కలల ఆశల మేడలూ... ఆ
మాట రాదాయె నా... నోట
ఎరుగవైతివే నా.... వలపూ
తెలియలేదు నా మనసు నీదనీ.
వయసూ వన్నెలా .....
అలలా ...నీ.... తలపులా....
లయలా.... నీ అడుగులా......
నీ చూపులే కవితలా..... ॥
నీ నవ్వుల జల్లులు ..
________________________
నీ నవ్వుల జల్లులు కురిసి
పూవులెన్నో విరిసాయీ
నీ కన్నుల కాంతులవెంట
దివ్వె లెన్నో వేలిగేయీ ॥
నీ హంసల నడకలలో
నిండు హొయలు ఎన్నెన్నో
నీ మువ్వల సవ్వడిలో
నెమలి నాట్య గతులేన్న్జో
అల్లే.. కురుల..జడలో పూల
పరిమళం పలకరించిందీ
నాలో.. దాగి ఉండే ప్రేమ
నీకై ... నిద్ర లేచింది ॥
చెదిరే ముంగురులే ..చిరు
గాలి వీచికై కదిలే ....
బెదిరే నీ చూపులో ..
( ఆ) .. నీడే . నేనై .మెదిలే
అదిరే పెదవి అందాలా
దాగేప్రేమ సందేసాలే .అవి
కబురై మేఘమాలికలై
కురిసే చినుకు చిరు జల్లై ॥
నీ తీయని తలపులు ఏవో
నన్ను కమ్ముకున్నాయి
స్వప్నం లో స్వర్గ విహారం
చేయ రమ్మని పిలిచాయి
నా వయసే ఓ నందనవనం
నా మనసే .... బృందావనం
నీవై నిండె నామది ...
రావే ....... నా..... చెలీ ॥
_______________________
"కరగిపోయె కలలన్నీ "
_________________________
(అతడు) :
కరగిపోయె కలలన్నీ
కలవరమే మిగిలిందీ
మాదిర మత్తులో కూడా
నీ రూపే మెదిలిందీ
మైకంతో మనసు చేరీ
మౌనగీతి పాడిందీ
శృతి చేయని గొంతు దాటి
అపశృతిగా పలికిందీ ॥
ఈ పేద బతుకులో కన్నీటికి విలువేదీ
మధువు రేపు మంటల్లో విఫలమైన ప్రేముందీ
ప్రేమించే నా తలపునూ నీకు ఎలా తెలిపేదీ
ముక్కలైన గుండె కోతనూ తిరిగి ఎలా అతికేదీ ॥
(ఆమె:)
తెలుసుకోనైతి తెలుపరానైతి
దాగి ఉంది నీ రూపనీ .
దూరమౌదాక తెలియరాలేదు
ప్రేమ నాలో నీదనీ .... .
సడిచేసే గుండె లోనా ..
నీ...తలపు వలపుందీ ...అది
నీవనే నా తలపునూ
నీకు ఎలా తెలిపేదీ ॥
మోడువారిన మానులన్నీ ఒంటరిగా నిలిచేయీ
మనసు తోట పూలన్నీ వాడి రాలిపోయాయీ
చిగురించని కొమ్మ చేరి ఏ కోయిలా పాడదూ
పూలులేని తోటలోకి ఏ మధుపము చేరదూ ॥
__________________________________
___________________________________
''హాయిగొలుపు ఆ నవ్వే ''
_________________________________
హాయిగొల్పు నీ నవ్వే
వెన్నెలంత చల్లదనం
అలిగి దూరమైనంతనే
కాల్చుతుంది నీ మౌనం ॥
ప్రేమతప్ప ఏమివ్వనూ
ఏమిలేని పేదతనం
అందమైన లేదు నాకు
నా రూపమే ఒక శాపం॥
అనురాగం మూగదైనదీ
అది నీదనీ తెలుపలేనిదీ
అందని ఆ చందమామను
పొందలేని తపనిదీ ॥ హాయి ॥
స్నేహమెంత ఓదార్పో నిను
కలిసి తెలుసుకున్నాను
నీ అల్లరి మాటలలో
నన్ను నింపుకున్నాను
ఈ జన్మకు చాలునదీ నీ
చెలిమి మరువలేనిదీ
చీకటి మది , నీ తలపులే
నా బ్రతుకు నిలుపు శ్వాసలవీ .॥ హాయి ॥
___________________
____________________
ఆవేదన చెందకుమా ...
_____________________________
ఆవేదన చెందకుమా హృదయమా
కంటనీరు తుడిచి సేద తీరుమా
ఆనందపు సీమలోన ,
అనురాగము పంచ చెలియ
నన్ను చేర వచ్చినదే ప్రాణమా... ॥
పలకరింపు నవ్వులతో పిలిచిందీ
సైగలతో సోగకనుల చూసిందీ
ఏనాటినుంచి దాచిందో వలపు మదీ
ఈనాటికి కరుణించి చేర వచ్చిందీ ॥
మూగ నోము వదలి మాట కలిపిందీ
సిగ్గుతెరలు బుగ్గలలో దాచిందీ
చేయి చేయి కలుప దరికి చేరిందీ
వలపు తోటలోన విహరింపగ రమ్మందీ ॥
ఏనాటి కలయో నిజమాయెనూ
నా మదిలో వలపు పాట వినిపించెనూ
చెలి చెంతనున్న క్షణమెంతో ఆనందమూ
చిగురించె ప్రేమ లతల మా అనురాగమూ ॥ ..
_____________________________
_____________________________
హృదయమా....
_____________________
హృదయమా వలపు బంధమా ...
అందమా ప్రేమ తరంగమా....
వినుమా.... నను ... గనుమా,......
ఓ ... ప్రేమా..... మనోరమా........ ॥
రవివర్మ చిత్రకళా సారమా ....
శ్రీనాధుని కవితా . సారాంశమా
ఆ మురళీ మోహన సంగీతమా..
ఆ నిర్మల పూర్ణ చంద్ర బింబమా ॥
వినుమా... నను .గనుమా
ఓ ... ప్రెమా.... మనోరమా..... ॥
అరవిరిసిన ఆటవెలది అందమా
కంద అంద గతి పదవిన్యాసమా ...
నా శ్వాశ శీసమాల చెలి చంపకమాల
నా ప్రేమ పిలుపు వినుమా సందేహమా .....
వినుమా నను గనుమా
ఓ ప్రెమా....... మనోరమా...... ॥
_________________________
_________________________
మనసా..... మనసా ..
__________________________
మనసా.... మనసా....
నన్నొదిలి వెళ్ళకే ఓ మనసా .... నా
మదిని భావాలు నీకు తెలపాలి
నీవే చెలివై విను మనసా... ॥
పెదవిపై నవ్వు చేరగిపోనీకు
పంచుకో నువ్వు జంటగా.. ఈ
వింతలోకాల చింతలే వీడి
మంచి మాట వినిపించనా ..నా
కల నిండే కళ మది చెప్పే కధ
వినవే నాకై నా చెలిగా ... ॥
నింగిలో మెరయు నిండు చందురుడు
పాల వెన్నెలై కురిసేనులే
ఆ చిన్ని తారలే చేయు అల్లరులు
మిణుకు మెరుపులై వెలిగేనులే
ఆ వింత లోకాలు చూసి రావాలి
నాతొ కలిసి రా మనసా ....॥
నీలి మేఘాల ప్రేమ భావాలు
జల్లు వానలై కురిసేనులే ..ఽఆ ..
చినుకు తడులలో విరిసి సుమబాల
ప్రేమ గీతాలు పాడేనులే ... ఏడేడు
రాగాల ఇంద్ర_- ధనుసుపై ...
నాట్యం చేద్దాం రా మనసా...... ॥
____________________________
___________________________