Sunday, July 11, 2021

ప్రపంచ జనాభా నియంత్రణ సున్నితాలు

గొరసం వారు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కవితల పోటీ
అంశం: ప్రపంచ జనాభా పెరుగుదల - నష్టాలు
శీర్షిక:  జన నియంత్రణ నిశ్ఛయం .
ప్రక్రియ: సున్నితం


41.
రోజురోజుకుా పెరిగే జనబాహుళ్యం
ఇక్కట్ల బాటలో ప్రగతిరధం.
కేంద్ర ప్రణాళికలకు అవరోధం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు॥
42.
జనభారంతో తరుగుతున్న భుాభాగం.
వనసంపదలు కరువౌతున్న  దుర్భాగ్యం
ప్రదుాషణ వైపరీత్యాలతో ప్రకృతి.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు॥
43.
ఆహార వనరులు అంతంతమాత్రం.
నియంత్రణలేని జనుల పోరాటం.
ఆకలి చావులు అనునిత్యం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు॥
44..
కాలుష్యంతో పొడిబారిన మేఘం..
కురవని  చినుకుకై  జనారాటం.
తడిలేనిమట్టితో రైతన్నల పోరాటం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు॥
45.
మందులేని మహమ్మారుల వీరవిహారం.
ప్రాణవాయువు కరువైన శాపం
అవగాహనలేని ఆచరణల లోపం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు॥


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


హామీ : 
ఈ రచన నా సొంతమని దేనికీ అనువాదం అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను.

Saturday, July 10, 2021

మధురగతి రగడ

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

మధురగతి రగడ
లక్షణములు:
1.జాతి(రగడలు) రకానికి చెందినది
2.రెండు పాదములు ఉండును.
3.ప్రతి పాదంలో నాలుగు చతుర్మాత్రా గణాలు(గగ-నల-భ-స) 4+4+4+4 గా ఉంటాయి.
4.ప్రాస నియమం కలదు
5. అంత్య ప్రాస నియమం కలదు
6.ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు:
UII      U I I        UI I        U I I 
శ్రీవని తాధిపుఁ   జేరిభ   జింపుఁడు
U I I      I I I I     U I I      U I I
భావజ  జనకుని  భక్తిద   లంపుఁడు



*ప్రధాన కార్యనిర్వాహకులు*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
గ గ      న ల     భ        స  
U U       IIII      UII    IIU

చిట్టి పొట్టి పాపలు ..బాల గేయం

అంశం : బాల సాహిత్యం.

 శీర్షిక : చిట్టి పొట్టి పాపలుా 

చిట్టి పొట్టి పాపలుా 
చిన్నారి పాపలుా
నాతోడు జతకుాడండి
నా మాట విన రారండీ
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

అన్నెం పున్నెం ఎరుగరు మీరు 
సీతాకోక చిలుకలుా
అమ్మానాన్నిల కొలువులుా 
గురులే దైవ స్వరుాపులుా
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

జగమంతా ఎరగాలంటే 
చదవాలండీ చదువులుా 
ఎదిగినకొద్దీ తెలియాలండీ 
మనసుా మమతల విలువలుా.
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

సత్యం ధర్మం నీ బాటైతే 
జీవితమే సుమ గంధముా
స్నేహం,బంధం నిలిపావంటే  
బ్రతుకే ఔను సర్గముా
॥చిట్టి పొట్టి పాపలుా ॥

కలిమి-లేములు కష్ట-సుఖాలు  
మొాసే కావడి కుండలుా
కలిసి మెలసి ఉంటే పెరుగును
ప్రేమను పంచే బంధాలుా 
॥చిట్టి పొట్టి పాపలుా ॥

దేశంకోసం త్యాగం చేసే 
వీరులబాటను ఎంచుకో
దేశ ప్రగతికై నీవో సమిధై
ఇలలో కీర్తిని నింపుకో 
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

హామీ: ఈ బాల గేయం ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన. 


శీర్షిక : చిట్టి పొట్టి పాపలుా .
 (బాల గేయం ).

చిట్టి పొట్టి పాపలుా 
చిన్నారి పాపలుా
నాతోడు జతకుాడండి
నా మాట విన రారండీ
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

అన్నెం పున్నెం ఎరుగరు మీరు 
సీతాకోక చిలుకలుా
అమ్మానాన్నలె కొలువులిలా 
గురులే దైవ స్వరుాపులుా
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

జగమంతా ఎరగాలంటే 
చదవాలండీ చదువులుా 
ఎదిగినకొద్దీ తెలియాలండీ 
మనసుా మమతల విలువలుా.
॥చిట్టి పొట్టి పాపలుా॥ 

సత్యం ధర్మం మీ బాటైతే 
జీవితమే సుమ గంధముా
స్నేహం,బంధం నిలిపారంటే  
బ్రతుకే ఔను సర్గముా
॥చిట్టి పొట్టి పాపలుా ॥

కలిమి-లేములు కష్ట-సుఖాలు  
మొాసే కావడి కుండలుా
కలిసి మెలసి ఉంటే పెరుగును
ప్రేమను పంచే బంధాలుా 
॥చిట్టి పొట్టి పాపలుా ॥

దేశంకోసం త్యాగం చేసే 
వీరులబాటను సాగండీ
దేశ ప్రగతికై మీరో సమిధై
ఇలలో కీర్తిని పొదండీ 
॥ చిట్టి పొట్టి పాపలుా ॥

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


 

Friday, July 9, 2021

అంశం: ప్రపంచ జనాభా పెరుగుదల - నష్టాలు

అంశం: ప్రపంచ జనాభా పెరుగుదల - నష్టాలు

  శీర్షిక: ఓ మనిషీ ! మేలుకో.!

 కవిత :
  
క్లిష్ట మైన దేశ పరిస్థితి. కష్టమైన  మనిషి జీవన స్థితి. పెరుగుతున్న జనాభా వల్ల నిండుతున్న స్థలాలు.
కరువౌతున్న వనరులు. బరువౌతున్న బతుకులు.
.తరుగే పచ్చదనం. కరువౌతున్న ప్రాణవాయువు
పెరిగిన జన కాలుష్యం .వన జీవుల స్వైర విహారం.
కరువౌతున్న వర్షపాతం వల్ల పొడిబారిన భుామి .
తడి లేని మట్టిలో సారహీన మడులు
ఎండిపోయిన నదీనదాలు .కొరత బడిన నీరు.
నిరక్షరాస్యత నిండిన భవిత.ఉద్యోగాలు లేని యువత
సంపాదన లేని సంసారాల్లో బరువైన రోగాలు.
నిండుతున్న ఆసుపత్రుల్లో కరువైన వైద్యులు
బరువైన వైద్యం కాటికి పోతున్న  ప్రాణాలు.
అంటు రోగాలు , అనారోగ్యాలతో
అట్టుడికి పోతున్న జనాలు. ఆకలి చావులు.
 ప్రణాళిక లేని జనాలకు అందించలేని పథకాలు
జనాభాలెక్కల జోరుతో కేంద్ర పాలనా వైఫల్యత
 వీటన్నటి కారణం, జనాభా పెరుగుదల.
 ప్రభుత్వ సంక్షేమ పథకాల రుాప కల్పన--
 వెనుక బడిన వర్గాల వారికై ప్రత్యేక ప్రణాళికలు,
 అమలు పరచే విధానాలకు, జనాభా లెక్కల ప్రాముఖ్యతను అందరుా అవగాహన చేసుకొని
 జనాభా నియంత్రణకు సహకరించాలి.
 అప్పుడే మన దేశ పరిస్థితి మెరుగై ముచ్చటైన
 రీతిలో మనం ముందడుగు వేయగలం.

 
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

అమ్మ పాట

వారం వారం కవిత లో
అంశం: అమ్మ.
శీర్షిక : త్యాగశీలి అమ్మ.

పల్లవి:
అనురాగం అభిమానం నిండిన కొమ్మా 
ఇల వెలసిన దేవత గద అమే అమ్మా..॥

అను పల్లవి:
కనరాని శాంతమే  కొరత లేని సహనమే
ఆ రెండుా కలిసిన  ఒక త్యాగముార్తి అమ్మా ॥

చరణం.
ఒడి బడిగా చేసి , ప్రేమ పలుకు పంచి పెంచి
తొలి అడుగుల నిలకడకే  ఆధారమె అమ్మా
మన భవితే తన బ్రతుకని 
మన ఘనతే తన సుఖమని
తలచి తలచి మురిసేటీ అనురాగమె  అమ్మా ॥.

చరణం: 
తల్లిపాల అమృతమే మన జీవము సుమ్మీ
తల్లి కష్టమే, పెరిగే మన కాయము తమ్మీ
తను తిన్నా లేకున్నా కడుపు నింపు మనకన్నా
కలిమిలోన లేమిలోన  మన బలమే కద అమ్మా ॥

చరణం: 
పనులెన్ని చేసినా , తనువెంత అలసినా 
సుఖము కోరి సేదతీర తలవదామె అమ్మా..
తన వారి సౌఖ్యమే తన జీవితమని తలచి 
తన కోస మొక క్షణం  కోరదామె  అమ్మా  ॥

చరణం: 
జవసత్వాలుడిగి వృద్ధాప్యమె చుట్టుముట్ట
కన్న పేగు చేయు తప్పు కాచు న్యాయమమ్మా
అవమానం చేసినా ఆశ్రమాల తోసినా 
కన్న బిడ్డ సుఖము కోరి దీవించేదమ్మా ॥

 ఈ పాట ఏ మధ్యమునందునుా ప్రచురితం కాని 
 నా స్వీయ రచన.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.