కల్యాణి రాగం. ఆది తాళం.
అరో॥ స, రిచ, గఅం, మప్ర , ప, ధచ, నికా, స ॥
అవ ॥ స ని ధ ప మ గ రి స ॥
-----------------------------------
పల్లవి.
-----------
నిరుపమగుణ సదనీ వాణీ
నీరజాక్షి జయ నిత్య కల్యాణి..॥ నిరుపమ ॥
అనుపల్లవి.
--------------
వరదాయకి వాణీ....కర రాజిత
వర మ్రదు వీణా పాణీ....॥ వర॥ నిరుపమ ॥
చరణం.
-----------
శరదిందు శోభిత సుందర వదనీ..
రాగాది స్వర, లయ, సంగీత సదనీ..॥
ఓంకార నాదాది ప్రణవ ప్రసుానే..
వాగ్విలాసిని వరదే కల్యాణీ...॥ నిరుపమ ॥
చరణం.
-----------
బ్రహ్మ మానస జాయే మాత్రే..
శ్రుతి సామ గాన సుధా రస పుార్తే..
అక్షయతేజో రుాప సుగాత్రే..
కచ్ఛతి వీణా వాదిని వంద్యే...॥ నిరుపమ ॥
-----------------------------------------------------------
రచన, :స్వరకల్పన...
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
Saturday, May 18, 2019
సప్త తాళ కీర్తన. సరస్వతీ ప్రార్ధన.
సప్త తాళ కీర్తన.ధ్యాన కీర్తన.++ మంగళ హారతి.
ధ్యాన కీర్తన.
--------------------
పుార్వికల్యాణి రాగం. ఆదితాళం.
---------------------------------------------
పల్లవి .
---------
హిమశైల సుతే ..పాహీ లలితే
పాలయమాం , శరణాగత వత్సలే...॥హిమ ॥
అనుపల్లవి.
--------------
కామకోటి పీఠ వాసినీ.....ఈ.....॥ కామ...
శంకరాభరణ వేణీ....॥2 ॥ హిమ ॥
1.చరణం.
---------------
సుమశరేక్షు కోదండ పాణీ -
రమణి మణీ రస రాగ రంజనీ..॥ 2 ॥
కోమలతర శుభ సుందర వదనీ
శ్యామల వర్ణ అపర్ణ భవానీ ॥ హిమ॥
2.చరణం.
-------------
రాకా శశిముఖి , రాజీవ లోచని ,
శాకంబరి శ్రీ సింహ వాహినీ...॥ 2 ॥
ముాకదైత్య దమనీ.....మాహేశ్వరీ..
ఏకానేకాక్షర మంత్ర స్వరుాపిణీ..॥2॥.హిమ॥
3. చరణం.
---------------
షట్చక్రోపరిస్థిత కమలాసని..
షడ్గుణ నిపుణ సంపుార్ణాభరణీ..
మాయా కల్పిత విషయ ధురీణే....
త్రిజగద్వందిత త్రిగుణ స్వరుాపిణీ...॥ హిమ॥
------------------------------------------------------------
రచన + స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
సప్త తాళ కీర్తనల మంగళ హారతి.
--------------------------------------------
శహన రాగం
ఆదితాళం.
మంగళ హారతి.
---------------------
పల్లవి:
మణి మయ మకుట ధరీ, సింహాసన
స్థితకరి శ్రీకరి శివ గౌరీ....
అను పల్లవి:
అణిమాద్యష్ట శిద్ధేశ్వరి ఈశ్వరి ,
జయ జగదీశ్వరీ..మంగళం....
మంగళం......మంగళం.....॥
మంగళం..
చరణం:
ఆర్కద్యుతి, శిర పాదాంగుళ్యే
నయనంచ తధా , పావక తేజే
తేజో రాసి సముద్భవ భేద్యే
మాం పాహీ శివే... మంగళం..
మంగళం....మంగళం...॥
చరణం:
రుప దశ దివ్య , మంత్ర మాన్యే
క్షితి మండల క్షేమంకరి సౌమ్యే
చింతిత మానస హరిత క్లేసే
పాలయ మాం జయ మంగళే..
మంగళం..మంగళం...మంగళం...॥
...............
Monday, February 25, 2019
తెలుసుకున్న నిజం
తెలుసుకున్న నిజం (శీర్షిక ).
పల్లె నుండి
పట్ణం వచ్చేక
పచ్చదనం కరువైంది.
ఎండకైనా ,వానకైనా,
చెట్టు చాటు మరుగైంది.॥
పెరుగుతున్న జనాభా వల్ల
వ్రుక్ష బారుల కోతలు...
నీటి చెరువుల -
ముాతలు , పడ్డాయి॥
పచ్చటి పైటచెంగుతో
కళ కళ లాడే
ప్రక్రుతి పడతి అందాలు
బోసి పోయాయి. ॥
రగిలే ఎండకు ,
నీరు లేని విందుకు
నిస్సారమై నీరసపడింది ।॥
కట్టడాల కలపకై
కనుమరుగవుతున్న వ్రుక్షాలు
తరిగిపోతున్న తమ
ఉనికిని గని
తల్లడిల్లి పోయేయి॥
ఆకాశ హార్మ్యాల పేటలు
ప్రతీచోట వెలిసి
పచ్చదనం కనుమరుగై
ప్రాణవాయువు
కరువై పోయింది ॥
అక్సిజన్ కరువై
అనారోగ్యం పెరిగింది.॥
కిచ కిచ రవాల
శుభోదయం--
ఎగిరే పక్షుల
నవోదయం-
కానరాని పుడమితల్లి,
బీటలువారిన మనసుతో
సారహీనమై సొమ్మసిల్లింది॥
తడి ఇంకిన మట్టి తల్లి
పొడిబారిన పెదాలని
తడిపేందుకు ఆర్తితో
మేఘుని చెలిమికై
చేతులు జాపింది॥
రాజ్యాలను ఏలేందుకు
ఎందరో వచ్చీ పోయే
నాయకులు నయవంచనతో
నాటక రంగస్తులయ్యేరు॥
నాట్ల పెంపు, నీటి
పంపుల -మాటల తో
నోట్లు పంచి, ఓట్లు
పెంచుకున్నారు ॥
పంట పొలాల బీడులు,
కరువు కటకాల చావులు,
రోగాలకు లేని మందులు,
తాగు నీటి కరువుల తో
ప్రజలంతా విల విల
లాడిపొితున్నారు ॥
మదమెక్కిన
మనిషి మేధస్సు
ముార్ఖపు మొండి వైఖిరితో
మారణహోమం చేస్తున్నాది ॥
రోజు రోజుకుా
పెరుగుతున్న కాలుష్యం
కర్కశంగా ప్రజల ఆరోగ్యం తో
చదరంగం ఆడుకుంటున్నాది॥
ఆర్తనాదాల అంగట్లో
గ్లోబల్ వార్నింగ్ ల ఘోషకు
కళ్ళు తెరిచిన నాయకులు
చేపట్టిన మొక్కల పెంపకం
పథకం, గ్రామాని కో నర్సరీ, ॥
ప్రజల్లో వచ్చిన చైతన్యం
మొక్కలు నాటాలన్న ధ్యేయం
ప్రతీ ఇంటింటా పచ్చదనం
ప్రతీ బాటా పుాలవనం॥
ఇంటింట పచ్చతోరణం-
ప్రతి తోటా జనుల జీవనం.
పక్షుల రవముల శుభోదయం,
కళ కళ శోభల జీవిత సారం ॥
ఇప్పుడు ప్రతీ గ్రామంలో
నాటే మొక్కలు
కాలుష్యాన్ని హరించే
ప్రక్రుతి పాలకులు
భావి తరాల నాదుకొనే
అరోగ్య సిరి సంపదలు॥
ఇంటింటి కీ ఒక మొక్క
కాలుష్యాన్ని హరించి
ఆరోగ్యాన్ని పెంచే
సంజీవామ్రుత చుక్క.॥
------------------------------
రచన , శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
------------
తెలుసుకున్న నిజం (శీర్షిక ).
పల్లె నుండి
పట్ణం వచ్చేక
పచ్చదనం కరువైంది.
ఎండకైనా ,వానకైనా,
చెట్టు చాటు మరుగైంది.॥
పెరుగుతున్న జనాభా వల్ల
వ్రుక్ష బారుల కోతలు...
నీటి చెరువుల -
ముాతలు , పడ్డాయి॥
పచ్చటి పైటచెంగుతో
కళ కళ లాడే
ప్రక్రుతి పడతి అందాలు
బోసి పోయాయి. ॥
రగిలే ఎండకు ,
నీరు లేని విందుకు
నిస్సారమై నీరసపడింది ।॥
కట్టడాల కలపకై
కనుమరుగవుతున్న వ్రుక్షాలు
తరిగిపోతున్న తమ
ఉనికిని గని
తల్లడిల్లి పోయేయి॥
ఆకాశ హార్మ్యాల పేటలు
ప్రతీచోట వెలిసి
పచ్చదనం కనుమరుగై
ప్రాణవాయువు
కరువై పోయింది ॥
అక్సిజన్ కరువై
అనారోగ్యం పెరిగింది.॥
కిచ కిచ రవాల
శుభోదయం--
ఎగిరే పక్షుల
నవోదయం-
కానరాని పుడమితల్లి,
బీటలువారిన మనసుతో
సారహీనమై సొమ్మసిల్లింది॥
తడి ఇంకిన మట్టి తల్లి
పొడిబారిన పెదాలని
తడిపేందుకు ఆర్తితో
మేఘుని చెలిమికై
చేతులు జాపింది॥
రాజ్యాలను ఏలేందుకు
ఎందరో వచ్చీ పోయే
నాయకులు నయవంచనతో
నాటక రంగస్తులయ్యేరు॥
నాట్ల పెంపు, నీటి
పంపుల -మాటల తో
నోట్లు పంచి, ఓట్లు
పెంచుకున్నారు ॥
పంట పొలాల బీడులు,
కరువు కటకాల చావులు,
రోగాలకు లేని మందులు,
తాగు నీటి కరువుల తో
ప్రజలంతా విల విల
లాడిపొితున్నారు ॥
మదమెక్కిన
మనిషి మేధస్సు
ముార్ఖపు మొండి వైఖిరితో
మారణహోమం చేస్తున్నాది ॥
రోజు రోజుకుా
పెరుగుతున్న కాలుష్యం
కర్కశంగా ప్రజల ఆరోగ్యం తో
చదరంగం ఆడుకుంటున్నాది॥
ఆర్తనాదాల అంగట్లో
గ్లోబల్ వార్నింగ్ ల ఘోషకు
కళ్ళు తెరిచిన నాయకులు
చేపట్టిన మొక్కల పెంపకం
పథకం, గ్రామాని కో నర్సరీ, ॥
ప్రజల్లో వచ్చిన చైతన్యం
మొక్కలు నాటాలన్న ధ్యేయం
ప్రతీ ఇంటింటా పచ్చదనం
ప్రతీ బాటా పుాలవనం॥
ఇంటింట పచ్చతోరణం-
ప్రతి తోటా జనుల జీవనం.
పక్షుల రవముల శుభోదయం,
కళ కళ శోభల జీవిత సారం ॥
ఇప్పుడు ప్రతీ గ్రామంలో
నాటే మొక్కలు
కాలుష్యాన్ని హరించే
ప్రక్రుతి పాలకులు
భావి తరాల నాదుకొనే
అరోగ్య సిరి సంపదలు॥
ఇంటింటి కీ ఒక మొక్క
కాలుష్యాన్ని హరించి
ఆరోగ్యాన్ని పెంచే
సంజీవామ్రుత చుక్క.॥
------------------------------
రచన , శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
------------
తెలుసుకున్న నిజం (శీర్షిక ).
పల్లె నుండి
పట్ణం వచ్చేక
పచ్చదనం కరువైంది.
ఎండకైనా ,వానకైనా,
చెట్టు చాటు మరుగైంది.॥
పెరుగుతున్న జనాభా వల్ల
వ్రుక్ష బారుల కోతలు...
నీటి చెరువుల -
ముాతలు , పడ్డాయి॥
పచ్చటి పైటచెంగుతో
కళ కళ లాడే
ప్రక్రుతి పడతి అందాలు
బోసి పోయాయి. ॥
రగిలే ఎండకు ,
నీరు లేని విందుకు
నిస్సారమై నీరసపడింది ।॥
కట్టడాల కలపకై
కనుమరుగవుతున్న వ్రుక్షాలు
తరిగిపోతున్న తమ
ఉనికిని గని
తల్లడిల్లి పోయేయి॥
ఆకాశ హార్మ్యాల పేటలు
ప్రతీచోట వెలిసి
పచ్చదనం కనుమరుగై
ప్రాణవాయువు
కరువై పోయింది ॥
అక్సిజన్ కరువై
అనారోగ్యం పెరిగింది.॥
కిచ కిచ రవాల
శుభోదయం--
ఎగిరే పక్షుల
నవోదయం-
కానరాని పుడమితల్లి,
బీటలువారిన మనసుతో
సారహీనమై సొమ్మసిల్లింది॥
తడి ఇంకిన మట్టి తల్లి
పొడిబారిన పెదాలని
తడిపేందుకు ఆర్తితో
మేఘుని చెలిమికై
చేతులు జాపింది॥
రాజ్యాలను ఏలేందుకు
ఎందరో వచ్చీ పోయే
నాయకులు నయవంచనతో
నాటక రంగస్తులయ్యేరు॥
నాట్ల పెంపు, నీటి
పంపుల -మాటల తో
నోట్లు పంచి, ఓట్లు
పెంచుకున్నారు ॥
పంట పొలాల బీడులు,
కరువు కటకాల చావులు,
రోగాలకు లేని మందులు,
తాగు నీటి కరువుల తో
ప్రజలంతా విల విల
లాడిపొితున్నారు ॥
మదమెక్కిన
మనిషి మేధస్సు
ముార్ఖపు మొండి వైఖిరితో
మారణహోమం చేస్తున్నాది ॥
రోజు రోజుకుా
పెరుగుతున్న కాలుష్యం
కర్కశంగా ప్రజల ఆరోగ్యం తో
చదరంగం ఆడుకుంటున్నాది॥
ఆర్తనాదాల అంగట్లో
గ్లోబల్ వార్నింగ్ ల ఘోషకు
కళ్ళు తెరిచిన నాయకులు
చేపట్టిన మొక్కల పెంపకం
పథకం, గ్రామాని కో నర్సరీ, ॥
ప్రజల్లో వచ్చిన చైతన్యం
మొక్కలు నాటాలన్న ధ్యేయం
ప్రతీ ఇంటింటా పచ్చదనం
ప్రతీ బాటా పుాలవనం॥
ఇంటింట పచ్చతోరణం-
ప్రతి తోటా జనుల జీవనం.
పక్షుల రవముల శుభోదయం,
కళ కళ శోభల జీవిత సారం ॥
ఇప్పుడు ప్రతీ గ్రామంలో
నాటే మొక్కలు
కాలుష్యాన్ని హరించే
ప్రక్రుతి పాలకులు
భావి తరాల నాదుకొనే
అరోగ్య సిరి సంపదలు॥
ఇంటింటి కీ ఒక మొక్క
కాలుష్యాన్ని హరించి
ఆరోగ్యాన్ని పెంచే
సంజీవామ్రుత చుక్క.॥
------------------------------
రచన , శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
------------
Wednesday, February 20, 2019
పాప పిపాసిని
రాత్రి నిద్దరలో విచ్చుకున్న
మస్తిష్కం, పగటి
పాపాలని పనిగట్టుకొని
మరీ ప్రతిపంబిస్తున్నాది.॥
పాలేరు నుంచి పనివాడి వరకు
అందరినీ అధికారబలంతో
అణగదొక్కుతుా,
అవమానిస్తుా , ఆనందిస్తున్న
నా క్రౌర్యాన్ని భుాతద్దం లో
చుాపిస్తుా ,భయంకరమైన
భీభత్సవాన్ని శ్రుష్టిస్తున్నాది॥
కలత నిద్దురలో అలసిన
అంతరంగం
పగలు ముాగబోతోంది.
పనికిమాలిన ఆలోచనలతో
బుద్ధి బురదగుంటలో
కుారుకు పోతున్నాది. ॥
ఏది చేసినా చెల్లుతుందనే
ధైర్యం ఇచ్చిన అహంభావం -
ఆలోచనా రహితమై
ఆగడాల ఆనందాల్ని
ఆశగా జుర్రుకుటోంది.॥
రాత్రి జ్ఞాపకాల - భయం
కనపడని మాధవునికి
మధుర భక్ష్యాలు, మంగళ
హారతుల తో పాటు ,.
ముడుపులంచం ఇచ్చి
క్షమాభిక్ష నడిగి - శాంతి
స్వాంతన పొందుతోంది.॥
మంచి చెడుల విచక్షణలను
విస్లేషించే మస్తిష్కాన్ని
మందలిస్తుా..ముళ్ళదారి
ఎంచుకున్న నా
బుధ్ధి నైజాన్ని
నవ్వుతుా భరిస్తోంది
నలిగిన నా మనసు.॥
రాత్రి కలిగిన పశ్చాత్తాపంకి
పగలు , వెలుగు ముసుగేసినా
రాత్రి నావెనకాలే నీడై
నన్ననుసరిస్తుా వెంబడిస్తోంది .॥
చేసిన పనుల చేదు నిజాన్ని
నిర్భయంగా వెలికి తీసి
చుాపుతున్న నా మన:స్సాక్షిని
నాలో ఉంచుకోలేకా. .,-.
బయటకి పంపలేకా , నాలో
జరిగే అంతర్మధనానికి
నాలో నేను--
బలైపోతున్నా సరే,
మనసు చుాసే
మధనాక్షువులకి మసిపుాసి ,
గంతలుకట్టి - నా
పాప చిట్టాలను
కరువుతీరా పోషించుకునే
నిరంతర పైశాచిక
దుష్ట పాప పిపాసిని..॥
---------------------------------
రచన..శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
-------------
Tuesday, February 19, 2019
మీ మనసులో చిన్న జాగా
మీ మనసుల్లో
చిన్న జాగా కావాలి.॥
(పుల్వామా లో)
బలవన్మరణం ప్రాప్తించిన
అమరవీరులకు అంజలి
అర్పిస్తున్నపుడు మా
మనసు లో రేగిన
కన్నీటి మంటలకు
ఏ కవి భాష్యం చెప్పగలడు.॥
మండుతున్న ఎండలో
వణుకుతున్న చలిలో
భయంకరమైన..
తుఫాను భీభత్సవం లో
దేశం కోసం , మా
జీవితాన్ని పణంగా
పెడుతుా కుాడా--మేం
మా గురించి ఆలోచించం.॥
మాకు వారంకో రోజు
శలవు దినం లేదు.
సరదాలు ,సంబరాలు లేవు.
పండగలు పబ్బాలుా ఉండవు.॥
భార్యా పిల్లలతో
గడిపే క్షణాలే కరువు.
తుపాకీ మొాతల్లో-
తుాటాల దారుల్లో-
అన్యాయపు ఆగడాల-
రుధిర ధారల్లో____
బంధానుబంధాల
కట్లు తెగిపోతాయి.
జ్ఞాపకాల ఎడారుల్లో
మా కన్నీళ్ళు
ఇంకిపోతాయి.॥
మాచేతిలో ఫోను ఉన్నా
మాకు స్నేహపుారితమైన
పలకరింపులు రావు.
అక్కా చెల్లెళ్ళ పెళళ్ళకి వెళ్లి
ఆశీర్వదించే అవకాశం రాదు.॥
అప్పుడప్పుడు ఫోన్
రింగవుతుంది. ఆనందంగా
ఎత్తిన ఫోనులో
మా క్షేమ సమాచారం
అడగడానికి ముందు
కేంటీన్ సరుకుల కాష్టు ,
వెరైటీ మత్తుల
మందు లిష్టు ఉంటుంది.॥
చెప్పడానికి బంధువులు
కొల్లలైనా , కోరి ప్రేమగా
పలకరించిన వారు కరువే.॥
గాలి -ధుాళిల విసురులో,
బండరాళ్ల పై పరుగులో,
మాదేశం , మా వాళ్లు
అన్న నిస్వార్ధపు చావుల్లో,
మాకు , మా ఉనికి కి -
రాలేదెపుడుా గుర్తింపు.॥
తుాటాల దాడుల్లో
కుాలిపోయిన మా
తోటి సైనికునికి
చేయుాతనివ్వడానికి
ఉండలేక , వదిలి పోలేక ,
మేము పడే యాతన
పగవాడికి కుాడా రాకుాడదు.॥
శవాల గుట్టల
కుళ్ళు కంపుకు
ఓదార్పు ముఖాల
మాస్కు ల్లో
ముఖాలు చిట్లించి
ముక్కులు
ముాసుకుంటారు.॥
మా కుటుంబాల
పోషణకై ఆర్ధిక
మినహాయంపులుండవు.
మా పిల్లల భవిష్యత్ కి
పుాల బాటల
తోటలుండవు.॥
మాలో ఒకరిగా ,మాకై
ఒక కన్నీటి బొట్టు కార్చే
నాటకరంగం , నగర వీధుల్లో
ఏడాదికి ఒక్కసారి చేసే
స్వాతంత్ర్యదినోత్సవం
మాత్రమే...॥
అదెందుకో ఆరోజుకి
గుర్తింపెందుకు వచ్చిందో...
చర్చించితే...ఒక్కరికిీ-
తెలియదు.
గొర్రెలమంద చందం..
బారులు తీర్చిన జనం.॥
ఎగరేసే జాతీయ ఝండాతో
ఎంగిలి చేతులను
తుడుచుకొనే ఏలికలు ,
ఏడ్పు మొహాల
ముసుగుల్లో , నెరవేర్చని
బాసల భాష్యాలిచ్చి
తమ వంతు ...
పుార్తయ్యిందనిపిస్తారు.॥
గుట్టలుగా మారిన
మా తోటి వారి శవాలను
ముాటలు కట్టి
ముడివేసినపుడు..
ముంచుకొచ్చే కన్నీటిని
తుడుచుకోడానికి కుాడా
సమయం దొరకని రక్షక
సేవా నాయకులం ॥
అటువంటి సమయంలో కుాడా
మేము మా
కర్తవ్యాన్ని మరువం.
ఎందుకంటే ..మేము
దేశభక్తి వీడలెేని
భరతమాత బిడ్డలం.॥
రక్షణ సుంతైనా లేని
విశ్వ వీర రక్షకభటులం.
సరిహద్దు సాక్షి సైనికులం.॥
మీ రక్షణే లక్ష్యంగా
పోరాటాల పేటల్లో
శవాలమై మిగులుతున్న
మీ తోటి సోదరులం.
మీకై రక్తం చిందించే
వీర రక్షక జవానులం ॥
మీ క్షేమమే మా జీవితం
మేం కోరేది ఒకటే..
మీ మనసుల్లో కొంచం
జాగా మాకోసం...మా
పరివారంకోసం ఉంచండి ॥
మీ ప్రేమే మాకు దిక్స్కుాచి
ఝండా కీర్తిని నిలబెట్టే -
ధైర్యానికి సహకార స్ఫుార్తి ।
మీ తలపుల్లో నిలవడమే
మేము పొందే ఘనమైన కీర్తి ॥
-------------------------
రచన., శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహారాష్ట్ర .)
-------------------------------------