16/05/2025.
మహతీ సాహితీ కవి సంగమం
అంశం , ఐచ్ఛికం
శీర్షిక :- బంధాను బంధాలు.
రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహరాష్ట్ర. (43).
కవిత సంఖ్య = 1.
ఒక్కరు తోడుంటే ,
ఒంటరివైన వేదన దూరమౌతుంది
మనసు పడే బాధను ,
మనసునన్న స్నేహం మరిపిస్తుంది
ప్రేమను పంచే హృదయముంటే,
బంధం ఎంతో మధురమోతుంది !!
నమ్మకమనే పునాది ఉంటే,
అనుబంధం శాశ్వతమౌతుంది.
కష్టంలో చేయూత నిచ్చే బంధం
బంధుత్వాన్ని బలపరుస్తుంది !!
సంతోషం పాలు పంచుకోవాలంటే ,
స్నేహితులు తోడవ్వాలి.
అపార్థాల మేఘాలు కమ్మిన చోట
" క్షమ" అనే వెలుగు నింపాలి.
తెగిన బంధం తిరిగి కలవాలంటే,
వీడని ప్రయత్నం చేయాలి .
గుండెకు గుండె తోడై నిలిస్తే,
జీవితమే స్వర్గమౌతుంది !!
మాటలు లేని మూగ సంభాషణ,
ప్రేమ బంధాలకు మౌన సంకేతమవుతుంది
కాలం గడిచే కొద్దీ బంధాలు బలపడాలంటే
ప్రేమానురాగాలు నిండే హృదయముండాలి !!
మానవత్వం మంట కలిసిపోకుండా ఉండాలంటే
మాటల్లో మంచితనం , చేతల్లో చేరువతనం ఉండాలి.
మానవ బంధాలెంతో గొప్పగా ఎదగాలంటే,
మనిషికి మనిషి మీద నమ్మకం ఉండాలి.!!
మనుషిలా బతుకుతూనే మనీషి గా ఎదగాలి.
ఎదగాలంటే ఒదగాలి.
ఒదిగి ఉండాలంటే మానవ సంబంధాలకు
నిజమైన అర్థం తెలుసుకోవాలి !!
-----------------------------
ఈ కవిత నా స్వీయ రచన.
No comments:
Post a Comment