Saturday, January 29, 2022

జణ మరణ వలయం

28/01/2022.
మహతీ సాహితీ కవిసంగమం.
అంశం : ఐచ్ఛికం.

మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 2.


శీర్షిక  : జనన మరణ వలయం.
(గీత రచన ).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.

పల్లవి:

జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..

అనుపల్లవి:

ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥

1.చరణం.

జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు మరలీ రాదుా
మిగిలినదాంతో నీకు  తృప్తిరాదుా ॥

2.చరణం.

ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
నీ నా...తేడాల మధ్య చితికిపోవు నిత్యం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥

3.చరణం.

స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
 ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
 ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
 ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
 తుదకు మట్టిలోనె కలియుటదె బ్రతుకు రహస్యము ॥

*******************************

Friday, January 21, 2022

సహనం కధానిక

[12/27/2020, 21:04] p3: 27/12/2020
వారం వారం గోరసం వారి కధానిక శీర్షిక పోటీ కొరకు..
అంశం : సహనం.
శీర్షిక : ఇల్లాలు.

అమ్మ  రోజుా పొద్దున్నే లేచి  ఆదరా బాదరా పరుగెత్తుతున్నట్టే  పని చేసేది. నన్ను తమ్ముడిని  స్కుాల్ కు తయారు చేసేందుకు , నాన్నకు, చిన్నాన్నలకు భోజనానికై కేరేజీలు కట్టేందుకు...
నానమ్మ పుాజకు నైవేద్యం కోసం ప్రసాదం చేసిచ్చేది .
అత్తయ్యలకోసం కాఫీ ఫ్లాస్క్ లో పొిసి ఉంచేది. 
అటు తర్వాత మా స్కుాల్ బేగ్ లు తను మొాస్తుా 
మమ్మల్ని స్కుాలుకు తీసుకు వెళ్లేది. 
మధ్యలో మార్కెట్ కు వెళ్ళి రోజుా కావలసిన కుారలు సామానులు తీసుకు వచ్చేది .తిరిగి సాయంత్రం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకడానికని స్కుాల్ కు వచ్చేది. అటుపై మళ్ళీ పరుగులే ..మాకు టిఫిన్ పెట్టి, రాత్రి వంట చేసి , మా ఇద్దరి చేత హోమ్ వర్క్ చేయించి రాత్రి భోజనాలయ్యేక గిన్నెలన్నీ తోమి , తిరిగి పొద్దున్న మాకోసం చేయవలసిన టిఫెన్స్ కోసం అన్నీ రెడీ గా పెట్టుకొనేది. పనమ్మాయిని పెట్టుకొమ్మని అంటే ..మీ ఇద్దరుా బాగా చదువుకొని పెద్ద ఉద్యాగాలు చేస్తే అప్పుడు హాయిగా పనమ్మాయిని పెట్టుకుంటాననేది.
ఆపై మా స్కుాలు యుానిఫామ్స్ ఇస్త్రీ చేసి పెట్టేది.
పడుకోడానికే రాత్రి పదకొండు దాటేది. ఆది వారాలు అమ్మ పడే కష్టం అంతా ఇంతా కాదు. రోజుా తెల్లారి నాలుగుకే లేచే అమ్మ ఇల్లంతా సుభ్రం చేసి , వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం తో మొదలైన దిన చర్య...
రాత్రి పదకొండు దాకా సాగేది. అంత పని చేస్తున్నా ముఖంలో అలసటని మరపించే చిరునవ్వు పులుముకొని , మా అల్లరిని భరిస్తుా...
నాన్న విసుగును సమర్ధుస్తుా , నానమ్మ సాధింపుకు తలవంచుతుా..ఎంతో సహనంతో ఇంటి పనులు చేసుకుపోతున్న అమ్మని చుాస్తుా ఉంటే నాకు ఆశ్ఛర్యం వేసేది 
కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమ్మ విలువ నా పెళ్ళి అయ్యేదాక దాక నాకు తెలియనే లేదు. అన్నీ అమ్మని అడిగి చేయించుకొనే నేను ఒక్క రోజు కుాడా అమ్మకు చేతి సాయాన్ని అందించ లేదు. కనీసం బయట పనైనా చేసేవాడిని కాదు.  పైగా అమ్మ నేను అడిగింది చేయలేదని విసుక్కునే వాడిని.  అలిగే వాడిని  ..తమ్మడు మరో రకంగా అల్లరి...అన్నీ ఆనందంగా భరిస్తుా బండెడు చాకిరీని చేస్తున్న అమ్మ నాకు నా ఇల్లాలిలో కనిపించేది..  సహనానికి మారు  పేరైన ఇల్లాలు. తన ఊరు పేరుా మారినా , తన పనితనం, సహనంతో మరో ఇంటికి దీపమై వెలుగు నింపుతున్న నిస్వార్ధ  కర్మచారిణి కదుా ఇల్లాలు.
ఒక ఇంట్లో పుట్టి వేరొకరింటిని మెట్టి అక్కడివారందరినీ తనవారిగా భావించి , నేను నా ఇల్లు , నా పిల్లలు, నా పరివారం, అన్న  అంకిత భావంతో
ఎంతో ఆనందంగా తనని తాను అర్పించుకున్న ఒక ఇల్లాలిని మించిన సహన శీలి వేరెవరుంటారు...?



రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
[12/29/2020, 20:02] +91 99084 50790: *గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక పోటీ ఫలిరాలు*
*(పోటీ జరిగిన తేదీ: 27-12-2020)*

1. శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి - ముంబయ్ (ప్రధమ స్థానం)
2. డా.. వేదాల గాయత్రీదేవి - విశాఖపట్నం (ద్వితీయ స్థానం)
3. శ్రీమతి పోతేపల్లి విజయలక్ష్మి - హైదరాబాద్ (ద్వితీయ స్థానం)
4. శ్రీమతి కె.శైలజ శ్రీనివాస్ - విజయవాడ (తృతీయ స్థానం)
5. శ్రీమతి వి. సంధ్యారాణి - నిర్మల్ (తృతీయ స్థానం)
6. శ్రీమతి మంజీతకుమార్ బందెల - బెంగళూరు (తృతీయ స్థానం)
7. శ్రీమతి కొమ్ము సాగరిక - మంచిర్యాల (ప్రోత్సాహక స్థానం)
8. శ్రీమతి ఎం.వి.ఉమాదేవి - నెల్లూరు (ప్రోత్సాహక స్థానం)
9. శ్రీమతి దేవలపల్లి సునందరెడ్డి - రంగారెడ్డి (ప్రోత్సాహక స్థానం)
10. శ్రీమతి ఎం.టి.స్వర్ణలత - మంచిర్యాల (ప్రోత్సాహక స్థానం)
11. శ్రీమతి మంజులా శ్రీనివాస్ - హైదరాబాద్ (ప్రోత్సాహక స్థానం)
12. శ్రీమతి రెడ్డి పద్మావతి - పార్వతీపురం (ప్రోత్సాహక స్థానం)
13. శ్రీమతి బోర భారతీదేవి - విశాఖపట్నం (ప్రోత్సాహక స్థానం)

*ఈవారం నిర్వహణ*
శ్రీ కంచుమారికి చిన్నారావు
కవి - ఉపాధ్యాయుడు
విశాఖపట్నం.

నల-దమయంతుల కధ

మహా భారత కథలో ఉపకథగా ప్రత్యక్ష మవుతూ ఉండే కథలలో నల, దమయంతుల కథ ఒకటి. భారతీయ సం స్కృతీ సంప్రదాయాలకూ, విలువలూ, ధర్మాలకూ అద్ధం పట్టే కథ

**మహతీ సాహితీ కవిసంగమం- కరీంనగరం*
అంశము: *నలదమయంతి*
తేదీ: *20-01-2022-గురువారం*

శీర్షిక: *నల దమయంతుల కధ
ప్రక్రియ: *ఇష్టపది*

రచన: శ్రీమతి : జగదీశ్వరీముార్తి.:
కల్యాణ్: మహారాష్ట్ర

నిషాధా పుర రాజు  నిజ నామమదె నలుడు
గుర్రపుా స్వారీలొ గుణ నిపుణుడు ఆతడు ॥

విదర్భ పురి కుమారి విరిబోణి దమయంతి
పుత్రికగ భీమునికి  పుణ్యవతి గుణవతీ॥

స్వాగతమ్ములతోడ స్వయంవరము జరిగె
నలుని జుాచెను అతని నచ్చి  స్వీకరించెను.॥

పాక శాస్త్రములోన    బహు నిష్ణాతుడతడు.
పాక దర్పణమనెడు పాక పొత్తమురాసె.॥

పాచికల జుాదమదె   బలహీనమతనిదిగ.
మంచి గుణములె అతని మలచె ఘన కీర్తునిగ ॥

మంచి గుణములవాని మారు ముట్టగలేని
కలిపురుషుడదె వేచె కాటేయగను నలుని ॥

కలి పురుషుడాతనీ కలిసీయుండెడి వాడు.
ఖలుడు రాక్షసుడతడు కడు దుష్టుడాతడుా ॥

రుాపవతినామె గని రుస రుసనె రాక్షసుడు.
దంపతుల విడదీయ ధర్మ  మన్నది మరచె ॥

ఇరువురీ ప్రేమగని నిట్లు శపధముజేసె
విడదీయ వారినీ విశ్వ యత్నము జేసె .॥

పాతికేండ్లవె గడచె పట్టె శని దేవుడు.
సమయమిప్పుడు దొరకె సంతసమ్మదె పెరిగె ॥

చెడు స్నేహ ప్రభావము చెడిపె నలునది యపుడు
మంచి చెడులను మరచె  మారె మాయకు నలుడు॥

పురి గొల్పె పుష్కరుడు  పుార్తి జుాదమునాడ
ప్రేమతో సోదరుని పేర్మి కోర్కెను దీర్చె.॥

ఆడి పాచికలాట అతనోడె రాజ్యమును .
ఆదుకొను వారెవరు  అతని బాధను గనుము॥

దమయంతి జేకొనీ దారి నడవికి బోయె.
కలిప్రభావముతోడ  కరుణ యన్నది పొియె ॥

దమయంతినే మరచి దారి మళ్ళెను ఘనుడు.
కర్కోట నాగునీ కాపాడెగా నలుడు.॥

తగు సాయమును జేయ పాము కాటును వేసె
నాగు కాటుకు మారె  నలుడు మరుగుజ్జుాయె॥

నాగు చేసిన  పనికి నలుడతిగ వగచెగా
ఏమి చేయుదునంచు ఎలుగెత్తి  అడుగగా  ॥

మేలు జేయగనెంచి మేను మార్చితినంచు
మాయ వస్త్రము నిచ్చె మంచి రుాపమునొంద॥

రాజు రితుపర్ణుదరి  రక్షించు సేవకుగ
జేరె వంటవానిగ జేరె రధసారధిగ.॥

లేచె నట దమయంతి లేని నలు గమనించి
పిలిచె నదె ఆ ఇంతి నలుదెసల యెంచెంచి॥

విసిగి పోయెను రాణి వివరమెరుగని బోణి
నలుడు కానగ రాక  నలుదెసల వెదకె ఘని .॥

తరలిపోయెను తుదకు  తండ్రి భీముని  కడకు
ఉత్తమంబగునదియు నుపాయముగనె తుదకు ॥

పెండ్లి పిలుపు పత్రిక పంపెనదే దినముా
నలుని జాడనెరిగీ  పంపె వర్తమానము.॥

మారు వివాహమదియె మనసిజకునని యెరిగి.
నలుడు నలిగెను మదిని నా రమణి సత నెరిగి ।

వేగ రధమును తోలె  వే వేగ పోనెంచి.
మదిని చింతలేలగ మరియు వేగము పెంచి॥

తన లోన నున్న కలి  తన తప్పు తెలుసుకొని
మన్నింప కోరె  కలి  మన్నించె దయనుగొని ॥

అసలు రుాపము దాల్చె  నా సమయమే న
లుడు॥
అందగానిగ మారె  నంతలోనే ఘనుడు ॥

జేరి భీముని కడకు జేపట్టె  తన సతిని
పుష్కరుని  ఓడించె పుార్తి  బానిస గతిని॥

జయము లేలెను నలుడు జగతి రాజుగను మని
జేలు వేలను పలుక జనులతని వేడ్క గని ॥

సాంప్రదాయములేలు సద్ధర్మ ముల గాధ
వినువారు తరియింప వివరించు ఘన చరిత ॥

స్వశ్ఛ తేలగ మనుము స్వయముగా సిరు లేల.
విడుము చెడు బాటలను విందు గద జీవితము ॥

నలదమయంతి కధను నలువురికి తెలుప మది
ఈశ్వరియె కోరినది ఇష్టపది రాసినది.॥

*******************************::::








Thursday, January 20, 2022

శివోహం కవిత

*ప్రదన్య సాహితీవేదిక* 
*శివోహం* కవనపోటీ కోసం ,

శీర్షిక : శివోహం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర


ఆదిబిక్షువు వయ్య   అణువణువు నీవయ్య 
ఆది మధ్యాంత రహిత  అంతయుా నీవయ్య
భవబంధ భయహరా ,  భస్మ లేపిత  రాయ
విశ్వంభర  విష కంధర హర గంగ జటాధరా  ॥
 
కార్చిచ్చు రేపేటి కాల కాలుడవీవు
ప్రణయ తాండవమాడు ప్రళయ రుద్రుడవీవు  పంచాక్షరీ మంత్ర పుాజ్య పరమాత్మవుా 
 ఫాల నేతృుడవీవు పంచ భుాతాత్మవు ॥
 
హరహరా శంకరా కర పాశ ధర ఈశ 
దినేశాది గాత్రా  శిరః చంద్ర ధాత్రా 
శృతి సార, గిరి సంత, హర శాస్త ,సుర వంద్య
పరే పాహి పరమేశ  ప్రభో పార్వతీశా  ॥

సభా దక్ష యజ్ఞావి నాశా  పరేశా  
సతీ అర్ధ గాత్రా ప్రభో తాండవేశ
శృతీ సార వంద్యా హరా భక్త బృంగా
కరుాణాంతరంగా  మహా జ్యోతి లింగా ॥
 
శవభస్మ లేపా భవా చింత్య రుాపా
శివా నాశ పాపా ధవా శక్తి తాప
హరా అర్ధనారీశ్వరా ఆర్కతేజేశ్వరా 
ధరాద్దురిత నాశా ప్రశాంత ప్రకాశా॥ 

శంకరాభయంకరా హరా సాధు మిత్రా 
ఘనోంకార గాత్రా సురేంద్రాది స్తోత్రా       
శుభా గిరిజానందా  సు గీష్పాదివంద్యా
భవాగమద్యుతీ  అక్షరాకృతీ  అమృత వాక్తేజా‍॥

శృతి గీత లయ సార నమొా నాట్య పాదా.
గతీ భువన పాలా  నమొా దివ్య తేజా
కటాక్షా వరాక్షా  కృపాక్షాభయేశా
జగన్నాటకాసుాత్ర కాలాంతకావేశ ॥


శబ్దబ్రహ్మ మయా సర్వాత్మా  
సకల భువన పాలా 
ఈశ్వరి వాగామృత సర్వేశా  
ఈప్సిత ఫల దాతా ॥

 ప్రభో రక్ష రక్షా విభో సుాత్ర దక్షా ॥
 శివోహం... శివోహం.... శివం శంకరం  ॥
 
 హామీ :  నేను రాసిన  ఈ " శివోహం" కవిత
ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన .

Wednesday, January 19, 2022

సంక్రమణం

అంశం :*జీవన సంక్రమణం*
*****************************
శీర్షిక : లక్ష్యపు కాంతులు
~~~~~~~~~~~~~~~~~~~

నిశిరాత్రిని చీల్చుకుంటూ
మెరుస్తున్న స్వార్ధపుముగ్గుల
రంగులన్నీ ఎలిసిపోయి
నవజీవన సంక్రమణానికి
స్వాగతిస్తున్నాయి
చుక్కల్ని కలిపే మాయారేఖల్లా.....

కాయకష్టం ఎక్కడైనా 
జన్మభూమివైపే చూసే
వెన్నెలచూపులు కాస్త మసకబారి
ఆస్పష్టపు అభిమానక్షేత్రాల
నటనలవైపు ఎదురిల్లుతున్నాయి
ఎండమావిలోదాగే నీళ్ళలా...

ప్రాచ్యపుకోరల్లో బంధింపడి
విష సంస్కృతిని అంటించుకున్న
నవతరపు సనాతనం కార్చిన
కన్నీటిఅలలు పొంగిపొర్లుతున్నాయి
ఆగని సుడిగుండపు వరదల్లా...

మొహంపై నవ్వులు పండించే రైతన్నకు
ఆశలతీరానికి చేరుతున్న వలసన్నకు
ఆప్యాయతల నీడకుచేరే అక్కచెల్లెలకు 
లక్ష్యపు కాంతులువిరిసే సప్తవర్ణాలకు
ఆహ్వానిస్తున్నాయి సంక్రాంతులు
శోభాయమానపు నవదీప్తుల్లా....
~~~~~~~~~~~~~~~~~~~~~~
మీసాల చినగౌరినాయుడు
గణితోపాధ్యాయులు
బొబ్బిలి,9492848564.
#######################

మనుమసిద్ధి కవన వేదిక పోటీల్లో టాప్ 10 లో నిలిచి,ద్వితీయ స్థానం లో నిలబడిన కవిత.....