Wednesday, May 25, 2022

ప్రేమసరాగాలు

శీర్షిక : ప్రేమసరాగాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్.మహారాష్ట్ర .


పుట్టిన ప్రతీ వారు తల్లిదండ్రులు ,
అన్నదమ్ములు , అక్కాచెల్లెళ్ల ప్రేమలో
తాత  అమమ్మల  అనురాగ హేల లో 
పెరిగి పెద్దవుతారు.
కానీ యుక్త వయసు వచ్చేసరికి 
వారి  అనుబంధం మరొకరి బంధంతో
 పెనవేసుకోవాలనీ ,వారితో జీవితం 
 ముాడుపుావులు ఆరు కాయలుగా
 ఉండి , ఆనందమయంగా మారాలని
 తాము వలచిన వారు తమను కుాడా
 ప్రేమించాలని ,  ఆ ప్రేమికుడు గాని 
 ప్రేమికురాలు గాని కోరుకుంటారు.
 తాము ప్రేమించిన మనిషిలోనే 
 తల్లిదండ్రుల ప్రేమను , స్నేహితులతో చేసే
  చిలిపి అల్లరి అటలను , ముద్దు ముచ్చట్లను
 కుాడా కోరుకుంటారు. 
ఆకలి రుచి ఎరుగదట, నిదుర సుఖమెరుగదట..
ప్రేమ ప్రపంచాన్నే మరచిపోతుందట.
ఆ మైకం అలాంటిదేమొా మరి...
ప్రేమ సరాగం లో మునిగి తేలిన ఈ యువ జంట
 అదే తీరులో ఆట పాటల లో మునిగి
 తమ జీవిత ఆనంద క్షణాలను అనుభవిస్తుా
 ఆనందిస్తున్న ఈ చిత్రం మన మనోగతానికి
 అద్దం పట్టేలా ఉన్నాది కదుా...
 మరి నాకైతే అలాగే ఉందిసుమండీ.. 😊

ఆవేశమనర్ధము.

అంశం: *ఆవేశము - అనర్థాలు..*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి 
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది

చదువు కున్న జ్ఞాని జడుడుకా డిలలోన
విద్య తోడ నబ్బు వినయ మెపుడు
మంచి మాట తోడ మన్ననలనుపొందు
శాంత గుణము తోడ శక్తి పెరుగు ॥

అడుగు యడుగు లోన యాలోచనలు జేయు
మహిని మంచి తోడ మసలు కొనుము
నతిగ మాట లొద్దు నావేశ పడవద్దు
అది యనర్ధ మిలను నదియె నిజము ॥

హాని జేయు మాట లావేశమున నాడ 
నాశనమ్ము జేయు నడత చరిత
తృటిని వేరు జేయు, జటిలమౌ బంధాల
నొంట రౌదు వంత నొనరు హాని ॥









సర్పయాగము

*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగ
తేది:  *12-05-2022:గురువారం*
అంశం: *సర్పయాగం*
ప్రక్రియ: *ఇష్టపది*

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

ఉదంకోపాఖ్యాన ముదంత వృత్తాంతము
జగతి విస్తృతమాయె జనమేజయు యాగము ॥

మహర్షి పైలునిప్రియ మగు శిష్యుడుదంకుడు
గురు సేవ జీవితము గురు మాటే వేదము॥

అణిమాది సిద్ధులను ఆతడు ప్రాప్తి పొందెను
గురు దక్షణ నీయగ గుణుడు దలచె సతతము ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

రాజు పౌష్యుని సతి రాణి  కుండలాలను
గురు పత్నవి కోరెను గుంభనముగ నవ్వెను॥

గురు పత్ని యానతిని  గుణుడు స్వీకరించెను
జాగురుాకత తోడ జక్కగ గొన బోయెను॥

పతివ్రతగు రాణిని పద్ధతిగా నడిగెను
హర్షించి రాణిచ్చె నామె కుండలాలను॥

  తక్షకుడు  చోరుడని తరచి తరచి చెప్పెను
జాగురుాకత తోడ జాడ బోవలెననెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

మార్గ మధ్యములోన మంత్రానుష్టానమును
జేయ కుండలాలను  చెట్టు దరిని దాచెను ॥

తాన మాడు వేళను తక్షకుడే వచ్చెను
మహిమ కుండలాలను మాయ నపహరించెను  ॥

నాగ లోకమునతడు  నడి రంధ్రమున దాగ
నమ్మిక నుదంకుడుా నారాయణు వేడెను ॥

నాగలోక వశమౌ నటుల వరము కోరెను
అగ్ని జ్వాలల తోడ ఆరని పొగ బెట్టెను.॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

తక్షణమే వణకుచు తక్షకుడే వచ్చెను
కుటిల బుద్దిని వీడి కుండలాలనిచ్చెను ॥

గురుదక్షణ నిచ్చిన గురువు సంతసించెను
గురుకులమున విద్యయె గుణుడు పుార్తి చేసెను॥

గురుకులము విడినంత గురుతుగానుదంకుడు
తక్షకుల నాశముకు తరుణముకై వేచెను॥

ప్రతీకార వాంఛను ప్రతిగ దీర్చ దలచెను
ఆ నాగుల జంపుట కతడు ప్రతిన పుానెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

సర్ప యాగముజేయ సంకల్పము బుానెను
జనమేజయు నాతడు జతనము నొప్పించెను  ॥

తండ్రి పరీక్షిత్తుకు తగులు శాపము జెప్పె
శాప మెరిగిన కుటిల సర్ప యొాచన జెప్పె॥

మాటు వేయ దాగి కాటు వేయుట జెప్పె
తక్షకుండదె జంపె తండ్రి ననుచును  జెప్పె ॥

ప్రతీకారము నదియె   ప్రతిగ దీర్చుకొమ్మని
ప్రేరేపించి యతడు  ప్రేరణ కలిగించెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

రాజు మనము రగిలె రగిలించె యాగాగ్ని
సర్ప యాగ మదియె సరి జంప నాగుల ॥

హోతల మంత్రములకు హోమమెగసెను పైకి
పెరుగాగ్ని జ్వాలలో పరుగున బడె నాగులు॥

మంత్ర తీవ్రత జుాచి  మదిని యింద్రుడు వణకె
అగ్ని కాహుతౌచును అతడు తల్లడిల్లెను ।

ఆశ్రయించు తక్షకు డావెనుకే జారెను ॥
ప్రాణ భీతి తోడను  ప్రాకులాట లాడెను॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

సొిదరీ వాసుకీ  సొంత బిడడ్డు అతడు
నాగులను కాపాడు నాగ వంశజుడతడు 
 
కారణ జన్ముడతడు కరుణ దయ గలవాడు
ఆస్థీకుడను పేర నలరు రక్షకుడతడు ॥
 
నిలిపె యాగమునతడు నిశ్ఛయమ్ముగ నపుడు
తక్షకులము బ్రతుకగ దక్షణ దిశ కోరెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

మహాభారతములో  మది కలచునది గాధ
ఆది పర్వములోనె  ఆరంభమైన  కథ ॥

ముని సుాతుడు జెప్పిన  ముఖ్యమైనదీ కధ.
సర్పయాగ విషయము  సరి శౌనకాదులకు ॥

సర్ప భయము లున్నను సత్కథను చదువుమా
సర్ప బాధ తొలగు  సత్య మిదియె వినుమా ॥

సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥
యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ॥

************************************

మణి పుాసలు ప్రక్రియ

22/05/2022.
చైతన్య భారతి వారి మణిపుాసలు సంకలనం  కొరకు...
అంశం : స్త్రీల పై అత్యాచారాలు.

శీర్షిక : నాటికీ నేటికీ మారని చరిత

ప్రక్రియ : మణిపుాసలు.
సృష్టి కర్త : వడిచెర్ల సత్యంగారు.

రచన.:.శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నాడు

ఒకప్పుడు ఆడపిల్లలు
భ్రుాణ హత్యలకు నెలవులు
వంటింటి కుందేళ్ళుగా
బ్రతుకు బంధాల కొలువులు ॥

కన్యాశుల్కపు బాధలు
అడుగడుగునవమానాలు.
సతీ సహగమనం వంటి
కర్కశపు ఆచారాలు ॥

మార్పు కోరె ఉద్యమాలు
మహిళారక్ష కేంద్రాలు
గడప దాటిన మహిళల్లో
ఆత్మవిశ్వాసపు సిరులు ॥

స్త్రీ జాతికి కొత్త మలుపు
అన్ని రంగాల్లో గెలుపు
ఆశయ ఆరోహణలవి
విజయ పథాలకిడె పిలుపు॥

నేడు..

విదేశ  వ్యామొాహ ఘనత
నాశనమౌతున్న యువత
డ్రగ్స్ , విస్కీల మత్తులో
చిత్తాయెను భరత భవిత ॥

మార్పది తెచ్చిన సారం
అవనిని నిండిన ఘొారం
కామంతో రగిలె జనం
స్త్రీ  బ్రతుకాయెను భారం ॥

పురుషుల అహంకారాలు
స్త్రీ ల పాలిటి శాపాలు
మాన మర్యాదల లోపం
మరచారు వావి వరుసలు ॥

స్వాతంత్ర్యము కోరె స్త్రీలు
భువి నీ జన్మ కారకులు
నాటికి నేటికి నతివకు
తగ్గలేదు వేధింపులు ॥

నేడు అతివ ఆట బొమ్మ.
సరదాల సందడి కొమ్మ
సాముాహిక హింసలతో
చావు రేవుల శవమమ్మ ॥

హామీ : ఈ మణిపుాసలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచనలు.

Tuesday, May 24, 2022

ధుామపానానికి దుారంగా....

24/05/2022.
మనుమసిద్ధి కవన వేదిక లో
మే 31వ తేదీ " పొగాకు వ్యతిరేక దినోత్సవం "సందర్భంగా..

అంశం : ధుామపానానికి దుారంగా..
శీర్షిక : మత్తు విడువరా  .....

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఆకాశంలో నక్షత్రం పుడమి చెలి 
కానరాక పొరుగురికి పయనమైంది.


మబ్బు పొరల్లో దాగిన తేమ 
ఉక్కపోతకు ఉడికి ఆవిరౌతోంది.॥
 పొగనిండిన పర్యావరణం ఊపిరాడక
 స్వశ్ఛమైన గాలికై పచ్చదనాన్ని వెతుక్కుంటోంది.॥
పొగ బారిన పడిన మబ్బు మారాజు
కారుతుాన్న చమట చుక్కతో  చినుకు 
తడి  అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాడు.॥
పొగ నిండిన వాతావరణంలో 
పొడిబారుతున్న తేమకు 
పుడమి సారం బీడుబారుతోంది ॥
పుాల తల్లి ఒడి నుండి విడివడిన పుప్పొడి
పొగాకు కంపులో పడి చిగురించ లేక
మట్టి గంధాల పచ్చ తడికై 
వెతుకులాడుతోంది॥
చినుకు తడెరుగక  మట్టిలో దాగిన 
విత్తు చిన్నారి చిగురించే సత్తువ లేక
మొలకగానే ముడుచుకు పోయింది ॥.
ఆకాశం వైపు ఆశగా చుాస్తున్న రైతన్న 
తడి మబ్బును కానరాక 
తహతహలాడుతున్న గుండెతో 
తడిలేని కన్నీరు కారుస్తున్నాడు.॥
ఇంతటి  దుస్థితికి కారణమైన మనిషి
పొగాకు మాయలో పడి భయంకర 
మత్తుకు అలవాటుపడిపోతున్నాడు.॥
మత్తు నిండిన మాయా ప్రపంచంలో 
ఆడ మగా తేడాలేని ఆధునిక ప్రక్రియగా
పొంగి పొరలుతున్న పొగాకు వంటి
మాదక ద్రవ్యాల మత్తు మరిగిన
మనిషి , కేన్సర్ కణాలు నిండిన
 కుళ్ళు దేహాలతో కమిలిపోతుా
భరత భవితకు పొగాకు పంటల 
రుచుల పాఠాలు నేర్పుతున్నాడు॥
మారని మనిషి చర్యలకు" మడిని"
కోల్పోయిన ప్రకృతి , పర్యావరణ 
రక్షణ లేని  ప్రారబ్దానికి ధుామపానానికి
దుారంగా ఉండే చోటుకై 
వెదుకులాడుతుా విసిగిపోతోంది.॥

************************:*:



24/05/2022.
 మనుమసిద్ధి కవన వేదిక లో
మే 31వ తేదీ " పొగాకు వ్యతిరేక దినోత్సవం "సందర్భంగా..

అంశం : ధుామపానానికి దుారంగా..
శీర్షిక : మత్తు విడువరా...

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఆకాశంలో నక్షత్రం పుడమి చెలి 
కానరాక పొరుగురికి పయనమైంది.
మబ్బు పొరల్లో దాగిన తేమ 
ఉక్కపోతకు ఉడికి ఆవిరౌతోంది.॥

పొగనిండిన పర్యావరణంలో 
ప్రకృతి పడతి పచ్చనం నిండిన 
స్వశ్ఛమైన గాలికై ప్రాకులాడుతోంది.॥

పొగ నిండిన వాతావరణంలో 
పొడిబారుతున్న తేమకు పుడమి
 తల్లి బీడుబారి సారం కోల్పోతోంది ॥
 
ఆడ మగా తేడాలేని ఆధునికతగా
మాదక ద్రవ్యాల మత్తు మరిగిన
మనుషులు , కేన్సర్ కణాలు నిండిన
 కుళ్ళు దేహాలతో కమిలిపోతుా
భరత భవితకు పొగాకు "పంట
సాగుకు పాఠాలు " నేర్పుతున్నారు॥

మారని మనిషి చర్యలకు" మడిని"
కోల్పోయిన ప్రకృతి మాత ,పర్యావరణ
రక్షణ లేని ప్రారబ్దానికి కన్నీరిడుతుా
ధుామపానానికి  దుారంగా ఉండే చోటుకై 
వెదుకులాడుతుా వీధీ వీధీ గాలిస్తోంది.॥



హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.

Friday, May 20, 2022

Women writers లో రాసిన కవితలు.

[2/10, 20:45] p3: ఎంతో సమయాన్ని వెచ్చించి సాహిత్య రంగంలో 
కృషిచేస్తుా, రచయిత్రుల మనోభావాలను , వారి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటుా , వారికి తగిన ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ,ప్రేరణనుా కలిగించే బిరుదులతో సన్మానితులను చేస్తుా మహిళా మణులను  ప్రేరేపిస్తున్న  గౌరవనీయులు
" శ్రీమతి సునీత "గారికి మనఃపుార్వక ధన్యవాదాలు .🙏🙏.మరియు ఆశీస్సులు .🙌🙌

వారి వెన్నంటే ఉంటుా ఎవరి మనసుా నిప్పించని విధంగా సమీక్షలు చేస్తుా వారికి సహకరిస్తున్న 
గౌరవ సమీక్షకులకు ధన్యవాదాలు ..🙏🙏🙏🙏
.మరియు ఆశీస్సులు .🙌🙌🙌🙌.🙏

ప్రతీ వారం నిష్కల్మషంగా " సున్నితం "
విజేతలను ఎంపిక చేస్తుా అద్భుతమైన 
పత్రాలనందిస్తుా ప్రోత్సహిస్తున్న విశ్లేషకులు
శ్రీ భరద్వాజ రావినుాతల గారికి ధన్యవాదాలు 
.మరియు ఆశీస్సులు .🙌 🙏.

[2/12, 23:07] p3: బలేబలే అందాలుా సృష్టించావుా...
పాటకు పేరడీ..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

భలే భలే అందాలు కురిపించాయిా
మదిని మురిపించాయిా
మనసు కానందం, పొంగె పద గంధం 
కవిత కన్నెల్లు  ప్రతిదినం ॥

రాసిన వన్నీ రసమయ సుధలై
పుాసిన పుాలవోలే  వికసించేయిా..
మితమైన వరుసల ఆగమ సారమై
అందరి మనసుకుా హత్తుకున్నాయిా

 మకుటము నీదిగా, మన్నిక నీయగా॥
 నీనామపు  పరిమళాల జల్లులే
కవన వీధి విహరించాయిా ॥

విందులుగానిడు అంశము లెన్నో
జ్ఞానపు నిధులై   మది నిలిచాయిా
అభినందనలా బహుమతులెన్నో
విజయపు చిహ్నాలై ఊరించాయిా
సాహిత్యపు బడిలో సాధించిన బిరుదులే
మా మది కానందపు నిధులేై
కలలెన్నో పండించాయిా..॥
[2/18, 13:26] p3: ' 
18/02/2022.
శీర్షిక : మహిళా దినోత్సవం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .కల్యాణ్.మహారాష్ట్ర .

ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని 
అన్ని రంగాల లోనుా 
మగవాడితో సమానంగా 
ఎదుగుతున్న మహిళలు  
మహిళా శక్తికి నిదర్శనాలు.
హిమాలయాల శిఖరాగ్రాలు చేరి
అంబర యాత్రలతో అలరిస్తున్న స్త్రీ లు.
ఇంటా బయటా సమాన శక్తితో
పనిచేస్తున్న  వెలుగు దీపాలు.
బాధ్యతల బాటలో  
తొలగిస్తున్నారు ముళ్ళు.
బంధాల తోటలో వికసిస్తున్న
 అనుబంధపు పరిమళాల పుాలు.
 ఏలోటుా రానీయని ఆదర్శ గృహిణులు
 ఎందులోనుా తీసిపోని వీర నారీమణులు.
ఎన్నో రంగాల లో ఎందరో ప్రసిద్ధులైన
నారీమణులు మన భరత  మాత
మకుటంలో మెరిసే కలికితురాయిలు.
తరాలు కదిలిస్తే చాలు 
తరుణీ మణుల ఉద్యమ, వీర 
స్వాతంత్ర్య , విద్యా , వినయ సంపన్నులైన
వారి గాధలు చరిత్ర పుటల్లో చదువరులకు
చక్కని స్ఫుార్తినిస్తున్నాయి.

నాటి నుండి  నేటి వరకు 
జరుగుతున్న ఎన్నో 
పోరాటాలకు  సాక్షిగా  ఎన్నో
మహిళా ఆరక్షణా కేంద్రాలు.
న్యాయ పరమైన చట్టాలు ,
మహిళా సంక్షేమ పథకాలుా 
నెలకొన్న ఘనత మహిళల
విజయానికి నిదర్శనాలు.
ఎన్నో అర్హతలతో బాటు 
మరెన్నో రంగాల లో 
ముందడుగేస్తుా దుాసుకుపోతున్న 
మహిళామణులకు స్ఫుార్తి నిస్తుా 
ప్రతి సంవత్సరముా జరుగుతున్న 
"మహిళాదినోత్సవం "మహిళా
శక్తి ప్రేరణకు దోహదమై
ఆత్మ విశ్వాసానికి నెలవై  
ముందడుగు వేయిస్తున్నదనుటలో 
సందేహములేదు.
జై మహిళా శక్తి : జై మహిళా స్ఫుార్తి.
[2/21, 15:05] p3: 21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

సాహితీ బృందావన జాతీయ వేదిక .

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

శీర్షిక  : తెలుగు వెలుగు.

జలజల జారే  గిరుల ఝరుల లో
నదీమ తల్లులు పారే గలగలలో
ఎగిరే పక్షుల కువకువల వేదంలో
జే గుడి గంటల ప్రణవ నాదంలో
సవ్వడి చేసే అక్షర కన్యల పద
మంజీరాల గలగలలో
నిండిన అక్షర మంజరీ నాదం 
మన తెలుగు భాష నిండు వేదం  ॥

శృతి లయల సంగీత గీతులు
కవుల కలమేలు ఫల రసాల తోటలు
వేద పురాణాది గ్రంధపు  తేటలు
తెలుగు భాషా వనములో 
పండిన  పసిడి పచ్చని పంటలు॥

నదీమతల్లుల సంగమ క్షేత్రాలు
ముక్కోటి వేల్పుల జేగుడి గంటలు
వేల పోరాటాల వీర చరితలు
తెలుగు సిగ నలరించు 
సుమ సౌగంధపు కీర్తులు॥

సంస్కృతి , సాంప్రదాయాల సారం
సత్య ,శాంతి .సద్ధర్మాలకు నిలయం 
ఐకమత్యానికి ప్రతీకగా ఎగిరే కేతనం 
తెలుగు జాతి  నిండు దనానికి నిదర్శనం 
తేనె లొలుకు మన తెలుగు భాష ॥

******************************
[4/28, 12:09] p3: 28/04/2022.
రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
అంశం : మగువ మహారాణి .
శీర్షిక : భరత చరితల భాగ్య విధాత.

కవిత:
------

తర తరాల చరితలను  తన కడుపులో 
తొమ్మిది నెలలు మొాసి తన రక్తాన్ని పంచి
పెంచి మనిషి మనుగడకు ప్రాణం పోసిన తల్లిగా
మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥

దేశం బానిసత్వపు సంకెళ్ళలో బందీ అయినప్పుడు
ఎందరో స్వాతంత్రోద్యమ వీరులను కని, వారిని
దేశ రక్షణకై సగర్వంగా సమర్పించిన  తల్లిగా...
మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥
  
 దేశానికి వెన్నెముక వంటి 
 నిస్వార్ధ  పుత్రులను కని ,
అందరి ఆకలినీ తీర్చగలిగే 
అన్నదాతలను కన్న తల్లిగా
మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥
 
 దుష్ట శిక్షణ  శిష్ట రక్షణ  చేసేందుకై
 ఘన చరితలు గల పురాణ పురుషులను కని
 తరించిన తల్లిగా జగదంబగా జేలందుకుంటున్న
 మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥
 
 వేయేల ! అమ్మను మించిన ఇలవేల్పులేదు.
 స్త్రీ ని మించిన త్యాగముార్తి లేదు.
 భరత మాతగా, భరత చరితల భాగ్య విధాతగా 
 మగువ ఎప్పటికీ మహారాణీయే ॥



హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
[5/1, 06:29] p3: 01/05/2022

అంశం : కార్మిక దినోత్సవం .
శీర్షిక  : శ్రామిక జీవనం .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

కష్ట పడనిదే కడుపు నిండని దౌర్భాగ్యం.
కాయ కష్టమే జీవితమైన  బడుగు జీవితం.
మనిషికో తలరాత రాసిన విధి విలాసం.
బలహీన వర్గాల బ్రతుకు తెరువు మార్గం ॥

కొందరు తిని పారేసిన పోగు చెత్త పని
మరి కొందరి ఆకలి తీర్చే ఖని.
బాధ్యత లేని బలసిన వాడల్లో
పులిసిన ధనానికి నిదుర లేమి పని. ॥

కలుషిత వ్యర్ధాల కర్ఖానాలలో కాలి-
కమిలిన  కష్ట జీవుల చమట ఫలం
అందమైన సామగ్రిగా అంతరాల
అంతస్తుల్లో మెరుస్తున్న వైనం.॥

పొట్ట నిండని వేతనాలతో 
వాడలుతున్న వేల కార్మికుల 
ఆకలి తీరని దైన్య జీవితం  ॥
ఎదుగు బొదుగు లేని కార్మిక
జీవితాల  కన్నీటి కథనం ॥

పార పలుగుల పరుగు కష్టానికి
కుాడు గుాడు కరువైన ఆక్రోశం .
అన్నదాతలై అలసిన ఖర్మానికి
వెన్నెముక విరిగిన రైతన్న శోకం ॥

శ్రమ జీవుల అస్థిత్వం లేని రోజు
జన జీవితం రోగాలు నిండిన తరాజు॥
కార్మికుల కష్టాన్ని గుర్తించిన రోజు
నిజమైన మానవత్వానికి  
మకుటం పెట్టిన రోజు.॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.
[5/12, 22:51] p3: శీర్షిక : అమ్మే అంతా....
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

అమ్మ  రక్త మంసాలతో నిండిన బొమ్మవు.
క్షీరామృత ధారలతో జీవం పొందిన ఘనవు
అమ్మ ఒడిలో అందలాలనేలిన ధన్యుడవు ॥

పిల్లల కోసం  పరితపించేది అమ్మ.
పెంపకంలో ఆనందపడేది అమ్మ .
అమ్మ పిల్లలకో ఆట బొమ్మ .॥

రాత్రి పగలుల నిదుర లేమి కష్టం
పిల్లల బోసినవ్వులలో సేద తీరిన ఇష్టం.
పెరిగే పిల్లలకు అమ్మ ఒక నేస్తం ॥

పిల్లల ఆట పాటలు అమ్మకు అనందం 
స్కుాలుకు పంపేక బాధించే ఒంటరి తనం  .
వారి నడతకు అమ్మే ఒక ఆదర్శం॥

పెద్దయ్యే పిల్లలు  తల్లికొక సవాలు.
వారి బ్రతుకు చింత అమ్మ మధనకు కారణాలు.
వారి వైవాహిక జీవిత స్పర్ధలు అమ్మకు శాపాలు॥

కరిగి పోయిన కొవ్విత్తిలా అమ్మ
అరిగిపోయిన ఎముకలు నిండిన బొమ్మ 
అమ్మ ఋణం తీర్చుకోవాలి సుమ్మ .॥

హామీ : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితముకాని నా స్వీయ రచన ॥
[5/20, 08:19] p3: 20/05/2022.
శీర్షిక  : పర్యావరణ రక్షణ స్వీయ రక్షణ .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
ప్రక్రియ : వచన కవిత.

విలవిలలాడే రోదనతో విశ్వం కంపిస్తోంది.
విశ్వ మామవ వినాశనానికి
కాలుష్యం  కంకణం కట్టుకుంది॥

రసాయనాలు, పురుగులమందుల 
వాడకాలతో మట్టి పొరల చాటులో 
మాటు వేసిన విష కీటకాల వీర విహారం ॥
 
రోగాలు నిండిన జన్మలకు 
 విషపుారితమైన ఆహారాలు కారణం .
వృక్షాల జాడ కానరాని ప్రకృతిలో
 పర్యావరణ రక్షణ లేని ప్రారబ్దం జీవితం ॥
 
పచ్చదనం కోల్పోయిన ప్రకృతిలో 
ఆక్సిజన్ కరువైన హా హాకారాలు.
పర్యావరణ రక్షణ లేక 
పెరుగుతున్న కాలుష్యాలు.॥

దేశంలో నిండిన స్వార్ధ కుతంత్రాకు
గుట్టలైన శవాల కుళ్ళు వాసనలు ॥

పలు  రసాయనాల  పారవేతలతో 
గంగమ్మ ఒడి నిండిన విష వ్యర్ధాలు
విష జలాల వాడకాలతో -
జన జీవితాల్లో రోగాలు రొష్టులు॥.

 విష కణాల వింత వ్యుత్పత్తి  దాడులతో
కరోనా కాట్లతో పెరుగుతున్న దారుణాలు.
సాముాహిక రాసాయనిక దాడులకు 
సారం కోల్పోతున్న పుడమి తల్లి కన్నీటి కథనాలు॥


హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితముకాని నా స్వీయ రచన.

Wednesday, May 18, 2022

64 కళ ల పేర్లు.

చతుషష్టి కళలు తెలియజేసే శ్లోకం

"వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే"

ఆ 64 కళలు ఇవే

1.వేదాలు (ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం)
2.వేదాంగాలు (శిక్షలు, వ్యాకరణం , ఛందస్సు , జ్యోతిష్యం, నిరుక్తం, కల్పాలు)
3.ఇతిహాసాలు (రామాయణం,మహాభారతం, భాగవతం, పురాణాలు)
4.ఆగమశాస్త్రాలు (శైవాగమం ,పాంచరాత్రాగమం , వైఖానసాగమం ,స్మార్తాగమం)
5.న్యాయం (తర్కశాస్త్రానికి మరో పేరు)
6.కావ్యాలంకారాలు(సాహిత్యశాస్త్రం)
7.నాటకములు
8.గానం (సంగీతం)
9.కవిత్వం (ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడం)
10.కామశాస్త్రం
11.ద్యూతము (జూదమాడడం-జూదానికి సంబంధించిన సూక్తములు ఋగ్వేదంలో కొన్ని ఉన్నాయి. కార్తిక శుద్ధ పాడ్యమి రోజు జూదమాడాలని శాస్త్రవచనం)
12.దేశభాషాజ్ఞానం
13.లిపికర్మ (దేశభాషలకు సంబంధించిన అక్షరాలు నేర్పుగ వ్రాయువిధానం)
14.వాచకం (ఏగ్రంధమైననూ తప్పులేకుండా శ్రావ్యముగా అర్థవంతముగ చదువగల నేర్పు)
15.సమస్తావథానములు (అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యం)
16.స్వరశాస్త్రము (ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంథించిది, ఇడా పింగళా సుషుమ్న నాడులకు సంబంధించినది)
17.శకునం (ప్రయాణ కాలంలో పక్షులు, జంతువులు, మనుషులు ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలక

Friday, May 13, 2022

శ్రీశ్రీ కళావేదికలో టాప్ 10 విజేతగా

" భ్రూణహత్యలు" అనే అంశానికి స్పందించిన
 300 మంది కవులను అభినందిస్తూ..
అన్ని గ్రూపులలో టాప్ టెన్ విజేతలను ప్రకటిస్తున్నాము.
పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందించబడును.
💐💐💐💐💐                                  విజేతలందరికీ శుభాకాంక్షలు.🌹🌹
పాల్గొన్న కవులందరికీ అభినందనలు.💐💐
గ్రూప్ 4 లో విజేతలు
~~~~~~~~~~
🌹సప్రం దినేష్ కుమార్
🌹చింతాడ కృష్ణారావు
🌹యండపల్లి పాండురంగ రావు
🌹కె.దివాకరాచారి
🌹సునీత దుర్గం
🌹వెంకట్
🌹బొల్లాప్రగడ ఉదయభాను
🌹డా.సూర్యదేవర రాధారాణి
🌹పి.వి.ఎల్.సుబ్బారావు 
🌹పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

💐👏💐👏💐👏💐
శ్రీ శ్రీ కళావేదిక టీం..