Thursday, June 15, 2023

పద్యాలు

[08/06, 8:23 pm] JAGADISWARI SREERAMAMURTH: మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
08-06-2023-
అంశము: రైతు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
శీర్షిక:  ఇలను వేల్పు.
ప్రక్రియ: *ఇష్టపది*
*********************

తొలుత పడిన చినుకులె తొలి వేల్పు వరములై 
అన్న దాత మనసు లాడె సంతసముగా
మట్టి తల్లిని నమ్మి  మనసార ప్రణమిల్లి
సాగె మడులు దున్న సంతసమ్ముగ నతడు ॥
ఏరువాకదె వచ్చె  నెడ్ల నాగలి తిరిగె
పారు నీటి సడులవి  పాట గలగల లాయె
జోరు విత్తనాలనె జొచ్చి నాటిన వేళ 
సారమట్టి సుగంధ  సరులె గాలిని జుట్టె ॥


హలము బట్టె రైతులు హాయి పసిడి ఫలముకు
పచ్చనైన మొలకలు పకృతి పడతికి సరులు 
బంగారు మడులెన్నొ పొంగారు వరములై 
పొలము నిండెను పంట  పొంగి పొరలెను సిరులు ॥
వెన్నెముక పుడమికని వేల గొంతులు పలికె
వెలసె కర్షకుడిలను వేల్పు మనకీ భువిని
అన్నదాతలు లేని  అవని బ్రతుకే లేదు 
అన్నదీశ్వరి మనుడు అన్నదాతే ఘనుడు ॥
[15/06, 3:52 am] JAGADISWARI SREERAMAMURTH: 14/06/2023

మహతీ సాహితీ  కవి  సంగమం 

 ప్రక్రియ: సీస పద్యము .

 రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .



సర్కారు బడిలోన సరి విద్యలను నేర్చి
పేరెన్ను నది వారు పెక్కు మంది.
జాతి బే /ధము లేక / నీతిన్యా/యములెంచి
కలిసి మె/లసి యుండు / కట్టు తోడ |

గుణమున్న  భావాల గురులెల్లరును గూడి 
 విద్య నేర్పె దరుగ వివిద గతుల
 కపటబు ద్ధది లేని కమ్మన్ని  స్నేహాలు
 సర్కారు బడి నుండు సత్య మిదియె  !
 
ఆట వెలది

పిల్ల పాప లెల్ల పిలుపు వలపు తోడ 
ఆట పాట లిడుచు అలసి సొలసి
అమ్మ  ఒడిని  చేరు నాద మరచు నిద్ర -
నిండు  మనసు  తోడ నిర్మలముగ !

రుసుము నెలకు లేదు రూక లక్కరలేదు
కడుపు నింప కాసు ఖర్చు లేదు
అమ్మ వలెను సాకు  నాయమ్మ లుందురూ
అచట పిల్లలున్న  నాత్మ శాంతి !

No comments:

Post a Comment