Tuesday, October 31, 2023

తపస్వి మనోహరం E-book కొరకు గ్రూపులో ". వచ్చిన రచనలలో ప్రతికలకు ఎంపికైన రచనలు*✍️




21-10 తేది నుండి, 31-10 2023 వరకు 
""యలవర్తి విజయకిషోర్ బాబు'' గారు ఇచ్చిన 
"అనుకోకుండా ఒక రోజు" అంశంపై వచ్చిన కథలు నుండి  
-------------------------------------------------
పై అంశం నుండి మనోహరం పత్రికల కోసం స్వీకరించిన కథలు.

01)మానవత్వం బతికే ఉంది- పంతుల లలిత
02)తీరిన కోరిక - పుల్లాబట్ల జగదీశ్వరీ మూర్తి 
03)ధర్మాన్ని కాపాడాలి- రామకూరు లక్ష్మీ మణి 
04)కొత్త ఇల్లు- NDSV నాగేశ్వర రావు
05))ఆంతర్యం- మోటూరి శాంతకుమారి 
06)మంచితనం - అద్దంకి లక్ష్మి 
07))గండం గడిచింది- కె.కె. తాయారు
8)అనుకోకుండా పెళ్లిచూపులు - కందర్భమూర్తి 
9)మంచితనం - అద్దంకి లక్ష్మి 
10)ఆ రోజుల్లో అలాగ- అంజనీ గాయత్రి- 
గుడ్

టాస్క్ లో పాల్గొన్న రైటర్స్ కి మా ధన్యవాదాలు, మరియు అభినందనలు.
        టీమ్ తపస్వి.


https://thapasvimanoharam.com/dasara-e-book-2023/

*విజయదశమి పర్వదిన సందర్భంగా తపస్వి మనోహరం రచయితలు వ్రాసిన రచనల సమాహారం.. దేవి నవరాత్రుల అంతర్జాల కవితా సంకలనం..* వెబ్సైట్ లింక్.. అక్టోబర్-2023.
**""""""***************

[06/11, 2:55 pm] బుజ్జి...✍️ స్వప్న: *25-10-2023 నుండి 28-10-2023 తేదీ వరకు గ్రూప్ సభ్యులు వ్రాసిన ఐచ్ఛికం వ్యాసాలలో పత్రికకు సెలక్ట్ చేసినవి..*✍️

1
3. శివుడు -స్వయం భవుడు- శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
4. పరాన్న జీవులు-  మామిడాల శైలజ
5. బోయకొండ గంగమ్మ తల్లి - కె.కె.తాయారు
6. త్రిగుణాలు! - శారద కెంచం
7. విజయనగరం.. పైడితల్లెమ్మ సిరిమాను ఉత్సవం - ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
[06/11, 3:01 pm] బుజ్జి...✍️ స్వప్న: *02-11-2023 నుండి 04-11-2023 తేదీలలో.. వచ్చిన ఐచ్చిక వ్యాస రచనలలో పత్రికకు సెలక్ట్ చేసినవి..*✍️
*************
1. అప్పటికీ , ఇప్పటికీ స్త్రీ - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
2. సరోజినీ దేవి భారత కోకిల - అద్దంకి లక్ష్మి
***************************


*01-07-2023 నుండి 08-07-2023 వరకు తపస్వి మనోహరం E-book  కొరకు గ్రూపులో "నాణానికి మరోవైపు" అనే అంశం పై వచ్చిన రచనలలో  E-book కొరకు  సెలక్ట్ చేసిన రచనలు ✍️*


9. కోమలకిషోరం - జయశ్రీ బారు
10. అంతర్మధనం -శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి (2parts )
11. మనషిలోని  మానవత్వం - కందర్ప మూర్తి
12. డబ్బు వెనుక ప్రేమ  - సత్య M
13. నిప్పులాంటి నిజం - పారుపల్లి అజయ్ కుమార్ 
14. అర్హత-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
15. మరో రూపం - గుణ్ణం భవాని
16
*************************************

*17-07-2023 నుండి 22-07-2023 వరకు తపస్వి మనోహరం E-book  కొరకు గ్రూపులో "మనిషి ఒకే ఒక్క రోజు దేవుడు అయితే " అనే అంశం పై వచ్చిన రచనలలో E-book కోసం సెలక్ట్ చేసినవి*✍️

1
19. దేవుని పదవి - జయశ్రీ బారు
20. సరిలేరు, నీకెవ్వరూ - శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
21.శ్రీరామ నవమి - ఎం. వి. ఉమాదేవి

*17-07-2023 నుండి 22-07-2023 వరకు తపస్వి మనోహరం E-book  కొరకు గ్రూపులో "మనిషి ఒకే ఒక్క రోజు దేవుడు అయితే " అనే అంశం పై వచ్చిన రచనలలో E-book కోసం సెలక్ట్ చేసినవి*✍️

1
18. సత్యం - భీమా శ్రీనివాస రావు
19. దేవుని పదవి - జయశ్రీ బారు
20. సరిలేరు, నీకెవ్వరూ - శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

*19-09-2023 నుండి 30-09-2023 వరకు తపస్వి మనోహరం E-book  కొరకు గ్రూపులో "క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్" అనే అంశం పై వచ్చిన రచనలలో ప్రతికలకు ఎంపికైన రచనలు*✍️
**************************************

1. 'కుంకుమ భరిణ' - వి.వి.వి.కామేశ్వరి (v³k)
2. హుష్!సస్పెన్స్ - సుజాతారావు
3. నేరం దాగదు - మోటూరి శాంత కుమారి
4. నమ్మకద్రోహం - కె.కె.తాయారు
5. యామిని - అంజని గాయత్రి
6. ప్రతీకారం - ఎం.వి.చంద్రశేఖరరావు
7. సాటి వారికి సాయం చేయండి - శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
---------------------------------------

*శ్రావణమేఘపు జావళికథలు * అనే అంశం పైన అంజనీ గారు ఇచ్చిన టాస్క్ కి వచ్చిన కథలు నుండి, అంజనీ గారు ఈ పుస్తకం కోసం సెలెక్ట్ చేసుకున్న కథలు.


1.
28..ఆనందమయ సంసారం.. అయ్యల సోమయాజుల ప్రసాద్. 
29..నువ్వంటే నాకెంతో ఇష్టం.. సుశీల రమేష్.
30.. తొలకరి వలపు జల్లులు... పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి.

*మిగిలిన కథలను వీలు చూసుకుని తపస్వి మనోహరం పత్రికలలో ప్రచురణ చేయగలము.

****************""
       తమ కథలతో ఈ టాస్క్ లో భాగస్వామ్యం అయ్యిన వారికి మా ధన్యవాదాలు.
     కథల ఎంపిక పూర్తిగా అంశం ఇచ్చిన వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
కావున ఇందులో ఎటువంటి వాదోపవాదనలు కి అవకాశం లేదు.
ఎవరైనా తమకి ఇష్టం వచ్చిన అంశం ఇచ్చి గ్రూప్ సభ్యుల నుండి కథలను కోరాలి అనుకుంటే మమ్మల్ని పర్సనల్ గా సంప్రదించవచ్చు. 
                      ధన్యవాదాలు 
                          తపస్వి.

Wednesday, October 18, 2023

వెంపటి శ్రీ వల్లి గారు పాడిన జగజ్జనని పాటలు" లింక్"

[20/7/2018, 9:15 pm] Rajshekhar Murthy: Check out Jagajjanani Devi Keertanalu by Vempati Srivalli Sarma & Jagadiswari Murthy on Amazon Music
https://music.amazon.in/albums/B07FPHRS94?ref=dm_sh_g63M7chv8jZUmKKaupkPUEiOA 

[20/7/2018, 9:59 pm] Rajshekhar Murthy: https://www.saavn.com/s/album/telugu/Jagajjanani-Devi-Keertanalu-2017/GwQSv3rZSro_
[21/7/2018, 6:21 pm] Rajshekhar Murthy: Also you can open https://www.primevideo.com

[20/7/2018, 9:15 pm] Rajshekhar Murthy: Check out Jagajjanani Devi Keertanalu by Vempati Srivalli Sarma & Jagadiswari Murthy on Amazon Music
https://music.amazon.in/albums/B07FPHRS94?ref=dm_sh_g63M7chv8jZUmKKaupkPUEiOA 

[20/7/2018, 9:59 pm] Rajshekhar Murthy: https://www.saavn.com/s/album/telugu/Jagajjanani-Devi-Keertanalu-2017/GwQSv3rZSro_
[21/7/2018, 6:21 pm] Rajshekhar Murthy: Also you can open https://www.primevideo.com

Tuesday, October 17, 2023

వారాహ గీతాలు

Monday, October 28, 2013

ALL IN ONE గజల్స్.( మధుశాల ).

ప్రేమ గీతాలు . 


  

"మౌన గీతం". 

__________________

మనసు కలచే మౌన వేదన 

పెదవి విప్పీ చెప్పలేను ... 

కలల  చెలివి నీవు నీవని 

ఎదుట నిలిచీ పలుకలేను


ప్రియతమా ......నా .... ప్రణయ గీతమా .... 

.. ప్రేమా ............ నా ప్రాణమా ......... ॥ 


గుండె గుడిలో నిలిపినాను 

కానవైతివి  నా వలపూ  ..... 

మదిని నిండిన  నీ రూపూ 

చెరపలేవది  నా గెలుపూ 

మరపు రాని జ్ఞాపకాలే 

నిండు పున్నమి వెలుగులూ ..ఆ .. 

వెలుగు పంచిన ప్రేమ కధలే 

బ్రతుకు నిలిపే శ్వాశలూ ...... నా ॥ బ్రతుకు ॥ 


ప్రియతమా ..... నా .... ప్రణయ గీతమా .. 

ప్రేమా .......... న ఆ......... ప్రాణమా ......॥ 


నిదురరానీ  కనులు బాధగ 

కార్చె  కన్నీటి  ఆవేదనా ..... 

కలత నిదురకు కరగే కలలే 

మిగిలే నాలో   వేదనా....

బ్రతుకు విరహపు అలల సడియై 

అలజడైనది భావనా...... 

చితుకు ఆశల చివరి పల్లవి 

పాడెనపశ్రుతి ఆలాపనా ....  


తీరదు ఈ తీపి బాధా 

ఎవరు ఎరుగరు  నా గాధా.... . 


ప్రియతమా ........నా ..ప్రణయ గీతమా.... 

ప్రేమా,.......... నా.....  ప్రాణమా .........॥ .. 

___________________________

"ప్రియా...సఖియా ". 

________________________

ప్రియా..   సఖియా.....

 రావే ..... ఇలా....

కదలే...... లయా.......

 నా...      గుండెలా ..... ॥ 


నుదుట  శశికళా ........ 

సిందూర సితార మెరుపులా .... 

ఎదుటా ,.... ఎరుపెక్కిన బుగ్గలు  

రంగు గులాబీ పూవులా......  ॥ 


కనులా....... కాటుకా..... 

అది కదలే మేఘ మాలికా..... 

కనులా ..........కలువలా... . 

అవి విరిసే.....  సుమ రేకలా...... ॥ 


కదలే.........  ముంగురులా .......

అవి ఎగిరే... తుమ్మెదలా.... 

కురులా....... అవి ఝరులా..... 

అవి ఆడే  నల్లని నాగులా.....॥ 


సడులా...... సవ్వడులా....... 

నీ  పదముల పారాడు మువ్వలా.... 

అలలా..... భంగిమలా ,....... 

నీ  మేని  సొగసుల  సందడులా ...॥ 

_______________________

_____________________


"నీవులేవు నిదురరాదు"..

నీవులేవు నిదురరాదు 

బ్రతుకుమీద ఆశలేదు 

అన్నీ మరపించీ పిలిచే 

చావుకూడా దరికి రాదు ॥ 


నీవు జతగా కట్టినాను 

కలల ఆశల మేడలూ... ఆ   

మేడచుట్టూ  వేసినాను 

వలపు పూవులా తోటలూ ,ఆ... 

తోటలో తిరుగాడు రాణివి 

నీవు నీవనే తలపులూ 

కూలిపోయెను ఆశలన్నీ 

వాడిపోయెను పూవులూ ॥ 


నిన్ను విడిచీ నిలువలేక 

మధువు మత్తును మరిగినాను 

మత్తు నిండిన మనసు గుడిలో 

నిండు నీ రూపు చెరపలేను 

నీడవై వెంటాడినావు 

మధువు సుధవై నిండినావు 

నీ..తలపులు వీడలేను 

నిన్ను వదిలీ ఉండలేను ॥ 

_________________


"శృతి తప్పెను నా పాట... 

_____________________

శృతి తప్పెను నాపాట 

అడుగు తడబడే ప్రతిచోట 

మాట రాదాయె నా... నోట 

మధుశాల గురుతులే నా బాట ॥ 


మరచిపోలేను మల్లెల నవ్వులు 

మాటలాడు నీ (నీలి) కన్నులూ 

గుండె లయల నీ  అడుగు  సవ్వడులు 

కాలి అందియల కొంటె కబురులు 

పైట రెప రెపల గాలి ఊసులు 

పరిమళించు నీ మేని సొగసులు ॥ 


తెలుపలేదు నా తలపు  సడి నీకు 

ఎరుగవైతివే   నా....  వలపూ 

తెలియలేదు  నా  మనసు నీదనీ.

అందలేనంత దూరమౌవరకు 

మనసు లేఖల మూగ భాషలు 

నావిగా మిగిలే ప్రేమ బాసలు ॥ 


కలనైన ఎరుగనీ ఎడబాటు 

కానరానైతి  విధి పోటు 

కోటీ స్వప్నాలే కూలి పోయి కన్నీటి 

వరదలో కరిగిపోయెను...... 

మనసు లో దాచు ప్రేమ సౌధాలె 

మత్తు మంటలో మసిగ మారెను 

నా బ్రతుకు అమావాస్య చీకటీ 

మధుశాల  మరపించు  నీ స్మృతీ...  

______________________


"మనసు మాటలాడుననీ"

____________________

మనసు మాటలాడుననీ 

కధ చెప్పగ విన్నాను 

కనులు చెప్పు భాష్యాలే

 కవితల్లో చదివేనూ ॥ 


కలల కావ్య మాలికలా ... 

ప్రేమ పిలుపు గీతాలా 

సందేశం సారాంశం నిను 

కలిసి తెలుసు కున్నాను ॥ 


కదలే నీలి మేఘం 

కురిసే చినుకు ప్రాణం 

ఉరిమే ఉరుము గమనం 

మెరిసే మెరుపు ప్రయాణం 

అలలై పొంగు ప్రాయం 

కలలో వలపు గేయం 

నీవై నిండు సవ్వడి 

నాలో ప్రేమ అలజడీ ॥ 


వయసూ వన్నెలా .....

అది   కురిసే  వెన్నెలా...... 

విరిసే ...నగవులా..... 

అవి పూవులా మధువులా.. 

అలలా ...నీ.... తలపులా.... 

నా జీవన రేఖలా    .... 

లయలా.... నీ అడుగులా...... 

నీ చూపులే కవితలా..... ॥ 

_______________________


నీ నవ్వుల జల్లులు .. 

________________________

నీ నవ్వుల జల్లులు కురిసి 

పూవులెన్నో విరిసాయీ 

నీ కన్నుల కాంతులవెంట 

దివ్వె లెన్నో వేలిగేయీ ॥ 


నీ హంసల నడకలలో 

నిండు హొయలు ఎన్నెన్నో 

నీ మువ్వల సవ్వడిలో 

నెమలి నాట్య గతులేన్న్జో 

అల్లే.. కురుల..జడలో  పూల 

పరిమళం పలకరించిందీ 

నాలో.. దాగి  ఉండే ప్రేమ 

నీకై ... నిద్ర లేచింది ॥ 


చెదిరే ముంగురులే ..చిరు 

గాలి వీచికై  కదిలే ....

బెదిరే  నీ  చూపులో ..

( ఆ) .. నీడే . నేనై  .మెదిలే 

అదిరే పెదవి అందాలా 

దాగేప్రేమ  సందేసాలే .అవి 

కబురై  మేఘమాలికలై 

కురిసే చినుకు చిరు జల్లై ॥ 


నీ తీయని తలపులు ఏవో 

నన్ను కమ్ముకున్నాయి 

స్వప్నం లో స్వర్గ విహారం 

చేయ రమ్మని పిలిచాయి 

నా వయసే ఓ నందనవనం 

నా మనసే .... బృందావనం 

నీవై నిండె నామది ... 

రావే ....... నా..... చెలీ   ॥ 

_______________________

"కరగిపోయె కలలన్నీ "

_________________________

(అతడు) :

కరగిపోయె కలలన్నీ

కలవరమే మిగిలిందీ

మాదిర మత్తులో కూడా

నీ రూపే మెదిలిందీ


మైకంతో మనసు చేరీ

మౌనగీతి పాడిందీ

శృతి చేయని గొంతు  దాటి

అపశృతిగా పలికిందీ ॥


ఈ పేద బతుకులో  కన్నీటికి విలువేదీ

మధువు రేపు మంటల్లో విఫలమైన ప్రేముందీ

ప్రేమించే నా తలపునూ నీకు ఎలా తెలిపేదీ

ముక్కలైన గుండె కోతనూ తిరిగి ఎలా అతికేదీ ॥


(ఆమె:)

తెలుసుకోనైతి  తెలుపరానైతి

దాగి ఉంది నీ రూపనీ .

దూరమౌదాక తెలియరాలేదు

ప్రేమ  నాలో నీదనీ .... .


సడిచేసే గుండె లోనా ..

నీ...తలపు వలపుందీ ...అది

నీవనే  నా తలపునూ

నీకు ఎలా తెలిపేదీ ॥


మోడువారిన మానులన్నీ ఒంటరిగా నిలిచేయీ

మనసు తోట పూలన్నీ వాడి రాలిపోయాయీ

చిగురించని కొమ్మ చేరి ఏ కోయిలా  పాడదూ

పూలులేని తోటలోకి ఏ  మధుపము చేరదూ ॥

__________________________________

___________________________________


''హాయిగొలుపు ఆ నవ్వే ''

_________________________________


హాయిగొల్పు  నీ నవ్వే 

వెన్నెలంత  చల్లదనం 

అలిగి దూరమైనంతనే 

కాల్చుతుంది నీ మౌనం ॥ 


ప్రేమతప్ప  ఏమివ్వనూ 

ఏమిలేని పేదతనం 

అందమైన లేదు నాకు 

నా రూపమే ఒక శాపం॥  


అనురాగం మూగదైనదీ 

అది నీదనీ  తెలుపలేనిదీ 

అందని ఆ చందమామను

పొందలేని తపనిదీ ॥ హాయి ॥ 


స్నేహమెంత ఓదార్పో  నిను

కలిసి తెలుసుకున్నాను 

నీ అల్లరి మాటలలో 

నన్ను నింపుకున్నాను 


ఈ జన్మకు చాలునదీ   నీ 

చెలిమి మరువలేనిదీ 

చీకటి మది , నీ తలపులే 

నా బ్రతుకు  నిలుపు శ్వాసలవీ .॥ హాయి ॥ 

___________________

____________________

ఆవేదన చెందకుమా ... 

_____________________________


ఆవేదన చెందకుమా హృదయమా 

కంటనీరు తుడిచి సేద తీరుమా 

ఆనందపు సీమలోన ,

అనురాగము పంచ చెలియ 

నన్ను చేర వచ్చినదే ప్రాణమా... ॥ 


పలకరింపు నవ్వులతో పిలిచిందీ 

సైగలతో  సోగకనుల  చూసిందీ 

ఏనాటినుంచి దాచిందో వలపు మదీ 

ఈనాటికి కరుణించి చేర వచ్చిందీ ॥ 


మూగ నోము వదలి మాట కలిపిందీ 

సిగ్గుతెరలు బుగ్గలలో దాచిందీ 

చేయి చేయి కలుప  దరికి చేరిందీ 

వలపు తోటలోన విహరింపగ రమ్మందీ ॥


ఏనాటి కలయో నిజమాయెనూ 

నా మదిలో వలపు పాట వినిపించెనూ 

చెలి చెంతనున్న క్షణమెంతో ఆనందమూ 

చిగురించె ప్రేమ లతల మా అనురాగమూ ॥ .. 

_____________________________

_____________________________

హృదయమా.... 

_____________________

హృదయమా  వలపు బంధమా ...

అందమా ప్రేమ తరంగమా.... 


వినుమా.... నను ... గనుమా,...... 

ఓ ... ప్రేమా..... మనోరమా........ ॥ 


రవివర్మ చిత్రకళా సారమా .... 

శ్రీనాధుని కవితా . సారాంశమా 

ఆ మురళీ మోహన సంగీతమా.. 

ఆ నిర్మల పూర్ణ చంద్ర బింబమా ॥  


వినుమా... నను .గనుమా

ఓ ... ప్రెమా.... మనోరమా..... ॥


అరవిరిసిన ఆటవెలది అందమా

కంద అంద గతి పదవిన్యాసమా ...

నా శ్వాశ   శీసమాల చెలి చంపకమాల

నా ప్రేమ పిలుపు వినుమా సందేహమా .....


వినుమా నను గనుమా

ఓ ప్రెమా....... మనోరమా...... ॥

_________________________

_________________________

మనసా..... మనసా ..

__________________________


మనసా.... మనసా.... 

నన్నొదిలి వెళ్ళకే  ఓ మనసా .... నా 

మదిని భావాలు నీకు తెలపాలి 

నీవే చెలివై విను మనసా... ॥ 


పెదవిపై నవ్వు చేరగిపోనీకు 

పంచుకో నువ్వు జంటగా.. ఈ 

వింతలోకాల  చింతలే వీడి 

మంచి మాట వినిపించనా ..నా  

కల నిండే కళ మది చెప్పే కధ 

వినవే  నాకై  నా చెలిగా ... ॥ 


నింగిలో మెరయు నిండు చందురుడు 

పాల వెన్నెలై కురిసేనులే 

ఆ చిన్ని తారలే చేయు అల్లరులు 

మిణుకు మెరుపులై వెలిగేనులే 

ఆ వింత లోకాలు చూసి రావాలి 

నాతొ కలిసి రా మనసా ....॥ 


నీలి మేఘాల ప్రేమ భావాలు 

జల్లు వానలై కురిసేనులే ..ఽఆ .. 

చినుకు తడులలో విరిసి సుమబాల 

ప్రేమ గీతాలు పాడేనులే ... ఏడేడు 

రాగాల ఇంద్ర_- ధనుసుపై ... 

నాట్యం చేద్దాం రా మనసా...... ॥ 

____________________________

___________________________





Sunday, October 15, 2023

నవరాత్రి. కీర్తనలు. ఫైనల్ లిష్ట్ .తపస్వి మనోహరం వారి , E Book కొరకు ,

15/10/2023


అమ్మవారి "నవరాత్రి కీర్తనలు."ఫైనల్ లిష్ట్.


తపస్వి15/10/2023


అమ్మవారి "నవరాత్రి కీర్తనలు."ఫైనల్ లిష్ట్.


తపస్వి మనోహరం వారి , E Book కొరకు ,

అమ్మవారి "నవరాత్రి కీర్తనలు."

-------------------------

వ్యాసం :

---------


మొదటిగా అమ్మవారి "పరిచయ వ్యాసం."

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


**********************

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించి, ప్రతి అవతారం నుండి ,మరొక రెండు రూపాలతో వెలువడిందని కథనం.

మహిషాసురుణ్ణి వధించేందుకు ఆ దేవి నవరూపాలు ధరించిందని , చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి మర్దించి విజయాన్ని వారంచిందని ఐతిహ్యం . దీనికి చిహ్నంగానే , శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి ,నవావరణ కీర్తనలతో అర్చించి , పూజించడం 

ఆనవాయితీగా వస్తోంది . 

అమ్మవారి "శ్రీ చక్రంలో" గల తొమ్మిది

ఆవరణలలో,  ఆ తల్లి తొమ్మిదైన శక్తి రుాపాలతో  విలసిల్లి , అసురుల 

దునిమేందుకు అష్టభుజాస్త్ర, శస్త్ర ధారిణియై , అభయహస్తముతో

చిన్మయానందమయ ఛిద్రుాపముతో అలరారుతుా , ఆర్తత్రాణ పరాయణిగా 

ఈ జగములనేలుతున్నది.

తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.



ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది . 

అటువంటి శక్తి స్వరుాపిణియైన దుర్గాంబ

అవతార విశేషాలను , నవావరణాల విశిష్టతను

తెలుపుతుా , ఒకొక్క  అవతారనికీ ఒకొక్క  కీర్తన

చొప్పున తొమ్మిది అవతారాలనుా, అచ్చమైన

తెలుగులో   కీర్తనలుగా రాసి , మీముందుంచుతున్నాను.

రోజు కొకటిగా రాసిన ఈ కీర్తనలను, తొమ్మిది రోజుల

పాటు , అమ్మవారి పుాజా సమయంలో ఆలాపనచేసి , 

పూజించి..‌


 పదియవ రోజున 'ఆ తల్లిని" శ్రీశ్రీ రాజరాజేశ్వరీ" యవతార రూపిణిగా పసుపు- కుంకుమలతో.  అలంకరించి , పూజించి , 

ఆమె కృపకు , అందరుా పాత్రులు కావాలని 

కోరుకుంటూ.....

నా ఈ సంకల్పానికి,  మీ ఆశీస్సులు తోడుకాగా, అందరముా ఆ తల్లి కృపకు పాత్రులం  కావాలని

ఆశిస్తున్నాను.

--------------------------------

---------------------------------

వ్యాసం తరువాత ...

----------------

అమ్మవారి "చక్రాలు , ముద్రలు "

--------------------------

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


**********************


ముందుగా...‌

నవావరణ చక్రాలు : ముద్రలు.

---------------------------


1.. త్రైలోక్య మోహన చక్రము  

ముద్ర పేరు - సర్వసంక్షోభిణీ

 

2. సర్వాశాపరిపూరక చక్రము 

ముద్ర పేరు - సర్వవిద్రావిణీ

 

3. సర్వసంక్షోభణ చక్రము 

ముద్ర పేరు - సర్వాకర్షిణీ

 

4. సర్వసౌభాగ్యదాయక చక్రము 

ముద్ర పేరు - సర్వవశంకరీ

 

5. సర్వార్థసాధక చక్రము 

ముద్ర పేరు - సర్వోన్మాదినీ 

 

6. సర్వరక్షాకర చక్రము 

ముద్ర పేరు - సర్వమహాంకుశా

 

7. సర్వరోగహర చక్రము 

ముద్ర పేరు - సర్వఖేచరీ 

 

8. సర్వసిద్ధిప్రద చక్రము

ముద్ర పేరు - సర్వబీజ

 

9. సర్వానందమయ చక్రము 

ముద్ర పేరు - సర్వయోని 


పిదప ధ్యాన్నం.  :  లో :"నవావరణ ధ్యాన శ్లోకాలు."

---------------------------------

----------------------------------


అంశం :       దశరా....దేవీ నవరాత్రులు.  

 (నవావరణ శ్లోకాలు)


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

-----------------


ధ్యానం ||


ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,

అఖండైక రస వాహినీ, | 

అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,

ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||


అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,

అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |

అంబ యంత్రాది ,కాది,సాది,మంత్రాది వసనీ

, కామేశ్వరీ  అంబ.  శివకామినీ ||

------------------------------------


1. త్రైలోక్యమోహన చక్రం .

ఆనందభైరవి రాగం .

----------------------------------


సర్వానందకరీం ,జయకరీం ,

త్రిపురాది చక్రేశ్వరీం |,

శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,

నిగమాదిసంవేదినీం ||


మహిషాసురాది దైత్యమర్దనకరీం ,

భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,

'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,

సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||

--------------------------------

2 సర్వాశాపరిపూరకచక్రం ,

కళ్యాణి రాగం.

--------------------------------


'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,

శర్వాణి శివవల్లభే .|

శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,

పర్వేందుముఖి పార్వతే ||


దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతీం

భవ,బంధ,భయ మోచకే |

ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,

'' కళ్యాణి '', ఘనరూపిణే ||

---------------------------

3 . సంక్షోభణచక్రం .

శంకరాభరణం రాగం .

---------------------------+-


అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,

''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |

అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,

అంబ అష్థ్థాదశాత్పీఠికే ||


హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,

జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |

,మందస్మితేందువదనాం ,శతసహస్రరత్నమణిదీప్తీం

' శంకరాభరణవేణీం '' ||

----------------------------

4 .సకలసౌభాగ్యచక్రం .

కాంభోజిరాగం .

-----------------------------


నమ: అంబికాయై , నమ:చండికాయై ,

నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |

నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,

'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||


నమ:కల్మషహరణే కలిసంతరణే ,

చతుర్వర్గ ఫలదాయినే ......|

నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,

సకల భువనాంతరాళికే    త్త్రైలోక్య ఘన పాలికే ...||

-------------------------------

5 . సర్వార్ధసాధకచక్రం .

భైరవిరాగం .

------------------------------


'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే, 

బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |

నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --

చిదానందమయి సాత్వికే ||


త్త్రై  మూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,

క్షిత్యాది శక్తి స్వరూపాత్మికే. |....

కదంబవనవాటికే, త్రిభువనపాలికే,

దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||

-----------------------------

6. సర్వరక్షాకరచక్రం .

పున్నాగవరాళిరాగం .

-----------------------------


దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-

దశశక్తి దైత్యాళికే ..... |

''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,

కైలాశరమణేశుమణి సాత్వికే ||


దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -

సంగీత, సాహిత్య , రసపోషికే.....|

అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''

పాహి | సర్వజ్ఙే శివకామినీ....||

-------------------------------

7 . సర్వరోగహరచక్రం .

శహనరాగం .

--------------------------------

రాజీవనయనే ,.. రాకేందువదనే ,

''శహన'' రాగోత్సాహి లయరంజనే |

స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ

దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||


అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''

దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |

కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -

శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||

-------------------------


8 . సర్వశిద్ధిప్రదచక్రం .

"ఘంటా" రాగం .

-----------------------------


ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -

దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|

సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,

'' ఘంటామణిఘోష '' కవాటికే.......||


నఖోదిత ,బ్రహ్మ , శివ, విష్ణు , దశరూపికే , దేవి

దశకరణ శబ్ధాది అంతర్లయే |

సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -

వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||


---------------------------------


9 .సర్వానందమయచక్రం .

ఆహిరిరాగం .

----------------------------------


జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,

శివ కమశ్వరాంకస్థ - బింబేందుబింబే....|

చింతామణిద్వీప మంచస్థితే , దేవి -

చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||


కమలాంబికే దేవి విమలాత్మికే ,

''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |

శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,

దుర్గా,రమా, వాణి సఖి సాత్వికే ||


జమంగళం |, దేవిం శుభ మంగళం ||

నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||


ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |

భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|

సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |

ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . || 

------------------------------------------------------------------------------------

అటుపై  "నవరాత్రి  అవతార కీర్తనలు"

-------------------------------


ఆ జగదంబ అవధరించిన, తొమ్మిది రూపాలు :


ప్రథమం శైల పుత్రీతి.           =      (   శైలపుత్రి .)

ద్వితీయం బ్రహ్మచారిణీ.      =       ( బ్రహ్మచారిణి.)

తృతీయం చంద్ర ఘంటేతి.   =        (చంద్ర ఘంట).

కూష్మాండేతి చతుర్థకం.        =        (కూష్మాండ)

పంచమం స్కందమాతేతి.    =        (స్కందమాత.)

షష్ఠం కాత్యాయనీచ.           =        (కాత్యాయని.)

సప్తమం కాలరాత్రీతి.           =        (కాళరాత్రి..)

మహాగౌరీతి చాష్టమం.         =         (మహా గౌరీ.)

నవమం సిద్ధిదా ప్రోక్తా.          =        (సిద్ధి ధాత్రి.)

నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ తొమ్మిది నామాలను, సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని పురాణోక్తి.


వరుసలో  ఉన్న నవ అవతార కీర్తనలు 

 ప్రథమం శైలపుత్రీచ .           =      (శైలపుత్రీ)

ద్వితీయం బ్రహ్మచారిణీ.      =       ( బ్రహ్మచారిణి.)

తృతీయం చంద్ర ఘంటేతి.   =        (చంద్ర ఘంట).

కూష్మాండేతి చతుర్థకం.        =        (కూష్మాండ)

పంచమం స్కందమాతేతి.    =        (స్కందమాత.)

షష్ఠం కాత్యాయనీచ.           =        (కాత్యాయని.)

సప్తమం కాలరాత్రీతి.           =        (కాళరాత్రి..)

మహాగౌరీతి చాష్టమం.         =         (మహా గౌరీ.)

నవమం సిద్ధిదా ప్రోక్తా.          =        (సిద్ధి ధాత్రి.)

నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ తొమ్మిది నామాలను, సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని పురాణోక్తి.


పై వరుసలో  ( బ్రాకెట్లో) ఉన్న నవ అవతార కీర్తనలు


---------------------------------------

----------------------------------------

చివరిగా..

పదవరోజునాడు - "శ్రీశ్రీ రాజరాజేశ్వరీదేవి."

అవతార రుాపిణిగా ."శ్రీ  మహిషాసుర మర్దని .".


శ్లోకం: అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

--------------------------------------------


నవరాత్రి  కీర్తనలలో 

ముగురమ్మల ముాలపుటమ్మయైన అమ్మవారిని

సంపుార్ణ శక్తిస్వరుాపిణియైన, 

 "శ్రీ మహిషాసుర మర్దిని " ని,

"శ్రిీ రాజరాజేశ్వరిీ దేవీ " అవతారిణిగా అలంకరించి అర్చించే  కీర్తన.


రచన , స్వరకల్పన ,

శ్రీమతి , పుల్లాభట్ల ,

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.

షణ్ముఖ ప్రియ రాగం.ఆదితాళం.

శ్లోకం.

-------

జయ జగదంబ శివే.,ఏ....ఏ....

లయబరిత ఝం  ఝణిత ,  ఝంకార నాద ఘోష

మృదంగ నాద జనిత  ఓంకార నాద ప్రియే....!!

భయ ఘోరతర ఖలు-కలిత. భవార్ణవ తారణ,

కారణాంఘ్రి యుగళే...!!

అఖిల జగదుదయ , స్థితిలయకార ,అవ్యయానంద,

మోక్ష సామ్రాజ్య బ్రహ్మానంద వెలసితే......

ఆనంద హృదయ సామ్రాజ్య ఖనే , గనే....,ఏ. ఏ..ఏఏ !!


*****

పల్లవి : 

------

అంబా పరమేశ్వరీ. !  ఓ జగదంబ పరమేశ్వరీ!

ఓంకార రూపిని నాదస్వరూపిణి ! నారాయణి గౌరీ !

ఓం నారాయణి గౌరీ.  !! ఓ జగదాంబ పరమేశ్వరీ !!


అనుపల్లవి :

----------

అఖిల కోటి బ్రహ్మాండ నాయకి

ఆగమనుత సారే...పరే.....!! ఓ జగదంబా పరమేశ్వరీ!!


చరణం :

------

సుందర వదనీ ,  సాంభుని రాణీ ,

మందగమని మధు-కైటభ భంజని ,

పంకజముఖి పరమేశ్వరి పార్వతి ,

పర్వత వర్ధిని పాహి మహేశ్వరి ,

మృగవాహిని గౌరీ.. శివే... !

శ్రీ రాజరాజేశ్వరీ....ఓ జగదంబా పరమేశ్వరీ!!


చరణం:

--------

కాత్యాయనీ, కరుణాంతరంగి, కామకోటి పీఠ వాసినీ...

కామ దహను , కాయార్ధ శరీరిణి..

కామితార్థప్రద కాల స్వరూపిణి..

కలినాసిని కామే.... శమే....

శ్రీ రాజరాజేశ్వరీ....ఓ జగదంబా పరమేశ్వరీ!!


మధ్యమ కాలం:

-------------

ఘణ , ఘణ. ఘణ...ఘణ    ఘంటారవే.,...

ఝణ.   ఝణ.  ఝణ. ఝణ.. నూపురపాదే....

ఐం ..హ్రీం....శ్రీం....సౌం..... మంత్ర మాన్యే.....

శ్రీచక్రేశ్వరి ,   భాగానే.. భవానీ.....

రౌద్రే , మహంకాళే ....శివే....‌!

శ్రీ రాజరాజేశ్వరీ....ఓ జగదంబా పరమేశ్వరీ!!



! ఓ జగదాంబ బా !!


ఐం ..హ్రీం....శ్రీం....సౌం.....మంత్రేశ్వరి....

ఐం ..హ్రీం....శ్రీం....సౌం .... చక్రేశ్వరి.....!!


---------------------------------

చివరిగా...

వెరసి 9 అవతారాల మూలపుటమ్మయైన

" శ్రీ రాజరాజేశ్వరీ దేవికి" మంగళ నీరాజనం.

--------------------------------------

ఆనందభైరవ రాగం. ఆదితాళం


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

----------------------------------


పల్లవి:

పంచాసత్పీఠ రూపి పరమేశ్వరి శ్రీ లలితకు

 ఎంచా  శ్రీ చక్ర నిలయ చిన్మయంబకూ...


అను పల్లవి:

అందాల అలివేణి కి , అతివ లందరు గూడి

అంగన, శ్రీహరురాణికి హారతులలీయరే 

మా లలితకు శుభ మంగళ  హారతు లియరే !!


చరణం:

జాజి చంపక కుసుమ హారావళి వల్లికి ,

కుందరదని మందార మల్లికి ,మా వేల్పు తల్లికి

 అతివలందర మంగళ హారతులీయరే...!!


చరణం:

మాతంగి మధుసూదని , మహిషాసురమర్ధినికి

మముగన్న తల్లికి, మా ముగ్గురమ్మల మూలపుటమ్మకు మురిపాల ముత్యాల హారతులీయరే !!


జయ మంగళం నిత్య శుభ మంగళం

 జయ మంగళం శుభ మంగళం

జయ మంగళం శుభ మంగళం !!



                ఓం..తత్సత్....

.         .సమస్త  ఫల సిద్ధిరస్తు., 

         శాంతి ...శాంతి....శాంత

----------------------------------------------------------------------------------------



 మనోహరం వారి , E Book కొరకు ,

అమ్మవారి "నవరాత్రి కీర్తనలు."

-------------------------

వ్యాసం :

---------


మొదటిగా అమ్మవారి "పరిచయ వ్యాసం."

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


**********************

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించి, ప్రతి అవతారం నుండి ,మరొక రెండు రూపాలతో వెలువడిందని కథనం.

మహిషాసురుణ్ణి వధించేందుకు ఆ దేవి నవరూపాలు ధరించిందని , చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి మర్దించి విజయాన్ని వారంచిందని ఐతిహ్యం . దీనికి చిహ్నంగానే , శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి ,నవావరణ కీర్తనలతో అర్చించి , పూజించడం 

ఆనవాయితీగా వస్తోంది . 

అమ్మవారి "శ్రీ చక్రంలో" గల తొమ్మిది

ఆవరణలలో,  ఆ తల్లి తొమ్మిదైన శక్తి రుాపాలతో  విలసిల్లి , అసురుల 

దునిమేందుకు అష్టభుజాస్త్ర, శస్త్ర ధారిణియై , అభయహస్తముతో

చిన్మయానందమయ ఛిద్రుాపముతో అలరారుతుా , ఆర్తత్రాణ పరాయణిగా 

ఈ జగములనేలుతున్నది.

తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.



ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది . 

అటువంటి శక్తి స్వరుాపిణియైన దుర్గాంబ

అవతార విశేషాలను , నవావరణాల విశిష్టతను

తెలుపుతుా , ఒకొక్క  అవతారనికీ ఒకొక్క  కీర్తన

చొప్పున తొమ్మిది అవతారాలనుా, అచ్చమైన

తెలుగులో   కీర్తనలుగా రాసి , మీముందుంచుతున్నాను.

రోజు కొకటిగా రాసిన ఈ కీర్తనలను, తొమ్మిది రోజుల

పాటు , అమ్మవారి పుాజా సమయంలో ఆలాపనచేసి , 

పూజించి..‌


 పదియవ రోజున 'ఆ తల్లిని" శ్రీశ్రీ రాజరాజేశ్వరీ" యవతార రూపిణిగా పసుపు- కుంకుమలతో.  అలంకరించి , పూజించి , 

ఆమె కృపకు , అందరుా పాత్రులు కావాలని 

కోరుకుంటూ.....

నా ఈ సంకల్పానికి,  మీ ఆశీస్సులు తోడుకాగా, అందరముా ఆ తల్లి కృపకు పాత్రులం  కావాలని

ఆశిస్తున్నాను.

--------------------------------

---------------------------------

వ్యాసం తరువాత ...

----------------

అమ్మవారి "చక్రాలు , ముద్రలు "

--------------------------

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


**********************


ముందుగా...‌

నవావరణ చక్రాలు : ముద్రలు.

---------------------------


1.. త్రైలోక్య మోహన చక్రము  

ముద్ర పేరు - సర్వసంక్షోభిణీ

 

2. సర్వాశాపరిపూరక చక్రము 

ముద్ర పేరు - సర్వవిద్రావిణీ

 

3. సర్వసంక్షోభణ చక్రము 

ముద్ర పేరు - సర్వాకర్షిణీ

 

4. సర్వసౌభాగ్యదాయక చక్రము 

ముద్ర పేరు - సర్వవశంకరీ

 

5. సర్వార్థసాధక చక్రము 

ముద్ర పేరు - సర్వోన్మాదినీ 

 

6. సర్వరక్షాకర చక్రము 

ముద్ర పేరు - సర్వమహాంకుశా

 

7. సర్వరోగహర చక్రము 

ముద్ర పేరు - సర్వఖేచరీ 

 

8. సర్వసిద్ధిప్రద చక్రము

ముద్ర పేరు - సర్వబీజ

 

9. సర్వానందమయ చక్రము 

ముద్ర పేరు - సర్వయోని 


పిదప ధ్యాన్నం.  :  లో :"నవావరణ ధ్యాన శ్లోకాలు."

---------------------------------

----------------------------------


అంశం :       దశరా....దేవీ నవరాత్రులు.  

 (నవావరణ శ్లోకాలు)


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

-----------------


ధ్యానం ||


ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,

అఖండైక రస వాహినీ, | 

అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,

ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||


అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,

అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |

అంబ యంత్రాది ,కాది,సాది,మంత్రాది వసనీ

, కామేశ్వరీ  అంబ.  శివకామినీ ||

------------------------------------


1. త్రైలోక్యమోహన చక్రం .

ఆనందభైరవి రాగం .

----------------------------------


సర్వానందకరీం ,జయకరీం ,

త్రిపురాది చక్రేశ్వరీం |,

శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,

నిగమాదిసంవేదినీం ||


మహిషాసురాది దైత్యమర్దనకరీం ,

భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,

'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,

సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||

--------------------------------

2 సర్వాశాపరిపూరకచక్రం ,

కళ్యాణి రాగం.

--------------------------------


'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,

శర్వాణి శివవల్లభే .|

శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,

పర్వేందుముఖి పార్వతే ||


దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతీం

భవ,బంధ,భయ మోచకే |

ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,

'' కళ్యాణి '', ఘనరూపిణే ||

---------------------------

3 . సంక్షోభణచక్రం .

శంకరాభరణం రాగం .

---------------------------+-


అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,

''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |

అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,

అంబ అష్థ్థాదశాత్పీఠికే ||


హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,

జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |

,మందస్మితేందువదనాం ,శతసహస్రరత్నమణిదీప్తీం

' శంకరాభరణవేణీం '' ||

----------------------------

4 .సకలసౌభాగ్యచక్రం .

కాంభోజిరాగం .

-----------------------------


నమ: అంబికాయై , నమ:చండికాయై ,

నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |

నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,

'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||


నమ:కల్మషహరణే కలిసంతరణే ,

చతుర్వర్గ ఫలదాయినే ......|

నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,

సకల భువనాంతరాళికే    త్త్రైలోక్య ఘన పాలికే ...||

-------------------------------

5 . సర్వార్ధసాధకచక్రం .

భైరవిరాగం .

------------------------------


'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే, 

బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |

నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --

చిదానందమయి సాత్వికే ||


త్త్రై  మూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,

క్షిత్యాది శక్తి స్వరూపాత్మికే. |....

కదంబవనవాటికే, త్రిభువనపాలికే,

దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||

-----------------------------

6. సర్వరక్షాకరచక్రం .

పున్నాగవరాళిరాగం .

-----------------------------


దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-

దశశక్తి దైత్యాళికే ..... |

''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,

కైలాశరమణేశుమణి సాత్వికే ||


దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -

సంగీత, సాహిత్య , రసపోషికే.....|

అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''

పాహి | సర్వజ్ఙే శివకామినీ....||

-------------------------------

7 . సర్వరోగహరచక్రం .

శహనరాగం .

--------------------------------

రాజీవనయనే ,.. రాకేందువదనే ,

''శహన'' రాగోత్సాహి లయరంజనే |

స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ

దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||


అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''

దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |

కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -

శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||

-------------------------


8 . సర్వశిద్ధిప్రదచక్రం .

"ఘంటా" రాగం .

-----------------------------


ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -

దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|

సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,

'' ఘంటామణిఘోష '' కవాటికే.......||


నఖోదిత ,బ్రహ్మ , శివ, విష్ణు , దశరూపికే , దేవి

దశకరణ శబ్ధాది అంతర్లయే |

సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -

వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||


---------------------------------


9 .సర్వానందమయచక్రం .

ఆహిరిరాగం .

----------------------------------


జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,

శివ కమశ్వరాంకస్థ - బింబేందుబింబే....|

చింతామణిద్వీప మంచస్థితే , దేవి -

చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||


కమలాంబికే దేవి విమలాత్మికే ,

''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |

శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,

దుర్గా,రమా, వాణి సఖి సాత్వికే ||


జమంగళం |, దేవిం శుభ మంగళం ||

నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||


ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |

భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|

సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |

ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . || 

------------------------------------------------------------------------------------

అటుపై  "నవరాత్రి  అవతార కీర్తనలు"

-------------------------------


ఆ జగదంబ అవధరించిన, తొమ్మిది రూపాలు :


ప్రథమం శైల పుత్రీతి.           =      (   శైలపుత్రి .)

ద్వితీయం బ్రహ్మచారిణీ.      =       ( బ్రహ్మచారిణి.)

తృతీయం చంద్ర ఘంటేతి.   =        (చంద్ర ఘంట).

కూష్మాండేతి చతుర్థకం.        =        (కూష్మాండ)

పంచమం స్కందమాతేతి.    =        (స్కందమాత.)

షష్ఠం కాత్యాయనీచ.           =        (కాత్యాయని.)

సప్తమం కాలరాత్రీతి.           =        (కాళరాత్రి..)

మహాగౌరీతి చాష్టమం.         =         (మహా గౌరీ.)

నవమం సిద్ధిదా ప్రోక్తా.          =        (సిద్ధి ధాత్రి.)

నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ తొమ్మిది నామాలను, సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని పురాణోక్తి.


వరుసలో  ఉన్న నవ అవతార కీర్తనలు 

 ప్రథమం శైలపుత్రీచ .           =      (శైలపుత్రీ)

ద్వితీయం బ్రహ్మచారిణీ.      =       ( బ్రహ్మచారిణి.)

తృతీయం చంద్ర ఘంటేతి.   =        (చంద్ర ఘంట).

కూష్మాండేతి చతుర్థకం.        =        (కూష్మాండ)

పంచమం స్కందమాతేతి.    =        (స్కందమాత.)

షష్ఠం కాత్యాయనీచ.           =        (కాత్యాయని.)

సప్తమం కాలరాత్రీతి.           =        (కాళరాత్రి..)

మహాగౌరీతి చాష్టమం.         =         (మహా గౌరీ.)

నవమం సిద్ధిదా ప్రోక్తా.          =        (సిద్ధి ధాత్రి.)

నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ తొమ్మిది నామాలను, సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని పురాణోక్తి.


పై వరుసలో  ( బ్రాకెట్లో) ఉన్న నవ అవతార కీర్తనలు


---------------------------------------

----------------------------------------

చివరిగా..

పదవరోజునాడు - "శ్రీశ్రీ రాజరాజేశ్వరీదేవి."

అవతార రుాపిణిగా ."శ్రీ  మహిషాసుర మర్దని .".


శ్లోకం: అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

--------------------------------------------


నవరాత్రి  కీర్తనలలో 

ముగురమ్మల ముాలపుటమ్మయైన అమ్మవారిని

సంపుార్ణ శక్తిస్వరుాపిణియైన, 

 "శ్రీ మహిషాసుర మర్దిని " ని,

"శ్రిీ రాజరాజేశ్వరిీ దేవీ " అవతారిణిగా అలంకరించి అర్చించే  కీర్తన.


రచన , స్వరకల్పన ,

శ్రీమతి , పుల్లాభట్ల ,

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.

షణ్ముఖ ప్రియ రాగం.ఆదితాళం.

శ్లోకం.

-------

జయ జగదంబ శివే.,ఏ....ఏ....

లయబరిత ఝం  ఝణిత ,  ఝంకార నాద ఘోష

మృదంగ నాద జనిత  ఓంకార నాద ప్రియే....!!

భయ ఘోరతర ఖలు-కలిత. భవార్ణవ తారణ,

కారణాంఘ్రి యుగళే...!!

అఖిల జగదుదయ , స్థితిలయకార ,అవ్యయానంద,

మోక్ష సామ్రాజ్య బ్రహ్మానంద వెలసితే......

ఆనంద హృదయ సామ్రాజ్య ఖనే , గనే....,ఏ. ఏ..ఏఏ !!


*****

పల్లవి : 

------

అంబా పరమేశ్వరీ. !  ఓ జగదంబ పరమేశ్వరీ!

ఓంకార రూపిని నాదస్వరూపిణి ! నారాయణి గౌరీ !

ఓం నారాయణి గౌరీ.  !! ఓ జగదాంబ పరమేశ్వరీ !!


అనుపల్లవి :

----------

అఖిల కోటి బ్రహ్మాండ నాయకి

ఆగమనుత సారే...పరే.....!! ఓ జగదంబా పరమేశ్వరీ!!


చరణం :

------

సుందర వదనీ ,  సాంభుని రాణీ ,

మందగమని మధు-కైటభ భంజని ,

పంకజముఖి పరమేశ్వరి పార్వతి ,

పర్వత వర్ధిని పాహి మహేశ్వరి ,

మృగవాహిని గౌరీ.. శివే... !

శ్రీ రాజరాజేశ్వరీ....ఓ జగదంబా పరమేశ్వరీ!!


చరణం:

--------

కాత్యాయనీ, కరుణాంతరంగి, కామకోటి పీఠ వాసినీ...

కామ దహను , కాయార్ధ శరీరిణి..

కామితార్థప్రద కాల స్వరూపిణి..

కలినాసిని కామే.... శమే....

శ్రీ రాజరాజేశ్వరీ....ఓ జగదంబా పరమేశ్వరీ!!


మధ్యమ కాలం:

-------------

ఘణ , ఘణ. ఘణ...ఘణ    ఘంటారవే.,...

ఝణ.   ఝణ.  ఝణ. ఝణ.. నూపురపాదే....

ఐం ..హ్రీం....శ్రీం....సౌం..... మంత్ర మాన్యే.....

శ్రీచక్రేశ్వరి ,   భాగానే.. భవానీ.....

రౌద్రే , మహంకాళే ....శివే....‌!

శ్రీ రాజరాజేశ్వరీ....ఓ జగదంబా పరమేశ్వరీ!!



! ఓ జగదాంబ బా !!


ఐం ..హ్రీం....శ్రీం....సౌం.....మంత్రేశ్వరి....

ఐం ..హ్రీం....శ్రీం....సౌం .... చక్రేశ్వరి.....!!


---------------------------------

చివరిగా...

వెరసి 9 అవతారాల మూలపుటమ్మయైన

" శ్రీ రాజరాజేశ్వరీ దేవికి" మంగళ నీరాజనం.

--------------------------------------

ఆనందభైరవ రాగం. ఆదితాళం


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

----------------------------------


పల్లవి:

పంచాసత్పీఠ రూపి పరమేశ్వరి శ్రీ లలితకు

 ఎంచా  శ్రీ చక్ర నిలయ చిన్మయంబకూ...


అను పల్లవి:

అందాల అలివేణి కి , అతివ లందరు గూడి

అంగన, శ్రీహరురాణికి హారతులలీయరే 

మా లలితకు శుభ మంగళ  హారతు లియరే !!


చరణం:

జాజి చంపక కుసుమ హారావళి వల్లికి ,

కుందరదని మందార మల్లికి ,మా వేల్పు తల్లికి

 అతివలందర మంగళ హారతులీయరే...!!


చరణం:

మాతంగి మధుసూదని , మహిషాసురమర్ధినికి

మముగన్న తల్లికి, మా ముగ్గురమ్మల మూలపుటమ్మకు మురిపాల ముత్యాల హారతులీయరే !!


జయ మంగళం నిత్య శుభ మంగళం

 జయ మంగళం శుభ మంగళం

జయ మంగళం శుభ మంగళం !!



                ఓం..తత్సత్....

.         .సమస్త  ఫల సిద్ధిరస్తు., 

         శాంతి ...శాంతి....శాంతిః


------------------------------

--------------------------------


        


-----------------------------------


----------------------------



Friday, October 13, 2023

విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహిమాన్వితమైన. శ్లోకాలు.

*విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ శ్లోకాలు ఎంతో మహిమాన్వితమైనవి*

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము
అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను
108 మార్లు జపించవచ్చును.

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. *విద్యాభివృద్ధికి*

14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. *ఉదర రోగ నివృత్తికి*

16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. *ఉత్సాహమునకు*

18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. *మేధాసంపత్తికి*

19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. *కంటి చూపునకు*

24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. *కోరికలిరేడుటకు*

27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. *వివాహ ప్రాప్తికి*

32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. *అభివృద్ధికి*

42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. *మరణ భీతి తొలగుటకు*

44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. *కుటుంబ ధనాభివ్రుద్ధికి*

46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. *జ్ఞానాభివ్రుద్ధికి*

48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. *క్షేమాభివ్రుధ్ధికి*

64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. *నిరంతర దైవ చింతనకు*

65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. *దుఃఖ నివారణకు*

67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. *జన్మ రాహిత్యమునకు*

75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. *శత్రువుల జయించుటకు*

88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

17. *భయ నాశనమునకు*

89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

18. *మంగళ ప్రాప్తికి*

96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

19. *ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు*

97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

20. *దుస్వప్న నాశనమునకు*

99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

21. *పాపక్షయమునకు*

106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః |

ఓం నమో నారాయణాయా!

Tuesday, October 10, 2023

మహిళా మనోహరీ స్వప్న గారు

[04/10, 10:16 am] బుజ్జి...✍️ స్వప్న: 
మేడం చాలా బాగా పాడారు
[04/10, 10:17 am] బుజ్జి...✍️ స్వప్న:
 మీరు పంపే పది కీర్తనలు eBook గా వేసి దసరా రోజు రిలీజ్ చేద్దాం మేడం.
[04/10, 10:26 am] బుజ్జి...✍️ స్వప్న: 
పాటలు కూడా బాగా పాడుతున్నారు మేడం. మన ఆప్ రిలీజ్ అయ్యే లోగా ఆడియో కూడా చూద్దాం సర్ కి చెప్తాను.

[04/10, 12:41 pm] బుజ్జి...✍️ స్వప్న
: Ok andi మేమే ఫ్రీ గా ఒక బుక్ ప్రింట్ చేసి ఇస్తాము మేడం. అందులో 80-100 పేజెస్ వచ్చేలా మీకు నచ్చిన కంటెంట్ ప్రూఫ్ రీడింగ్ చేసి పంపండి మేడం. 
బుక్ తీసుకు రావాలి అనే మీ కోరిక మా ద్వారా తీరితే మాకు సంతోషంగా ఉంటుంది కదా.

Monday, October 9, 2023

శీర్షిక : శ్రీ సీతారాముల కళ్యాణం.

[21/4/2021, 5:11 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక   :  శ్రీ సీతారాముల కళ్యాణం.

శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
 
హిందువులందరు ఏ పని ప్రారంభించినా, ఏ పత్రము, ఉత్తరము వ్రాసినా శ్రీరామ నామముతో వ్రాయడం ఈనాటికీ ఒక ఆనవాయితీ, శుభ సంప్రదాయం. ఏనాటి రాముడు? ఈ నాటికీ కూడా మననలో ఎంత లోతుగా అణువణువునా ఇమిడిపోయాడు కదా! అదీ రామ నామంలో ఉండే గొప్పతనం.రామనామ స్మరణ కష్టాలలో కూడా ఎంత ఉపశమనం కలిగిస్తుందో కదా.సీతారాముల జన్మ విశిష్టత—సీతారాములు ఇరువురివీ యజ్ఞ సంబంధమైన జన్మలే. యాగం అంటే త్యాగం.అదే నిష్కామ కర్మ. యజ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయస ఫలంగా శ్రీరామచంద్రుల వారు అవతరించారు. యజ్ఞనిర్వహణకై భూమిని శుధ్ధిచేసేటప్పుడు నాగేటిచాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత. అందుకే ఆమె అయోనిజ. జనకాత్మజ!

శ్రీ రాముని ప్రవర–వాశిష్ట మైత్రావరుణ కౌండిన్యస త్రయార్షేయ ప్రవరాన్విత, వసిష్ట గోత్రోధ్బవస్య నాభాగ మహారజు వర్మణః నప్త్రే, అజమహారజ వర్మణః పౌత్రాయః దశరధమహారాజ వర్మణః పుత్రాయాః శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపాయ శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే వరాయాః 

సీతాదేవి ప్రవర– ఆంగేయస, ఆయాష, గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగొత్రోద్భవస్య స్వర్ణరోమ వర్మణో నప్త్రీం, హ్రస్వరోమ వర్మణో పౌత్రీం, జనక మహారజ వర్మణో పుత్రీం సాక్షాత్ లక్ష్మీ దేవీ స్వరూపిణీం సీతాదేవీ నామ్నాం కన్యాం.

సీతారాముల కళ్యాణము సౌమ్య నామ సంవత్సర ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమా ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యుక్త కర్కాటకలగ్నమందు జరిగింది. కానీ రాముని జన్మదినం నాడే కళ్యాణము ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందామా!అవతార పురుషుడు శ్రీరాముడు జన్మించడమే లోకకళ్యాణం కోసం . అందుకనే శ్రీరామ జన్మదినమైన నవమినాడే అభిజిత్ లగ్నమందు (సూర్యుడున్న రాశినుండి నాలుగవ రాశి). శ్రీరామ కళ్యాణము ఆచరిస్తున్నాము.నేటి మనవివాహ వేడుకలు, ఆచారాలు, నాటి సీతారాముల వివాహమునుండి సంప్రదించినవే! ఈనాటికి వాడవాడల సీతారాముల కళ్యాణోత్సవము జరుపుకుంటున్నాము. మన ఇళ్ళల్లో కూడా అదేరీతిలో వివాహాలు చేస్తున్నాము.

ఉదాహరణకు పెండ్లి శుభలేఖ “జానక్యాః కమలాంజలిపుటే యాః పద్మరాగయితాః… అనే శ్లోకంతొ ప్రారంభమవుతుంది. తరువాత జరిగే స్నాతకం(వరపూజ), సుముహూర్తం, తలంబ్రాలు, కన్యావరణం , పెండ్లికుమారునికి పాద ప్రక్షాళన, అప్పగింతలు వంటి మన సంప్రదాయములోని పెండ్లి వేడుకలు, ఆచారాలు చాలామటుకు సీతారముల కళ్యాణంనుండి పాటిస్తున్నవే. దంపతుల అన్యోన్యతకు కూడా సీతారాముల వంటి దంపతులవాలని ఆశీర్వదిస్తారు.నేటికి కూడా మన ఇళ్ళల్లో జరుగు వివాహ సమయములో కన్యాదాత లక్ష్మీ నారాయణ స్వరూపుడైన వరుని పాద ప్రక్షాళన చేస్తూ చెప్పే మంత్రము ఒక్కసారి చూడండి. 

“ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ | ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా | పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా  సదా!” 

రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా!. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో!( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి) ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామా! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామా , ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి!ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది అని జనకుడు చెప్పి రాముని చేతిలో సీతచేతిని ఉంచి మంత్రజలం విడిచి పెడుతాడు .రాముడు అగ్నిసాక్షిగా సీత యొక్క పాణిగ్రహణము చేసాడు .దేవదుందుభులు మ్రోగి పూలవాన కురిసినది. తరువాత జనకుడు లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శతృఘ్నునకు శృతకీర్తిని ఇచ్చి కన్యాదానము చేసాడు! 

ఈవిధంగా శ్రీ సీతారాముల కల్యాణంలో మన ముాడు తరాల వంశ ప్రవర చదవడం , కన్యా దాన సమయంలో 
వధువు తండ్రి , వధువుకు  ధర్మబద్ధమైన భాధ్యతలు తెలుపుతుా 
రాముని చేతికి తన  తన కన్యను అప్పగించడం ,  ఆ మాటలన్నీ విని అంగీకరించిన వరుడు అగ్నిసాక్షిగా ఆ చేతిని అందుకోవడం...మన  సాంప్రదాయ పద్ధతిని , మన సంస్కృతి  గొప్పతనాన్ని చాటి చెపుతున్నాయి.
నాటి నాటికి తరిగిపోతున్న మన సంస్కృతి , సాంప్రదాయాల్ని ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామ కల్లాణంలో నేటికీ మన విపృులు వేద పరంగా నిర్వహిస్తుా మనకు జ్ఞప్తికి తెస్తున్నారు. తిరిగి ధర్మ బద్ధమైన  మన సంస్కృతి , సాంప్రదాయ పద్ధతులను తప్పకుండా అందరుా ఆచరించాలని కోరుతుా...
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.


ఇది ఎప్పుడు ఎవరు పోష్ట్ చేసేరో తెలీదు .కానీ నాకు నచ్చినందున ఈ పోష్ట్ ను  నాకు తెలిసిన కొన్ని పంక్తులను జొిడించి మీ మధ్య నుంచేను.
[1/5/2021, 7:37 pm] JAGADISWARI SREERAMAMURTH: [5/1, 19:31] p3860749: కవితా పోటీ ఫలితాలు
*********************************************
ఫలితాలు:
ప్రథమ బహుమతి
*కడిమెళ్ల శ్రీ రామచంద్ర వర ప్రసాద్ గారు  ప్రకటిస్తారు*. 
1.శ్రీ ఆడిగొప్పుల సదయ్య
2.శ్రీమతి ఫుల్లాభట్ల జగదీశ్వవరి
3శ్రీ కిలపర్తి దాలినాయుడు
[5/1, 19:31] p3860749: శ్రీ రామనవమి కవితావసంతోత్సవం సందర్భంగా మీ కవితాపటిమను కనబరచి, *ద్వితీయ బహుమతి..* ని అందుకున్నందుకు
అభినందిస్తూ..🌹💐🌹

జక్కని గంగాధర్ 
ముంబాయి..
🌹🙏🌹

Thursday, October 5, 2023

పురాణాలలో మహిళల ప్రాముఖ్యత .

05/10/2023

*తపస్వి మనోహరం పత్రిక కొరకు రచన..*

*విభాగం:* వ్యాసం

*అంశం:* పురాణాలలో మహిళల ప్రాముఖ్యత .

శీర్షిక. : "సహనానికి మారుపేరు ".


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


చిన్నప్పటినుంచి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు చెప్పే కథలు వింటూ, పురాణాలలో గల స్త్రీల గురించిన  అవగాహనతో పాటు , మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా చాలా తెలుసుకున్నాను.

పురుషాధిక్యతతో తప్పు త్రోవలో వెళుతున్న ఎంతో మంది భర్తలను , భార్యలు తమ శాంత స్వభావంతో" ఇది తప్పు" అని చెప్పిన  స్త్రీలను , 

"ఆడదాని మాట వినేదేంటి" అన్న అహంకారంతో , తప్పు త్రోవలో నడిచి,తాము చేసిన తప్పులకు "శిక్ష" గా, తమ రాజ్యాలను కోల్పోవడంతో పాటు, తమ ప్రాణాలను కూడా కోల్పోయిన మగవారు ఎంతమందో మన పురాణాలలో కనిపించారు.


ఇంక విషయానికి వస్తే...

రామాయణంలో. లంకాధిపతియైన "రావణాసురుని" పట్ట మహిషి " మండోదరి."

మహా పతివ్రత..  

 శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు , మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే ,మరికొన్ని పాత్రలు దానవకులానికి చెందినప్పటికి మానవత్వానికి ప్రతీకలై , ఆ చంద్రార్కం నిలిచిపోయాయి. లంకాధినేత రావణుని పట్టమహిషి అయిన ఈ మహారాజ్ఞి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి.

నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గల "మండోదరి"  వ్యక్తిత్వం , మిక్కిలి ప్రశంసానీయమైనది.

సీతాపహరణ చేసి , ఆమెను  లంకలో నిర్బంధించిన

క్షణం నుంచి, రావణుని ధర్మపత్నిగా" మండోదరి" రావణుని హెచ్చరిస్తూనే ఉంది 

ఆమె సీత యొక్క ప్రతివ్రత్య మహత్యం గురించి , శ్రీరాముని యొక్క ధర్మనిరతి , యుద్దం పటిమల గురించి 

తెలియ పరుస్తూనే ,రావణుడిని మంచి వ్యక్తిగా

మార్చడానికి ఆమె తన వంతు కృషి చేస్తూ , విధ్వంసకర భవిష్యత్తుకు దారితీసే అతని తప్పుడు పనుల గురించి హెచ్చరిస్తూనే ఉంది.

  అతనిలో ఎన్నో లోపాలు  ఉన్నప్పటికీ, ఆమె తన 

పత్త్నీ. ధర్మాన్ని విడువక చివరి వరకు అతనికి అండగా నిలిచింది .


మండోదరిరే గాక , అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచ కన్యలుగా ప్రసిద్ధి చెందిన  ఈ అయిదుగురు స్త్రీలు, తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. 


అహల్య : 

అహల్యని గౌతమ ఋషి. "పర పురుష సంబంధం ఉందన్న" కారణంగా   వెళ్ళగొట్టాడు .భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించిందని ఒక కథ.

  అహల్య   బ్రహ్మ మానస పుత్రిక , అత్యంత సౌందర్యవతి,

ఆ కారణంగా , త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోడానికి అర్హులని బ్రహ్మ ప్రకటిస్తాడు.

 దీంతో, తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు, అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరుతాడు. అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడి కంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెప్పగా

 బ్రహ్మ , అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. 

తన ఇంద్ర పదవి గౌతముడు దక్కించుకుంటాడేమోనని కలవరపడిన దేవేంద్రుడు, కుటిల ప్రయత్నంతో ,

 గౌతముడి రూపంలో వచ్చి తన వాంఛను తీర్చమని అడుగుతాడు.

మహా పతివ్రత అయిన అహల్య, తన భర్త వేషంలో  వచ్చింది

 ఇంద్రుడు అని తెలుసుకొని , తన భర్త రాకమునుపే

ఇంద్ర దేవుని వెళ్లిపోమని వేడుకుంటుంది. కానీ, ఈ లోగా అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, అవేశంతో . తన భార్య అయిన హల్యను  అలాగే, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని  ఆమెను శపించాడు. అలాగే ఇంద్రుడికి ",వృషణహీనుడవు" అవుతావని శాపం ఇచ్చాడు.

అటు పై నిజం తెలుసుకున్న గౌతముడు శ్రీరామ పాద స్పర్శతో అహల్యకు శాప విముక్తి అవుతుందని తెలియపరుస్తాడు.

ఈ విధంగా అహల్య తన భర్త శాపాన్ని.వెయ్యేళ్లు భరించింది గాని ,పతివ్రతా మహత్యంతో తాను తిరిగి, భర్తకు శాపం ఇవ్వలేదు.


ఇక శ్రీమద్రామాయణంలో, రాముని భార్య అయిన" సీత,"

తల్లి కైకేయి కోరిక నెరవేర్చడానికై 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిన శ్రీరాముని వెంట వెళ్లి , ఆ అడవిలో మాయా రాక్షసుల బారిన పడి ఎన్నో బాధలు పడింది .

లక్ష్మణుడు ,  రక్తసియైన సూర్పణఖ పై  కోపంతో, ఆమె ముక్కు-చెవులు, కోసినందుకు రావణుడు ఆగ్రహించి ,మాయతో, సీతమ్మను ఎత్తుకెళ్లి లంకలో ఉంచాడు.

పతివ్రత అయిన సీత, తిరిగి రాముడు తనను వచ్చి తీసుకు వెళ్ళే దాకా ,రావణుడి లంకలో, అశోక వృక్షం కింద తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ, రామ నామం జపిస్తూ, కొన్ని సంవత్సరాలు గడిపింది.

రాముడు రావణాసురుని చంపి, సీతను తిరిగి తనతో తీసుకెళ్ళి, అయోధ్యలో రాజ్యపాలన చేస్తూ ఉండగా , ఒక చాకలివాడు అన్న మాటలకు తలవంచి, గర్భం ధరించి ఉన్న "సీతమ్మను* అడవులలో వదిలి వచ్చాడు.

 చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళ గొట్టబడింది, 

ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన సీతమ్మ, తిరిగి రాముడు

 పిలచినా రాకుండా, అగ్నిలో దూకి తన పాతివవ్రత్యాన్ని నిరూపించుకుని అగ్నిపునీత అయ్యింది.


ఇక ద్రౌపది అయిదుగురు భర్తలు ఆమెను జూదంలో ఒడ్డి, పోగొట్టుకున్నారు.


మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు దుర్యోధనుడు .అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.

ఇలా చెప్పుకుంటూ పోతే నాటి కాలం నుండి నేటి కాలం వరకు కూడా, స్త్రీలు , అటు పురాణాలలో వారైనా సరే, ఇటు సంసారికులైనా, సరే ఎన్నో బాధలు అవమానాలు పడుతూనే ఉన్నారని తెలుస్తున్నా ది.

నా నాటి కాలంలో కూడా, పతివ్రతలైన

 స్త్రీలు బానిసత్వానికి, పురుషాధిక్యతకు ,తలవంచారు.

 నేడు కూడా అదే జరుగుతున్నది.

 దీనికి అంతం ఎప్పుడు..?


(గూగుల్ సేకరణ)

------------------


Wednesday, October 4, 2023

నవరాత్రి కీర్తనలు. ..రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

[03/10, 11:45 pm] JAGADISWARI SREERAMAMURTH: నవరాత్రి కీర్తనలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

**********************
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించి, ప్రతి అవతారం నుండి ,మరొక రెండు రూపాలతో వెలువడిందని కథనం.
మహిషాసురుణ్ణి వధించేందుకు ఆ దేవి నవరూపాలు ధరించిందని , చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి మర్దించి విజయాన్ని వారంచిందని ఐతిహ్యం . దీనికి చిహ్నంగానే , శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి ,నవావరణ కీర్తనలతో అర్చించి , పూజించడం 
ఆనవాయితీగా వస్తోంది . 
అమ్మవారి "శ్రీ చక్రంలో" గల తొమ్మిది
ఆవరణలలో,  ఆ తల్లి తొమ్మిదైన శక్తి రుాపాలతో  విలసిల్లి , అసురుల 
దునిమేందుకు అష్టభుజాస్త్ర, శస్త్ర ధారిణియై , అభయహస్తముతో
చిన్మయానందమయ ఛిద్రుాపముతో అలరారుతుా , ఆర్తత్రాణ పరాయణిగా 
ఈ జగములనేలుతున్నది.
తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.


ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది . 
అటువంటి శక్తి స్వరుాపిణియైన దుర్గాంబ
అవతార విశేషాలను , నవావరణాల విశిష్టతను
తెలుపుతుా , ఒకొక్క  అవతారనికీ ఒకొక్క  కీర్తన
చొప్పున తొమ్మిది అవతారాలనుా, అచ్చమైన
తెలుగులో   కీర్తనలుగా రాసి , మీముందుంచుతున్నాను.
రోజు కొకటిగా రాసిన ఈ కీర్తనలను, తొమ్మిది రోజుల
పాటు , అమ్మవారి పుాజా సమయంలో ఆలాపనచేసి ,  పసుపు- కుంకుమలతో 'ఆ తల్లిని 
అర్చించి, ఆమె కృపకు , అందరుా పాత్రులు కావాలని 
కోరుకుంటూ.....
నా ఈ సంకల్పానికి,  మీ ఆశీస్సులు తోడుకాగా, అందరముా ఆ తల్లి కృపకు పాత్రులం  కావాలని
ఆశిస్తున్నాను.

ముందుగా...‌
నవావరణ చక్రాలు : ముద్రలు.
---------------------------

1.. త్రైలోక్య మోహన చక్రము  
ముద్ర పేరు - సర్వసంక్షోభిణీ
 
2. సర్వాశాపరిపూరక చక్రము 
ముద్ర పేరు - సర్వవిద్రావిణీ
 
3. సర్వసంక్షోభణ చక్రము 
ముద్ర పేరు - సర్వాకర్షిణీ
 
4. సర్వసౌభాగ్యదాయక చక్రము 
ముద్ర పేరు - సర్వవశంకరీ
 
5. సర్వార్థసాధక చక్రము 
ముద్ర పేరు - సర్వోన్మాదినీ 
 
6. సర్వరక్షాకర చక్రము 
ముద్ర పేరు - సర్వమహాంకుశా
 
7. సర్వరోగహర చక్రము 
ముద్ర పేరు - సర్వఖేచరీ 
 
8. సర్వసిద్ధిప్రద చక్రము
ముద్ర పేరు - సర్వబీజ
 
9. సర్వానందమయ చక్రము 
ముద్ర పేరు - సర్వయోని 


ఆ జగదంబ అవధరించిన, తొమ్మిది రూపాలు :
కీర్తనలు.


1 .శైలపుత్రీ.


శ్లోకం: 
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

1.. త్రైలోక్య మోహన చక్రము  .
ముద్ర పేరు - సర్వసంక్షోభిణి.
బ్రాహ్మీ మాతృక .

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.

కీర్తన :

పల్లవి :
పాహి పాహి జయ,  శ్రీ  చక్రేశ్వరి
పాలించుము మము  జగదీశ్వరీ..॥

అను పల్లవి:
పాహి పరాత్పరి  , శంకరు రాణీ..
గిరి రాజ నందిని  ,  సతి శర్వాణీ...॥

చరణం :
దక్షుని యింటను  , అవమానితవై
యాగాగ్నిని నువు దుమికితివంటా
యొాగాగ్నిలొ , నీ తనువును త్యజియించి 
హిమవంతు పుత్రికవైనావంట ॥  పాహి ॥ 

దద పప మమరిరి.  పప మమ రిరి సస
దా.సరి, సా.రిస.  రీపమపా..!!
దపమపధస , మప దస. సని దసరీ..
రిపా.మ గరి ,  ధరీ.సనిధ  మగరిమప !! పాహి!!

చరణం : 
త్రైలోక్య మొాహన  చక్రమునందుండి 
అణిమాది సిద్ధులకాధారమై...
వేదపురాణ సంవేదినివై మాఁ...
బాధల బాపేవు శైలసు పుత్రివై ...

దద పప మమరిరి.  పప మమ రిరి సస
దా.సరి, సా.రిస.  రీపమపా..!!
దపమపధస , మప దస. సని దసరీ..
రిపా.మ గరి ,  ధరీ.సనిధ  మగరిమప !! పాహి!!

మిత్రం : 
అహరహముా నిను అర్చింతుము మా
అంతరంగమున  నిలుమా తల్లీ
ముల్లోకములము ఏలేటి జననీ
కల్లోల జగతిని కాపాడు తల్లీ...॥ పాహి॥

శ్రీ చక్రేశ్వరి ,  జయ జగదీశ్వరి -
లక్ష్మీ రుాపిణి పార్వతీ..
హిమవత్పన్నగ  రాజకుమారీ..
"బ్రాహ్మీ " శివే  జయ  కామేశ్వరీ...॥
----------------------------
[04/10, 9:39 am] JAGADISWARI SREERAMAMURTH: 
నవరాత్రి  కీర్తనలు .
ధ్యాన కీర్తన.. షణ్ముఖ ప్రియ రాగం.
శ్లోకం.
-------
జయ జగదంబ శివే.,ఏ....ఏ....
లయబరిత ఝం  ఝణిత ,  ఝంకార నాద ఘోష
మృదంగ నాద జనిత  ఓంకార నాద ప్రియే....!!
భయ ఘోరతర ఖలు-కలిత. భవార్ణవ తారణ,
కారణాంఘ్రి యుగళే...!!
అఖిల జగదుదయ , స్థితిలయకార ,అవ్యయానంద,
మోక్ష సామ్రాజ్య బ్రహ్మానంద వెలసితే......
ఆనంద హృదయ సామ్రాజ్య ఖనే , గనే....,ఏ. ఏ..ఏఏ !!

*****
పల్లవి : 
------
అంబా పరమేశ్వరీ. !  ఓ జగదంబ పరమేశ్వరీ!
ఓంకార రూపిని నాదస్వరూపిణి ! నారాయణి గౌరీ !
ఓం నారాయణి గౌరీ.  !! ఓ జగదాంబ పరమేశ్వరీ !!

అనుపల్లవి :
----------
అఖిల కోటి బ్రహ్మాండ నాయకి
ఆగమనుత సారే...పరే.....!! ఓ జగదంబా పరమేశ్వరీ!!

చరణం :
------
సుందర వదనీ ,  సాంభుని రాణీ ,
మందగమని మధు-కైటభ భంజని ,
పంకజముఖి పరమేశ్వరి పార్వతి ,
పర్వత వర్ధిని పాహి మహేశ్వరి ,
మృగవాహిని గౌరీ.. శివే... ! ఓ జగదంబా పరమేశ్వరీ!!

చరణం:
--------
కాత్యాయనీ, కరుణాంతరంగి, కామకోటి పీఠ వాసినీ...
కామ దహను , కాయార్ధ శరీరిణి..
కామితార్థప్రద కాల స్వరూపిణి..
కలినాసిని కామే.... శమే....!! ఓ జగదాంబా !!

మధ్యమ కాలం:
-------------
ఘణ , ఘణ. ఘణ...ఘణ    ఘంటారవే.,...
ఝణ.   ఝణ.  ఝణ. ఝణ.. నూపురపాదే....
ఐం ..హ్రీం....శ్రీం....సౌం..... మంత్ర మాన్యే.....
శ్రీచక్రేశ్వరి ,   భాగానే.. భవానీ.....
రౌద్రే , మహంకాళే ....శివే....‌!! ఓ జగదాంబ బా !!

ఐం ..హ్రీం....శ్రీం....సౌం.....మంత్రేశ్వరి....
ఐం ..హ్రీం....శ్రీం....సౌం .... చక్రేశ్వరి.....!!

---------------------------------
[04/10, 8:23 pm] JAGADISWARI SREERAMAMURTH: నవరాత్రి  కీర్తన

2 .రెండో రోజు పరాశక్తి ""బాలాత్రిపుర సుందరీదేవి".
అవతార మూర్తిగా  "బ్రహ్మచారిణి ".
సర్వాశా పరిపూరక చక్రం ".బృందావని". రాగం.
------------------------------------------

బాలాత్రిపుర సుందరీ
శ్లోకం:
 హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!

2.కీర్తన.
--------
పల్లవి:
--------
పూర్ణ జ్యోతి రూపాన బ్రహ్మచారిణివై.
వెలసిన పర్ణా, అపర్ణ  పాహిమాం పాహిమాం!!

అనుపల్లవి:
-----------
స్వర్ణ మకుట, మణిద్వీప, వాసములను వదిలి నీవు
ఘోర తపము నాచరించి గౌరవములనందినావు !!

చరణం:
-------
చంద్రమౌళీశుని సగభాగము నీదైన ," ఉమ"గ
భాగ్యముంది , ఖ్యాతి చెంది , పరవశించినావు
తపః , త్యాగ, వైరాగ్య ,సదాచార సంయమములు
వర్థిల్లే ఫలములిచ్చు  తల్లిగ విలసిల్లినావు !!

చరణం:
-------
సర్వాశా పరిపూరిత చక్ర స్థితవై
సాధకులకు సిద్ధినిచ్చు సిద్దేశ్వరివై
ఒక చేతిని జపమాల , వేరొకచే కమండలము
ధరించి దర్శనమిడి దీనుల బ్రోచేవు !!

బృందం:
--------
జయ జయ మహేశ్వరీ , జగదాంబా ఈశ్వరీ
జయమీయవె  జగదీశ్వరి , జయ శ్రీ దుర్గా !!
--------------------------------------

నవరాత్రి కీర్తన.

రచన : సంగీతం:  గానం : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


3. మూడో రోజు- గాయత్రీదేవి.

అవతారిణిగా  "చంద్ర ఘంట".

సర్వ సంక్షోభణ చక్రం.

పంతువరాళి రాగం  (ఆధారంగా)

.అది తాళం.


శ్లోకం: 

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌, గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.

కీర్తన:


పల్లవి: 

-----

ఖడ్గ, బాణాది,శర , అస్త్ర-శస్త్రములెన్నియొ

దశ భుజముల ధరియించి  ధరణి నేలినావు.

అను పల్లవి:

---------

చంద్రఘంటాకార తిలకాంకితవై నీవు

సింహ వాహనమెక్కి అసురుల దునిమావు..!!


చరణం:

-------

సర్వసంక్షోభణ  చక్రస్థితవై. 

నిర్విరామ నిత్య, యుధ్ధోన్ముఖివైనావు

భూత, ప్రేత గణాదులను  ఘంటారవములతోడ

పారద్రోలి పరిరక్షణ జేసినావు !!


చరణం:

-------

దుష్ట-దమన, దురితాది శమనవై, శాంకరీ

జగముల నేలేటి జనని  జగద్ఘనివి నీవు

వీర -సౌమ్య- వినమ్ర భావముల విస్తృతి చేసేటి

విజయదుర్గ రూపి ,  "చంద్రఘంటువు" నీవు!!


బృందం:

పాహి పాహి చంద్రఘంట  పాహీ జగదీశ్వరి

పాహి జనని దుర్గా , భవాని పాహి పాహి !!


--------------------------------



Monday, October 2, 2023

మహిళ మనోహర్ పత్రికలో సెలెక్ట్ అయినది

*25-09-2023 తేదీ నుండి 30-09-2023 వరకు.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అంశంపై వచ్చిన రచనలలో తపస్వి మనోహరం పత్రికకు సెలక్ట్ చేసినవి...*✍️


1. పోస్ట్ డేటెడ్ చెక్ - మామిడాల శైలజ
2. తెరముందే ఉండాలి! -ఎం. వి. ఉమాదేవి
3. రాజకీయ ప్రస్థానంలో జయహో నారీ - వెలిగట్ల రత్నకుమారి
4. ఎండమావులు -  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
5. మహిళా రిజర్వేషన్ బిల్లు - సమాజ వైఖరులు  - నాగ మయూరి
6. తల్లిగా పాలిస్తాం -  తల ఎత్తుకొని పరిపాలిస్తాం - సిద్ధగాని భాగ్యలక్ష్మి

***********

https://thapasvimanoharam.com/varapathrika01-10-2023/


*20-09-2023 తేదీ నుండి 23-09-2023 వరకు వచ్చిన  వ్యాస రచనలలో.. పత్రికకు సెలక్ట్ చేసినవి.. ✍️*

1. మౌనం విడనాడుమా! -శారద కెంచం
2. కళాత్మక శోభ - నారు మంచి వాణి ప్రభా కరి
3. మనోహరం- మామిడాల శైలజ
4. ఆదర్శం - సుజాతకోకిల
5. మౌనం - మాధవి కాళ్ల
6. శ్రీనాధుని చాటు పద్యాలు -  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
7. నూతన ఆశయం - షేక్ నశ్రీన్
8. తెలుగు మధురిమ - కొంటికర్ల లలిత
9. యవ్వనం - కుబ్రా ముజాహెద్
10. శక్తిపీఠం శివాని మాత ఆలయం - అద్దంకి లక్ష్మి (క్షేత్ర దర్శిని) 
11. నారీ బేరి - దేవి గాయత్రి.
************"""""