Wednesday, June 10, 2020

ఆక్రోశం.


మారుతున్న రాజకీయ వ్యవస్తావిన్యాసానికి ,
వంతు పలుకుతుా, కమ్ముకున్న మేఘాలజోరుకు, 
కురిసే ఉద్ధృత వర్షపు, ఊపు  ధారలు 
వక్ర మార్గాలలో వంకర్లు పోతుా,.
మేము కార్చే కన్నీరుతో కలిసి 
ఎరులై పొంగి పొరలుతోంది .
చేతికొచ్చిన పంట, నేలపాలైన వైనం ,
తట్టుకోలేని గుండెకోత శబ్దం తో కలిసి ,
నిశబ్దమైన ,నిరాశా నినాదాలు చేస్తోంది.
మా గుండెలు అవిసిపోతున్నాయి.
గొంతులు పొడిబారుతున్నాయి.
వాలిపోయిన పంట పొలాల్లో నిలచిన
నీటిలో ,  నానిపోయిన మా పాదాల-
పాచిపట్తిన  పగుళ్ళ సందుల లో ,నిండిన  తడి
ఎండిపోయిన మా గొంతుల దాహాన్ని 
తీర్చలేని , నిస్సహాయ నీరమై నిర్వీర్యమౌతోంది.
అందరి ఆకలినీ తీర్చేందుకు, అహోరాత్రాలుా
కష్టించే మా శ్రామిక హస్తాలు , కమిలి కాయలు కాసాయి. ఆకలి కడుపుల అసహాయ  జీవితాలు,  పట్టెడన్నం కోసం  అలమటిస్తుా ,
అర్ధాంతర  చావులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
చెమటగా మారిన మా రక్తం , మీ ఆకలి తీర్చే అన్నంగా
మారి , అంతస్తుల హార్మ్యాల లో మీకు జోల పాడుతోంది. అధికారపు  ఏలుబడి పట్టాలకు
మాధ్యమాలమైన మా "ఉనికి" మురికి పట్టిన 
మంతనాల చాటున,  మసిబారిపోతోంది.
"ఏమని"" అడిగే "ప్రశ్నకు" జవాబుగా ,
మంది ప్రాణాల్ని అన్యాయంగా బలితీసుకొంటోది. 
రాజకీయ తృష్ణ ,తారతమ్యాల ,దాడుల్లో  
రాబడి పెంచుకుంటుా , "రమ్ము" పానం చేస్తొింది.
అవసరానికి ఆదుకుంటామన్న పాలకుల వాగ్ధానాల
చిట్టాలు , మా చుాపుడు వేలిపై నల్లటి ముద్రగా చిత్రించబడి, నాలుగు రోజుల్లోనే నలిగిపోతున్న -
మా వెలసిన, బతుకు చిత్రాల కుప్పల  మధ్య, 
వెల- వెల పోతుా  , రంగును కోల్పోతోంది.
"కంచే చేను మేస్తున్న "  రాజకీయపు టెత్తుల తీరుకు , 
మా వలస బతుకుల గతుకు ప్రయాణాల్లో , 
ఆకలి చావుల ఆక్రోశం , శవాల గుట్టల ముాటల్లో చేరి ముక్కి కంపు కుడుతోంది.
హద్దులు దాటిన ఆక్రోశం , పగ బట్టిన శాపమై , 
విధ్వంశం వీడని, కుంభ వృష్టిగా కురుస్తోంది.
కుళ్ళిన జీవుల కళేబరాల్లోంచీ పుట్టిన "కరోనా"',వంటి
కనిపించని కణాలు,  క్లిష్ట  దుష్ట పాశాలై , 
శర వేగంతో ప్రపంచ వ్యాప్తి చెందుతుా, విశ్వ-
విధ్వంశ చేష్టలతో విఝృంభిస్తుా....
మా కార్మికుల కష్టాలకు, 
కన్నీటి తర్పణాలు వదులుతోంది.
మానవత్వం మరచిన ఈ సమాజంలో , 
సమానవత్వం లేని, మనస్తత్వపు రాజకీయాల-
నిర్ణక్ష్య వైఖరి , మారనంత వరకు ,
మా కన్నీటి  చావులు,  కణ పిశాచాలై , 
విశ్వాసఘాతకుల వినాసనానికై, వీర విహారం
 చేస్తుా ,మిడతల దండు తీరు లో 
 విధ్వంసాన్ని శృష్టిస్తుానే ఉంటాయి.
 ----------------
రచన , శ్రీమతి , 
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్  (మహరాష్ట్ర ).

------------------------------









No comments:

Post a Comment