Wednesday, November 30, 2022

బాల సాహిత్యము

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *26-11-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(ల గుణింతం)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *లెక్క విప్పవమ్మ చక్కనమ్మ!*
ప్రక్రియ: *పద్యము*
*********************

*(1)*
*లయను కలిగి యుండు! లాలిత్యమే నిండు!*
*లిప్తలోన నిదుర! లీనమగును!*
*లాలి లాలి యనగ రాత్రిని మరిపించు!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(2)*
*లవకుశులకు తండ్రి! లంకేశునకువైరి!*
*లక్ష్మణునికి యన్న! లక్షణముగ!*
*లక్ష్మియయ్యె సీత! రాజిల్లె నతనితో!*
*లెక్కవిప్పవమ్మ! చక్కనమ్మ!*

*(3)*

*లిప్తపాటులోన రెక్కలే లేకుండ*
*లేచి జారుకొనును! లెస్సగాను!*
*లుప్తమైనవేళ రోదించ రాదయా!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(4)*

*లలితపదములుండు! లావణ్యమొలికించు!*
*లిపిని నేర్చినంత లిఖితమౌను!*
*లెస్స భాషలందు! లేతసొగసులతో!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(5)*
*లోకమంత మెచ్చు! రూపాయి వృథకాదు!*
*లోనయున్న తెలివి రూపమిదియె!*
*లక్షలెన్నియున్న రసనచే కలుగురా!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*

*జవాబులు*
*1. లాలిపాట/జోలపాట*
*2. శ్రీరాముడు*
*3. కాలము/సమయం*
*4. మాతృభాష*
*5. లౌక్యం*


*పొడుపుకథలు/పజిల్స్ కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు*

*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏

తెలుగు పదాలు , అర్ధాలు

***** *** ** * ** ** 

{మునపు = కోరిక
గాధి సుతుడు = విశ్వామిత్రుడు 
త్రిశంకు సుతుడు = సత్య హరిశ్చంద్రుడు 
అంబ = సతీ దేవి, శిఖండిగా మారిన స్త్రీ 
అయ్య = తండ్రి (దక్షుడు) 
పూజ్యుడు, పెద్దవాడు (భీష్ముడు) 
మనసు = కోరిక, మానసం
మను =జీవించు} 

🙏🙏🙏🙏🙏🙏
*

Tuesday, November 8, 2022

మనిషి-మానవత్వము

శ్రీశ్రీ కళావేదికలో
అంశం : మనిషి- మానవత్వం .
శీర్షిక : మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

మనిషి జన్మ మెత్తు  మదిని మర్మము లేక
కల్మషమ్ము లిడని కాంతి మనసు
పెరిగి నపుడు బుద్ధి పెడదోవ నదెబట్టు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసన పరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

మానవత్వ మదియె మనిషి భుాషణ మౌను.
పరుల బాధ నెరిగి పలుకు మెపుడు
 నీవు జేయు కర్మ నీవెంటె వచ్చురా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

తల్లిదండ్రు లిలను  తలచు వేల్పులు నమ్ము
తీర్చు ఋణము నీవు  తీరు గాను
 జగతి నీదు భవిత   జన్మదా తల భిక్ష 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

ఆతివ అబల యనెడు ఆలోచనసలొద్దు 
అబల కాదు యామె  ఆది శక్తి
అడుగు లోన యడుగు ఆమెతో డుగనేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్య తెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషివిలువె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
-----

భగణం UII


07/11/2022.

శ్రీశ్రీ కళావేదికలో
అంశం : మనిషి- మానవత్వం .
శీర్షిక : మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

ప్రక్రియ : శీస పద్యము.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

మానవత్వము లేని మనిషి జన్మమదేల 
మాయ మర్మములున్న  మాయ కపటి 
ముార్ఖత్వ మదెనిండి ముార్ఖుడై చరియించు
మహిబుద్ధి హీనుడౌ మనుజు  డతడు ॥

సాటివారికెపుడు సాయమ్ము జేయడు
స్వార్ధ బుద్ధదె నిండు  వ్యర్ధ జీవి.
సర్వావగుణముల సరినేర్చు రసికుండు
నమ్మకెపుడు వాడె  నర పిశాచి ॥

మానవ త్వముగల్గి  మమతనిం డెడుమాట
మహిని మనెడు నడతె  మనిషి కీర్తి.
పరుల కష్టము దీర్చ పలుచింత నలుజేయు
సజ్జనుండె భువిని సాధు వర్తి ॥

మనదైన సంస్కృతి  మన సాంప్రదాయాలు
గౌరవించెడు వాడె ఘనుడు ఇలను 
స్త్రీల సమ్మానించు శీల సద్గుణుడేగ
మహిని ఉన్నతుండు మనిషి వాడు .॥

ప్రక్రియ : ఆటవెలది.

చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసనపరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసుకొనుము మంచి మాట.॥

మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్యతెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషి విలువె మెండు
మనుజ తెలుసుకొనుము మంచి మాట.॥

హామీ : ఈ పద్యములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు.

అంశం : స్కౌట్స్ అండ్ గైడ్స్.

అంశం : స్కౌట్స్ అండ్ గైడ్స్.
శీర్షిక : ఆపద్బాంధవులు .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది 
భారతదేశ జాతీయ స్కౌటింగ్ ,
మరియు గైడింగ్ అసోసియేషన్..॥

బాల బాలికలలో దేశభక్తి, క్రమశిక్షణను 
పెంపొందించి వారిని సమాజ సేవకులుగా 
తీర్చిదిద్దడానికి ప్రారంభించిన ఉద్యమం .॥

బాలుర బృందాలను "స్కౌట్స్", 
బాలికల బృందాలను "గైడ్స్" అని అంటారు॥

1986 లో  ఐక్యరాజ్యసమితి  
 అంతర్జాతీయ శాంతి సంవత్సరానికి 
 భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్‌ను 
  గౌరవ "శాంతి సందేశకులు"గా ఎంపిక చేసింది॥

స్కౌటింగ్ యొక్క లక్ష్యం, 
స్కౌట్ వాగ్దానం మరియు చట్టంపై 
ఆధారపడిన విలువ వ్యవస్థ ద్వారా ...
యువకుల విద్యకు తోడ్పడడం, ॥

వ్యక్తులు వ్యక్తులుగా స్వీయ-సంతృప్తులై 
 సమాజంలో నిర్మాణాత్మక పాత్రను
 పోషించే మెరుగైన ప్రపంచాన్ని 
నిర్మించడంలో సహాయపడటం. ॥

సేవా పద్ధతులను అనుసరించి శిక్షణలో 
వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, 
ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు.॥

 ఒక నాయకుడి ఆధీనంలో పనిచేసే వీరు
సైనికుల వలె ప్రత్యేక దుస్తులలో ఉండి ,
కేవలం ఒక కర్రను మాత్రమే ధరించీ
మెడలో ఒక స్కార్ఫ్ తోఈ ఉద్యమంలో 
 చేరి దళాలుగా ఏర్పడతారు. ॥
    
 "సదా సమాజసేవలో ఉంటాం" అనే నినాదం
 నిండిన  పతాకం తో స్వచ్ఛందంగా
  ఈ ఉద్యమంలో చేరిన బాల భటులంతా
 సత్యం పలకడం, కష్టాలలో ఉన్నవారిని 
 ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవచేయడం,
  పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా సమాజసేవ చేస్తారు.

Monday, November 7, 2022

ఇష్టపదిలో భగవద్వీత.

ఇష్టపది భగవ
--ీ------------.
సర్వ దేవతా ప్రార్ధన.
1.గణపతి వందనం.
------------------------
1.
అంబ ఈశుని పుత్ర            ఆది పుాజ్యుడవయ్య
అహరహము నిను గొల్తు    నార్తిబాపగదయ్య ॥
2.
ఆది -అంత్యము లేని          ఆది గురుడవు నీవు
అర్చించు నీశ్వరికి              ఆపదలు బాపయా ॥ 
3.
ముజ్జగమ్ముల ఒజ్జ          ముద్దు గణపతి రాయ.
విఘ్నముల బాపేటి        విఘ్నేశ్వరుడవయ్య॥
4.
ఇష్టపదులను రాయు       ఇచ్ఛ దీర్చగ రార
ఈప్సితములీడేర్చి         ఈశ్వరిని బ్రోవరా ॥
5.
.ఎలుక వాహన మెక్కి  ఎలమి భుామిని చుట్టి
ఏలిక  పుాజ్యవై         ఏలితివి ఈ జగమును.
6.
అమ్మ చేతి  బొమ్మవు ఆగమ నుత వంద్
గురు వందనం.
.---------------------
1.
శ్రితజనుల బ్రోవగా         
శిరిడీ పురమునందు
శ్రీశ నీ వాసమే                
శ్రీ నిలయమై ఒప్ప-॥
2.
సర్వ మత సమ్మతిని     
సరళముగ జెప్పేవు
సకల తీర్ధములన్ని          
నీదరినె జుాపేవు..॥
3.
ఖండయొాగివి నీవు       
ఖలు సంతరణ జేయు
కరుణా సముద్రుడవు    
కమలనయన సునేత్ర॥
4.
కలత లన్నియు బాపి      
కావుమయ్యా మమ్ము   
శ్రీ షిరిడి శ్రీ వాస              
శ్రీ పదాంబుజయుగళ ॥
5.
వందనము శ్రీసాయి        
వందనము గురుదేవ
వందనము చేకొనగ         
వేగ రావగదయ్య ॥
6.
వేడుచుంటిని నిన్ను        
వేల కీర్తుల తోడ
వరద హస్తముతోడ        
వరలు సాయిాశ్వరా ॥
7.
నింబ వృక్షము నీడ       
నిత్య తపమును జేసి
సర్వ జన సమ్మొాద      
సామరస్యపు భావ-॥
8.
మలరు సాయిాశ్వరా    
మా నమము నీకయా
ఇల గాచు ఇలవేల్ప      
ఈశ్వరిని  బ్రోవరా..॥

3.సరస్వతీవందనం.
------------------------
13.
విద్యలకు కొలువైన      విలువ పలుకుల తల్లి
విజయ పథములేలు    విశ్వ జన శ్రీ వల్లి   ॥
14.
విద్య- బుద్ధుల నెల్ల      విశ్వ  జనుకల నొసగు
తల్లి శారద నీవె            తరుణి బ్రాహ్మ్మీ శివే ॥
15
నా పుాజలను కొమ్మ       నగుమొాము పుారెమ్మ 
వివరములు నాకొసగి    విజయ పథ ములనిమ్మ
16
నాదు జిహ్వను నిలచి     నను బ్రోవు మాయమ్మ
నలువ కొమ్మా నిత్య       నీరాజనము గొమ్మ ॥..
4.అంబికా వందనం.
------------------------
17.
గణ నాధ షణ్ముఖా         ఘన పుతృలకు తల్లి
గణనలే  లేనట్టి                గుణ కల్పవల్లివీ
18.
గౌరవర్ణముతోడ             గౌరివై భాసిల్లు

ఘన సింహ వాహినీ        గావు ఈశ్వరి నిలను ॥
19.
దుష్టులను , దైత్యులను    దునుమాడి గాచేవు
దశరుాపములతోడ         ధరణిలో వెలసేవు.
20.
దివ్య  శక్తుల నేలు           దీనార్తులను బ్రోవు          
ఈశ్వరీ నుత పాద          ఈశు రాణివి నీవు. ॥
21.
హిమగిరిసు పుత్రికవు           హిమగిరి పురీశ్వరివి
హరుని పట్టపురాణి             హరి భగిని పార్వతివి
22.
హంస వాహిని సఖివి            హరునర్ధరుాపిణివి
అంబ, జగదీశ్వరిని                అహరహము కావవే॥
--------------------------------------------------------------------
                  శ్రీమద్భగవద్గీత -ఆరంభము.
                     (   పంచమ వేదము.).
---------------------------------------------------------------

1.అర్జున విషాద యొాగము.
--------*-------:-----------------------
1.
ధర్మ క్షేత్రమునందు           ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన               పరమేశుడవునీవు.
2.
స్వఫలా పేక్ష కై               స్వజన సంహారమ్ము         
జేయనని పార్ధుడదె        ధ్యేయమును విడనాడ ॥
3.
వేద సారము మెండు       వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత              కావ్య ఘనుడవునీవు
4.
శ్రీ కృష్ణ రుాపాన                శ్రితునర్జునకు  నీవు
ఘనయొాగ ములనెంచి    గీత బోధించేవు. ॥
5.
నిఖిల లోకోధ్భవుడ         నిత్య పరమానంద
నిల కర్మ ఫలములకు       నీదె బాధ్యతటంచు
6.
నిస్సహాయత తోడ         నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ         ఫలము నెరిగించేవు.॥
7.
కులధర్మ ములు వీడు      కుటిల మాయలనేలు
కులహీనులౌ, ఖలుల       కుాల్చ తప్పదు పార్ధ  .
8
యనుచు పలికెను విభుడు-యదునందనందనుడు.
ఈశ్వరీ హృత్సదను    డిలను శ్రీ కృష్ణుడుా . ॥
9
పార్ధునకు బోధించు   పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము     పంచమపు వేదమ్ము ॥
10.
ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥     

2. సాంఖ్య యొాగము.
--------------------------------
11.
పోరి గురులను జంపి  -      పోరు ననుజుల గుాల్చి
పొందురాజ్యములేల ?       పొలయు  సుఖ మేలా..?
12.
రక్త సిక్తము లైన                  రాజ్య సంపద లేల..?
రధము తిప్పుము కృష్ణ       రణము వీడెదనయ్య    ॥
13.
అని పల్కునర్జనుని             అజ్ఞానమును బాప
ఆది దేవుడు పల్కె              అనునయము తోడ ॥
14.
పుట్టి -గిట్టుటె రీతి              పుడమి యందనుచునుా
శాశ్వతము ఆత్మనుచు      శంకలనుబాపేను.॥
15.
శోత్రుడవు నీవనుచు          శోకింప తగదనుచు   
సాంఖ్య యొాగపు నామ     శాస్త్ర మును తెలిపేను ॥
16.
సరి దుఃఖ -సుఖములను    సమముగా చుాచేటి
స్థిర తత్త్వజ్ఞానియె              స్థితప్రజ్ఞుడగుననియె॥
17.
కర్తవ్య కర్మలను                 కడ దాక పాటించి
సమబుద్ధియుక్తుడవై          సమరమును సలుపమనె॥
18.
పార్ధునకు బోధించు          పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము            పంచమపు వేదమ్ము ॥
19
ఇల వ్రాలు ఈశ్వరీ           ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార           శ్రీ కృష్ణ బ్రోవగా ॥     
--------------------------------------------------------------
3. కర్మ యొాగము.
-------------------------
20.
యొాగముల పాటించి       యొాగ కర్మల నేలు
యొాగ నిష్టాపరులు          యొాగులిల పార్ధా॥
21.
ఇంద్రియపు లోలుడై          ఇలను చింతల పొందు
మానసిక ముాఢుడే           మాన మిధ్యాచరుడు   ॥
22.
పరమాత్మ ప్రాప్తి  నదె         ఫలముగా నొందేటి
నిష్ట పుార్ణుడె యొాగి          నిత్య సంతుష్టుడు. ॥ 
23.
ఆశక్తిరహితుడవై                ఆచరింపగ  కర్మ-
పరమ శ్రేష్టుడ వగుచు         పరము నొందెదవు.॥    
24.
పరధర్మ గుణములను       పాటించుటలు కన్న
స్వీయ ధర్మము లిలను      స్వీకరించుటె మిన్న.॥
25.
కామ క్రోధము లిలను         కడు పాప ప్రేరణలు  
బుద్ధి తోడ విడుమా           బద్ధుడవై మెలగుమా॥
26.
జ్ఞానమ్మె శాస్త్రమని            జ్ఞానివై మెలగుమని
కర్మ ఆచరణ లిల               ఘన లోక హితములని
27.
కర్మలకు బాధ్యుడవు-          కర్త నీవని తెలిపి
జగతి కర్మల సలిపి              జయమొంద మంటివి ॥   
28.
పార్ధునకు బోధించు            పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము              పంచమపు వేదమ్ము ॥
29.
ఇల వ్రాలు ఈశ్వరీ              ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార              శ్రీ కృష్ణ బ్రోవగా ॥     
--------------------------------------------------------------
----------------------------------------------------------------
4.జ్ఞాన , కర్మ సన్యాస యొాగము.
---------------------------------------------
30.
ధ్యాన యొాగము లనెడు   జ్ఞాన, కర్మల ఫలము
ఒక్కటిగ చుాడుమా           ఒనరు భావముతోడ.॥
31.
ఏ కాంక్షయుా లేని             ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె                కాంచ ఫల రుాపమ్ము.॥
32.
నిష్కామ కర్మములు         నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను         శాంతి పొందెదరు.॥
33.
సర్వత్ర సమభావ             సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ         నిర్వాణ పాత్రులు॥
34.
ప్రకృతి కర్మల నేలు           పెక్కు జన్మలు నీవి 
ప్రబలు భవ బంధముల    పట్టి జిక్కితి వీవు॥
35.
పెక్కు జన్మలు నావి         పెక్కు అవతారములు-.
పేర్మి నెత్తితి నేను            పెకిలింప పాపములు.  ॥
36.
నాల్గు వేదములైన           నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా         నట సుాత్రధారుడను ॥
37.
అజ్ఞాన  మును వీడి         అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే                  కడు శ్రేష్టమని యెంచు.॥
38.
కర్మ తత్వమునెరిగి       కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవౌ   --       ఉత్తమంబెరిగి  ॥
39.
పార్ధునకు బోధించు   పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము     పంచమపు వేదమ్ము ॥
40.
ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥     
--------------------------------------------------------
5.కర్మ సన్యాస యొాగం.
----------------------------------
41.
కర్మ , సన్యా సములు    కనిన రెండును వేరు
కాని రెండిటి  ఫలము    కల్యాణ దాయకమె॥
42.
అవనిని  ద్వేషములను      అధిగమించిన వాని
సాధనల సమకుారు          సార బ్రహ్మపు పథము॥
43.
అతఃకరణ  సుద్ధి                ఆనందయొాగమై
పరమాత్మ తత్త్వ మును     పలుకు జ్ఞానులగుదురు.॥
44.
బాహ్య విషయములంచు    భవభోగవిషయముల
చింతన ను చేయకయె        చింతా ముక్తుడగును.॥ 
45.
ఆత్మ స్థిత ధ్యానులు,        అనాశక్త విషయులు
అక్షయానందములను        అనుభవించెదరిలను॥
46.
ఏక భావ స్థితులును           ఏ మొాహమ్ములకును
వివశులేటికి కాక                విజయ సాధకులౌను ॥
47.
చిత్త వృత్తుల జయము    చిరముగా సాధించి
పరమ శాంతి నొందియు   పరము నొందెదరుగద ॥
48.
తామరాకు పై నదె         తళుకు బిందువు వోలె
స్వజన చింతన వీడు     స్వ భయంబు వీడుమని  ॥
49.
పార్ధునకు బోధించు   పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము     పంచమపు వేదమ్ము॥
50.
ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగను ॥      -------------------------------------------------------------
6.ఆత్మ సంయమ యొాగము.
-----------------------------------------
51.
సంకల్ప త్యాగముల       సహనశీలత నొదులు  
సాధు చిత్తుడె యగును   సన్యాస యొాగిగను॥
52.
సంసార   సంద్రాన        సాధు చింతన లేని
మనిషి తనకే తాను     మది మిత్ర శతృడును.॥
53.
శీతోష్ణ, సుఖ -దుఃఖ        శీల,మానావముల
నిశ్ఛలపు స్థితి నేలు       నిత్య లగ్నుడె యొాగి॥
54.
చిత్తేంద్రియమ్ములను    చిద్బ్రహ్మ ధ్యానమున
లగ్నమై యుంచవలె      లక్ష్యసాధకుడిలను ॥
55.
అనంత చైతన్య స్థిత ----   ఆత్మ రుాపమునదె
సకల ప్రాణులయందు    సమానమని యెంచును॥
56.
సర్వ భుాతములందు   సమ దృష్టి కల్గుటను    
పరమ శ్రేష్ఠులు వారు     పరమాత్మ రుాపములు॥
57.
పర స్వర్గ సుఖములను    పుణ్య పురుషులుపొంది 
మరల జన్మింతురుా           మహి పవితృలుగాను॥
58.
విరాగులకు జన్మ            విధిగ ప్రాప్తంబౌను
ధర దుర్లభమ్మైన           ధన్య యొాగిగ జనును॥ 
59
అట్టి యొాగము తోడ   ఆత్మ యొాగిగ మనుచు
  శ్రేయ, శ్రద్ధను కొమ్ము       శ్రేష్ట కార్యము జేయ ॥
60.
అని పలికె  శ్రీకృష్ణు       డవని అంతర్యామి
ఫల గీత సారమ్ము       పంచమపు వేదమ్ము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥ 
------------------------------------------------------------
7. జ్ఞాన విజ్ఞాన యొాగము.
--------------------------------------
61.
తత్త్వ జ్ఞానపు  మహిమ     తనిగ తెలిపెద పార్ధ            
తద్ద్యాన్న మగ్నవై               తథ్యముగ వినుమా॥
62.
యొాగమాయను  కమ్ము     యొాని జన్ములకెల్ల
తనిగ నీశుని తెలియ         తరముకాదిలలోన   ॥
63.
రాగద్వేషము వలన           రగులు సుఖ- దుఃఖములు
మొాహమును విడలేరు      మొాహ బుద్ధి హీనులు .॥
64.
ప్రకృతి పరా, చేతన----       ప్రకృతి జడపరాదులు,   
పుట్టుకలు, ప్రళయముల      పుార్ణ రుాపిని నేనె  ॥
65.
వేద రుాప ఓంకార             వేల గుణ తేజమును 
త్రిగుణాత్మ భావముల      త్రిగుణతీతుడ నేను ॥
66.
గత, వర్తమానాల              గుణ, మొాహ ముక్తులదె
నన్ను శరణని నమ్మి            నను చేరెదరు తుదకు ॥
67.
అని పలికె కృష్ణుడు         అవని అంతర్యామి
ఫల గీత సారమదె           పంచమపు వేదమ్ము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥ 
------------------------------------------------------------
8. శక్షర  బ్రహ్మ  యొాగము.
---------------------------------------
68.
కన బ్రహ్మ మన నేమి?           కర్మ మనగా నేమి?
తెలియ జెప్పెద వినుమ       .తెలుసుకొనుమొా పార్ధ॥
69.
సర్వ శ్రేష్టుడు బ్రహ్మ             సృష్టి కర్మ లె కర్మ
అభ్యుదయొాత్పత్తిని         అలరు కర్మలు ఇలను॥
   70.
అఖిల చరాచరములు          అవ్యక్త ప్రకటములు
సుాక్ష్మదేహోత్పన్న                సుాన్య లీనములు॥
71.
అధి భుాత, అధి దైవ             అధి యజ్ఞ ,జీవాత్మ-
సృష్ట్యాది  సారముల             సృజనాత్మకుడ నేను॥
72.
చివరి ఘడియల లోన           చెదరు మానసు లిలను
ఏ స్మరణ చేయునో                ఆ జన్మ పొందెదరు   ॥
73.
బ్రహ్మ పథమును ప్రాప్తి           బ్రహ్మ యొాగులకునుా
స కామ కర్మయొాగి                సర్గ లోక వాసిగ..॥
74.
దేవయాన మార్గుల             దేహమేలును పరము
పితృయాన దేహులకు        పిదప జనన భ్రమణము ॥
75.
అని తెలియుమర్జునా      .అక్షరుడ ను నమ్ముమ
ఫల పుణ్యము పొందుమ  పరమపదము నొందుమ॥
76.
అని పలికె  కృష్ణుడు       డవని అంతర్యామి
సార భగవద్గీత             సరి పంచమ వేదము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ  బ్రోవరా ॥ 
------------------------------------------------------------
9.రాజ విద్యా, రాజ గుహ్య యొాగము.
----------------------------------------------------
77.
తలమానికమ్మైన              తత్వముత్తమొాత్తము.
సమస్త గోప్య విషయ        సత్ శిరో భుాషణము.॥
78.
జగతి భుాత నిలయము      జలపుార్ణ మీ జగతి
నా సంకల్పములివి             నాలో నిండున్నవి.॥
79.
కల్పాది సృజనుడను            కల్పాంతకుడనేను
కర్మానుసారముా                  కలిగింతు జన్మలను.॥
80.
అద్యక్షుడ  సృష్టికి             ఆశక్తి రహితుడను
లోక కల్యాణార్ధ-               లోకావతారుడను ॥
81.
క్రతు,యజ్ఞ , స్వధ నేను      క్రతు వేద సారమును
హోమ క్రియ మంత్రాగ్ని      ఓషధీ, ఘృతాగ్నిను ॥
82.
సత్తును, అసత్తును  నే       సర్వ మృత్యు కారకను.
అప్రాప్త  యొాగముల          ఆరక్షక క్షేమమును ॥
83.
నిష్కామ భక్తితో             నిత్యమునర్చించుము
ప్రీతి పత్ర ,ఫల,ముకే       ప్రియమొందు వాడను ॥
84.
క్షణ భంగుర జీవములు   క్షణమౌ సుఖ,హితములు
శరణము కోరినవారు      సవ్యులు నను చేరెదరు॥
85.
అని పలికె కృష్ణుడు        అవనినంతర్యామి
సార భగవద్గీత             సరి పంచమ వేదము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ నను బ్రోవ ॥ 
------------------------------------------------------------
10. విభుాతియొాగము.
---------------------------------
86.
జన్మరహితుడననియు        జ్ఞాని ఎరుగును నన్ను
వివిధ భావపు గతులు       విధి, నాచే కలుగును ॥
87.
స్వయంభుావ మనువులు  స్వయమునాదు భక్తులు
సమస్త ప్రాణి కోటుల           సంకల్పుడ నేనెగ ॥
88.
నాయందు మనసుంచి         నాయందే రమించు
నిత్య ధ్యానులకు నే            నిచ్చు ధనము జ్ఞానము ॥
89.
పరబ్రహ్మవు నీవెగా              పరమాత్మవు నీవుగ
నీ తత్త్వము నెరుగను          నీ విభుాతి తెలుపుము॥
90.
అను పార్ధుని గని హరి       అనునయమున పలికెను
సమస్త ప్రాణ సృష్టి కి           సకల లయము తాననె  ॥             
91.
ప్రాణ చైతన్యమును               ప్రాణ శక్తిని నేను
ఓంకార శబ్దమయ                ఓజ తేజము నేను॥
92.
ఆది మధ్యాంతముల           ఆది పురుషుడ నేనె
విశ్వతోముఖుడ  నుా           విరాట్పురుషుడనే ॥
93.
యొాగ శక్తి  అంశను            యొాగ కారకుడేను.
తేజ సంభవుడను               తేజైశ్వర్యుడను॥
94.         
అని పలికె  శ్రీకృషు-        అవనినంతర్యామి
సార భగవద్గీత             సరి పంచమ వేదము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ  బ్రోవగను ॥ 
----------------------------------------------------------
11.విశ్వరుాపసందర్శనయొాగం.
--------------------------------------------
95.
తొలగె సంశయమ్ములు       తొలగె  నజ్ఞాననమదె
నాజన్మ ధన్యముగ             నను నడుపుమ కృిష్ణా   ॥ 
96.
షడ్గుణైశ్వర్యాల                 సంపన్న  మైయున్న   
నిజ దర్శనమిమ్మా              నిఖిల లోకాత్మా   ॥  
97.
ప్రాకృతపు దృష్టి నను        పార్ధ  చుాడగలేవు
దివ్య దృషిని ఇత్తు             దివ్య దర్శనము గన ॥
98.
అని దివ్య రుాపమును     ఆది దేవుడు చుాపె
అనంత భ్రహ్మాండము        అందు నిండి యుండెను॥
99.
పెక్కు ముఖముల వాని   పెక్కు కర, అస్త్రములు, 
జగతి నిండుదరములు     జల ప్రళయ భీకరము॥
100.
వేల సుార్య కాంతిని          వెలుగు విరాట్ రుాపము
గాంచి ధన్యుడు నరుడు    ఘనమునంజలులిడెను॥
101.
దుర్నిరీక్ష్యమైన                దివ్యరుాపుని గాంచి -
కమ్ము భయముతోడను   కడు ప్రసన్ను కమ్మనె॥
102.
సౌమ్యముార్తిగ యైన       స్వామి రుాపమునుగని
సవ్యసాచి  హరిగని         సంతసించి నమమిడె॥
103.
అట్టి భాగ్యముపొంద        అహరహము ధ్యాన్నింతు
అనుచు శరణము వేడె       అవనిలోనీశ్వరి  ॥
------------------------------------------------------------------
12. భక్తి యొాగము.
------------------------------
104.
అనన్య భక్తి సేవ                అత్యంత భక్తి సేవ
ఏది శ్రేష్టమైన దొ                ఎంచి చెప్పుము కృష్ణ ॥
105.
సగుణ రుాప ధ్యానులు   సర్వ యొాగ శ్రేష్టులు
సమ సమాన దృష్టులు     సత్య  సిద్ధ యొాగులు ॥
106.
అవ్యక్త పరబ్రహ్మ             ఆశక్తచిత్తులు
పరగుటకు సాధనలు     పరమ కష్టతరములు ॥
107.
మత్పరాయణ భక్తులు      అనన్య భక్తి కాములు
నన్ను నమ్ము వారి నే         నట్లె ఉద్ధరింతును  ॥
108.
అభ్యాస యొాగమదె       అత్యంత సులభము
మత్ప్రాప్తికై చేయు          మదె సాధన పార్ధా ॥
109.
కర్మ ఫల త్యాగములె         కన మిక్కిలి శ్రేష్టము
ఫల త్యాగము చేయుట     పరమ శాంతి యొాగము॥
110.
ఏ ద్వేషములు లేని              ఏ స్వార్ధములు లేని
మనోబుద్ధి అర్పణుడు        మత్ ప్రీతి పాతృడుగ.॥
111.
అని పలికెను శ్రీహరి           అర్జునోద్ధారకుడు
ఇల ఈశ్వరీ నుతుడు         ఈప్సిత వర ధాముడు ॥
--------------------------------------------------------------  
13. క్షేత్ర  క్షేత్రజ్ఞవిభాగ యొాగము.
---------------------------------------------
112.
జీవులు  ఎన్నున్నను        జీవాత్మను నేనే॥---
క్షేత్ర త్రిగుణ తత్త్వము      క్షేత్రజ్ఞుడను నేనే.
113.
బ్రహ్మసుాత్ర పదములు        బహు ఇంద్రియ దశలును-       ధృతి వికార మయమును    ధృఢ క్షేత్ర స్వరుాపము  ॥
114.
జన్మ జరా దుఃఖము           జన్మ రాగమొాహము
విని యుంటివి అవె గద      వివిధ దేహ దశలిల  ॥
115.
ఇంద్రియ వైరాగ్యము          ఇల మమతల త్యాగము
మన భావ సు చిత్తుడు       మన వికార ముక్తుడు ॥
116.
నిత్యనన్య  భక్తుడు             నిత్య సుస్థిర చిత్తుడు
సుతత్త్వ జ్ఞానార్హుడు           సత్+అసత్,కతీతుడు॥
117.
ఇహ,పర నిరాశక్త                 ఇంద్రియ వైరాగ్యుడు         
బహు విధ స్వరుాపుడును    బాహ్యాంతరశుద్ధుడు.           
118
పరమాణు స్వరుాపుడు       పలు విధ గోచరుడుా
పరంజ్యోతి రుాపుడు          పరమాత్మయౌనతడు ॥.
119
జ్ఞాన బోధ జేయుచు           జ్ఞేయము నెరిగించిన
ఈశ్వరీ నుతుడతడు          శ్రీశుడు   శ్రీ కృష్ణుడు ॥
-------------------------------------------------------------------
14. గుణత్రయవిభాగయొాగము.
---------------------------------------------
120.
ముహి ప్రకృతి స్థానము      మద్బ్రహ్మ స్వరుాపము
జడ సంయమ యొాగము  జగ దుత్పత్తి స్థలము .
121.
విశ్వ ప్రకృతి తల్లిగ        విత్తు తండ్రి  నేనుగ
త్రిగుణ క్షేత్ర మునందు   తిరుగు  జీవాత్మగను॥
122.
సత్త్వ గుణము సుఖమగు  సర్గ లోక ప్రాప్తము
రజో గుణమశాంతిని        రగుల జేయు స్వార్ధము॥
123.
తమగుణమజ్జానము    తథ్యమతి ప్రమాదము.
శ్రేష్టమైన కర్మలనే             శ్రేష్ఠుడాచరించును.॥
124.
ఇచ్ఛా ద్వేషములకు-      ఇల అతీతుడు, వాడు
.అపరబ్రహ్మ  ప్రాప్తికి         అట్టి వాడు అర్హుడు॥
125.
అని పలికెను కృష్ణుడు    అఖండ ఆనందుడు .
ఈశ్వరీ హృన్నిలయ       ఇహ, పర అవతారుడు॥
----------------------------------------------------------------
15. పురుషోత్తమప్రాప్తియొాగము.
---------------------------------------------
126.
శాఖోపశాఖలౌ                 సంసార వృక్షము కు-
ముాలమాదిపురుషుడు  ముజ్జగములకీశుడు॥
127.
తిర్యగ్యోనులజను          త్రిగుణ దేవ, మనుజులు
తగు విస్తార కర్మల         తరు శాఖలు, చిగుళ్లు ॥   
128.
నశ్వర శాఖల తరు          నాశమె  వైరాగ్యము
అట్టి వైరాగ్యుడు            అందు పరమపదమును॥            
129.
అవ్యయపరమాత్ముడు  అతడె వేదవిదితుడు.
క్షర-అక్షర పురుషుడు     క్షాత్రజ్ఞుడు సర్వుడు॥
130.
గోప్యమ్మౌ విషయము      గోవిందుడు తెలిపెను.
ఈశ్వరిల తరించెను         శ్రీశుని ప్రార్ధించెను ॥
---------------------------------------------------------------
16.దైవాసురసంపద్విభాగయొాగము.
------------------------------------------------------
131.
యొాగ స్థిత జ్ఞానియె           యొాగ్య శ్రేష్ట తేజుడు
దురిత గుణ పాపుల-          దుష్టుల దరి చేరడు .॥
132.
అలోలుప్త్వములును        అచాపలత్త్వములు,
అద్రోహము, కపటము     అనునవి  త్యజించుమా॥
133.
ప్రవృత్తి, నివృత్తి                ప్రవర్తనలసురులకు
అపకారులు, కృుారులు     అవని మంద బుద్ధులు ॥
134.
కామ ,క్రోధ, లోభకు            కలుగు నరక ప్రాప్తము
అనర్ధములను విడుము     అవని శ్రేష్టవై మను ॥
135.
అని పలికె, కృష్ణుడు        అవనినంతర్యామి
సార  గీతామృతమె        సరి పంచమ వేదము ॥
---------------------------------------------------------
17. శ్రధ్ధాత్రయవిభాగయొాగము.
----------------------------------------------
136.
విరుద్ధ కర్మ చేయరు      వివేకము గలవారు
స్వభావజమౌ శ్రద్ధ        సంస్కారోత్పన్నము.॥
137.
ఆరోగ్య  పానములు     ఆయు వృద్ధి కరములు
సార భోజనాదులు       సాత్వికులకు ఇష్టము .॥
138   .
ఆసురస్వభావులు         ఆత్మ క్లేశమిడుదురు.
కృత్యాసుర సేవల          కృశింపజేయువారు.॥
139.
రాజసు లేలు ఋచులు   రోగోత్పన్నములుా
అపవిత్ర పక్వములె          అవె తామసులిష్టము ॥
140.
శాస్త్ర విహిత కర్మలు         శ్రద్ధ రహిత యజ్ఞము.
గురు, బ్రాహ్మ్మణ సేవలు      దేహ సౌచ తపములు॥
141.
అనిశ్ఛిత  కార్యముల----- అధృవమని అందురు.
శ్రేష్టాలోచనముల  -         చేయు పనులు శుభములు.॥
142.
వేద మంత్ర విధములు      శ్రేష్ట సన్మార్గములు ॥
ఓం -తత్ -సత్ నామను    ఓజ రుాప బ్రహ్మను.
143.
సార  గీతామృతమె         సరి పంచమ వేదము ॥
అదె పలికెను కృష్ణుడు      అవనిని గుణ ధాముడు ॥
------------------------------------------------------------
18. మొాక్ష సన్యాసయొాగము.
------------------------------------------
144.
కామ్య కర్మల త్యాగి       కన సన్యాసుండని
తప చర్య కర్మలవి        త్యజ్యములు  కావనిరి-॥
145.
శాస్త్ర విహిత కర్మలు         సత్కర్తవ్యములు
నిరాశక్త  ఫల కర్మలు         నిజ త్యాగపు గుణములు॥    
146.
శుభ కర్మాచరులిల           శుద్ధ బుద్ధి మంతులు
అకృత బుద్ధిపరులు        అపవితృలు అగుదురు.॥
147.
శుద్ధ తత్త్వ గుణుడు       శుఖ సంశయ రహితుడు.
కర్మ ఫల త్యాగుడుా          కన సత్య సుపుార్ణుడు ॥
148.
ప్రారబ్ద హింసలందు        ప్రబలు  పాపమంటదు.
స్వార్ధ రహిత దండన      స్వ అపరాధము కాదు॥
149.
కర్మాచరుడు కర్త..            కర్మాచరణ  కర్మ.
నశ్వరము శరీరము        నడుమాత్మయే స్థిరము॥
150.
ఈ విధి శాస్త్రము గని    ఈశ్వరభావమెరిగి
జ్ఞాన పరా నిష్టతో          జ్ఞానుడవై మెలగుము॥
151.
పరమాత్ముడు చెప్పిన      పలు శ్రేష్ట యొాగములు
పలువిధ గుణ కర్మలు      పలు తత్త్వ,శాస్త్రములు॥
152
సవ్యమెరిగి పార్ధుదు   సంశయముల వీడెను
సన్ముకుళిత హస్తుడై       సమర సిద్ధుదాయెను॥
153.
ఇయ్యది భగవంతుని     ఇహ అమృత భోధకము
ఈశ్వరి రచనామృత-        మిల సార్ధక యొాగము॥
------------------------------------------------------------------
                     ఓం  శ్రీ కృష్ణార్పణమస్తు.
                               ఓం తత్సత్.
                          శాంతి శాంతి శాంతిః.
                          --------------------------
-రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------