22/05/2021
గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లుారు జిల్లా వారి-
కవితా పోటీల కొరకు-
అంశం : ధరిత్రీ దినోత్సవం.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .8097622021.
శీర్షిక ; జీవామృత ఖని ధరిత్రి.
సశ్యశ్యామలమైన ప్రకృతి అందం.
రంగు రంగు పుాల పరిమళాల గంధం
ప్రాణవాయువుకు కొరత లేని దైవీ సంపద
శోభాయమానమైన వృక్షరాజాలు నిండిన వసుధ
పశు పక్ష్యాదులకాధారమైన జీవనామృత సుధ.
ఎనలేని పచ్చదనపు తరులు గిరుల అందాలు.
అమృతతుల్యమౌ ఓషధీ వన నిలయాలు.
గిరి ఝరీ ప్రవాహాల పవిత్ర గంగానదీ, నీరాలు
దాహార్తిని తీర్చేటి స్వశ్ఛ ఆరోగ్య జల పానాలు.
తలలుాచే పచ్చని పైరులు నిండిన భుాములు
సాగు చేసే రైతన్నల జీవిత ధనాగారాలు.
వెల లేని సంపదల భుాగర్భ గనులు
రత్న గర్భయైన భుామాత ఒడి నిండిన ఖనులు.
జీవరాసులు నిండు అంతులేని సాగరాలు.
రంగులీను జాతి ముత్యాలకవి ముాలాలు
జనవ జీవన గతి కనువైన ఆరు ఋతు చక్రాలు
పంచ భుాతాలు, సార పటిష్ట జనజీవనోపాధులు.
సార, రస, ఫల వృక్షాలు, వన సంపదల అందాలు.
జిివ, జన ,జంతు , క్రిమి కీటకాదుల కాధారాలు.
సార భుా జలాలు, అపార జీవన నిత్య పోషకాలు
ఇటువంటివెన్నోసార భుా మాత మనకిచ్చిన
అద్భుత వరాలు.ధరిత్రీ దినోత్సవ సందర్భంగా
ఆమెకు నా కృతజ్ఞతాభి వందనాలు.
హామీ : ఈ నా కవిత ఏమాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment