Monday, May 24, 2021

తీరని ఋణం

అంశం : గురువు.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .

శీర్షిక   : తీరని ఋణం.

మనిషి గా పుట్టిన ప్రతీ జీవికి
భగవంతుడిచ్చిన వరం బుద్ధి -
జ్ఞానమనే అదృష్ట సోపానాల వరం.
తొలి దశ ఐన , బాల్యావస్టలో
అమ్మ ఒడిలో పెరుగుతుా
 ముద్దుగా తినిపించే గోరు
 ముద్దలతో చెప్పేవ చందమామ
 కధలతో మొదలయ్యే ఆశక్తి
 తొలి  గురువుగా  అమ్మ నీ
 మదిలో వేసిన విద్యా బీజం.
 మలి నడకల సందళ్ళ లో కలిగే
 మానసిక వికాశపు పరిచయం.
  ప్రపంచ  రీతుల మార్గదర్శకం..
  నాన్న చుాపే జ్ఞాన  బాటకు వేసిన
  తొలి అడుగుల ప్రయాణం.
 జీవిన గతికి నీతి నియమాల
 కట్టుబాట్ల కాల చరితలను
 విశదీకరించి , సంపుార్ణ జ్ఞాన 
 వికాశానికి చేయుాతనిచ్చి మనకు
 మార్గ దర్శకం చేసేది సద్గురువులు.
 అక్షర జ్ఞాన శ్రీకారంతో ఆదర్శాల
 విలువలతో, ఆత్మ జ్ఞాన వలువలను
 తొడిగేది గురువు మాత్రమే.
 అటు సం,స్కృతి ,సాంప్రదాయాల 
 సారాన్ని , ఇటు సార విద్యావి ధానాన్ని
 బోధిస్తుా , జీవిత గమనానికి కావలసిన 
 అర్హతల విజయ సోపానాన్ని 
 చేయిబట్టి  ఒకొక్కటిగా ఎక్కిస్తుా 
 సుఖ తీర గమ్యానికి చేర్చేది గురువొక్కడే.
 అటు తల్లిదండ్రులు , ఇటు గురువులు
 పడిన కష్టానికి , మన జీవితమంతా 
 ధారపొిసినా తీరని ఋణ గ్రస్తులం.
 విద్యతో వినయాన్ని , జ్ఞానం తో
 జీవితాన్ని ధర్మ బాటలో అనుసరిస్తుా
 మన జన్మ సార్ధకత చేసుకొనే 
 అవకాశానికి ఆది నుండి అంతం వరకు
 ఆదర్శ  నాయకులుగా నిలచిన
 తల్లిదండ్రులకు , సద్గురువులకు 
 గౌరవంతో సాదర ప్రణామములు ,
 చేస్తున్నాను. 
 -------------------------------------------

No comments:

Post a Comment