Saturday, October 5, 2019

"అమ్మ" ..కనిపించని శక్తిస్వరుాపిణి.

అమ్మ
-------
తన రక్త మాంసాలను
నా ఆకార వికాశానికి ధారపోసి ,
తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
                               అమ్రుతమయి.  "అమ్మ "
భూమిపై పడిన క్షణంలో , 
నాలో. కదిలే భావాలకు నాందిగా
పలికే మొదటి పలుకు
అ..ఉవ్ ••వా..•లో ఇమిడిన.,
                                 ఓంకారధ్వని. " అమ్మ "
తనలో నున్న 
రక్త స్రావాలను ,
క్షీర రసాలుగా. మార్చీ -
ఆకలి తీర్చిన కారుణ్య ఖని ,
                                      అన్నపూర్ణ. " అమ్మ " వచ్చీరాని నడకతో.
నిలదొక్కుకోలేని నాకు
చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన
                                     మార్గదర్శి. " అమ్మ " ,
నా  విజ్ఞాన వికాసానికై
తోడ్పడుతూ ,
నా భవితవ్యానికి
పూలబాట వేసిన -
                                      గురుమూర్తి అమ్మ".  
చెడు సావాసాలతో,
రోగాల పాల్పడిన నాకై,
తన జీవితాన్ని
పణంగా పెట్టి , సెేవలందించిన
                                జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో  ,
గంగమ్మలో  ముాడు
మునకలు వేయగానే
నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటుగా తీసుకుపోతుా
శాంతిగా సాగిపోయే పవిత్ర -
                           క్షమా ధరిత్రి. " అమ్మ "
కారే కన్నీళ్ళతో ,
నాకళ్ళు మసకబారేయి.
నాకై "సమిధ " లా కరిగిపోయే
"అమ్మ" కు , కనీసపు
గుర్తింపు ఇవ్వని నేను ,
అమ్మ కోసం విలపిస్తున్నాను.
                                    " అమ్మా -----అంటూ
నన్నో ఒడ్డుకు చేర్చి
నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా -
న్నాశీర్వదించే -,
                                దేవత "అమ్మ "

           
-----------------------------------------------------------
          కవిత  పేరు 
        శక్తి స్వరుాపిణి-   
             " అమ్మ".
         రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
             కల్యాణ్.
          (మహరాష్ట్ర ).
         8097622021.
-----------------------------------------

శక్తి స్వరుాపిణి అమ్మ.

అమ్మ
-------
తన రక్త మాంసాలను
నా ఆకార వికాశానికి ధారపోసి ,
తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
                               అమ్రుతమయి.  "అమ్మ "
భూమిపై పడిన క్షణంలో , 
నాలో. కదిలే భావాలకు నాందిగా
పలికే మొదటి పలుకు
అ..ఉవ్ ••వా..•లో ఇమిడిన.,
                                 ఓంకారధ్వని. " అమ్మ "
ఆకలి తో ఆక్రోశిస్తున్న నాకు..  
తనలో నున్న  రక్త స్రావాలను ,
క్షీర రసాలుగా. మార్చీ -
ఆకలి తీర్చిన కారుణ్య ఖని ,
                                      అన్నపూర్ణ. " అమ్మ " వచ్చీరాని నడకతో.
నిలదొక్కుకోలేని నాకు
చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన
                                     మార్గదర్శి. " అమ్మ " ,
నా  విజ్ఞాన వికాసానికై
తోడ్పడుతూ ,
నా భవితవ్యానికి
పూలబాట వేసిన -
                                      గురుమూర్తి అమ్మ".   అమ్మ మమకారానికి ,
మూర్ఖత్వాన్ని. జోడించీ -
చెడు సావాసాలకి బలియై ,
రోగాల పాల్పడిన నాకై
తన జీవితాన్ని పణంగా పెట్టిన ,
                                జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో  కూడా ,
తలకు కొరివి పెట్టిన పాపం
నాకు అంటరాదని ,  
నాచే గంగమ్మలో మూడు -
మునకలు వేయించీ ,
నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటు , గా తీసుకుపోతుా
శాంతిగా సాగిపోయే పవిత్ర -
                           క్షమా ధరిత్రి. " అమ్మ "
కారే కన్నీళ్ళతో ,
నాకళ్ళు మసకబారేయి.
.నా కష్టాలని  ఇష్ఠంగా పంచుకొని ,
నాకై "సమిధ " లా కరిగిపోయే
"అమ్మ" కు , కనీసపు
గుర్తింపు ఇవ్వని నేను ,
అమ్మ కోసం విలపిస్తున్నాను.
                                    " అమ్మా -----అంటూ
నన్నో ఒడ్డుకు చేర్చి
నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా -
న్నాశీర్వదించే -,
                                దేవత "అమ్మ "

           
-----------------------------------------------------------
          కవిత  పేరు 
        శక్తి స్వరుాపిణి-   
             " అమ్మ".
         రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
             కల్యాణ్.
          (మహరాష్ట్ర ).
         8097622021.
-----------------------------------------

స్త్రీ శక్తి.

స్త్రీ శక్తి.
----------

యత్ర నార్యంతు పుాజంతే
రమంతే తత్ర  దేవతా:
అంటే ఎక్కడ స్త్రీలు పుాజింపబడతారో...అక్కడ
దేవతలు  స్థిరమై ఉంటారు -
అని వక్కాణిస్తుా , స్త్రీ యొక్క
ప్రాముఖ్యతను తెల్పుతున్నాది
మన సనాతన ధర్మం.

అలనాటి కుంతి, గాంధారీల వంటి వారుకుాడా,
ధర్మం కోసం, తమ సంతానాన్ని పణంగా పెట్టినవారే.
సీతమ్మ చుాపిన  శాంతం , సహనశీలత్వం ,
సావిత్రి  , అనసుాయలు నెరపిన పాతివ్రత్యం..
ఇలా ఎందరో పుణ్య స్త్రీల చరితలతో , మన దేశప్రతిభ , ఘనత కెక్కింది.

సనాతన ధర్మానికి ముాల ప్రమాణమైన
వేదాన్ని మనం " వేద మాత " అని పిలుస్తాం.
అంతటి ప్రాముఖ్యత  స్త్రీ కి ఉంది ,  కనుకనే
మనం నవరాత్రుల లో అమ్మవారిని
తొమ్మిది రుాపాలుగా  తీర్చి దిద్ది ..
తొమ్మిది రోజులు భక్తి , గౌరవాలతో పుాజిస్తాం.

పురుషుని జీవితంలో సగభాగమైన స్త్రీ  ,
అర్ధనారీశ్వర తత్త్వంతో   రాజిల్లుతుా-
జన నీరాజనాలందుకుంటున్నాది.
మన చరిత్రలో ,దేశద్రోహులని అణచే ఝాన్సీలక్షీబాయి
వంటివారు , నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన
సరోజినీ నాయుడు వంటి వారు, ఇలా మీనన్ వంటి ప్రముఖ చిత్రకారుణుల వంటివారు , సాంకేతిక రంగాల్లో
ఆషామాధుర్ , జితేందర్ కౌర్ , యమునా క్రిష్ణన్ వంటివారు ...ఇలా ఎందరో మహిశా శక్తి నిరుాపణకు నిదర్శనీయ -స్ఫుార్తి దాయకులు.

ప్రస్తుత కాలంలో  పురుషునితో పాటు
సమాన హక్కులను పొందుతున్న మహిళ లు,
సునీతా విలియమ్స్ , సింధుా ,,
పి.టి ఉష , డయానా , సానియా మీర్జా , కరణం మల్లీశ్వరి , వంటి వారు ఎందరో కాక
ఎమ్ .ఎస్ సుబ్బ లక్ష్మి ,  వంటి ఎందరో స్త్రీలు ,సంగీత రంగంలోనుా  ,  శోభాడే , అరుంధతీ రాయ్ వంటి వారు సాహిత్య రంగంలోనుా కాక మరెందరో స్త్రీలు , చైతన్య ముార్తులు గా , పలు రంగాల్లో తమదైన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

రాజకీయరంగంలో స్త్రీలు తమ వంతుగా 50%  రిజర్వేషన్లు పొందేరు.రక్షకదళ చరిత్రలో మహిళలు , ఫైటర్  పైలెట్లుగా..ప్రసిధ్ధిగాంచేరు. సావిత్రీ బాయీ పటేల్ స్పుార్తి తో ఎందరో మహిళలు,  అత్యాచారాలను ఖండిస్తుా ఆహుతవుతున్నారు..

శాస్త్ర, సాంకేతిక  కళా రంగాలలోనే కాక ...
ఇంటా, బయటా, ప్రతీ చోటా  కుాడా , తమదైన
శక్తిని చాటుతుా ,  స్త్రీ ,ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిందనే చెప్పాలి.

కేంద్ర సమితివారు , మొాదీ అద్యక్షతలో
వెనుకబడిన స్త్రీ వికాశానికి, మహిళా రక్షక కేంద్రాలతో పాటు , బాల- బాలికల శిక్షణా కేంద్రాలు , బేటీ పడావో-
బేటీ- బచావో, వంటి యొాజనాలకు ,"అంబరెల్లా స్కీమ్" లు , మహిళా సురక్ష కోసం , "వన్ ష్టాప్ సెంటర్లుా..".ఏర్పాటు చేసేరు.

ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే,
రాబోయే కాలంలో స్త్రీలు విద్యా సంపన్నులై , పలు రంగాల్లో నిష్ణాతులై , అగ్ర పీఠాన్ని అధిరోహిస్తారన్న
మాటలో సందేహమే లేదు.

స్త్రీ శక్తిని గుర్తించండి. స్త్రీని గౌరవించండి. స్త్రీ ఒక
అమ్మగా, అక్కగా, చెల్లిగా ,ఆలిగా- నేకాదు ,దుష్టులని , అన్యాయాలని , రుాపు-మాపేందుకు , అంబగా కుాడా అవతారాలు ఎత్తగలిగే , శక్తి స్వరుాపిణి అని గ్రహించండి.

రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
----------------------

Wednesday, October 2, 2019

భలేవారు   ఓగన్న  గారూ  మీరు.మీరు అన్న మాటలో   తప్పేముందీ .నేను  బాధపడటానికి ...నేను  పంపినది  కూడా ,ఎవరూ
కొత్తగా సృష్టించి రాసినది ,కాదు .వేదాల్లో,అష్టాదశ  పురాణాల్లో  ఏనాటి  నుంచో  ఉన్నవే ...
హిందూ ధర్మ  చక్రం  అనే  వెబ్సైటు లో  ,మీరు
సూర్యభగవానుడి  కుటుంబము,వారి  పేర్లు  ఏమిటి  టైపు  చేస్తే  మెసేజ్  లో  వచ్చిన వచ్చిన పేర్లు  అన్నీ  వస్తాయ్..అలా  అన్ని  గ్రహాల పేర్లు
చూస్తుంటే వారి వారి  కుటుంబపు వివరాలన్నీ వస్తాయి .మనము నమ్మటం నమ్మకపోవడం  మన   వ్యక్తిగత  అభిప్రాయం ..అని తలుస్తాను నేను . అదే కాకుండా  ,మనం  చాలా  మంది నమ్మి భక్తితో  పూజించే గణపతి,బ్రహ్మ, విష్ణు ,శివుఁడు ..దేవుళ్ళు అందరూ ఇమాజినరీ   దేవుళ్ళే కదా ..అసలు దేవుళ్ళని  ఎవరూ చూడలేదు  కదా .దేవుడి గురించీ ,సృష్టి  గురించీ ,ఎందరో మహానుభావులు  అలోచించి,నేతి  , నేతి , అని వారి సిధ్ధాన్తాలని 
,కాదనుకున్నారు...
అసలు సాహిత్యపు  విషయాలు  ఒకటే  త్వం కి పంపాలి అని  అడ్మిన్  వాళ్లు  చెప్పినది  గట్టిగా పాటిస్తే  బాగుంటుంది
ఉంటాను  శెలవు
హిందూ ధర్మ  చక్రం  అనే  వెబ్సైటు లో  ,మీరు
సూర్యభగవానుడి  కుటుంబము,వారి  పేర్లు  ఏమిటి  టైపు  చేస్తే  మెసేజ్  లో  వచ్చిన వచ్చిన పేర్లు  అన్నీ  వస్తాయ్..అలా  అన్ని  గ్రహాల పేర్లు
చూస్తుంటే వారి వారి  కుటుంబపు వివరాలన్నీ వస్తాయి .మనము నమ్మటం నమ్మకపోవడం  మన   వ్యక్తిగత  అభిప్రాయం ..అని తలుస్తాను నేను . అదే కాకుండా  ,మనం  చాలా  మంది నమ్మి భక్తితో  పూజించే గణపతి,బ్రహ్మ, విష్ణు ,శివుఁడు ..దేవుళ్ళు అందరూ ఇమాజినరీ   దేవుళ్ళే కదా ..అసలు దేవుళ్ళని  ఎవరూ చూడలేదు  కదా .దేవుడి గురించీ ,సృష్టి  గురించీ ,ఎందరో మహానుభావులు  అలోచించి,నేతి  , నేతి , అని వారి సిధ్ధాన్తాలని 
,కాదనుకున్నారు...
అసలు సాహిత్యపు  విషయాలు  ఒకటే  త్వం కి పంపాలి అని  అడ్మిన్  వాళ్లు  చెప్పినది  గట్టిగా పాటిస్తే  బాగుంటుంది
ఉంటాను  శెలవు

Tuesday, October 1, 2019

శ్రీ శ్రీ...గురించి.

🙏🌹🙏

శ్రీశ్రీ హాస్యవల్లరి...(ఎత్తిపోతలపథకం)

                                               🙏🌹👇

“ శ్రీశ్రీ “ తో సరదాగా కాస్సేపు…….!!

శ్రీశ్రీ అనగానే అగ్గి సెగ తగులుతుంది.ఎర్రజెండా రెపరెపలు కనిపిస్తాయి. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం.. శ్రీశ్రీ అంటే మరో ప్రస్థానం.శ్రీశ్రీ అంటే విప్లవం... కానీ..నిజానికి శ్రీశ్రీ అందరూ అనుకునేం సీరియస్ పొయెట్ ఏం కాదు. అప్పుడప్పుడు ఆటవిడుపుగా హాస్యాన్ని జోడించి ‘లైట్’  కవిత్వం కూడా చెప్పాడు.
శ్రీశ్రీ'సిప్రాలి‘..అదేనండి..(సి )సిరి‌సిరిమువ్వలు,(ప్రా )ప్రాస క్రీడలు,(లి ) లిమరిక్కులు ఈ కోవలోకే వస్తాయి.

“కంద” మంటే ఎంతిష్టమో?

వచన కవిగా మనకు తెలిసిన శ్రీ శ్రీ ,కవిత్వారంభంలో పద్యాలు రాశాడన్న సంగతి కొద్దిమందికే తెలుసు.”ప్రభవ “ “స్వర్గదేవతలు “ చదివితే శ్రీశ్రీ పద్యరచన తెలుస్తుంది.అయితే వీటిలో శ్రీ శ్రీ కందపద్యాన్ని మాత్రం వదిలేశాడు.నిజానికి.కందపద్యం అంటే శ్రీ గారికి తెగఇష్టం! శ్రీవచన కవిత్వం రాయడం మొదలెట్టాక పద్యాన్ని దాదాపు మరిచిపోయాడు .
ఓ పదేళ్ళ తర్వాత ఎందుకో మళ్ళీ కందపద్యంపై మనసు మళ్ళింది.ఏమయ్యా శ్రీ శ్రీ మళ్ళీపద్యం ఎందుకు ముట్టుకున్నావ్? అంటే..”.కందాల అందాలకోసమే రాస్తున్నా “ అన్నాడు.

“మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రా?యుటిది ఎట్లన్నన్
పళ్ళూడిన ముసలిది ,కు
చ్చెళ్ళన్ సవరించినట్టు సిరిసిరి మువ్వ !”

శ్రీశ్రీ ఆరంభిస్తే ఊరుకుంటాడా ! “సిరి సిరి మువ్వ “ మకుటంతో ఓ శతకమే రాసేశాడు.

“అందంగా,మధురస ని
ష్యందంగా ,పఠితృహృదయ సంస్పందంగా
కందా లొక వంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరి సిరి మువ్వా!”.!!

ఇదేకాదు 1945..50 కాలంలో మరో రెండు శతకాలను కూడా రాశాడు.
శతకం,లిమరిక్కులు.వీటన్నిటిని కలిపి “సిప్రాలి “ గా నామకరణం చేశాడు.రుక్కుటేశ్వరశతకం,పంచపదుల్ని కూడా సిప్రాలి లో పొందుపరిచాడు.నిజానికి సిప్రాలి ఇండియాలోపుట్టలేదు.1981లో అమెరికాలో వుండగా రాశాడు.అమెరికాలోనే పది డాలర్లు ఖర్చుపెట్టి మిమియో గ్రాఫ్ మిషన్ మీద యాభై ప్రతుల్ని స్వదస్తూరీతో తీయించాడు.సిప్రాలి ఒక్కో కాపీ ఖరీదు పది డాలర్లు.అవన్నీ అప్పుడే,అక్కడేఅమ్ముడైపోయాయి.

శ్రీశ్రీసిరిసిరిమువ్వ,రుక్కుటేశ్వరశతకం,చాటువులు,మేమే గేయసంపుటి లోని గేయాలు కేవలంనవ్వించే వుద్దేశంతో రాసినవి.నిజంగా కూడా నవ్వుతెప్పిస్తాయి.”బూతాడక దొరకునవ్వు పుట్టదు” (బూతు చెప్పక పోతే దొరకు నవ్వు పుట్టదు ) అంటూ మన బూతు కవి చౌడప్ప నవ్వింఛడమే తన ఉద్దేశమన్నాడు.శ్రీశ్రీ కూడా కేవలం నవ్వించే ఉద్దేశంతోనే సిప్రాలికి జన్మనిచ్చాడు.

శ్రీశ్రీ హాస్య రసం….!!

“ఎప్పుడు పడితే అప్పుడు
  కప్పెడు కాఫీ వొసంగ గలిగిన సుజనుల్
  చొప్పడిన యూరనుండుము
  చొప్పడకున్నట్టి యూరు చొలకుము మువ్వా “.

సుమతీ శతకంలోని పద్యానికి పద్యానికి పేరడీగా రాశాడీ పద్యాన్ని.

“వైవాహిక జీవితములు
దావాలకు దారితీసి తగలడిపోతే
కేవలము పెళ్ళి మాని ఖు
షీ వాలా లగుట మేలు ,సిరి సిరి మువ్వా! “

పెళ్ళి చేసుకొని,వాదులాడుకొని,విడిపోడానికి కోర్టులెక్కే బదులు ,పెళ్ళి మాని ఖుషీవాలాలు కావడమే మేలంటున్నాడు శ్రీశ్రీ.(శ్రీ శ్రీ గారికి రెండు పెళ్ళిళ్ళు.అది వేరే సంగతి )

“మీసాలకు రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే
సీసా లేబిల్ మార్చే
స్తే ,సారా బ్రాందీ యగునె ,సిరి సిరి మువ్వా !”

మీసాలకు,జుత్తుకు రంగేసుకుంటే తెలుపు దాగుతుందేమో గానీ,వయసు దాగదు కదా! ఉడికిపోయిన యవ్వనం తిరిగి వస్తుందా!సారా సీసాకు లేబిల్ మారిస్తే..సారా బ్రాందీ కాదు కదా అంటున్నాడు మన శ్రీ శ్రీ గారు (స్వీయానుభవం మరి )

“పనిలేని యట్టి మంగలి
యనుకొని మార్జాల శీర్షమును గొరిగెడు తీ
రున రాస్తానేదో ,రా
సిన దానికి కోపమేల ? సిరిసిరిమువ్వా !”

పనిలేని మంగలి పిల్లి తలగొరిగినట్లు ఏదో రాస్తాను.మీరు మాత్రం కోప్పడకండేం? అంటూముందుగానే సంజాయిషీ ఇచ్చుకుంటున్నడు శ్రీశ్రీ.కాబట్టి రాసిందాంట్లో తప్పులు వెదికేకన్నా. పనికొచ్చేదేమైనా వుంటే తీసుకోవడమే‌మేలన్నది కవి భావం.

రాసక్రీడ..శృంగారానికి, ప్రాసక్రీడ హాస్యానికంటూ ..”.ప్రాసల” తో ఎలా చెడుగుడు ఆడాడో?హాస్యం ఎలా పండించాడో చూడండి.

*”ప్రజాస్వామికం పేరిట
  పదవులకై పోటీ
  పరిపాలన చేసేదిక
  పోలీసుల లాటీ “...!!

ఎన్ని ప్రభుత్వాలు మారినా..నాయకులకు పదవుల ఆరాటమే తప్ప పరిపాలనపై దృష్టే వుండదు .పాలించేది,పరిపాలించేదీ పోలీసుల లాఠీలే ..మన  రాజకీయంపై శ్రీ శ్రీ చెంపదెబ్బ ఇది.

“వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు
వారి వారి సొంతం
పబ్లిక్కులో నిలబడితే
ఏమైనా అంటాం..”

తెలుగునాట బాగా పాపులర్ అయిన శ్రీ శ్రీ మాట ఇది.

*”ఉన్న మాటంటేనే
   ఉలికిపాటు పడాలా?
   యథార్థాన్ని వాదించే
   బంధువునే విడాలా?

యథార్థవాదీ లోక విరోధీ..అన్న సామెతకు శ్రీశ్రీ ప్రాస రూపం ఇది.ఉన్నమాటంటే ఉలిక్కిపడుతుంది లోకం.యథార్థాన్ని చెబితే ముఖం తిప్పే రోజులివి.!.

“లాటీలకు లోటుండదు
జైళ్ళలో చోటుండదు
రాబోయే ఎన్నికలలో
రౌడీలకు ఓటుండదు “...!!

శ్రీశ్రీ నాటి పరిస్థితుల్లో ఇలా రాశాడు గానీ..ఇప్పుడు వుండి వుంటే….“రాబోయే ఎన్నికలలో రౌడీలకే ఓటుండును “ అని రాసి వుండేవాడు.
అయితే ఈ కింది ప్రాస పద్యాన్ని మాత్రం సరిగ్గా రాశాడు.

“ పోలీసుల రాజ్యమిది
‌ పోలింగొక బూటకం
  ఫాసిజమై మారుతోంది
  ప్రజాస్వామ్య నాటకం “

ఇప్పటి పరిస్థితులకు చక్కగా అతికే పద్యమిది.

“పిట్టపోరు పిట్టపోరు
పిల్లి తీర్చినట్టుగా
రెడ్డి తగవు కమ్మ తగ్టవు
రెడ్సు తీర్త్రు గుట్టుగా “...

వర్త మాన రాజకీయాల్లో నిజానికి జరిగింది మాత్రం ఇది కాదు.రెడ్స్...అంటే కమ్యూనిస్టులు కొంతకాలం రెడ్లతో (కాంగ్రెస్ )మరికొంత కాలం కమ్మవారితో (తెలుగుదేశం  )పొత్తుల పేరుతోభుజంళభుజం కలిపి ఊరేగారు.ఫలితంగా రెడ్లు,కమ్మలు మిగిలారు.రెడ్స్ ..ఉనికే గల్లంతైంది.

*పంచపదుల్లోనూ “ప్రాసే “..!!

“అరవ్వాడి దోసై
మీద తోచింది వ్రాశై
ఏవో విట్లు వేశై
ఏవో ఫీట్లు చేశై
తర్వాత చూసుకుందాం ప్రాశై..!!”

ఈ దంపతులగురించి పంచపది ‘లో ఎలా  పంచ్ ‘ వేశాడో చూడండి.

“ అతగాడి పేరు గురాచారి
  అతనో పెద్ద దురాచారి
  అతని దెప్పుడూ మరో దారి
  అతని కంటే భార్య కొద్దిగా అనాకారి
  అతని పాలిట కావిడ మహామారి “!!

*లిమరుక్కలు….!!

అమెరికా స్నేహం గుబాళించే ఈ రోజులను శ్రీశ్రీ ఆనాడే ఊహించాడేమో?అమెరికా ముష్టి ఎంత నష్టమో? ఈ లిమరిక్కులో ఎంత చక్కగా చెప్పాడో చూడండి.!!

*”పెరిగితే వ్యాపార దృష్టి
  మరిగితే లాభాల సృష్టి
  దొరికితే అమెరికా ముష్టి
  మిగిలేది విగ్రహ పుష్టి
  నైవేద్య నష్టి!!

నాటి జనసంఘ్ గురించి ఎలా చెప్పాడో చూడండి.

*”జనసంఘం
  మారణ సంఘం
  ప్రతారణ సంఘం
  విచారణ సంఘం
  కలహ కారణ సంఘం
 
*”జనసంఘం
   హరేరాంభజన సంఘం
   అశక్త దుర్జన సంఘం
   అపకీర్తి సమార్జన సంఘం
   అమేధ్య భోజన సంఘం “..

ఈ జనసంఘే కాలగతిలో భారతీయ జనతాపార్టీగా మారింది.

సినారె మీద విసిరిన చమక్కు చూడండి.!!

*”సినారె
   బళారె
అన్నిట్లో హుషారె
   సినిమా రె
డీమేడ్ సరుక్కీ తయారె !!

ఇక విశ్వనాథ సత్యనారాయణ గారినైతే ఎలా ఉతికి ఆరేశాడో చూడండి!!

*”వెయ్యి పడగలు
   లక్ష పిడకలు
   లక్క పిడతలు
   కాగితపు పడవలు
   చాదస్తపు గొడవలు “!!

వెయ్యిపడగలు ఓ సుదీర్ఘ నవల.దీనికే విశ్వనాథవారికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.ఇక తనపై తానే జోకు వేసుకున్నాడంటే శ్రీ శ్రీ ఎంత హాస్యచతురుడో అర్థం చేసుకోవచ్చు.

*”శ్రీశ్రీ ఒక చెత్త కవి
   వాడి వల్లనే దేశం ముక్కలవుతోంది.”

నిజానికిది నాటి ముఖ్యమంత్రి వెంగళరావు గురించి చెబుతూ ,
“వెంగళరావొక జాతీయనాయకుడు..ఆయన వల్లనే తెలుగు వాడుఏకమైందంటూ...పొడిగింపుగా తన గురించి చెప్పుకున్నాడు.వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నపుడు ఎందరో కవులు జైలుపాలయ్యారు .ఎమర్జన్సీ సిఎం గా ఆయనకు చెడ్డపేరొచ్చింది.దానివల్లతెలుగు వాళ్ళంతా ఏకమై పోరాడారన్నది శ్రీశ్రీ భావం.ఇక శ్రీశ్రీ లాంటిచెత్త కవులవల్ల దేశం ముక్కలవుతోందన్నది నాటి రాజ్యం అభియోగం.అందుకే నాడు జైళ్ళు నోళ్ళు తెరిచాయి.ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని ప్రశ్నించిన ప్రజాస్వామ్య వాదులు,కవులు,రచయితలు కటకటాలపాలయ్యారు.

ఏమైతేనేమి? థోడా ఖట్ఠా..థోడా మిట్ఠా.వెరసి శ్రీశ్రీ హాస్యవల్లరి పాఠకలోకంలో అల్లరి చేసింది!!

                                      🙏🙏🙏🙏🙏