Sunday, January 27, 2019

ఓ....పడతీ....



శీర్షిక .

ఓ పడతీ...

ఓ పడతీ...పైట కప్పుకో..
పైటలాగ గానే
పరుగెత్తుకొచ్చే పరంధాముడు
ఇక  రాడు....లేడు గనక..

అసహ్యపు హీన బ్రతుకును
ఆస్వాదంచే    మ్రుగ మగాడికి
నీ ఆర్తనాదం  ఆనందగీతమై 
అర్ఘ్యం పోస్తుంది    అందుకే ...
ఓ  పడతీ...పైట కప్పుకో...

ఎవరో వస్తారని   ఏదో చేస్తారని
ఎన్నాళ్లిలా  ఎదురు చుాస్తావు
కాగితపు నోట్లకి అమ్ముడు పోయిన
న్యాయం...కామాంధుడికి
అద్భుత  దీపం లాంటది.
కసిగా రుద్ది...కరకుగా వాడుకోవడమే
కాదు
కోరిన వారికి   కావలసినంత
పంచేంత
దుర్గుణ  హేయానంద
హృదయం వాడిది
అందుకే...ఓ పడతీ...
పైట కప్పుకో..

నీవు అక్రోశించిన  ప్రతీ చోటా
దుశ్శాశన రాజ్యం
దుందుభిలు
మ్రోగిస్తోంది
సిగ్గు విడచిన సీమ పందుల్లాంటి
జనం మురికిలో కామం మందు
తాగి పొర్లుతుా.మలం
నంజుకు తింటున్నారు
అందుకే..ఓ..పడతీ..
పైట కప్పుకో..

పాచికలు పారడానికి 
సిద్ధంగా ఉన్న
శకునులతో జూదమాడి
ఓడిన  తలలు
సిగ్గుతో  వాలి  పోయాయి .
అవి నిన్ను  చుాడలేవు.
అందికే..ఓ  పడతిీ....
పైట గట్టిగా క ప్పుకో ॥
                  ఎందుకంటే
న్యాయం గుడ్డిదే కాదు.
చెమిటిది. ...ముాగదీ కుాడా
దానికి నీ ఆర్తనాదాలు
వినబడవు
అవి రాజకీయ సీస శాశనాలతో
ముాసుకుపోయాయి
దాని నోరు పదవుల పెద్దనోట్ల 
పక్షవాతంతో   ఎప్పుడో 
పడిపోయింది..అందికే...
ఓ.....
పడతీ...పైట గట్టిగా కప్పుకో
పైట లాగినంతనే పరగెత్తుకొచ్చే
పరమాత్ముడిక్కడ...లేడు. .
ఇంక రాడు కుాడా...
-----------------------------------------

                   రచయిత్రి: శ్రీమతి :
     పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి .         

మహారాష్ట్ర   కల్యాణ్.
--------------------------------------------------------

Saturday, January 19, 2019

కట్నం

కట్నం   ...కవిత
          రచన...రాచెర్ల మధుసుాదన్ గారు.
       స్వరకల్పన...శ్రీమతి..జగదీశ్వరీముార్తి.
                          కల్యాణ్.
----------------------------------------------------------
ప॥       అంగట్లో బొమ్మై పోయిండ్రో
            నా అక్క చెల్లెల్లు , ఆడపడుచులుా...॥
అ.ప॥  ఆడు సుాత్తడుా...ఈడు సుాత్తడుా
            సుాసినాంక కట్నం అడిగిపోతాడుా ॥                                 =             ==== ॥అంగట్లో॥

చ॥       కట్నం కాటుకు బలియైపోయారో
            నా అమ్మ అయ్యలు  నా ఇంటోల్లుా....
             పండగంటడుా   పబ్బమంటడుా..
            ఉన్నదంతా తానే ఊడ్సుక పోతాడు..॥

చ॥      కట్న దాహానీకి కిరొసీనో వరమాయె
            నా అక్క సెల్లెల్లు  ఆడపడుసుాలకు
            ఇక్కట్లు తీరేటీ దారీ తెన్నుా లేదా
            తప్పన్ని సావుల నాపేటోడుా లేడా ॥

చ॥      
           మల మల మాడుతు కాలుతు ఉన్నా
           చలనం లేని మ్రుగజాతన్నా..
                   అది మగజాతన్నా.....
           మ్రగ మగజాతిని మార్చే కాలం
           కట్నం రక్కసి పోయేకాలం
           ఎప్పుడు వచ్చును రాజ్యంలో
         । మార్పే రాదా  ఈ లోకంలో...॥
                       ॥అంగట్లొ॥

       --------++++-----------------++++----
                     

Friday, January 18, 2019

కట్నం .

కట్నం   ...కవిత
          రచన...రాచెర్ల మధుసుాదన్ గారు.
       స్వరకల్పన...శ్రీమతి..జగదీశ్వరీముార్తి.
                          కల్యాణ్.
----------------------------------------------------------
ప॥       అంగట్లో బొమ్మై పోయిండ్రో
            నా అక్క చెల్లెల్లు , ఆడపడుచులుా...॥
అ.ప॥  ఆడు సుాత్తడుా...ఈడు సుాత్తడుా
            సుాసినాంక కట్నం అడిగిపోతాడుా ॥                                 =             ==== ॥అంగట్లో॥

చ॥       కట్నం కాటుకు బలియైపోయారో
            నా అమ్మ అయ్యలు  నా ఇంటోల్లుా....
             పండగంటడుా   పబ్బమంటడుా..
            ఉన్నదంతా తానే ఊడ్సుక పోతాడు..॥

చ॥      కట్న దాహానీకి కిరొసీనో వరమాయె
            నా అక్క సెల్లెల్లు  ఆడపడుసుాలకు
            ఇక్కట్లు తీరేటీ దారీ తెన్నుా లేదా
            తప్పన్ని సావుల నాపేటోడుా లేడా ॥

చ॥      
           మల మల మాడుతు కాలుతు ఉన్నా
           చలనం లేని మ్రుగజాతన్నా..
                   అది మగజాతన్నా.....
           మ్రగ మగజాతిని మార్చే కాలం
           కట్నం రక్కసి పోయేకాలం
           ఎప్పుడు వచ్చును రాజ్యంలో
         । మార్పే రాదా  ఈ లోకంలో...॥
                       ॥అంగట్లొ॥

       --------++++-----------------++++----
                     

మహరాష్ట్ర ఆమని.


మహారాష్ట్రామని..
--------------------------

చదివిన చదువుకి దోరికిన ఉద్యోగానికి
సంబంధం  లేని  జీవితాలు
అప్లై చేసినది  ఆరువేల మంది అయితే
అద్రుష్టం వరించినది ఆరుగురికే॥

వారిది  బ్రతుకు తెరువు త్రుప్తి '
మిగిలిన వారిలో చావలేని విరక్తి.
కుాలిన ఆశలని , అవమానాల
అసహాయతని  ముాట కట్టుకొని  ,
బతుకుతెరువు కోసం ,
బహుదుారపు  ప్రయాణం ॥

సన్నిహితుల
సముదాయింపుల సారం
ముంబయ్  మహానగరానికి 
ఆశల పయనం ॥

అడుగు  పెట్టినంతనే 
అదిరిపడిన  అంతరంగం ,
ఎదుట అలలై  పొంగి ,
హోరెత్తే   జనసముద్రం ॥

పగలుా రాత్రీ తేడా తెలీని
ఆర్ధిక  ఆశల  రద్దీ   వేట
ముంబాయ్   నగరం ,
నా లాంటి  వారికి
చావని ఆశల వరాల పేట ॥

తెలుగు మాట ప్రతి చోట. ...
తెలుగు పలుకు ప్రతి నోట...
అన్ని వర్ణాలకు  ఆశ్రయమిచ్చే
ఆర్ధిక వనరుల అందాల పుాదోట ॥

బంగరు కాంతుల బల్బుల బాట
బజారు ముాయని మాయల కోట
చదివిన వారికీ , చదవని వారికి
బ్రతుకు తెరువుల బంగారు ముాట.॥

ఆకల్లేని  నిండైన కడుపులు ,
కాయ కష్టపు స్వతంత్ర్య  బతుకులు...
కలిసీ మెలిసీ ఉండేటి  వలపులు.,
ఆదరించు బంధాల  పిలుపులు..॥

వారి భాష  మరాఠీ అన్నది
తెలుగు వారి మది దోచిన  పెన్నిధి ..॥
అమ్చీ ముంబై  శుభ యాత్రా ,
అది వెలుగులు పంచే మహరాష్ట్ర ॥

-------------------

నేడు కరోనా కాటుకు కమిలి విషపుారితమైపోయింది "  కరోనా" కట్టడిలో, ఆకలి వేటలుా, ఆర్తనాదాలుా ,రెక్కాడితే గానీ డొక్కాడని,వలస జీవుల అగచాట్లుా,కాలిన బొబ్బల  కాలి నడకల ప్రయాణాలతో ముంబైనగరం సిగ్గుతో తలవంచింది.

ఎంతెంత దుారం , ఎంతో దుారం....దుారం దుారం నిర్మానుష్య రహదారుల్లో  , నీరైనా దొరకని వివసత్వపు కన్నీటి కథనాలు..నీర్సపు చావులు  , ఆకలి కోర్వలేని  అర్ధాంతర  చావుల శవాల గుట్టలు ,రక్తపు అడుగుల, రగిలినహృదయాలఆక్రందనలు

నిర్వీర్వ నీరస ధృక్కుల, నిరంతర కన్నీటి వలసలు

ఒకొక్కరుగా తన ను విడిచిపోతున్న 

అసహాయ హృదయాల నీరస నిధనాలకు

కంపించిన ముంబాయ్ , నిస్త్రాణగా చెప్పింది వీడ్కోలు.

మానవత్వం  అంతరించిన రాజకీయపుటెత్తుల్లో

అలమటిస్తుాన్న ఆక్రోశపు చావుల ఆర్తనాదాలకు

ముంబాయ్ నగరం ముఖం చాటేసింది.

విస్వాసం లేని విద్యావంతుల, విచక్షణా రహిత 

అబద్ధపు సాక్ష్యాల మధ్య  , నలిగిపోతున్న న్యాయ వ్యవస్థకు ,  అసందర్భపు వాగ్దానాల  నాయకుల పాలన తిోడై , దేశాన్ని దుర్గతి  పాలు చేస్తుా ఉంటే  చుాడలేని ముంబాయ్ నగరం ,

ముాసుకున్న కళ్ళకు  గంతలు కట్టుకొంది.

ఈ వ్యవస్థను మార్చలేని ముంబై నగరం , వివసత్వంతో  ముాగబోయింది..॥॥




------------------------
రచన...శ్రీమతి
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
                కల్యాణ్.
--------------------------------------------

ధన్య్ మహరాష్ట్ర.

ధన్య మహారాష్ట్ర.
----------------------.
"శివాజీ టెర్మినస్ " పేరులొనే
కీర్తిని కిరీటాన్ని ధరంచిన నగరం
మరాఠీల మహోన్నత
స్వామిభక్తి కి నిదర్శనం.॥

అణువణువుా దేశ భాషనే
పలికే  , ఆదర్శపుారిత  ఐకమత్యం   
" మాఝా మరాఠ్ వాడా "
అనేపదానికి  వారిచ్చే గౌరవం.॥

చారిత్రాత్మక శిధిలాలు ,వారి
నిజమైన స్వామి భక్తి కి నిలయాలు.
అష్ట  గణపతీ ; పండరిపుార్
వంటి  ఆలయాలు...సాంప్రదాయ
నిష్ట- నియమాలకు ప్రతిరుాపాలు.॥

అభంగాది  సంకీర్తనా సరాలు,
విఠలు ని నామామ్రుత  గాన సాధనలు
సంగీత కళా నిధుల సన్మాన వేడుకలుా,
మరాఠీ సంస్క్రుతికి  వారిచ్చే
పలు విందుల  భక్తి  నీరాజనాలు.॥

నామదేవ్ , తుకారాం ,జ్ఞానేశ్వర్
వంటి  ఎందరో మహనీయులు
మరాఠీ  సంగీత  , సాహిత్య
సమాహారం లో  మెరిసే  -
కలికితురాయిలు.॥

ఆత్మీయానుబంధాల పలకరింపులు;
సంక్రాంతి సంబరాల పసుపు, కుంకుమలు
కట్టు బొట్టుల  పద్ధతిలో  నిండైన తీరుకు
మరాఠీ .వాసుల కి, పెట్టింది  పేరు.॥

బీద ,గొప్ప , జాతి మత
తారతమ్యాలు లేని ,పలు
  ప్రేమ బంధాల , జీవన
గంగా వాహిని.మహారాష్ట్రా-
మానిని,  ప్రేమామ్రుత తరంగిణికి
ఇవే నా నమ:సుమాంజలులు॥
-------------------------

రచన; శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  (మహారాష్ట్ర)
ID...4200.

కట్నం


-----------------------కట్నం   ...కవిత
          రచన...రాచెర్ల మధుసుాదన్ గారు.
       స్వరకల్పన...శ్రీమతి..జగదీశ్వరీముార్తి.
                          కల్యాణ్.
----------------------------------------------------------
ప॥       అంగట్లో బొమ్మై పోయిండ్రో
            నా అక్క చెల్లెల్లు , ఆడపడుచులుా...॥
అ.ప॥  ఆడు సుాత్తడుా...ఈడు సుాత్తడుా
            సుాసినాంక కట్నం అడిగిపోతాడుా ॥                                 =             ==== ॥అంగట్లో॥

చ॥       కట్నం కాటుకు బలియైపోయారో
            నా అమ్మ అయ్యలు  నా ఇంటోల్లుా....
             పండగంటడుా   పబ్బమంటడుా..
            ఉన్నదంతా తానే ఊడ్సుక పోతాడు..॥

చ॥      కట్న దాహానీకి కిరొసీనో వరమాయె
            నా అక్క సెల్లెల్లు  ఆడపడుసుాలకు
            ఇక్కట్లు తీరేటీ దారీ తెన్నుా లేదా
            తప్పన్ని సావుల నాపేటోడుా లేడా ॥

చ॥      
           మల మల మాడుతు కాలుతు ఉన్నా
           చలనం లేని మ్రుగజాతన్నా..
                   అది మగజాతన్నా.....
           మ్రగ మగజాతిని మార్చే కాలం
           కట్నం రక్కసి పోయేకాలం
           ఎప్పుడు వచ్చును రాజ్యంలో
         । మార్పే రాదా  ఈ లోకంలో...॥
                       ॥అంగట్లొ॥

       --------++++-----------------++++----
                     

Wednesday, January 16, 2019

ధన్య మహరాష్ట్ర మాయిా

సహస్ర పుస్తక యజ్ఞం కొరకు..
-------------------------------------.
ధన్య మహారాష్ట్ర మాయిా
----------------------.--------------
"శివాజీ టెర్మినస్ " పేరులొనే
కీర్తిని కిరీటాన్ని ధరంచిన నగరం
మరాఠీల మహోన్నత
స్వామిభక్తి కి నిదర్శనం.॥

అణువణువుా దేశ భాషనే
పలికే  , ఆదర్శపుారిత  ఐకమత్యం   
" మాఝా మరాఠ్ వాడా "
అనేపదానికి  వారిచ్చే గౌరవం.॥

చారిత్రాత్మక శిధిలాలు ,వారి
నిజమైన స్వామి భక్తి కి నిలయాలు.
అష్ట  గణపతీ ; పండరిపుార్
వంటి  ఆలయాలు...సాంప్రదాయ
నిష్ట- నియమాలకు ప్రతిరుాపాలు.॥

అభంగ కీర్తనాది , సంకీర్తనా సరాలు,
విఠలు ని నామామ్రుత  గాన సుమాలు,
సంగీత కళా నిధుల సన్మాన వేడుకలుా,
మరాఠీ సంస్క్రుతికి  వారిచ్చే
పలు సౌరభ   భక్తి  నీరాజనాలు.॥

నామదేవ్ , తుకారాం ,జ్ఞానేశ్వర్
వంటి  ఎందరో మహనీయులు
మరాఠీ  సంగీత  , సాహిత్య
సమాహారం లో  మెరిసే  -
కలికితురాయిలు.॥

ఆత్మీయానుబంధాల పలకరింపులు;
సంక్రాంతి సంబరాల పసుపు, కుంకుమలు
కట్టు బొట్టుల  పద్ధతిలో  నిండైన తీరుకు
మరాఠీ .వాసుల కి, పెట్టింది  పేరు.॥

బీద ,గొప్ప , జాతి మత
తారతమ్యాలు లేని ,పలు
  ప్రేమ బంధాల , జీవన
గంగా వాహిని.మహరాష్ట్రా-
జనని,  ప్రేమామ్రుత తరంగిణి ॥
-------------------------

రచన; శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  (మహారాష్ట్ర)
ID...4200.