Thursday, July 23, 2020

అంశం =అన్నదాత సుఖీభవ ( ముత్యాల సరాలు ప్రక్రియలో) క్రిష్ణవేణి గారి కవిత.

ప్రక్రియ: ముత్యాల సరాలు
పేరు: ఐనవోలు. కృష్ణవేణి
ఊరు: చింతపర్తి 
 చిత్తూరు జిల్లా
ఫోన్ నెంబర్: 9010974748
_____________________

శీర్షిక: అన్నదాత సుఖీభవ!
🌾🌾_________🌾🌾

01. కర్షకుడు అతని పేరు
       కష్టపడడం అతని తీరు
పంటపొలాలే అతని ఊరు
కష్టాలు కరువులతోనే పోరు
లేదు అతనికి అత్యాస
నీకింత కూడు పెట్టాలన్నది
అతనికి ఎంతో ఆశ🌱

02. నేలగుండెచప్పుళ్ళు వినే  మర్మజీవి
స్వేదకాలువలు పారించే కర్మజీవి
హరితహొయలు సృష్టించిన కష్టజీవి
భవితకుభరోస నిచ్చిన ధర్మ జీవి
అందరి కడుపులు నింపే ప్రేమజీవి
తప్పులను భరిస్తున్న క్షమజీవి
ప్రకృతి వ్యవసాయ ప్రకృతిప్రేమి🌴

03. రైతు లేనిదే రాజ్యం లేదు
ఎగసిపడే కెరటం రైతన్న
సాయంచేయడం  అతని నైజం
రైతే మన రాజు
రైతే మన నేస్తం
రైతులు అందరూ బాగుండాలి
అందులో మనమూ ఉండాలి🌳

04. వారాల వర్షం కురవాలంటే☔
పసిడి పంటలే పండాలంటే
చిన్నాపెద్దా చేతులు కలిపి
రైతన్నకు అండగా ఉండాలి
ప్రకృతి వనరులను కాపాడాలి
పర్యావరణపరిరక్షణ ధ్యేయం కావాలి
రైతే రాజని పొగడాలి👏

05. హర్షంతో హలాలు పట్టి
      మోదంతో పొలాలు దున్ని
ధరాతలాన్ని  సస్యశ్యామలం చేసి
పంటలు పండించే రైతన్న
అయ్యాడు  దేశానికి వెన్నెముక
మూలం అయ్యాడు దేశప్రగతికి
పస్తులుఉండే కడుపుకు అమ్మయ్యాడు🌲

06. శ్రమైక జీవన సౌందర్యానికి
పచ్చనిపైరు కు నీరులేక
వెచ్చని కన్నీటిని చిందించి
చెమటోడ్చి పంటలు పండించి
పండినపంటకు ధర లేక
బక్కశల్యమై బ్రతుకుతున్న 
కృషీవలుడు  ను రక్షిద్దాం🙏

07. అడుగు ముందుకు వేయగలిగితే 
దూరం అన్నది లేనేలేదు
చెమటచుక్క ను చిందించగలిగితే
సాధ్యంకానిది లేనే లేదు
వాననీటితో వనరులు పెంచుదాం
సేంద్రియవ్యవసాయానికి ఓటేద్దా0
రైతుకు అండగా ఉందాం👍

08. ఏమున్నది ఈ మట్టిలో
ఏ మున్నది ఈ గాలిలో
సమస్తం విషతుల్యం  ఆయే
జీవకోటి మనుగడ గతితప్పే
కూడు, గుడ్డ, కొదవై
ఏమి చేయును రైతన్న
ఆత్మాభమానం వదిలేసే😭

09. బ్రతుకుపంటలో వేసెను ఆశలవిత్తనం
బువ్వకంకులను వెద జల్లుతూ
ప్రపంచానికి అందించాలనే తపనతో
అధిక వడ్డీరేట్లతో సతమతమయ్యే
పంట నష్టం వచ్చే
రైతన్నకేమి తెలుసు వేసింది...
కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలుఅని😞

10. నేలతల్లి కి నమ్మినబంటు
భూమిదున్నడమే తన పని
రైతు ఐదువేళ్ళూ మట్టిలో
మన ఐదువేళ్ళూ నోటిలో
రైతుగానీ లాక్డౌన్ చేశాడంటే
కరోనా కంటే ప్రమాదం
దేశ  ప్రజలారా మేల్కొనండి
🌲🌳🌾☘️🌾🌳🌲
🙏🙏🙏🙏🙏🙏🙏

హామీ పత్రం: ఈ కవిత నా స్వంత రచన.

No comments:

Post a Comment