[7/25, 17:43] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: 💐💐💐💐💐💐
(9 అంశాలు)-9 శతాక్షరీ లు రాయాల్సి వుండును
1పురస్కారం
💐నవరస శతాక్షరి
(1)శృంగారం(2)వీరం
(3)కరుణ(4)అద్భుతం
(5)హాస్యం(6)బయనకం
(7)బీభత్సం(8)రౌద్రం
(9)శాంతం
💐💐💐💐💐💐
***వివరాలకు****
--భేరి మధుసూదన్
కర్నూల్-518002
7674993500
6301932933
berimadhusudhan@gmail. com
💐
(BERI MADHUSUDHAN
google/Face Book)💐💐💐💐💐💐
👌(3)👍
[7/28, 20:06] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు:
అంశం.
నవరస శతాక్షరి .
------------------------
1.శృంగారము.
--------------------+
చెలి ముఖము చంద్ర బింబము
కొంటె చుాపులు విరి తుాపులు
ఆ నవ్వుల లో విరి జల్లులు.
పలుకులొలుకె తేనియలు.
నడుము వంపులో విరుపులు
నడకల లో నిండు హొయలు
అరుదెంచిన చెలిని జుాచి
మొాహము నిండిన తలపులు
అగుపించెను అప్సర వలె
ఆడె నా మది మయుారి వలె॥
----------------------------------
2. వీర రసం.
----------------
పద్మ వ్వుాహాన్ని ఛేదించు కొని -
చొచ్చుకుపోయాడభిమన్యుడు.
లోపలికి తప్ప బయటకు -
తిరిగి రావడం తెలియదు.
ఐనా, వెనుకంజ వేయలేదు.
స్వ విజయమొా, వీర స్వర్గమొా?
"వీర రసం" తో పోరు సల్పేడు.
వీర గతికి ప్రాప్తుడయ్యేడు.
ప్రాణ భయం లేని "పట్టుదల"
పోరు లో, చావు కుాడా "గెలుపే"॥
-------------------------------------
3.కరుణ రసం.
--------------------
చలికి వణుకుతుా, అతడు.
చీర కొంగు కప్పాలని, ఆమె.
గమ్యం తెలీని బ్రతుకు భారం.
ఫుట్ పాథే, వీరికి ఆధారం.
దైన్యత నిండిన చుాపుల్ల లో-
ఒకరికొకరమన్న దైర్యం.
స్వార్ధం నిండిన కరకు తనం.
" కరుణ " లేని కృుార సంతానం .
పెంచిన ప్రేమకు బహుమానం
అమ్మా, నాన్నలు వారికి భారం.
-----------------------------------------
4. అద్భుతం.
-----------------
దేవుని సృష్టి ఒక "అద్భుతం".
వే- వేల రుాపాల మనుషులు .
తప్పు , ఒప్పుల మనస్తత్వాలు.
ఆదుకొనే ముక్కోటి దేముళ్ళు.
అనంతమైన అంతరిక్షము.
గ్రహ తారాది శక్తి కుాటము.
ప్రకృతి, పంచ భుాతాల మయం.
జీవాధారం, భీషణ ప్రళయం.
వీటి మధ్య ప్రగతి సాధించే-
మనిషి మేధస్సు మహాద్భుతం.॥
-----------------------------------------
5.హాస్యం .
-------------
పాప అల్లరి , నాకు విసుగు.
తండ్రంటే దానికి చాలా భయం.
తనున్న రోజు నాకు నిశ్ఛింత.
ఒక రోజు పాప అడిగింది.
నాన్నకెందుకు భయపడాలి.?
ఇంటికి నాన్న" బాస్ "అన్నాను.
ఆదివారం, అల్లరే అల్లరి.
ఆయనని చుాసి పాప అంది -
నాన్నా, ఈ రోజు..నేను నీ "బాస్".
ఇద్దరికీ నవ్వు ఆగలేదు...😃 ॥
-------------------------------------
6. భయం.
----------------------
పొగ తాగుతుా పట్టు పడ్డాను.
నాన్న కళ్ళల్లో ఎర్రటి జీర.
తలెత్తి చుాడ లేక పోయాను.
కోపం తో నాన్న చేసే గద్దింపు-.
ఎప్పటి నుంచీ ,అనే సాధింపు.
జవాబు చెప్ప లేక ఏడ్చాను
నా ఒళ్ళు "భయం" తో వణికింది.
అమ్మ దగ్గరకు తీసుకుంది.
నాన్న కి కోపం తెప్పించనని -
అమ్మ దగ్గర ఒట్టు పెట్టాను.
తప్పొప్పుకోడం మంచి లక్షణం
పశ్ఛాత్తాపమే మార్పుకు మార్గం.॥
--------------------------------------------
7. భీభత్సం.
----------------
మానవత్వం నశించిన కాలం .
మాన భంగాల మారణ హోమం.
దాడుల చావుల ఉపారం .
రక్త కన్నీటి జ్జ్వాలా తోరణం.
మహిలో మానభంగాల జాలం..
మదిలో జాతి మతాల జాడ్యం.
అస్తి తగాదాల జోరు హోరు
అన్న దమ్ముల్లో వైరపు పోరు
మనిషికి మనిషే శతృవై-
చావు కొట్లాటలల్లే "భీభత్సం ॥
-----------------------------------
8.రౌద్రం.
--------------------
ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.
విష్ణు చింతనే అతని శ్వాస .
హిరణ్య కశిపుడు దైత్యుడు.
దేముడిని నమ్మేవాడు కాదు.
విష్ణువెక్కడున్నాడనేవాడు.
తనమాట వినని పుతృణ్ణి-
కొట్టి తిట్టి హింసలు పెట్టేడు.
స్తంభం లోంచీ విష్ణువు వచ్చేడు.
"రౌద్ర "రుాప నారసింహునిగా.
హిరణ్యకశిపుని దృంచేడు.
---------------------------------
9. శాంతం.
-----------------
నాన్న లేని నన్ను పెంచిందమ్మ.
చెడు స్నేహాల తో పెరిగేను.
మంచి చెప్పే అమ్మంటే చిరాకు.
పెళ్ళితో వేరు కాపరం పెట్టా.
అమ్మకి ఆరోగ్యం క్షీణించింది.
వృధ్ధాశ్రమంలో చేర్చంది, భార్య..
అలవాట్ల కు డబ్బు కావాలి
డబ్బు తేకపోతే కొట్టే భార్య.
"శాంత "ముార్తెైన అమ్మ కై ఏడ్చా..
అమ్మ విలువ తెలుసుకున్నా.
-------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
8097622021.
iswarimurthy@gmail.com.
-----------------------------------------.ఈ రచన ఏ మాధ్యమునందు ప్రచురితం కాని నా స్వీయ రచన.
🌹🌿🍁🍃🌹🌿🍁🍃🌹🌿🍁🍃
" శతాక్షరి "ప్రక్రియలో
20--07---2020 ( సోమ వారం)సోదరి శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com గారూ "స్వచ్ఛ ప్రేమిక--(93వకవయిత్రి)పురస్కారానికి ఎంపికయ్యారు
(మరియు)
22-07-2020(బుధవారం)సప్తవర్ణ శతాక్షరి ప్రక్రియలో 7 ఆత్మీయ అంశములు రచన గావించి ""సప్తవర్ణ స్వచ్ఛ ఆత్మీయ ప్రేమిక"' పురస్కారానికి ఎంపికయ్యారు
26 07-2020(ఆదివారం)
నవరస శతాక్షరి ప్రక్రియలో 9 సాహిత్య అంశములు రచించి
""స్వచ్ఛ నవరస సాహితి ప్రేమిక""పురస్కారానికి ఎంపికయ్యారని
"గిఫ్ట్ ఆఫ్ గాడ్"సభ్యురాలు
శ్రీమతి అనుషాభేరిమధుసూదన్
తెలిపారు.
💐శతాక్షరి ప్రక్రియ రూపకర్త:శ్రీ భేరి మధుసూదన్(కర్నూలు)7674993500
berimadhusudhan @gmail. com
64 కళలు24 ఫ్రేమ్స్ వరల్డ్💐భేరి
భేరి💐సాహితి నిధి
భేరి💐సాహితి వేదిక
కర్నూలు-518002
ఆంధ్రప్రదేశ్, ఇండియా
🌹🌿🍁🍃🌹
భేరి💐 సాహితి వేదిక సభ్యత్వ సంఖ్య:93💐
🍃🌹🌿🍁🍃👌
26--07-2020
(PRESS NOTE)
No comments:
Post a Comment