మనుమసిద్ధి కవన వేదిక
తెలుగు భాషా దినోత్సవము కొరకు
శీర్షిక పసిడి పలుకుల భాష-
తెలుగుభాష*
అంశం: అ ఆ ఇ ఈ
జానపదాలతో జాతిని వెలిగించు భాష
జాతి సమైక్యతను పెంచు జనులభాష
తేనెలొలుకు నా తెలుగుభాష
మేలిమి ముత్యాల వంటి కుదురైన అక్షరాల భాష
ప్రభాకర కిరణ స్పర్శ గల ప్రబంధ భాష
తేనెలొలుకు నాతెలుగుభాష
దేశభాషలందు తెలుగు లెస్స
అని గణుతి కెక్కిన భాష
తేనెలొలుకు నాతెలుగుభాష
పద్యమై,గద్యమై,
గేయమై,నానీలై,
చమక్కులై,రాజశ్రీ లై
మెరుపులై వివిధ రూపాల వెలుగొందు భాష
తేనెలొలుకు నాతెలుగుభాష
ప్రాంతమేదైన మదినిదోచు మహోన్నతభాష
పల్లె పదాలతో విలువ పెంచిన పసిడిభాష
తేనెలొలుకు నాతెలుగుభాష
పాటకు పట్టంకట్టిన భాష
సంగీత సౌకర్యమైన భాష
తేనెలొలుకు నాతెలుగుభాష
హామీ పత్రం:
ఇది నా స్వీయ రచన అని తెలియ చేస్తున్నాను
రచన:
డా!!తాడిగడప సుబ్బారావు
కలం పేరు: రసజ్ఞా వాగ్దేవి
పెద్దాపురం
99592 30369
No comments:
Post a Comment