మహిళా మనోహరి మాస పత్రిక కొరకు.
28/03/2023.
రచయిత్రి : యడవల్లి శైలజగారు.
పుస్తకం : హృదయరాగం.
సమీక్షకురాలు :
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.,
కల్యాణ్ : మహారాష్ట్ర .
యడవల్లి శైలజగారి హృదయరాగం...
ఒకమినీ నవల గానీ, ఓ పెద్ద కధ గానీ, అయి ఉంటుదన్న
అభిప్రాయంతో Pdf ఓపెన్ చేసిన నేను , ఆశ్ఛర్యానందాలకు గురయ్యాను..
అందులో కన్నవాెు , గౌరవనీయులైన వారు , ఎందరో స్ఫుార్తి దాయకులు , హితులు స్నేహితులు , ప్రోత్సాహకులు ఐన
వారు తన హృదయానికి దగ్గరైన ఎంతో మంది గురించిన
తన మనసులో ఉన్న భావనలను పంచుకుంటుా...
మనలను కయాడా ఆలోచింపజేసి ఔను అనిపుంచిన విధానం నన్ను చాలా ఆకట్టుకొంది.
అమ్మగా ,అక్కగా, ఆలిగా, స్నేహితురాలిగా అందరి పట్ల తన మనసులో ఉన్న ప్రేమను, అనురాగాన్ని అభిమానాన్ని ,
తపనను తెలియజేస్తున్న వైనం కళ్ళ నీళ్ళు పెట్టించింది..
ఈ నాటి పరిస్థితులు ఎలా మారాయంటే
అమ్మ, నాన్న, అక్క, చెల్లీ , అన్న, తమ్ముడు అనే రక్త బంధాలకు విలువ లేకుండాపోయింది, కాస్తంత సంపాదన రాగానే "ఎవరికి వారే యమునాతీరే "అన్నట్లున్నారు.
కాకుండా ప్రతీ ఒక్కరుా "ట్రెండ్ మారిందండీ "అని గొప్పగా చెప్పుకోవడం ఒక " ట్రెండ్ " గా మారిపోయింది.
మనిషిలో స్వార్ధం పేరుకుపోయింది.
మానవత్వం మట్టిలో కలిసిపోయింది.
అటువంటి వారికోసమే అన్నట్టుగా శైలజగారు
బంధాలు బంధుత్వాలు వాటి విలువల గుార్చి ఆర్ద్రత నిండిన భావుకతతో తన మనసులోని భావాలను వ్యక్త పరచిన విధానం చాలా చాలా బాగుంది.
తనను పెంచిన తల్లితండ్రుల మీదున్న గౌరవాభిమానాలని తెలియపరచే విధానం..వారెంత కష్టపడితే తామీ స్థితికి వచ్చేరోనని తన తమ్మళ్ళకు అన్నలకు తెలియపరుస్తుా తల్లిదండ్రులను ముసలికాలంలో ఏ విధంగా చుాసుకోవాలో సుతిమెత్తగా ప్రేమతో తెలియపరచిన విధానం చాలా బాగుంది.
.చాలా మంది స్నేహ బంధం గురించి పెద్దపెద్ద మాటలు పుటలు- పుటలుగా రాస్తారు. కానీ నిజమైన స్నేహితునిగా
మసలలేరు.
అలాగే మనం చాలా మందిని ఎక్కడెక్కడో కలుస్తాం .ఆత్మీయతను పంచుకుంటాం . విడి పోతాం, కానీ కొంతమందిని కలిసినపుడు అనుకోకుండా వారితో ఐన అనుభవాలని మనమెప్పటికీ మరవలేం.
మన జీవిత కాలంలో ఎంతో మంది సహకారం వల్ల
మనమెన్నో మెట్లు పైకెక్కుతాం . ఒకసారి పైకి వెళ్ళాకా మరి తిరిగి వెనక్కి చుాడం .
కానీ మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా ఒకప్పటి వారి సహాయాన్ని , వారి ఉనికిని గుర్తు చేస్తాయి.
మనలో జ్ఞాపకాల ఆ సడులే మన కళ్ళను తడి చేస్తాయి.
కొంత అనందం, కొంత అనురాగం , కొంత ఆప్యాయత , కొన్ని బాధలు , మరిన్ని బంధాలు, మమతానురాగాలు , స్నేహ బంధాలు ,కొన్ని పాత- కొత్త జ్ఞాపకాల తరంగాలు, లేపిన ఎత్తుపల్లాలు కలబోసిన ప్రయాణమే మన జీవితం.
ప్రతీ చిన్న మాటకు , చేతకు , స్పందించే మనసు అందరికీ ఉన్నా అది వ్యక్తపరచే విధానం చాలా మందికి తెలియదు.
కానీ అందరిలోనుా అన్ని రసాలకుా స్పందించే హృదయం ఉంటుంది.
అందరి మాటను తన మాటగా చెపుతుాన్నట్లుండే
" యడవల్లి శైలజగారి హృదయరాగం..."
అందమైన అనుభవాలను ఆస్వాదింప జేసి ఊరట కలిగించే "సుందర సుమధుర మధుర పరాగం "
ఇటువంటి విలువలను తెలియ జేసే
మరిన్నిమంచి స్పందనలను మరింత భావులతతో తెలియజేసి చదువరులకు స్ఫుార్తినివ్వాలని
మనఃస్ఫుార్తిగా కోరుకుంటుా....
శైలజగారుా...."హేట్సాఫ్ టుా యుా ".
అభినందనలతో..మీ స్నేహితురాలు
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.,
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.