Monday, August 26, 2013

తరంగిణి పాట.తరతరాల సాంప్రదాయ  సౌగంధపు వాహినీ  రంగరించు రాగసుధల  సంగీత మోదినీ ॥ గిరులు, ఝరులు ,  విరులు , తరు-  లతాపూరిత  భూషిణి ॥ వాణీ వర- వీణారవ  రమ్య రస  సుపోషిణీ ॥ ఆమని భరతావని. ......  సమత, మమత సమ భావన  నిండు నిర్మలావనీ ........ ॥ ఆదర్శపు   అడుగులసిరి  ఆణిముత్యముల  ఖని ॥ అనురాగము  పంచు నిధుల  నిండు నిత్య  యౌవ్వని ... ॥ ఆట, పాట ,  కవుల ,కళల నాదరించుపాధినీ .... ॥ అహ -రహములు  శాంతి బాట , నడచు కల-సుభాషిణీ .... ॥ ఆమని... భరతావని సమత , మమత ,  సమ భావన   నిండు నిర్మలావనీ .........॥ __________________________

"తరంగిణి "(ప్రారంభ గీతం ). 

_______________________________

తరతరాల సాంప్రదాయ 
సౌగంధపు వాహినీ 
రంగరించు రాగసుధల 
సంగీత మోదినీ ॥

గిరులు, ఝరులు , 
విరులు , తరు- 
లతాపూరిత 
భూషిణి ॥
వాణీ వర-
వీణారవ 
రమ్య రస 
సుపోషిణీ ॥

ఆమని భరతావని. ...... 
సమత, మమత
సమ భావన 
నిండు నిర్మలావనీ ........ ॥

ఆదర్శపు  
అడుగులసిరి 
ఆణిముత్యముల
 ఖని ॥

అనురాగము 
పంచు నిధుల 
నిండు నిత్య 
యౌవ్వని ... ॥

ఆట, పాట , 
కవుల ,కళల
నాదరించుపాధినీ .... ॥

అహ -రహములు 
శాంతి బాట ,
నడచు
కల-సుభాషిణీ .... ॥

ఆమని... భరతావని
సమత , మమత , 
సమ భావన  
నిండు నిర్మలావనీ .........॥
_________________________________
_____________________________________


ఇదె మా అంజలి గొను..

(ఫిబ్రవరి 10TH 2011 గురువారం ,రాధసప్తమి నాడు " హరిహరకళాక్షేత్రం " హైదరాబాద్ లో "శివపద సప్తాహం " జరిగిన  సందర్భం గా గురువుగారు" శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారికి గౌరవ పూర్వకంగా  సమర్పించిన " స్వర పుష్పాంజలి "

శణ్ముఖాంజలి .(ప్రారంభ గీతం )

--------------------------------------------------
ఇదె మా అంజలి గొనుమా గౌరవగురు జననుతా 
షణ్ముఖ శర్మ నామా కారణ జన్మాద్భుతా 
నిపుణ పురాణాది ధనీ  , గుణ సద్గుణ జ్ఞానఖనీ 
 వాజ్మృదు  గంభీర స్ఫూర్తి  వరభూషిత విభూతీ ॥ ఇదెమా ॥ 

అహరహములు శ్రమియించీ , అంబ శివుని అర్చించీ 
మహా గ్రంధ సారమ్మును అందించిన  ఘనగురూ 
సహస్ర దివ్య శివ-మహిమలె , కీర్తనలుగ రచియించితి -
విహపర సాధన ఘనములు ,అవియే మా ధనములు ॥ ఇదేమా ॥ 

శివ-శక్తుల జపియించుటే నిత్య కర్మాగా, ఆ 
శివ లీలలు గిరి కీర్తులే నోటిపలుకుగా ...... 
శివార్పణము నీ దేహము ,శివమయమే జీవనమూ 
నీ గమనమే శివ పథమూ , నీ తలపులే శివపదం 

శివపదం ..... ఈ.... శివపదం ....... 
శివకృప  కలిగిన వేదం , నీ రచనీ శివపదం ... 

_________________________________         
_____________________________



Wednesday, August 14, 2013

అమరగీతం.

అమరగీతి.  (యే మేరె వతన్ కె లోగో వరస )

--------------------------------------------------------



మన దేశం హక్కులకోసం  
పోరాడే వీరులనేకం 
గుర్తించీ  వారి త్యాగం   
కన్నీరిడరే  కొంచం ॥ 

శతృవుల  గుండెలు చెండీ , 
తూటాకు బలైనారండీ 
అమరత్వం పొందిన యువత 
 నిలబెట్టిరి ఝండా ఘనత ॥

గాంధీ పోరాడిన దేశం , 
నెహ్రూజీ కోరిన సంఘం 
అందించీ మనకు స్వాతంత్ర్యం ,
అసువులనే బాసిన సత్యం ॥మన ॥  

 జాతి మతాలను వీడి ,
ఒకటై మని స్నేహం తోడి 
చిందించిన రక్తం భువిపై , 
ప్రవహించెను నదులై ఝారులై ,॥

ఒక తల్లికి మిగిలెను శోకం ,
తెగే భార్యకు మంగళసూత్రం 
అర్పించిన ఆత్మ త్యాగం ,
అది మననం చేసుకో నిత్యం ॥ మన ॥ 

ఈ భారతి ముద్దుల పంట ,
గర్వించే ఈ యువతంతా 
మనమంతా ఒకటే శక్తి , 
ప్రవహించే రక్తం ఒకటి ॥

చిరునవ్వులు మోమున నింపి , 
స్వాతంత్ర్యపు విందులు పంచీ 
నిలపెడదాం ఝండా చరితా , 
జై కొడదాం లేవండంతా ॥ మన ॥ 
-----------------------------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర .).
-------------------------












____________________________________________



Saturday, August 10, 2013

పాడవోయి విజయగీతి.

స్వాతంత్ర్య గీతి . 

------------------------
పాడవోయి విజయగీతి 
పుడమితల్లి వెలుగుకీర్తి 
అమరులైన వారి స్ఫూర్తి 
స్మరియించే వరదినం 
స్వాతంత్ర్యపు శుభదినం ॥ 

సమసమాన భావనతో కలసిపోదమీదినం 
కులమతాల భేదములను కూలద్రోయుటె ధనం 
తరతరాల చరితలకే నిలువుటద్దమీదినం  
వీరగతిని పొందు ఘనుల త్యాగఫలము ఈ దినం ॥ 

స్వాతంత్ర్యపు హక్కులనే పొందినార మీదినం 
భరతమాత కీర్తి ఘనత చాటి నిలుపు గౌరవం  
సత్య,ధర్మ , శాంతి గురుతుగా ఝండా నిలుపుదాం 
చేయి చేయి కలిపి మాత ఒడిని శాంతి నిలుపుదాం ॥ 

అహింస దారి అడుగులేసి ఆగడాలనాపుదాం 
ఆదర్శపు బాట నడచి ఆనందం పంచుదాం 
సమత మమత పంచి భరత మాత కీర్తి పెంచుదాం 
మన ఝండా ఎగురవేసి విశ్వశాంతి నిలుపుదాం ॥ 

-------------------------------------------------------------
రచన, శమతి,
పుల్లాభట్ల, జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
---------------------------------
___________________________________________


 

Sunday, July 14, 2013

నవ్వవే బంగారు పాపా ॥

నవ్వవే ఓ పాప బంగారు పాపా ....
కల్లకపటము లేని బోసి నవ్వుల మొలక
నీ నవ్వు ఏడేడు లోకాల గెలుపు
ఆనంద లోకాల విహరించు పిలుపు ॥ నవ్వవే ॥

చిదమ బుగ్గలు కారు చిక్కన్ని పాలు
లేలేత పెదవులే ముద్ద  మందారాలు
కలువ వంటీ కనులు చిలుకు వెన్నెలలు
నీలోని అందాలు విరిపారిజాతాలు ॥ నవ్వవే ॥

చిట్టి పొట్టీ నడక వయ్యారితనమొలుక
ముద్దు మాటలు తీపి తేనేల్లు చిలుక
చిన్ని అల్లరితోడ చేయు మురిపాలు
మా యింటి సందళ్ళు ,ఆనంద పరవళ్ళు ॥ నవ్వవే ॥ 

తేట తెల్లని దినుసు ,అద్దమంటీ  మనసు
ఆట,పాటల తీరు ముద్దు ముచ్చట మాకు
హాయినిచ్చే సిరులు పసిపాప పరవళ్ళు
నిన్ను వలచనివారు ఈ జగములో లేరు ॥ నవ్వవే ॥

తొందరెందుకు నీకు ఎదిగి ఏం చెస్తావు
వింత లోకపు తీరు , మర్మమెరుగవు నీవు 
ఆటు పోట్లకు నలిగి విసిగి అలసిన నీవు
ఏ ఏ టి కాయేడు నవ్వు మరచెదవీవు ॥ నవ్వవే ॥

---------------------------------------------------
-రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర ).



--------------------------------------------------
---------------------------------------------------