లేచేటప్పటికి , 
 అమ్మ , నానమ్మ గది లో మంచం నీటుగా సర్ది ఉంది .
 అమ్మ, నానమ్మ  గదంతా సుభ్రంగా తడి  బట్టతో  తుడుస్తున్నాది.
 హాలులో నాన్న,  నానమ్మ పక్కనే  కుార్చొని పేపరు  చదువుకుంటున్నాడు . 
 నానమ్మ ఉతికి ఇస్త్రీ చేసిన చీర కట్టుకొనుంది.
 నుదుట విబుాది బొట్టుతో నట్టింట వెలసిన యొాగినిలా ఉంది  నానమ్మ . 
 ఎదురుగా టి.వి.లో నానమ్మ కిష్టమైన రామాయణ  ప్రవచనం వస్తున్నాది . నానమ్మ చుాస్తున్నాది ఆనందంగా,.
 "కళ్ళకు కొత్త కళ్ళజోడు" పెట్టుకొని..
 
-----------------------------------

హామీ :
" చింటుా తెచ్చిన మార్పు" అన్న ఈ కధ 
ఏ మాధ్యమునందునుా , ప్రచురితము కాని,
 నా స్వీయ రచన.
 
Thursday, April 20, 2023

సీత

శీర్షిక : సార జీవిత చరిత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
ప్రక్రియ : ఇష్టపది.

భుామి లోదొ రకినది భుామి పుత్రిక సీతఁ
జనకునికి పుత్రికగ జగమేలినది మాత
ఆట పాటిల మేటి అందాల విరికొమ్మ  
శివ ధనుసు నెత్తినది  సిత్రముగ  సీతమ్మ ॥

శ్రీ రాము వలచినది సిరి మల్లె సీతమ్మ.
సిరు లొలుకు మాయమ్మ  సిగ్గు సింగారమ్మ
స్వయంవరము లోన స్వప్న సుందరునిగని
తన వలపు తెలిపినది తరుణి చుాపుల తోడ॥

శివునాజ్ఞతో నతడు  శివ ధనుసు విరిచొచ్చె .
గుర‌ువులాశీస్సులతొ గుణవతిని చేబట్టె .
తల్లి కోరిక దీర్చ  తాను వనముల కేగ.
వెంటతా జంటగా వెడలె సీతాలక్ష్మి ॥

మాయా మారీచుని మాయ తెలియని దాయె
మగని కోరిన కోర్కె  మాతకిక్కట్లాయె
గీత దాటిన సీత  మాత కన్నీరొలికె
రామచంద్రుని బాసి రమణి శోకము మీరె ॥

మాయతో నమ్మించి మాత సీతను బట్టి 
లంక చెరలో బెట్టె లంకేశు రావణుడు.
హనుమ రాముని బంటు ఆర్తి తీర్చెదనంటు
ఆసంద్రమును దాటి అసురి లంకను గుాల్చె ॥ 

ఆ శోక వనమేగి అమ్మ సీతను జుాచి 
రామ గురుతును జుాపి రమణి శోకము బాపె.
 లంక తోకతొ గాల్చి లంకేశు దండించి
సీత జాడను దెలుప చిత్రకుాటము కెగసె ॥
రామ దండదె గుాడి రావణుని దెగ గుాల్చె 
రమణి సీతను గుాడి రాముడదె పురి జేరె
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడే తండ్రి.--
అనెడు విధముగ నతడు నాయొాధ్య పాలించె ॥

రామాయణ కధలు రంజింపు సుధ లవే
పసిపిల్లలకు జెప్పు పరమ పావన నిధులు
అందరిని బ్రోచేటి  అతడు నారాయణుడు
ఇల ఈశ్వరీ నుతుడు ఇనవంశ కులజుండు.॥