**ప్రదన్య సాహితీ వేదిక బృందం*
సంకలనం కొరకు
12/06/2023.
ప్రదన్య సాహితీ వేదిక
హంసికలు ప్రక్రియ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
••••••••••••••••••
1.
కాలుష్య నివారణ నినాదం.
చెవిటివాడి ముందు శంఖంలా
కాలువ నిండిన చెత్తకు, కంపు కాపలాలా...॥
2
అక్కరకు రాని చుట్టాన్ని ,
కష్టానికి స్పందించని నాయకుణ్ణి ,ఎన్నుకోకు
అబద్ధపు బాసల అతి వాదిని నమ్మకు...॥
3
రసహీనమైన జాతీయ గీతం
వత్సరాని కొకసారి వడ్డన లేని విస్తరిలా
రాజకీయపుటెత్తులకు గతి తప్పిన పాటలా॥
4
ఎక్కడుందో ,మువ్వన్నెల ఝండా .
వెలసిన రంగులను దాస్తుా
ఏటికోసారి తీస్తున్న ఉరి తాడుతో...॥
5
అమ్మకానికి ఓట్లు...
పంచుతున్న నోట్లకు బానిసలా
అమ్మ భారతినాదుకోలేని అసహాయతలా.॥
6
మన భారత దేశ ప్రగతి...?
అడుక్కోవడమొక్కటే తక్కువలా
మాటలు మరచిన మట్టి బుక్కడాల్లా ॥
7
దేశాన్నేలే నాయకులు
విదేశీయులకు తొత్తుల్లా
దేశ సంపదకే "చెక్" పెట్టిన శకునుల్లా ॥
8.
మన దేశ భవితలు
మేలి ముసుగుల్లో మైలుపడిన ఏలికలు
మానత్వాన్ని మంటగలిపే పిశాచాలు॥
9.
ఉఁ ఊఁఁ ...అంటే ఊచకోత .
ప్రణాళికలు లేని రాజ్యాగంలో
ఊపిరాడని జనం ,ఉరిగా మారిన ఉద్యమాల్లో
10
మారుస్తున్న నోట్లతో, మంతనాలకు
బడుగు జీవుల బ్రతుకు పోరాటాలు
మాట పట్టించుకోని మడ్డి వ్యవస్థలు.
************************:::***********:
హామీ :
ఈ హంసికలు నా స్వీయ రచనలు.
No comments:
Post a Comment