11/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చిత్ర కవిత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
ప్రక్రియ : ఆటవెలది.
ఆలుమగలు కలిసి అలుపు సొలుపు లేక
కలసి పనులు చేయ కలదు సుఖము
ఆడ మగల బేధ మది చూపబోకయా
వలచు వారి కన్న వరమదేది !!
నాటి మాట గాదె నలభీమ పాకంబు
నేటి మహిళ లెరుగ నేర్పు ఏది ?
చీర గట్టి మగడు చిన్న సాయము జేసి
వంట రుచుల నేర్పె వనిత లకును!!
ఆడ మగల మాట ఆరోజు లెటొపోయె
కలసి మెలసి సాగు కథలు నేడు.
కలసి పనులు చేసి కలసి పనికి పోవ
కలిమి పెరుగు కడకు కలుగు సుఖము !!
No comments:
Post a Comment