Wednesday, June 28, 2023

పూరీ యాత్ర. రథా యాత్ర

తపస్వీ మనోహరి పత్రిక కొరకు ,
విభాగం : దర్శనీయ స్థలాలు , ఆధ్యాత్మిక విశేషాలు.
రచన :  శ్రీమతి :  పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక :    జగన్నాథ పురీ ఆలయ చరిత్ర.

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి.

ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని,, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారట. ఈ పట్టణంలో శ్రీ మహా  విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు

ఈ  ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనదే కాక హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెపుతారు.

ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి అరవై  కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ఆలయాన్ని ప్రధమంగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు.
తదుపరి  శిథిలావస్థకు చేరుకున్న ఈ  ఆలయాన్ని కళింగ పాలుకుడైన అనంత వర్మ చోడగంగాదేవ ప్రారంభించగా , తదుపరి ఆయన మనవడైన రాజా అనంత భీమ్రావు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడని చెబుతారు.

ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం.

.అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. 

విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, 
ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపగా అతడు. విశ్వావసుడి కూతురైన లలితను  ప్రేమించి పెళ్ళాడీ , ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతూడంతో అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్లేడట. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడచగా, . కొన్నాళ్లకు అవి మొలకెత్తడంతో, దారి స్పష్టంగా తెలిసిందట., వెంటనే  ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడట్టగా , ఇంద్రద్యుమ్నుడు
ఇప్పటికప్పుడు అడవికి బయలుదేరాడట.
కానీ అక్కడ చేరే సరికి అక్కడ విగ్రహాలు మాయమవడంతో    ఇంద్రద్యుమ్నుడు నిరాశకు గురై  ,  అప్పటికప్పుడు అక్కడే అశ్వమేధ యాగం చేయడమే గాక, , 
నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, అక్కడే నిద్రించేవాడట.
.

ఒక  రోజు   నిద్రిస్తున్న ఇంద్రద్యుమ్నుని   కలలో  జగన్నాథుడు  కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశించాడట.. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాఠపపోవడంతో,.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్ఛి, తానొక్కడే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ,  21 రోజుల వరకు  అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధించాడట. 
 రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో ,.  రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపించాడట..
షరతు తప్పిన రాజుకు అక్కడ శిల్పి కనిపించలేదు కానీ ,
చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిచ్ఛేయట. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా , చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిచ్ఛి. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడట. 
అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి ,నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు .దీనిని నవ కళేబరోత్సవంగా నిర్వహిస్తారు . ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది ఈ జగన్నాథ రథయాత్ర.
" జగన్నాధ రధ యాత్ర " గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో  అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఒక రహస్యమే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న అంతు పట్టని రహస్యాలేంటో ఓసారి తెలుసుకొందామా !

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.


పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి

ఈ ఆలయ గోపురం పైన ఉండే  ఈ జెండాలకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఎగురుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో  ఎగురుతుంది.
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.

చాలా ఎత్తుగా ఉండే పూరీ జగన్నాథ్ ఆలయం  గోపురం పైన   20 టన్నుల బరువు గల సుదర్శన చక్రం ఉంటుంది.  . ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

సాధారణంగా అన్ని చోట్ల  గాలి సముద్రం నుంచి భూమి వైపునకు  వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం  అందుకు విరుద్ధంగా విభిన్నంగా గాలి వీస్తుంది.

జగన్నాథ ఆలయం పైన పక్షులు కూడా ఎగరవు.  " ఎందుకు ఎగరవు.." అనే విషయం మాత్రం, ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.  దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. అంత అద్భుతమైన నిర్మాణమా , లేక దేవుడి మహిమా...?   అన్నది మాత్రం అంతు చిక్కడం లేదంటారు..
సింహద్వారం నుంచి ఆలయంలోకి  ఒక్క అడుగు  లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే  అలల శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం   హోరు మని  వినిపిస్తుందట.

ఇకపోతే పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది  రథయాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలనుపయోగిస్తారు. 
 మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.
రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.
ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుందట.. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీలాగానే ఉండిపోయింది.
 
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన కానీ, రుచి కానీ ఉండదు . కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ ఘుమఘుమలాడుతూ, ఎంతో మధురంగా ఉంటాయి .
విచిత్రం ఏమిటంటే
ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో  ఆలయంలో.   ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం,  ఎంతమంది భక్తులు వచ్ఛినా సరిపోయే విధంగా సమకూరడం  ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.

పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరట .

, ఇన్ని అద్భుతాలు నిండిన ఈ పవిత్ర పూరీ క్షేత్రాన్ని దర్శించేందుకు
దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.


గూగుల్ సేకరణ.

Monday, June 26, 2023

శీర్షిక :సాహితీ పుట్టినరోజు.

24/06/2023.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : బాల సాహిత్యం.
ట&డ* ఒత్తు సంయుక్తాక్షర పదాలు.

శీర్షిక :సాహితీ పుట్టినరోజు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ :మహారాష్ట్ర: 


ఈరోజు మా సాహితీకి ఇష్టమైన పుట్టినరోజు
 మేమంతా ఎంతో కష్టపడి.
 ఇల్లంతా అలంకరించి ,తీర్చిదిద్దాము.
 మా మహతి రోజంతా ఎంతో 
 హడావిడి చేసిందంటే నమ్మండి.
మహతికి తన  చెల్లెలు పుట్టిన రోజంటే
చాలా విశిష్టమైన రోజు.
సాయంత్రం అవగానే మహతి, అమ్మతో చెల్లికి 
ఇష్టమైన చాక్లెట్ కేక్ తెప్పించమంది.
మహతి సాయంత్రం ,చెల్లి సాహితీకి ఇష్టమైన
బెస్ట్ ఫ్రెండ్స్,నందరినీ పిలిచి వచ్చింది
వాళ్లకి అందరికీ ఇవ్వడానికి 
బోల్డన్ని చాక్లెట్లు ,చిప్స్, అన్నీ కొన్నాది.
రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలానే కొన్నాది.
ఇక సాయంకాలం నాలుగు అవుతూ ఉండగా
 మహతి, సాహితీల సందడి చూడాలి.
మహతి హాలులో అడ్డదిడ్డంగా పడి ఉన్న 
సామాన్లన్నిటినీ చక్కగా నీట్ గా సర్దింది.
అట్ట ముక్కలతో చేసిన" హ్యాపీ బర్త్డే" ముక్కలని
 చక్కగా అతికించి గోడకు అలంకరించింది.
 సాహితీకి ఇష్టమైన రంగురంగుల బెలూన్స్ ని
 నోటితో ఊది , వాటిని  గుత్తులుగా చేర్చి
  గోడలకు అక్కడక్కడ  అంటించింది.
 రోల్డ్ గోల్డ్ వస్తువులు సాహితీకి నచ్చవు.
 అందుకే మహతి తన గోల్డ్ నగలన్నీ
  సాహితీకి ఇచ్చింది.
సాహితీ చెవులకి గోల్డ్ జుంకాలు పెట్టుకుంది
 చేతులకి గోల్డ్ గాజులు వేసుకుంది.
 లైట్ గోల్డెన్ కలర్ పరికిణి -జాకెట్టు వేసుకుంది.
 కాలికి వెండి మువ్వల పట్టాలు పెట్టుకుంది.
 అందంగా బుట్ట బొమ్మలా ఉన్న చెల్లిని చూసి 
 మహతీ ఎంతో మురిసిపోయింది .
 మహతి ,సాహితీల సందడి చూసి వాళ్ళ అమ్మ
  చిక్కనైన పాలు వెన్నలతో చక్కటి పాయసం చేశారు.
  ముందుగా చిన్ని కృష్టుడికి నైవేద్యం పెట్టారు.
  మహతి, సాహితీలు ఇద్దరు స్పష్టమైన తెలుగులో
  కృష్టుడి పాటలు పాడీ, మంగళహారతులిచ్చారు.
 కృష్ణుడికి , అమ్మానాన్నలకి దండం పెట్టారు.
ఇంతలోనే  పిల్లలు చట్టా పట్టాలు వేసుకుని,
అంతా కట్ట కట్టుకొని ఒక్కసారిగా వచ్చేసేరు.
 సాహితీ కేకు కట్ చేసింది.
 అమ్మ అందరికీ లడ్డూలు, చిప్స్, పంచింది.
 పిల్లలంతా సందడిగా "అష్టాచమ్మా," "మ్యూజికల్ చైర్"
 " పాసింగ్ ద బాల్ "ఆడుకున్నారు.
  అమ్మ అందరికీ రిటర్న్ "గిఫ్ట్స్ "తో పాటు
   చాక్లెట్లు , బిస్కెట్లు  ఇచ్చింది.
   మహతి సాహితీలు ఫ్రెండ్స్ కి
   గుడ్ నైట్ చెప్పారు.
  పిల్లలందరూ సాహితీకి "బెస్ట్ విషెస్ "చెప్పి 
  సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.

**********************************

శీర్షిక :సాహితీ పుట్టినరోజు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ గారు 

ఈరోజు మా సాహితీకి ఇష్టమైన పుట్టినరోజు
 మా మహతి రోజంతా ఎంతో 
 హడావిడి చేసిందంటే నమ్మండి.
వాళ్లకి అందరికీ ఇవ్వడానికి 
బోల్డన్ని చాక్లెట్లు✅👌 
మహతి, సాహితీల సందడి చూడాలి.👌
అట్ట ముక్కలతో చేసిన" హ్యాపీ బర్త్డే👌" ముక్కలని
 చక్కగా అతికించి గోడకు 
 రోల్డ్ గోల్డ్ వస్తువులు సాహితీకి నచ్చవు.👌
 అందుకే మహతి తన గోల్డ్ నగలన్నీ
  సాహితీకి ఇచ్చింది.👌
సాహితీ చెవులకి గోల్డ్ జుంకాలు పెట్టుకుంది
 చేతులకి గోల్డ్ గాజులు వేసుకుంది.
 లైట్ గోల్డెన్ కలర్ పరికిణి -జాకెట్టు వేసుకుంది.👌
మహతి, సాహితీలు ఇద్దరు స్పష్టమైన తెలుగులో
  కృష్టుడి పాటలు పాడీ, మంగళహారతులిచ్చారు.
 కృష్ణుడికి , అమ్మానాన్నలకి దండం పెట్టారు.
పిల్లలంతా సందడిగా "అష్టాచమ్మా," "మ్యూజికల్ చైర్"
 " పాసింగ్ ద బాల్ "ఆడుకున్నారు.
   సాహితీకి "బెస్ట్ విషెస్ "చెప్పి 
  సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.
👉 బుజ్జాయి, మహతి ,సాహితీ 
అక్కాచెల్లెళ్ళ మధ్య ప్రేమతో మహతీలో పుట్టిన రోజు పండుగ 
కన్నుల పండువగా జరిగింది. ఆనందాల అంచులకు తీసుకెళిపోయారు. వత్తులు చాలా బాగా కుదిరాయి . సాహితీకి బర్త్డే విషెస్ . అధ్బుతం . అమోఘం .. పిల్లలూ సాహితీకి జేజేలు చెప్పండి . అభినందనలు .
🙏 🎉 💐 🤗🤗🤗🤗🥇🍫🍫👌💐💐💐

-------_-------------------------_------------------------------

 

  
 

Tuesday, June 20, 2023

మత్తకోకిల పద్యాలు

05/05/2023
తపస్వీ మనోహరం మరియు ఈ వేమన కవితానిలయం 
 సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్య, వచన కవితల పోటీ కొరకు ,
అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట మొాచనీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సితావర దాయినీ ॥

జోత లెట్టెద చిద్ఘనీ శుభ జ్యోతి చక్రని వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ బ్రోవవె మాత మంగళ రుాపిణీ ॥

ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ.
భండ దైత్య విదారిణీ భవ బంధ దుఃఖ విమొాచనీ ॥

భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన శక్తి శంకరు కామినీ ॥
సుాక్తి సుందరి శాంత రుాపిణి సుార్య తేజ ప్రకాశినీ
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥


హామీ :
మత్తకోకిల పద్యాలు నా స్వీయ రచనలు.

కీర్తన

🙏ఓం నమో నారాయణాయ 🙏
🌷కమలాలయతే నమో నమో 🌷
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

పల్లవి :
కమలాలయతే నమో నమో
కమల భూషణా హరి నమో నమో

1. చరణం :
నారద తుంబుర స్వర రాగ నుత
పరమ పూజ్య హరి నమో నమో 
సరోవర పద్మాలంక్రుత గంధమాధన
కరి వరద నుత కాళింది మర్దన నమో నమో

2. చరణం :
హనుమత్సేవిత అమరేంద్ర నుత
గాన విభూషణ భక్తవత్సలా నమో నమో
అనిమిష విభవ ఆనంద రూప
మణిమయ దీప మధురవాక్పాలక నమో నమో

3. చరణం :
పృథ్విజాపతి పండరి పుర నుత
అథిరధ మహారధ ధనుష్పాణినే నమో నమో
మదురపురాధీష గోకుల వరద 
అదె వేంకటాచలా ఆరాధ్యధామ నమో నమో

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

మీ కుసునూరు భద్రయ్య 🙏🌹
గోవిందార్పణ మస్తు 🙏🙏🌹
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Sunday, June 18, 2023

శీర్షిక. : నాన్న. కవితలు

"మార్గదర్శి  
​మా నాన్న.
     గుడిపూడి రాధికారాణి.

మళ్ళీ ఆడపిల్లేనా?
మూకంతా మూతి విరిచినా
మూర్ఖించకుండా మురిసిపోయింది
              మానాన్నొక్కడే

పొత్తిళ్ళలో పసిగుడ్డుగా
పొదివిపట్టుకోవడం చేతకాక
తన వేలును నా గుప్పిట్లో దూర్చి
తనివితీరా నన్నుచూసి 
కళ్ళలో కాంతులు నింపుకుని
తన చేతిస్పర్శ నా మనసుకు తెలిసేలా
నా భవితకు భరోసానీ,భద్రతనీ
ఆర్ద్రంగా వర్షించిన కారుణ్య మేఘం...మా నాన్న.

నాలుగో ఏటనే నాకు చదవటం నేర్పేసి
తన పెళ్ళినాటి నుండి కొనిదాచిన
చందమామల్ని నేను చదివేస్తుంటే
ముద్ద ముట్టక్కర్లేదిక అని
మురిసిపోయిన మెరుపుతునక...మా నాన్న.

ఎడమచేత్తో రాసే నన్ను 
పురచేతివాటం అని అంతా హేళన చేస్తుంటే
గెలిచిన రోజు ఈ సమాజమే 
నీ సంతకం కోసం చేయి చాపుతుందని 
ఊరడించిన మార్గదర్శి...మా నాన్న. 

ఆనాడు నా ముద్దుమాటలకు,ముత్యాలరాతకు 
నాన్న మురిసిపోవడం నాకు గుర్తులేదు.
ఈనాడు నా సాహితీ సేద్యం 
చూపి మురిసిపోదామంటే నాన్న లేరు.

అయితేనేం...నా రచనలకు
  మీ చప్పట్లతో నాన్న నా వీపు తట్టినట్లు
  మీ మెచ్చుకోళ్ళలో నాన్న కళ్ళు మెరిసినట్లు
ఇప్పటికీ నాన్న వేలుని నా గుప్పిట్లో పదిలంగా పట్టుకున్నట్లు
ఆ ఊహే నా కలమును కదిలించేస్తున్నట్లు...
అంతే మరి...
        భావనలే కదా బతుకు బండి ఇంధనాలు...

"మార్గదర్శి  
​మా నాన్న.
     గుడిపూడి రాధికారాణి.

మళ్ళీ ఆడపిల్లేనా?
మూకంతా మూతి విరిచినా
మూర్ఖించకుండా మురిసిపోయింది
              మానాన్నొక్కడే

పొత్తిళ్ళలో పసిగుడ్డుగా
పొదివిపట్టుకోవడం చేతకాక
తన వేలును నా గుప్పిట్లో దూర్చి
తనివితీరా నన్నుచూసి 
కళ్ళలో కాంతులు నింపుకుని
తన చేతిస్పర్శ నా మనసుకు తెలిసేలా
నా భవితకు భరోసానీ,భద్రతనీ
ఆర్ద్రంగా వర్షించిన కారుణ్య మేఘం...మా నాన్న.

నాలుగో ఏటనే నాకు చదవటం నేర్పేసి
తన పెళ్ళినాటి నుండి కొనిదాచిన
చందమామల్ని నేను చదివేస్తుంటే
ముద్ద ముట్టక్కర్లేదిక అని
మురిసిపోయిన మెరుపుతునక...మా నాన్న.

ఎడమచేత్తో రాసే నన్ను 
పురచేతివాటం అని అంతా హేళన చేస్తుంటే
గెలిచిన రోజు ఈ సమాజమే 
నీ సంతకం కోసం చేయి చాపుతుందని 
ఊరడించిన మార్గదర్శి...మా నాన్న. 

ఆనాడు నా ముద్దుమాటలకు,ముత్యాలరాతకు 
నాన్న మురిసిపోవడం నాకు గుర్తులేదు.
ఈనాడు నా సాహితీ సేద్యం 
చూపి మురిసిపోదామంటే నాన్న లేరు.

అయితేనేం...నా రచనలకు
  మీ చప్పట్లతో నాన్న నా వీపు తట్టినట్లు
  మీ మెచ్చుకోళ్ళలో నాన్న కళ్ళు మెరిసినట్లు
ఇప్పటికీ నాన్న వేలుని నా గుప్పిట్లో పదిలంగా పట్టుకున్నట్లు
ఆ ఊహే నా కలమును కదిలించేస్తున్నట్లు...
అంతే మరి...
        భావనలే కదా బతుకు బండి ఇంధనాలు...

Friday, June 16, 2023

శీర్షిక శ్రీ అగస్త్యేశ్వర , చెన్నకేశవ ఆలయం

మనోహరి పత్రిక కొరకు రచన
 తేదీ 16 6 23
 విభాగం వ్యాసం
 అంశం ఐఛ్ఛికం

పేరు అద్దంకి లక్ష్మి
 ఊరు ముంబై 

శీర్షిక   శ్రీ అగస్త్యేశ్వర , చెన్నకేశవ  ఆలయం 

కడప జిల్లా చెప్పలి

 కడప జిల్లా కమలాపురం సమీపంలోని 'చెప్పలి' గ్రామంలో  అగస్త్యేశ్వర స్వామి , చెన్నకేశవ ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 
అగస్త్యేశ్వర  స్వామి ఆలయం గర్భగుడి గజపృష్ట  ఆకారంలో విలక్షణంగా ఉండటం విశేషం . ఇక్కడి శివలింగం కూడా ఆధ్యాత్మిక ఆకర్షణతో భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తూ ఉండటం విశేషమే !

 చెప్పలి క్రీ.శ. 575 కాలంలో  రేనాటి చోళుల రాజధానిగా విలసిల్లింది. తెలుగుభాషలో మొదటి రెండు శాసనాలను ఈ రేనాటి చోళులే కలమల్లలో, ఎర్రగుడిపాడులో వేశారు.

 ఈ గ్రామంలో 1.13 ఎకరాల స్థలంలో, ఒకే ప్రాంగణంలో శివకేశవుల ఆలయాలు ఉన్నాయి. శివాలయంలో అగస్త్యమహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించగా, 6వ శతాబ్దంలో రేనాటి చోళులు ఆలయాన్ని పునరుద్ధరించారు.

 శివకేశవుల ఆలయాలకు ఎదురుగా బలమైన 2 రాజగోపురాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. 48 అడుగుల ఎత్తయిన ఈ రెండు గోపురాలూ ఇప్పుడు కూలిపోయి ఉన్నాయి. శివాలయం ఎదుట ఉన్న గోపురం 1994లో కూలిపోగా, చెన్నకేశవస్వామి ఆలయం ఎదుట ఉన్న గోపురం, 2011, జూలై 28న కూలిపోయింది. 

 ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 
ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని  పాలించాడనటానికి
అగస్త్యేశ్వరాల స్తంభాలకు చెక్కబడిన తెలుగు
శాసనాలే నిదర్శనం.

 ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. 
 
 నంది వాహనంపై శివపార్వతులు గల అరుదైన విగ్రహం ఉండటం ఇక్కడి విశేషం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద శివాలయాలలో ఎక్కడా ఇలాంటి విగ్రహాలు లేవు.

 వీటి పక్కనే ఉన్న శ్రీలక్ష్మీసమేత చెన్నకేశవ ఆలయాన్ని 1323లో విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 
విశాలమైన ఆవరణం, రెండు పెద్ద గాలి గోపురాలు, శుభకార్యాలకు పెద్ద వంటశాల, పెండ్లి మంటపాలు ఉన్నాయి.

 ఏటా కార్తీకమాసంలో కల్యాణం చేస్తున్నారు. రోజూ ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటుగా ప్రతి సోమవారం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలిగోపురాన్ని పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.

 యెల్లమ్మ ఆలయం

 గ్రామంలోని చెప్పలి యెల్లమ్మ ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరు గాంచింది. 
యెల్లమ్మ తల్లి గ్రామంలోని ఒక గ్రామాధికారి ఇంట్లో ఉద్భవించినట్లుగా స్థలపురాణం వల తెలుస్తోంది. 
చైత్రమాసం బహుళ ఏకాదశి దినాన్ని పురష్కరించుకుని గ్రామంలో ఏడు రోజుల పాటు జాతర జరిపే ఆచారం ఉంది. 
యెల్లమ్మ గుడికి పూజారిగా ఆత్రేయస గోత్రానికి చెందిన భట్రాజు వంశస్తులు వ్యవహరించడం పురాతన ఆచారం.

రోడ్డు మార్గంలో : కడప కి 30 కి.మీ

హామీ ఈ వ్యాసం నా స్వంతం దేనికీ అనువాదం అనుకరణ కాదు ఏ వెబ్సైట్ పత్రికలకూ పంప బడలేదు

Thursday, June 15, 2023

పద్యాలు

[08/06, 8:23 pm] JAGADISWARI SREERAMAMURTH: మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
08-06-2023-
అంశము: రైతు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
శీర్షిక:  ఇలను వేల్పు.
ప్రక్రియ: *ఇష్టపది*
*********************

తొలుత పడిన చినుకులె తొలి వేల్పు వరములై 
అన్న దాత మనసు లాడె సంతసముగా
మట్టి తల్లిని నమ్మి  మనసార ప్రణమిల్లి
సాగె మడులు దున్న సంతసమ్ముగ నతడు ॥
ఏరువాకదె వచ్చె  నెడ్ల నాగలి తిరిగె
పారు నీటి సడులవి  పాట గలగల లాయె
జోరు విత్తనాలనె జొచ్చి నాటిన వేళ 
సారమట్టి సుగంధ  సరులె గాలిని జుట్టె ॥


హలము బట్టె రైతులు హాయి పసిడి ఫలముకు
పచ్చనైన మొలకలు పకృతి పడతికి సరులు 
బంగారు మడులెన్నొ పొంగారు వరములై 
పొలము నిండెను పంట  పొంగి పొరలెను సిరులు ॥
వెన్నెముక పుడమికని వేల గొంతులు పలికె
వెలసె కర్షకుడిలను వేల్పు మనకీ భువిని
అన్నదాతలు లేని  అవని బ్రతుకే లేదు 
అన్నదీశ్వరి మనుడు అన్నదాతే ఘనుడు ॥
[15/06, 3:52 am] JAGADISWARI SREERAMAMURTH: 14/06/2023

మహతీ సాహితీ  కవి  సంగమం 

 ప్రక్రియ: సీస పద్యము .

 రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .



సర్కారు బడిలోన సరి విద్యలను నేర్చి
పేరెన్ను నది వారు పెక్కు మంది.
జాతి బే /ధము లేక / నీతిన్యా/యములెంచి
కలిసి మె/లసి యుండు / కట్టు తోడ |

గుణమున్న  భావాల గురులెల్లరును గూడి 
 విద్య నేర్పె దరుగ వివిద గతుల
 కపటబు ద్ధది లేని కమ్మన్ని  స్నేహాలు
 సర్కారు బడి నుండు సత్య మిదియె  !
 
ఆట వెలది

పిల్ల పాప లెల్ల పిలుపు వలపు తోడ 
ఆట పాట లిడుచు అలసి సొలసి
అమ్మ  ఒడిని  చేరు నాద మరచు నిద్ర -
నిండు  మనసు  తోడ నిర్మలముగ !

రుసుము నెలకు లేదు రూక లక్కరలేదు
కడుపు నింప కాసు ఖర్చు లేదు
అమ్మ వలెను సాకు  నాయమ్మ లుందురూ
అచట పిల్లలున్న  నాత్మ శాంతి !

Wednesday, June 14, 2023

హంసికలు

**ప్రదన్య సాహితీ వేదిక బృందం*
సంకలనం కొరకు

12/06/2023.
 
ప్రదన్య సాహితీ వేదిక

హంసికలు ప్రక్రియ.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

••••••••••••••••••
1.
కాలుష్య నివారణ నినాదం.
చెవిటివాడి ముందు శంఖంలా
కాలువ నిండిన చెత్తకు, కంపు కాపలాలా...॥
2
అక్కరకు రాని చుట్టాన్ని  ,
 కష్టానికి స్పందించని నాయకుణ్ణి ,ఎన్నుకోకు
అబద్ధపు బాసల అతి వాదిని నమ్మకు...॥
3
రసహీనమైన జాతీయ గీతం 
వత్సరాని కొకసారి వడ్డన లేని విస్తరిలా
 రాజకీయపుటెత్తులకు గతి తప్పిన పాటలా॥
4
ఎక్కడుందో ,మువ్వన్నెల ఝండా .
వెలసిన రంగులను దాస్తుా 
ఏటికోసారి తీస్తున్న ఉరి తాడుతో...॥
5
అమ్మకానికి ఓట్లు...
పంచుతున్న నోట్లకు బానిసలా
అమ్మ భారతినాదుకోలేని అసహాయతలా.॥
6
మన భారత దేశ ప్రగతి...?
అడుక్కోవడమొక్కటే తక్కువలా
మాటలు మరచిన మట్టి బుక్కడాల్లా ॥
7
దేశాన్నేలే నాయకులు
విదేశీయులకు తొత్తుల్లా
దేశ సంపదకే "చెక్" పెట్టిన శకునుల్లా ॥
8.
మన దేశ భవితలు
మేలి ముసుగుల్లో  మైలుపడిన ఏలికలు
మానత్వాన్ని మంటగలిపే  పిశాచాలు॥
 9. 
ఉఁ ఊఁఁ ...అంటే ఊచకోత .
ప్రణాళికలు లేని  రాజ్యాగంలో
ఊపిరాడని జనం ,ఉరిగా మారిన ఉద్యమాల్లో    
10
మారుస్తున్న నోట్లతో, మంతనాలకు
 బడుగు జీవుల బ్రతుకు పోరాటాలు
మాట పట్టించుకోని  మడ్డి వ్యవస్థలు.

************************:::***********:
హామీ : 
ఈ హంసికలు నా స్వీయ రచనలు.


గజల్ రాయడం ఎలా

మిత్రులకు నమస్తే !
గజల్ రాయాలని ఇష్టం, పట్టుదల  ఉన్నందున తప్పక చక్కగ రాయగలరు..

గజల్ వ్రాయడమెలా ?
*******************
మొదట 
గురులఘువులు గుర్తించడం తెలియాలి.
గురువులు: 
దీర్ఘాక్షరాలు, 
 రా రీ రూ రే రై రో ( ఐ ఔ చేరిన అక్షరాలు )
కం గం నిం - సున్న చేరినవి
విసర్గ తేరిన అక్షరాలు దుః 
సంయుక్తాక్షరానికీ ద్విత్వానికి ముందున్న అక్షరాలు గురువులు 
సుత్తి  - సు గురువు
లక్క - లగురువు
పత్తి - ప గురువు
సత్య- స గురువు
-పద్మ  ప గురువు
విస్సు - వి గురువు 
మరి ఇక...లఘువు 
క కె. రు. గు. కి. డి జు వంటివి అన్నీ లఘువు


గజల్ లో గణాలు ఉండవు . మాత్రలు తెలియాలి
గురువు -2 మాత్రలు
లఘువు - 1 మాత్ర
3 మాత్రల పదాలైతే త్రిస్రగతి
4 మాత్రల పదాలై తే చతురస్ర గతి
5 మాత్రల పదాలు వాడితే ఖండగతి
రెండు రకాల గతులు కలిపితే మిశ్రగతి, సంకీర్ణ గతి 
ఇలా ఉంటాయి. 


3 మాత్రలు- కవిత 
4 మాత్రలు - కవితలు, కవితా 
5 మాత్రలు- కవిత ఇది, కవితలే 
ఇలాంటి కూర్పు తీసుకొని వ్రాయాలి. 
రెండు షేర్ పాదాలలో విషయం ఒకటే అయిఉండాలి. 
ఉదాహరణ ---

నీ కంటి పాపలో నీలమై పోతాను 
నీ మేని ఛాయలో రాగమై పోతాను 

ఇక్కడ మై చివరి అక్షరం అయింది. దాని ముందు ల, గ లో అచ్చు అ గానే ఉంది. గజల్ మొత్తం ఇలాగా రావాలి. పెద్ద కాఫియా లైతే 
మురిసిపోతోంది, కురిసిపోతోంది, అలిగిపోతోంది, కుమిలిపోతోంది ఇలాంటి పదాలు వస్తే సరిపోతుంది. 

కాఫియా ఎంపికలో జాగ్రత్త ఉండాలి.అచ్చు ఒక్కటై ఉండేలా వ్రాయాలి. అప్పుడు అందమైన గజల్. లయ, నియమం కుదురుతుంది. 

గజల్ కు శీర్షిక‌ ఉండదు‌ వచన కవిత లాగా. 

మత్లా = గజల్ లో మొదటి ద్విపద ( రెండు పాదాలు) చివరి పదాలు  ఖాఫియా, రదీఫ్  అంటారు

షేర్ = గజలలోని మిగిలిన ద్విపదలు..షేర్ లంటారు. 
ఇందులో మొదటి పాదం కేవలం మాత్రలు పాటిస్తూ 
సాగుతుంది. దీనిలో కాపీయా, రదీఫ్ అవసరం లేదు. 

రెండవ పాదం మత్లాలోని విధంగా కాఫియా, రదీఫ్ 

ఇలా మత్లా‌, షేర్లు కలిపి, 5, 7, 9....ద్విపద లుగా రాస్తారు.


చివరి ద్విపదలో కవి పేరు ( తఖల్లూస్)ఉంచుకో వచ్చు క్లుప్తంగా.. 

ఇక 
నా పూర్తి గజల్ ఇక్కడ కింద పోస్ట్ చేస్తున్నాను ఉదాహరణ కోసమే.. 
ఇందులో 
రదీఫ్ : అనుకున్నా 

కాఫియా:  దాగాలని, పాడాలని  వగైరా లు 
కాఫియా పదంలో  "డాలని " "పదంముందున్న అక్షరo లో అచ్చు అన్నిటికి ఒకేలా సరళంగా ఉండాలి.  
"పాడాలని " అ కారమే వస్తుంది అన్ని కాఫియా లు. 

గతి: 6-6-6-6


గజల్ ప్రాథమిక లక్షణాలు  మాత్రమే ఇచ్చాను 
 గజల్ లో కొంత స్వేచ్ఛ ( మరీ ఎక్కువగా కాదు) తీసుకో వచ్చు.  ఉదాహరణకు  నిజమెంతొ "" అని రాయవచ్చు "నిజమెంతో ' కి మాత్రతగ్గింపు కోసం.  బదులుగా ...వచన కవితలో ఐతే ఇలా రాయకూడదు.  

 అలాగే లయ అందుకోగలిగి ఉంటే 6 మాత్రలు కట్ చేసినట్టు ఉండనక్కర లేదు. నాలుగు మాత్రలు పదాలు మూడు కలిపి పన్నెండు గా లెక్కింపు చేయొచ్చు.  కొందరు సీనియర్ కవులు లయ తో వ్రాస్తారు. అందమైన గజళ్ళు. 

గజల్ లో "తఖల్లూస్ నామ ముద్ర  "ఉండకపోయినా పరవాలేదు. ఐచ్ఛికమే. 
గజల్కి ఒక ఆత్మ ఉంటుంది.
సహజత్వం తో చమత్కారం ఇమిడి పోవాలి అప్పుడే అది సంపూర్ణ గజల్. ఒట్టి నియమాలతో మాత్రలు సరిపోతుంది అనుకో రాదు. మన గజల్ పాఠకులు మెచ్చాలి. 

 మీరు వ్రాస్తున్న అద్భుతమైన వచన కవిత ల్లో లాగే ఉపమానాలు ఉండొచ్చు కానీ అవి సహజం గా ఇమిడి పోవాలి. హృదయం కదిలేలా విషాద గజల్... 
పెదవిమీద చిరునవ్వు విరిసేలా ప్రేమ గజల్ ఉండి, లోకం తీరు గజల్ ఔరా నిజమే అనిపించాలి. 
మొత్తానికి వహ్వా అనిపిస్తుంది అప్పుడు గజల్ !
ఉదాహరణ కి... 
సేవ గజల్ వారోత్సవాలలో నేను వ్రాసిన గజల్ V V V. శర్మ సార్ పాడారు జూమ్ లో. జడ్జిల ప్రశంసలు పొందిన గజల్ !


తాజా గజల్ 

చెలిమోమున  నునుసిగ్గులు చూడాలని అనుకున్నా 
మల్లియనై  పూలజడను  మురవాలని అనుకున్నా

గుండెలలో దాచుకున్న బండలాంటి కఠినతలే 
వెన్నపూస లాగ మారి కరగాలని అనుకున్నా 

మొహమాటం నవ్వులన్ని మోజుమరీ పెంచినవే 
హాసమణులు గుప్పిటలో దాచాలని అనుకున్నా 

ఎవరికివారే లోకం ఏటికి ఎదురీదు బతుకు 
తోడునీడ సఖికొంగున నిలవాలని అనుకున్నా 

నిశ్శబ్దపు నిశీధిలో అమావాస్య జతకూడెను 
మిణుగురులై చెలిచూపులు మెరవాలని అనుకున్నా 

కత్తులు విసిరే కాలం చిత్తుగ నను ఓడించే 
అనునయాల అమృతఝురులె కురవాలని అనుకున్నా 

ప్రేమతపసు వరమైనది భామమనసు అందె ఉమా 
సురకిన్నెర వీణియతో  పాడాలని అనుకున్నా !!


మీతో ఈ ముచ్చట్లు పంచుకునే అవకాశం ఇచ్చినo దుకు అడ్మిన్ గారికి ధన్యవాదములు. నేను ఇంకా నేర్చుకోవాలి. గజల్ సముద్రం లాంటిది. ముత్యాలు, పగడాలు అమూల్యమైన ఓషధులు ఉంటాయి.  ధన్యవాదములు. 🙏🙏🙏🙏

ధన్యవాదాలు మిత్రులకు 
ఎం. వి. ఉమాదేవి

అన్నీ నేనే...

[13/06, 7:54 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక : అన్నీ నేనే ...అంతా నేనే..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


నేను..
నాదమైనా ,  నినాదమైనా 
వేదమైనా , వివాదమైనా
నిజాల దోపిడీకి నీ నీడగా, సాక్షిని
ఆత్మ ఘోషల అక్షర కుక్షిని॥

ఉరుము లేని మెరుపులేదు
భుామి లేని ఆకాశం లేదు.
చినుకు తడిలేని మేఘం లేదు.
భావోద్వేగం లేనిదే కవి కాడు.॥

మట్టి కణాలతో మలచిన దేహం
తాత్కాలికపు ఉనికికి తార్కాణం.
తమస్సు నిండిన మనస్సులో మలినం
వెలిగించు జ్ఞాన సముపార్జనతో దీపం ॥

నేను..
అరుణోదయ శాంతి కిరణాన్ని
ప్రాణ స్పందనల ప్రకృతి వరాన్ని .
అక్షరకోట్ల అనంత భావాకృతికి-. 
వెలుగై వ్యాపించే చింతామణి ద్వీపాన్ని॥

భయాన్ని నేనే , బాధనుా నేనే
గిరి గీసుకున్న గాధనుా,  నేనే...
గుండె గుడిలో వెలిగే జ్యోతిని నేనే
 ఓ న మః లు నింపుకున్న బడిని నేనే॥

విప్లవాల బాటలో  వీర గతిని నేనే
విశ్వ శాంతి బాటలో విజయ కేతనం నేనే ॥
నన్ను నన్నుగా  మలచుకునేవారికి 
శాంతి జీవితాన్ని నేనే...
వ్యక్తిత్వం లేని వారి జీవితాలకు
 వెలుగునివ్వని శాపాన్ని  నేనే.॥
 
 నేను , పాత కొత్తలతో ప్రవహించే 
అనంతాక్షర అమృత వాహినిని..
ఆర్చుకుపోతున్న గుండె మడులలో తడినై 
విప్లవ విత్తులు నాటించే  కలం హలాన్ని ॥

*************************
[13/06, 7:57 pm] +91 93224 00551: సూపర్ కవిత మేడం 👌👌👌💐💐💐
[13/06, 8:01 pm] +91 93235 64359: భలే 👏👏👏 ఎంత బలాన్ని పుంజుకుని వ్రాసారో 👍👍🙏
[13/06, 8:06 pm] +91 96193 06414: గుండె మడులలో తడినై
విప్లవ కత్తులు నాటించే
కలం హలాన్ని.. సూపర్ 👌👍🙏
[13/06, 8:11 pm] +91 98190 96949: మీ కలం హలానికి హ్యాట్స్ ఆఫ్ మేడం 👏
[13/06, 8:22 pm] +91 97698 55645: 👏👏👏👌👌👌 కలం హలం మీ బలం
🙏🙏🙏

Wednesday, June 7, 2023

ఎందుకని....?

[01/06, 8:51 am] JAGADISWARI SREERAMAMURTH: 
శీర్షిక  : ఏముందని...?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఒదొగొదిగి రాసిన ఈ  అక్షరాల్లో
ఒడిసి పట్టుకునేందుకు ఏముందని..?

కవి కాని కవిగా ఉబుకు తున్న భావాలను 
అణచిపెట్టి రాసే అబద్ధాలు ఎందుకోసమని...?

ఒట్టొట్టి కవితరాసి ఒక ప్రశంస పత్రం మంది  
పోకపోసి చుాసి చుాసి ఆనందం ఎందుకని..?

నిజం రాయలేని కలం, విమర్శంటె నీకు భయం
ఏ సందేశం తెలుపని ఈ కవిత లింకేటికని...?

నిన్ను నీవె మొాసగించి ఆత్మ క్షోభ ననుభవించి
నిజం వెలికి తీయలేక నిప్పు మింగుడెందుకని..?

 జరుగుతున్న దన్యాయం  జారిపోయె నక్షరం
 కానరాని దారిలో కలిసిపోయె నో చితిలొ
 
 చేతి కలం చెరచబడె ,ఉన్న మాట కొరతబడె
 ఊకదంపు మాట కవిత  కురితీయవెందుకని ?
  
 నీ భావం నిజమైతే ,  నీకలయే బలమైతే
చేయి న్యాయమొక్క సారి, ఓ కవితకు పెట్టు" సారె"

చితికి పోవు ఆశయాల కుార్చపేర్చు అక్షరాల
 కనువిప్పై కదలి నంత , బ్రతుకుతుంది నీ కవిత॥

**************************************

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.
[01/06, 9:18 am] +91 99678 29399:
 సూపర్బ్..👌🏻👌🏻
[01/06, 9:37 am] Sangiveni raveendra: 
Thought provoking poem..!
బాగుంది👍💐
[01/06, 10:16 am] +91 93240 93249: 
Nice poem
[01/06, 10:50 am] 
+91 95943 51660: 👌🏻👌🏻
[01/06, 10:55 am] 
+91 78881 56530: 👌🏻👌🏻
[01/06, 11:17 am] 
+91 84838 78838: జీవితముందని 🙏🏿
[01/06, 11:21 am] 
+91 70212 67856: 👌👌👏
[01/06, 11:23 am] 
+91 98334 97812: సూపర్ కవిత అభినందనలు 👌👌💐💐
[01/06, 9:29 pm] 
+91 93200 36339: 👌👌👌బాగా చెప్పారు మేడం
[01/06, 9:59 pm] 
+91 96193 06414: 
మీ కవితలు చాలా బాగుంటాయి..
నా పుస్తకపు పుటల్లో దాచుకునేట్టుగా.. 👌
మచ్చుకి యీ క్రింది విధంగా...
👍👍🫡

జీవితమే నడిసంద్రపు నావ
తెలియని బ్రతుకు ఒడిదుడుకుల త్రోవ
అలల ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది? ఏమని అడిగేది??

గడిచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలే దొంతరలై కదిలే
వెదికి చూడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యథ కలిగించె

ఎవరిని ఎన్నని ఏమిటి లాభం
గడిచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై నే నిలిచిన క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం

భువిలో ఎన్నో అక్షరమాలలు
ఉచ్ఛ నీచ ఆచారపు దాడులు
జాతి మతముల జాడ్యపు మరకలు
తెరవని తలుపుల అడ్డుగోడలు

జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేది నీ వెనుక యాత్రలో

ఒంటరినై నే నిలిచిన క్షణంనా
మనసే నాతో మాట్లాడు నేస్తం...

          .. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 👏

[02/06, 9:04 am] +91 98190 96949
: మేడం, మీ కవిత అందరి లాంటిధైనప్పటికి, 
కొన్ని వాస్తవాలను మోహమాట పడకుండా 
వ్యక్త పరిపరిచారు. అది నాకు నచ్చింది.👌
👏👏👏👌