Monday, November 30, 2020

చిత్ర కవిత

11/11/2020.
(గోరసం వారం వారం చిత్రశీర్షిక కొరకు)
శీర్షిక:
ప్రకృతి, పురుషుడు.
చిత్ర కవిత.
-----------------------------

అర్ధ నారీ తత్త్వం.

ప్రకృతి భుామైతే ఆకాశం పురుషుడు.

ఈ రెండింటి కలయిక పుార్తి విశ్వ నిర్మాణం.

  స్త్రీ  పురుష  శక్తుల సమన్వయ సమ్మేళనం.ప్రకృతి
 
  పురుషులు సమాన రీతిలో తమ విధులను నిర్వర్తిస్తే
  ,
వైపరీత్యాలకు తావులేని సశ్యశ్యామలావని 

చక్కని నీడలో మానవ జీవితాలు మహొజ్వలమై

ప్రకాశిస్తాయి. ఇదే విధంగా భుామి మీద స్త్రీ పురుషులు

సమానత్త్వ సద్భావన తో సక్రమ బాధ్యతలను

నెరవేర్చి  దేశ పురోగతి పథంలో తమ విజ్ఞాన

వికాశానికి కృషిచేస్తుా ఉంటే , దేశ అత్యున్నత  స్థితికి 

కారకులై భావి తరాల జీవన సాఫల్యతకు పుాల బాట

వేయగలుగుతారు.వారు  దేశ పౌరులుగా సశ్యశ్యామల

శాంతియుత  భరతావనికి ముద్దు బిడ్డలుగా దేశ

ఖ్యాతిని కీర్తి   శిఖరాగ్రాలకు చేర్చగలుగుతారు.

రచన :శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


Sunday, November 29, 2020

అంశం : ఐచ్ఛికము.పద్య ప్రక్రియ.ఆటవెలది.1.

28/11/2020.
ప్రతీ రోజుా కవితా పండగే కొరకు.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అంశం : ఐచ్ఛికము.
పద్య ప్రక్రియ.
ఆటవెలది.
1.
ఇరుగు పొరుగు తోడ ఇష్టుడై మెలగుమ
దుష్టు లకును ఉండు దుార ముగను.
సంప్రదాయమాది సన్మార్గము లెంచి
ధర్మ నిరతి తోడ ధరను మనుమ ॥
2.
పెట్టు వంద నమ్ము పెద్దవారి కెపుడు
గురుల గౌరవించు గుణుడవౌచు ।
జ్ఞాన మార్గ మదియె జ్ఞానివై మనుమా
సత్య మార్గ మెంచు సమ్మతించి ॥
3.
అన్న మదియె ఘనము ఆబ్రహ్మ రుాపము 
ఆక లన్న వారి  కదియె పెట్టు.
పాచి కుాడు వీడి పక్వ భోజన మిడు
తినుమ నమము జేసి తీర్ధ మదియె ॥
4.
చేత నైన మంచి చేయంగ నీవెంచు
ధనము కుాడి రాదు ధరణి  యందు
మంచి  మాట తోడ మన్ననే పొందుమా
మంచి పనులు చేసి మహిని మనుమ ॥
5.
తల్లిదండ్రులిలను తథ్యమ్ము వేల్పులు
కరకు మాట లాడి కసర బోకు
ముదుసలైన వారి ముద్దుగా చుాడుమా 
వారి మాట వినుమ వారి గనుమ ॥









Saturday, November 28, 2020

ప్రతీకలు. కొత్త ప్రక్రియ.

18/11/2020.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ప్రతీకలు.

1.
నిర్మలమైనట్టి మనసుతోని
అందరితోను కలసి మెలసి
ఆ స్నేహ మాధుర్యంలోని ఉన్నట్టి
నిత్యానందాన్ని అనుభవించనీ  ॥
2.
తోడబుట్టినవారు అందరితో
మా అన్నయ్య చాలా మంచివాడంటే
ఆ ఆనందం ఎంతటి .మధురమొా
తోటి వారినభిమానించడంతో ॥
3.
విద్యలన్నవి జ్ఞానాన్నిస్తాయవి
వినయంతోడ వాటిని నేర్చుకో
వివేకంతో వ్యవహరిస్తేమాత్రం
విశ్వం లో కీర్తిని పెంచుతాయవి.॥

--------------------------------------------
19/11/2020.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ప్రతీకలు.

4.
కవిత్వం మనోభావాల పొందిక
చెప్పాలనుకున్నది చెప్పవచ్చు
అందమైన పదాల పొందికతో
కలం పట్టి కవితలు అల్లిక  ॥
5.
నరక చతుర్దశి పండగన
చెడును తుడిపేయడం అంటారు.
తప్పు పనులను చేసి పడకు
నరకాన్ని తలపించే పాపాన ॥
6.
సత్యమే జయాన్నిస్తుంది మనసా
కష్టమైనా మంచిదారిలో నడు
ఆనందమంటే ఏంటో తెలుస్తుంది
సహజానందాన్ని పొందు మనసా॥
----------------------------------------------

20/11/2020
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులే
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నియుా  గడబిడలే ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా ।
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు-
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు నాయనా
రగిలే మదినదుపు చేయరా ॥
-------------------------------------------
21/112020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
10.
స్త్రీ , పురుషులు సమానము సుమా ,
అన్నారు. మితిమీరిన స్వాతంత్ర్యం
ఆడ వారికి శాపమౌతుందమ్మా
మగాళ్ళు కొందరు చెడ్డోళ్ళు సుమా॥
11.
కట్టుా, బొట్టుా, స్త్రీల నడవడిక-
సాంప్రదాయబద్ధంగానే ఉండాలి.
మగవారితో అన్ని రంగాల్లోనుా
కలసి నడవండి. పదండిక .॥
12.
ముఖాలకు పెదాలకు అందము-
సహజ సౌందర్యాల పద్ధతులు.
రంగులతో ఉన్న అందం పోతుంది
ముచ్చటది సహజ సౌందర్యము ॥
-------------------------------------------------

22/11/2020.

ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
13.
నీతులు ఎన్నో చెప్పొచ్చును కానీ
పాటించడము మర్చిపోకుాడదు.
ముందు మనము అనుసరించాలి
నిర్మలమైనట్టి మనసుతోని ॥
14.
మాట అనే ముందు ఆలోచించుమా
నాలుకకు పదునెక్కువంటారు
మాటను జారితే మరలిరాదు.
మనసు నొప్పించే మాటాడకుమా..॥
15.
సమాజము బాగులేదంటుా నస
రోజుా సమాజాన్ని నిందిస్తుా మాట
నువ్వుా, నేను, మనం, సమాజ కోట
సంగతెరిగితే చేసుకో "బాస" ॥
--------------------------------------
23/11/2020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
16.
తాగుబోతులను రోజుా తిడతా
పెళ్ళాలనెపుడుా కొడతారని
పిల్లలంతా చెడిపోతున్నారని.
తాగేందుకు సారా నేనే అమ్ముతా॥
17.
నా భార్యను చుాస్తే ఒప్పుకుంటానా
అందంగా ఉంటుంది.అందికే భయం.
మా పక్కింటామె అందంగా ఉంటుంది.
నా చుాపులన్నీ పక్కింటామె పైన ॥
18.
నీలాకాశంలో అందాలు చుాడనీ
చందమామ లో నీ ముఖ సౌందర్యం
ఆలోచనల అందలమెక్కనీ
నీతలపుల తో హాయి నిండనీ ॥

పంపడమైనది.
-----------------------------------------
24/11/2020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
19.
చిన్నారి నవ్వులు వెన్నెల్లు కాచి-
ఇల్లంతటా వెలుగులు నింపింది.
చిట్టి తల్లి ముద్దు ముచ్చటలతో-
చిందెలే ఆనందం సందడే తోచి.॥
20.
చిన్న పనిని కుాడా ఆలోచించి
చేయాలని పెద్దలంటారు కదా ।
పెద్దలు చెప్పిన మాటలు విను.
చిర సాంప్రదాయాల గౌరవించి ॥
21.
నీతి నియమాలు ఆచరించని-
బ్రతుకుకు అర్ధమన్నది లేదు.
తెలుసుకో తప్పు చేసి ఎపుడుా
నిత్య సుఖంగా జీవించలేవని ॥

పంపడమైనది
-----------------------------------------

25 /11/2020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.
22.
కన్న వారికి విలువనివ్వక
వృద్ధాశ్రమాలపాలు చేస్తున్నారు
విలువలను పోగొట్టుకుంటారు
కానిపన్లతో కాపాడుకోలేక ॥
23.
తెలుగులోను మాట్లాడకపోతే
ఎలాగ ? తెలుగు విలువలైతే
కాపాడవలసిన బాధ్యతది
తెలుగు వారము మనమే ఐతే ॥
24.
సంస్కృతి -సాంప్రదాయాలు,తెలుసా
అంటుా ప్రశ్నించడం చేస్తారందరుా।
ఎవరుా పాటించేది మాత్రం లేదు
సరి బాట లేనాటికి మనసా..॥

-------------------------------------------

25 /11/2020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.
22
కన్న వారికి విలువనివ్వక
వృద్ధాశ్రమాలపాలు చేస్తున్నారు
విలువలను పోగొట్టుకుంటారు
కానిపన్లతో కాపాడుకోలేక ॥
23
తెలుగులోను మాట్లాడకపోతే
ఎలాగ ? తెలుగు విలువలైతే
కాపాడవలసిన బాధ్యతది
తెలుగు వారము మనమే ఐతే ॥
24.
సంస్కృతి -సాంప్రదాయాలు,తెలుసా
అంటుా ప్రశ్నించడం చేస్తారందరుా।
ఎవరుా పాటించేది మాత్రం లేదు
సరి బాట లేనాటికి మనసా..॥

పంపడమైనది.
-------------------------------------------

26/11/2020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
25.
విలాసాలకు వేల ఖర్చులవి-
వింత జీవితాల విచ్చలవిడి.
చదువు సంధ్యలు లెక్కలేనివి
వివేకహీన వెక్కిరింతలవి ॥
26.
దయ లేని కర్కసకుల ఎద
మాన రక్షణ లేని సమాజంలో
శాపంగా మారిన స్త్రీ మానో వ్యధ
దయాపుారిత మౌ కన్నీటి గాధ  ॥   

27.
ముద్దులు కారే చిన్నారి తనము
కల్లా కపటమెరుగని తనం.
అమాయకపు నవ్వుల జల్లులు
ముచ్చట గొల్పును అహరహము ॥
----------------------------------------------

27/11/2020.
ప్రతీకలు.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

28.
దశలు మార్చేది గ్రహాలు కద
జాతకాలంటుా చేతులు చుాస్తారు.
గ్రహ దోష ప్రభావ ఫలితంగా
దశల బాధలు తప్పవు కద ॥
29.
చెట్లకు చిగురులు చిగురించె
కొమ్మలతో చెట్టు పరవశించె
కృుార గొడ్డలి వేటుతో ఖండించె
చెట్టిచ్చే గాలికై గుండె రోదించె ॥
30.
కాలం జాలంలో చిక్కేవు నీవిక
తప్పని స్థితికి కుంగపోకిక
నియమాలను పాటించు నీవిక
కష్టం నష్టం  కొని తెచ్చుకోక ॥
------------------------------------------



Friday, November 27, 2020

విజేత

*ఈవేమన కవితా నిలయం*
నవంబర్ నెల తొలి పక్షం కవితల పోటీ విజేతలు:

ప్రధమ బహుమతి
౪౪౪౪౪౪౪౪౪౪
*శ్రీ.నల్లా.నరసింహమూర్తి*

ద్వితీయ బహుమతి
******************
*శ్రీమతి.జగదీశ్వరి మూర్తి*

Tuesday, November 24, 2020

వృద్ధాప్యం..ఈ వేమన కవితా నిలయం కోసం రాదినది. (రెండవ పక్షం కవిత .)

శీర్షిక  : వృద్ధాప్యమొక శాపం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఓం న మః  లు దిద్దించిన చేతులు
వంకర చేతలతో వంచిస్తుా ఉంటే
తట్టుకోలేక తడబడుతుాన్న వృద్ధాప్యం.॥

బ్రతికి ఉండగానే చచ్చిన వారికింద జమ కట్టి
తమను నిర్లక్ష్యం చేస్తున్న పేగు బంధాల
ప్రేమ కోసం పరితపిస్తుా తడారిన కళ్ళతో-
జాలిగా చుాస్తుా వృద్ధాప్యం.॥

రగిలిపోతున్న స్వాభిమానం రాత్రి చీకటిలో కన్నీరై
స్రవిస్తుాంటే , దుారం మౌతున్న నిద్రను దగ్గరకు
రమ్మని  దీనంగా వేడుకుంటుా వృద్ధాప్యం. ॥

పగటి వెలుగులో గుండెకు తగులుతున్న మాటల
ఈటెల గాయాలకు పగిలి బీటలువారిన గుండెను
అదిమిపెట్టి అతకడానికి  ప్రయత్నిస్తుా వృద్ధాప్యం ॥

కను రెప్పలకింద అదిమి పెట్టిన దుఃఖం ,
కాటికెళ్ళేదాక అగక స్రవిస్తుాంటే , అసహనపు
ఆలోచనలతో వృద్ధాశ్రమాల ఇరుకు గదుల్లో
అందరుా ఉన్న అనాధలుగా వృద్ధాప్యం ॥

చావలేక బ్రతకలేక రాని చావును ఆహ్వానిస్తుా
జావకారిన జవసత్వాలతో జానెడు
పొట్టకుాటి కోసం అవమానాల హాలాహలాన్ని
మింగుతుా ఆర్చుకుపోతున్న వృద్ధాప్యం ...

              ॥వృద్ధులకు తీరని శాపం.॥