Thursday, June 21, 2018

నీవులేవు నిదురరాదు

నీవులేవు నిదురరాదు 
బ్రతుకుమీద ఆశలేదు 
అన్నీ మరపించీ పిలిచే 
చావుకూడా దరికి రాదు ॥ 

నీవు జతగా కట్టినాను 
కలల ఆశల మేడలూ... ఆ   
మేడచుట్టూ  వేసినాను 
వలపు పూవులా తోటలూ ,ఆ... 
తోటలో తిరుగాడు రాణివి 
నీవు నీవనే తలపులూ 
కూలిపోయెను ఆశలన్నీ 
వాడిపోయెను పూవులూ ॥ 

నిన్ను విడిచీ నిలువలేక 
మధువు మత్తును మరిగినాను 
మత్తు నిండిన మనసు గుడిలో 
నిండు నీ రూపు చెరపలేను 
నీడవై వెంటాడినావు 
మధువు సుధవై నిండినావు 
నీ..తలపులు వీడలేను 
నిన్ను వదిలీ ఉండలేను ॥

రచన , శ్రిీీమతి..
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
---------------------

ప్రియా...సఖియా

ప్రియా..   సఖియా.....
 రావే ..... ఇలా....
కదలే...... లయా.......
 నా...      గుండెలా ..... ॥ 

నుదుటా  శశికళా ........ 
సిందూర సితార మెరుపులా .... 
ఎరుపెక్కిన బుగ్గలు  
రంగు గులాబీ పూవులా......  ॥ 

... 
కనులా ......అవి...కలువలా... . 
విరిసే.....  సుమ రేకలా....
కదలే.........  ముంగురులా .......
అవి ఎగిరే... తుమ్మెదలా....  ॥

కురులా....... మెేఘ మాలికలా.... 
 ఆడే  నల్లని నాగులా.....
నడుమా...నదీ గమనమా
అలల కదలికల సంగమమా॥

సడులా...... సవ్వడులా....... 
నీ  పదముల పారాడు మువ్వలా.... 
అలలా..... భంగిమలా ,....... 
నీ  మేని  సొగసుల  సందడులా ...॥

రచన 
జగదిీశ్వరిీముార్తి
కల్యాణ్.
----:-------- ++



మనసు కలచే మౌన వేదన

మనసు కలచే మౌన వేదన 
పెదవి విప్పీ చెప్పలేను ... 
కలల  చెలివి నీవు నీవని 
ఎదుట నిలిచీ పలుకలేను

ప్రియతమా ......నా .... ప్రణయ గీతమా .... 
.. ప్రేమా ............ నా ప్రాణమా ......... ॥ 

గుండె గుడిలో నిలిపినాను 
కానవైతివి  నా వలపూ  ..... 
మదిని నిండిన  నీ రూపూ 
చెరపలేవది  నా గెలుపూ 
మరపు రాని జ్ఞాపకాలే 
నిండు పున్నమి వెలుగులూ ..ఆ .. 
వెలుగు పంచిన ప్రేమ కధలే 
బ్రతుకు నిలిపే శ్వాశలూ ...... నా ॥ బ్రతుకు ॥ 

ప్రియతమా ..... నా .... ప్రణయ గీతమా .. 
ప్రేమా .......... నా....... ప్రాణమా ......

నిదురరానీ  కనులు బాధగ 
కార్చె  కన్నీటి  ఆవేదనా ..... 
కలత నిదురకు కరగే కలలే 
మిగిలే నాలో   వేదనా....
బ్రతుకు విరహపు అలల సడియై 
అలజడైనది భావనా...... 
చితుకు ఆశల చివరి పల్లవి 
పాడె అపశ్రుతి ఆలాపనా ....  

తీరదు ఈ తీపి బాధా 
ఎవరు ఎరుగరు  నా గాధా.... . 

ప్రియతమా ........నా ..ప్రణయ గీతమా.... 
ప్రేమా,.......... నా.....  ప్రాణమా .........॥ .. 

రచన , శ్రిీమతి, 
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
-------------------------

ప్రణయగీతం

ఆమె = ఆకాశం లో  నల్లని మేఘం 
ఆడుతు పాడుతు  అల్లరి చేసెను ఈవేళా ...
చల్లని ఝల్లుల గాలులు వీచెను 
నా మది పాడెను మోహన గీతం ఈ వేళా ....... 

అతడు = నల్లని నీకురుల చెదరిన అందం 
మేఘ మాలలై సాగెనులే .... 
ఎగిరే పయ్యెద లయల ఊసులే 
చల్ల గాలులై వీచెనులే .... ॥ 
నా కమ్మని కలయై సాగెనులే ...... 

ఆమె= పూల వనంలో విరిసిన అందం 
రంగుల పల్లకి నెక్కిన భావం తోచెనులే ... 
మల్లెల మాలలు ఝల్లుగ కురిసే 
మత్తు పరిమళం మదిలో వలపులు రేపెనులే .....

అతడు =మల్లెలు కావవి నీ చిరునవ్వుల 
కురిసే ముత్యపు ఝల్లులులే .... 
పల్లవి పాడే పూల పరిమళం 
నీమేని సొగసుల అందములే .. 
పరువాల విరుపుల గంధములే ........ 

ఆమె+అతడు 
పున్నమి రాత్రుల వెన్నెల (సిరులే )తానుగ 
కవితకు జతయై   వలపుల గీతం పాడెనులే ....
ఇద్దరి తలపుల ఇంద్ర ధనుసుపై 
వలపు వాడలకు  ప్రేమ ప్రయాణం   సాగెనులే ..... 

ఆ.............. ఆ.............. ఆ.............. ఆ..... \\ ॥