Friday, July 9, 2021

న్యస్తాక్షరి... ద ది దు దె.

వాగ్దేవిలో  
09/07/2021
వాగ్దేవిలో  
09/07/2021
న్యస్తాక్షరి... 
ద ది దు దె.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ : ఆట వెలది.

దనుజ సంహా రమ్ము  ధర్మమ్ము  తోజేసె
దివ్య తేజు డైన  దాశ రధుడు
దుష్ట రక్క సులను దునుమ భువినిజని 
దెలియ జేసె రాజ  ధర్మ  నిరతి ॥

వే(ద )విధుల దెలియు వెలలేని చెలికాడు
వీ (ధి) కయ్య ములవె వింద తనికి.
వా(దు) లాడు వారి  వరుసగుా డెడువాడు..
(దె )బ్బ లాట ప్రియుడు తెలియ ఘనుడు॥

వా(ద) మేల టంచు  వాదులా టలుపెంచు
వి(ధి)గ కలహ మెంచు వీణ ధరుడు
కాదు కాదటంచు కలహమ్ము లేపెంచు
అం(దె) వేసి నట్టి ఆట గాడు॥

నా(ద)  బ్రహ్మ అతడు నారదుం డతడేను
ఆ (ది)కలహ భోజు డతడి పేరు.
(దు)య్య బెట్టు నతడు దురాలో చనలున్న
(దె)ల్పు సత్య మతడు తెలిసి నింద ॥

Thursday, July 8, 2021

G k.

[7/8, 11:46] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🌺 సాహిత్య విజ్ఞానం🌻
ఎపిసోడ్11
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
తేదీ 8/7/2021 గురువారం ప్రశ్నలు
1 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు?
జవాబు 
2 అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్న కవి ఎవరు?
జవాబు;
3 వట్టికోట వారి గొప్ప రాజకీయ నవల ఏది?
జవాబు;
4 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎం ఏ తెలుగు చేసిన కవి ఎవరు?
జవాబు;
5 తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో లో పీవీ నరసింహారావు రాసిన కథ పేరేమిటి?

జవాబు;
*********************************
గ్రూప్ లోని ప్రశ్నలు ప్రతి రోజు పన్నెండు గంటలకు ఇవ్వబడును రచయితలు అందరూ రెండు గంటల్లో జవాబులు క్రింద మీ పేరు రాసి పెట్టగలరు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌻🌻🌻🥎
[7/8, 15:30] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
ఈరోజు ప్రశ్నలకు జవాబులు
1 జవాబు సురవరం ప్రతాపరెడ్డి
2 జవాబు కాళోజీ నారాయణరావు
3 జవాబు ప్రజల మనిషి
4 జవాబు పల్లా దుర్గయ్య
5 జవాబు గొల్ల రామవ్వ
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🌷🌷🌷🌷

పదండి ముందుకు

సంస్కృతి పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో
"ప్రేమికుల దినోత్సవ వ్యతిరేక రచన కవితల పోటీ"

శీర్షిక : పదండి ముందుకు ...

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

 దేశ పురోగతి పేరుతో  పల్లె వాతావరణం , పచ్చదనం
 తరిగిపోయింది. 
దేశ అభ్యున్నతి  అంటుా ,  టెక్నాలజీ పేరుతో ,రోజు రోజుకుా వెలువడుతున్న దుారదర్సన్,  మొబైల్ వంటి పరికరాల లో అసభ్య సన్నివేశాలు , సమాచారాలుా , అశ్లీల పదజాలాలుా. వీటన్నిటి వల్ల  తరిగిపోతున్న మన భారతీయ సంస్క్రుతి సాంప్రదాయాలు. ‌ 
 పాశ్చాత్య  పోకడలతో విజృంభిస్తుా దిగజారిపొితున్న    చదువు సంస్కారాలు .  యువత భవిత .
దిగజారిపోతున్న మన ఆచార వ్యవహారాలు. 
రాను రాను తరిగిపోతున్న , సంస్కృతి ,  విడిచి పెడుతున్న సిగ్గు- బిడియాలు  , మాన మర్యాదలతో పాటు ,ఆడ మగ సమానమంటుా,పాశ్చాత్య పోకడలకు తలొగ్గిన యువతీ-యువతులు  
 లవ్ ఎఫైర్స్ ,వేలెంటైన్ డే లు అంటుా ప్రేమ పేరుతో
మొాసపోయి ,తమ జీవితాలనే పణం పెడుతున్నారు.
మంచేదో చెడు ఏదో తెలీని రీతిలో , అర్ధ నగ్న వస్త్ర ధారణతో  మాన -మర్యాదలను కుాడా కోల్పోతున్నారు. 
ఆడ , మగ కలసి క్లబ్బులు పబ్బుల , తిరుగుళ్ళు మరిగి , మత్తు పానీయాల మొాజులో మంచి మర్యాదలు  విడిచిపెడుతున్నారు.. పరువు మర్యాదలు కోల్పోతున్న తలిదండృలు...అవమానం భరించలేక ఆత్మహత్యలకు 
గురౌతున్న ఆడపిల్లల తో మన భారతీయ సంస్కృతి 
పుార్తిగా దిగజారిపొియింది.
పెద్దలు పెద్దరికాన్ని కోల్పోయేరు. 
పిల్లలు బరితెగించి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు.  స్వార్ధపు రాజకీయాల , రౌడీయిజపు 
దాడులతో రామరాజ్యం, రావణ రాజ్యమయ్యింది.
ఈ తీరు మారాలన్నా,  సమ సమాజోద్ధరణ జరగాలన్నా ఉత్తమ నాయకుల ఎన్నిక తోపాటు , 
మనందరం కుాడా కలసి సమిష్టి పొిరాటం చేయవలసి ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే
తిరిగి పాటించాలి . నవ్య దేశాభివృద్ధి  తో పాటు, .సత్సాంప్రదాయాచరణలు కుాడా అవసరమని గుర్తించాలి.
 పదండి. అందరం కలిసి  అడుగు ముందుకేద్దాం.
 సవ్య సమాజం స్థాపిద్దాం.
 ------------------------------

వందేమాతరం

అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : మా  తరం  చరిత్ర.

(వం)దనాలు కరువైన  
 పరదేశీ వ్యామొాహం.
(దే)శ ప్రగతి సుాన్యం .
 దైన్య స్థితిలో జనం , మనం.
(మా)రని మనస్తత్వాల 
మారణ హోమపు కాలుష్యం.
దిగజారిపోతున్న ప్రకృతి అందాలు
(త)రిగిపోతున్న మానవ బంధాలు
( రం)కు రాజకీయాలతో 
 రగిలిపోతున్న న్యాయ వ్యవస్థ.
  బీద, బిక్కి, బడుగు, జీవితాల
 భారమౌతున్న బతుకు అవస్థ.
పుటల్లో నిండిన ఉద్యమకారుల పాత్ర
( వందే) ళ్ళైనా మారని భారత చరిత్ర.
 ఇదే ఈ నాటి (మాతరం) జీవన వేధ..
 భరత మాత ఒడి నిండిన కన్నీటి కథ ॥

------------------------------------------

అక్షర క్రమ కవిత.
అంశం : వందే మాతరం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక :  భయం-భయం, క్షణ -క్షణం ॥

 వంకర టింకర రాజకీయం
 దేశ ప్రగతి దుఃఖ మయం
 మా,మీ, తగాదాల మారణ హోమం
 తరిగిపోతున్న మానవత్వపు  విలువలు 
 రంగు మారుస్తున్న రాజకీయ వ్యవస్థ-
  నిండా మునిగె  మా "తరం". 
  అను క్షణం ,భయం- భయం ,  ॥

 .

సెల్యుాట్ టు డాక్టర్స్

  శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు-

అంశం : సెల్యుాట్ టు డాక్టర్స్.

శీర్షిక : వైద్యో నారాయణో హరి.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


మారుతున్న  కాలం.  పెరుగుతున్న జనాభా.
పచ్చదనం కరువైన ప్రకృతి పర్యావరణం.
 సమస్యగా మారిన పెరుగుతున్న కాలుష్యం .
 మానసిక ఒత్తడులకు లోనౌతున్న సామాన్య జనం.॥

సమిష్టి కృషీ లేని సారహీన సమాజం
మందులేని మహమ్మారి విజృంభణ తో-
ఆక్సిజన్ కరువై, ఆసుపత్రి పాలౌతున్న జనం.
పెద్ద చిన్న తేడాలేక ప్రాణాలు కోల్పోతున్న వైనం॥

పులి మీద పుట్రలా..కరోనా రేపుతున్న కల- కలం.
సుచి -పరిశుభ్రత లేని  పొడిబారిన వాతావరణం. 
సామాజిక దుారం పాటించని నిర్లక్ష్యం. 
రోగ గ్రస్థులౌతున్న జనం- జనం, మనం- మనం ॥

కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రుల్లో 
అగచాట్లు పడుతున్న జనాలకు బ్రతుకు 
ఆస్వాసన నిచ్చి విశిష్ట సేవలందిస్తున్న  వైద్యులు
విధి నిర్వాహణలో  విధివంచితులైన వారి
విపత్కర , విచలిత,దృశ్యాలకు ప్రత్యక్ష సాక్షులు॥

విరామం లేని విధులతో విశ్రాంతి లేని సేవలు.
ఆసుపత్రులలో రోగగ్రస్తులను ఆరోగ్యవంతులుగా-
చేయలన్న సంకల్పంతో  శ్రమిస్తున్న వైద్యులు.
స్వేత వస్త్రాలు ధరించిన దేవతాముార్తుల చిహ్నాలు॥
 
కళ్ళముందే కొట్టాడుతుా అసువులు బాసిన ఆక్రోశం
గుండెలు పిండుతున్న బాధ నిండిన అనుభవం.
ప్రాణాలు నిలిపే ప్రయత్నంలో తమ జీవితాలనే
పణంగా పెడుతున్న వైద్యులు, మహిలో 
మానవత్త్వం ముార్తీభవించిన నర-నారాయణులు॥

జీవం పోసేది బ్రహ్మైతే..జీవితాన్ని నిలిపేది వైద్యుడు.
అటువంటి వైద్యులకు కృతజ్ఞత తో చేద్ధాం మనం 
                           "సెల్లుాట్"