Sunday, December 13, 2020

స్ఫుార్తిదాయకుడు.

వాగ్దేవీ కళాపీఠం..విజయవాడ.
అంశం : భావి భారతం: బాల ప్రబోధం.
రచన : శ్రీమతి, పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


శీర్షిక :
స్ఫూర్తి  దాయకుడు.
-----------------------------
ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం, తమ-జీవితాలని ధారపోసిన ,ధన్యజీవుల బాధా భరిత గాధా తరంగాలు,  ఈ నాటికీ  మన మదిని కలచివేస్తున్న  జ్ఞాపకాల కన్నీటి ఝరీ తరంగాలు ॥

మనిషి " లో" మనిషిని తట్టి లేపే నిశ్శబ్ద  సందేశ  నినాదాల, చైతన్యపు సడులు వారి చరితలు.॥

 తరాలు మారినా ,నెహ్రుా వంటి ఎందరో మహాత్ముల    జ్ఞాపక  దినోత్సవాలు, మనవీయత నశించిన మనుషుల మనోభావాల స్వార్ధపుారిత
స్వలాభ చర్యలకు స్థుాపాలపై వెలసిన శిలారుాప నిధులు. ॥

నేడు మనం సంవత్సరానికి ఒకసారి జరుపుకొనే
వారి జ్ఞాపకాల చరితా గానాల దేశ భక్తి 
స్ఫుార్తి ...దేశోన్నతి కోసం పాటుపడాలన్న 
తపనావేశం కలిగే యువతను మేలుకొల్పాలి .॥

ఈ మార్పు సమత- మమతల శాంతియుత సమాజ స్థాపనకు  నాంది కావాలి .॥


.

వాగ్దేవీ కళాపీఠం. దత్తపదులు.

వాగ్దేవీ కళాపీఠం.
దత్తపది.  కల  - తల -  మర -  వస
ప్రక్రియ: కంద పద్యం .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

కలయా నిజమా  ఏమని
తలచెను తామది యశోద తనయుని గాంచిన్
ఇలనదె మన్ను తినెడు ఆ
అల్లరి   క్రిష్ణయ్య నోట అలభుా వనముల్ ॥

పలుమారులుగ యశోదదె
జలచర ,వనగిరుల  గాంచె జగ ప్రళయములన్
అల నమరవినుతు నదే 
ఇల  మ్రొక్కెను  దైవ  సముని  ఇందిర రమణున్ ॥

11/12/2020.
వాగ్దేవీ కళాపీఠం
చేప -రొయ్య -నత్త- పీత
ప్రక్రియ : ఆటవెలది.
రచన: శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

చేప రుాప  మెత్తి  చెలగు సోమకు జంపి
వేద ములను దెచ్చు  వేల్పు నీవు
 పిల్ల వాడ వైన    పీతాంబరములిడి
 వెన్న పాలు దోచు  వెన్న దొంగ
 
 రొయ్యననుచు సాగి రోట తరుల గుాల్చి
 శాప ములను బాపు సార ఘనుడ .
 అల్ల నల్ల నున్న  నత్తటాకము చేరి
 కాళి యునదె నణచి కాచి నట్టి
 నల్లనయ్య నీకు  నమము లివియె గొను
 నంద బాల క్రిష్ణ  నరస్వ రుాప ॥

11/12/2020.
వాగ్దేవీ కళాపీఠం
చేప -రొయ్య -నత్త- పీత
ప్రక్రియ : ఆటవెలది.
రచన: శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

చేప రుాప  మెత్తి  చెలగు సోమకు జంపి
వేద ములను దెచ్చు  వేల్పు నీవు
ధరణి బ్రోవ నీవు దశరుాప ములనెత్తి
అభయ మొసగి నట్టి ఆది విష్ణు ॥

పిల్ల వాడ వైన    పీతాంబరములిడి
వెన్న పాలు దోచు  వెన్న దొంగ
రొయ్యననుచు సాగి రోట తరుల గుాల్చి
శాపములను బాపు సార ఘనుడ .

అల్ల నల్ల నున్న  నత్తటాకము చేరి
కాళియునదె నణచి కాచి నట్టి
నల్లనయ్య నీకు  నమము లివియె గొను
నంద బాల క్రిష్ణ  నరస్వ రుాప ॥





వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక..
(08.12.2020) ఇచ్చిన పదాలు
------------------------------
కామ - భామ - మామ - రామ
ప్రక్రియ :ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

---------------------

భామ సీత బట్టి  బాధించె కృుారుండు

కామ మునను చెలగు ఖలుడు లంక

మామనోహరుండు  మట్టు బెట్టునటంచు
రామ శౌర్య గుణము రమణి దెల్పె ॥

కందము
కామము నిండిన  అసురుడు
భామన్ చెరబట్టి  దెచ్చె భంగ పడంగన్ ॥
రమణి రావణు తొపలికె
మామది దోచిన రాముడు మట్టుబె ట్టునటంచున్

 (09.12.2020) ఇచ్చిన పదాలు
హర - గణేశ - కుమార - నంది.

ప్రక్రియ :ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

-------------------------------
అమ్మ చెప్పె ననుచు ఆజ్ఞపాలించుచుా
అడ్డ గింప హరుని ఆగ్ర హించి
ఒక్క వేటు వేయ ఒరిగె బాలునితల
వచ్చి కుమరు జుాచి  వగచె గౌరి.॥

పుత్రు డనియు దెలిసి  పుత్ర ప్రేమయె కల్గ
గజపు శిరము బెట్టె ఘనము గాను 
విజయ గణేశు డతడు విశ్వమేలిన వాడు
నంది వాహను సుతుకు నమము లివియె॥

 *ఏరు - పారు - ఊరు - మారు*
----------------------------------------------------
• వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక*
----------------------------------------------------
2/12/2020.
వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక
అంశం : ఏరు - పారు - ఊరు - మారు .
రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

మారుతున్న మనస్తత్త్వాల వికృత చేష్టలకు
ఏరులై పొంగుతున్న స్త్రీ ల కన్నీరు।
ఊరుా వాడా జాతి-మత విభేధాలతో
పారు తున్న మానవ సంబంధాల రక్తపుటేర్లు.॥

3/12/2020
వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక. 
అంశం  : అమ్మ - అయ్య - అన్న - అక్క
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మినీ కవిత..
శీర్షిక .
ఇల వెలసిన దేముళ్ళు.
---------------------------------

అమ్మ తన రక్త మాంసాలని
 పంచి ఇచ్చిన సృష్టి కర్త.
నాన్న మన భావి జీవిత 
కలల సాకారాల పెట్టుబడి.
అన్న  అంతరంగ ఆప్తుడైన 
బాల్య స్నేహితుడు.
అక్క ,అమ్మ తరువాత అమ్మై  
ఆదరించే ప్రేమ ముార్తి ॥


అమ్మ , బిడ్డ ఆకలెరిగి 
కడుపు నింపేది.
నాన్న , బాధ్యతెరిగి బిడ్డల 
భవిష్యత్తు తీర్చి దిద్దేవాడు.
అన్న ,తన హితునిగా 
వెన్నంటి  కాచేవాడు.
అక్క , బరువు బాధ్యతలను పంచుకున్న అమృతమయి అమ్మ కు మారు పేరు.
-----------------------------------*---------------------







ఉత్తమ కవిత

ఉసావే సాహితీ సృజనోత్సవం
*నేటి వారం  ఉత్తమ కవితలు:*

1.డా.మరుదాడు అహల్యాదేవి
2.రాజకుమారి
3.జగదీశ్వరీ మూర్తి
4.పి.వి.ఎల్.సుజాత
5.డి.ఉషా రాణి

ప్రక్రియ ప్రతీకలు

ప్రతీకలు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర :7


మంచి వారిని బాధ పెట్టకుమా
వారికి మనసు బాధ పడితే
మన కది మంచిది కాదంటారు.
మంచి చెడులు ఆలోచించుసుమా ॥

కల్లా కపటం తెలియ నందుకా
పసి వారిని కాలరాస్తున్నారు
బాల కార్మికులను బాధించేది
కడుపు కింత అన్నం పెట్టేందుకా ॥ 

మాతృత్వమది తల్లికి భారమా
ఆడపిల్లను అంతం చేయవద్దు.
ఆడపిల్ల ఇంటికి లక్ష్మంటారు.
మహిలో వారికి  ప్రేమ పంచుమా ॥

నిత్య సత్యుడైన భగవంతుని 
నియమ నిష్టలతో కొలవాలి..
అభయ హస్తుని, ఆది దేవుని
నిత్యానంద దీక్షతో పుాజించనీ ॥

నిగమ సారం తెలిసినా గానీ
  జ్ఞాని యైనా, తెలుసుకోలేడు
 మంచి గుణాలు, నడవడికలే
 నిత్య జీవితోపయొాగములని॥

తెలియక చేసిన తప్పులైతే
తెలియపరచి క్షమించవచ్చు.
తెలిసి తప్పు చేస్తే ఏమిచేస్తాం,
తెలిపి ప్రయొాజనం లేకపోతే॥

:నిత్య కర్మాచరణలెందుకని
వాటిని అశ్రద్ధ చేయకుసుమీ !
తెలుసుకో మన సాంప్రదాయాలు
నిత్య ఆరోగ్య సాధనలేనని ॥

నీ మాటే నీకు శత్రువౌతుందని
తెలుసుకో. ఆలోచించి మాట్లాడు.
మనసు కష్టపెట్టని మాటకు
నీ వారంతా నిన్ను గౌరవించనీ ॥

 తపస్సువంటి నీ సాధన చేత
 సానుకుాల పడతుంది జీవితం.
 చేస్తున్న పని మధ్యలో విడకు.
 తరువాత పోతుంది చేసిందంతా

పున్నమి కాంతి నిండిన తలపు       
మేఘమాలికలిడు సందేశమై
నా మదిలో విరిసిన ప్రేమకు
పుాచిన పుావంటి చెలి వలపు.॥

వసంత కోకిల రాగాల నావ
నీ జ్ఞాపక విహారం చేయిస్తోంది
కలువలవంటి నీ కన్నులతో
వలపు పంచి అలరింప రావ ॥
 
పుాల వనంలో వచ్చే గుభాళింపు
మనసు పరవసింపజేస్తుంది.
చెలి పక్కనుంటే ఆ పరవశం  
పుాల పరిమళం నిండు వలపు ॥



రాముని రుాపు చుాడు కనులారా
రాముని కీర్తించుచుండు నోరారా
రాముని పుాజించుము  చేతులారా
రామ నామమే ముక్తిల కదరా ॥

సీతా రాముల అన్నోన్యత చుాసి
దంపతులెలా ఉండాలో చెప్తారు.
రాముని ధర్మ పాలనను చుాసి
సీమ రాజ్యాంగాలన్నీ సరిచేసీ..॥  

రామ లక్ష్మణుల  ప్రేమ చుాడరా
అన్నదమ్ములంటే అలా ఉండాలి.
మారిన మనస్తత్వాల  బాటలో
రగిలిపోయే బంధాలు చుాడరా ॥

పదునాల్గు భువనాలను చుాప
మన్ను తిన్నాననుచు మాయజేసి
యశోద జన్మ తరింప జేసేవు
పద్మనాభా  రావ కరుణ జూాప ॥

కాళీయు నణచ చిన్ని బాలకా
కాళింది దుాకేవు భయము లేక
నారాయణుడవీవు నాధ కృష్ణా 
కావుమా మమ్ము సమయమిదిక ॥

దుష్టు లైన వారి  కుాడ వలదు.
మంచి కోరు వారి మరువ వద్దు.
యొాచనెంచి చేయు మైత్రి ముదము
దుారమాలోచించు జయము నీదు ॥

అమ్మ నాన్నలనభిమానించయా
పెంచిన ప్రేమ తిరిగి పంచయా
వృధ్ధాప్యం అందరికీ వచ్చునయా
అది తెలిసి మసలుకోవయా ॥

ఆ ముాగ జీవులపై చుాపు దయ
విస్వాసాన్ని చుాపు జంతువులవి.
మనిషి కన్నా కుక్క నయమని-
అంటారు కదా ! తెలుసుకోవయా ॥

మనిషిగా మానవత్వం చుాపుమా 
మంచి చెడులు తెలిసి వర్తించు.
మనమంతా ఒక్కటను భావంతో 
మంచిగా నువు మహిని మనుమ ॥

చంద్రుడు ఆకాశంలో  కనుపించ
చెలి జ్ఞాపకాలే చెలరేగెను.
పరవసాన మది పులకించె
చక్కిలి గిలి కవితలు తోచ ॥

చక్కదనము ఉందని గర్వించ
చెదిరిపోవునది వయసు మీర
మంచి గుణివై మహిని మనిన
చరిత ఘనమగును గర్వించ ॥

చక్కనైన చెలి పలకరించ
వెచ్చని వలపు తలపు తోచె.
చెలి నవ్వులు చెంత కురిసెగా
చల్లని జల్లై  మది మురిపించ ॥




 నాన్న అమ్మల అనురాగమన
అమృతము కన్నా తీయనైనది.
అవసానకాలంలో నువు వారి-
నమ్మకాన్ని వమ్ము చేయకు కన ॥

ముాగ జీవులపై దయచుాపుము
విస్వాసాన్ని చుాపు జంతువులవి.
మనిషి కన్నా కుక్క నయమని-
మునుపన్నది తెలుసుకొనుము ॥

మనిషిగా మానవత్వం చుాపుమా 
మంచి చెడులు తెలిసి వర్తించు.
మనమంతా ఒక్కటను భావంతో 
మంచిగా నువు మహిని మనుమ ॥

తిరగడానికెళ్ళే ,తిరుపతి.
దైవ దర్శనం ముాడ్రోజులు పట్టి,
 హుానం  అయ్యింది ఒళ్ళంతా.బాబోయ్-
మళ్ళీ వస్తే ఉండాలి పరపతి.॥

రైతన్న వ్యవసాయంతో బేజారై ॥
ఉన్న పొలం అమ్ముకొని వచ్చేడు.
నోట్లై పోయేకా బతకడంకోసం
రైలెక్కేసాడు బతుకు బేజారై ॥

కరోనాలో విసిగా । పని లేక l
డిగ్రీ చేత నున్నా, కుాలీనయ్యేను.
అది చేయ లేక కుారలమ్మేను.
కష్టం తెలిసింది.కన్నీళ్ళొచ్చేక ॥

దైవ ప్రార్ధన నిస్వార్ధమైనదై ,
నిర్మల భక్తితో నిండి ఉండాలి-
అప్పుడే దేముడు కరుణిస్తాడు.
ధేర్యం నిండు దైవ కృప మనదై ॥

పేద- సాదలపైన నువు చుాపే
దయా-ధర్మాలు మాత్రమే నీ అస్థి.
నీతి -నియమాల నడవడిక 
పేరు తెచ్చే పెన్నిధికి పిలుపే ॥

మన సాంప్రదాయ రీతుల శ్రమ
మనం పెంచే మహా వృక్ష మంటిది.
ఎంతగా పాటిస్తే అంత ఆరోగ్యం.
మన ఆరోగ్యం , మహా భాగ్యం సుమా  ॥

 గోవిందుని శ్రీవాసము అదిగో
 ధన్య మొంద ముక్తి ధామ మేలుకో
దరిసించీ దీవెనల నందుకో
గోవిందు సప్త గిలులు అవిగో ॥

దినదినముా మారే కాలమిది
మానవత్వం లేని మనిషి మది
ఏ జన్మ పాపమొా ఈనాటి విధి
దిన దిన గండం మార్పు రానిది ॥

ముత్య మంత బొట్టు నిండు ముఖము
చిరు నవ్వు నిండు పలకరింపు
సంస్కారమును మించు సౌశీలము
ముదితలందరి కది అందము ॥

మారుతున్నట్టి కాలాన్ని గనుమా
మానవత్వాన్ని మర్చిపోయినారు.
ఈ మార్పులకు కారణం ఏమిటి ?
మార్పు ప్రగతికి భారముసుమా ॥

మనిషి స్వార్ధపు బానిస సుమా
పాపం పండి ప్రకృతి కోపించింది.
మంచన్నదై కలుషిత మయ్యింది.
మారని సమాజమే ప్రళయమా ॥

ముద్దు మురిపాలవి ఎరగము.
పిడికెడు అన్నానికి బానిసలం.
కాముకుల వలలో చిక్కుకున్నాం.
ముళ్ళ బాటలో మేమనాధలము ॥




బాల కృష్ణ లీలలు

బాల కృష్ణ లీలలు 
🌸☘️🌸☘️🌸☘️🌸

సుద్దులనేలా చెప్పెదరే 
ముద్దుల కృష్ణుని లీలలకూ 
ఇద్దరికిపుడే    ఏతెంచే 
ఒద్దిక కమ్మని  వెన్నలకై.. 

    "సుద్దులనేల "

బుడిబుడి నడకలో తొందరిదే 
విడివడి చేలము మొలనూలు 
కడవలొ మునిగిన కవ్వముకు 
తడవకు తడవకు చేయెత్తే .. 
   
   "సుద్దులనేల "

పొన్నల నీడను పోటీగా 
వెన్నెల యాటల నాడంగా 
కన్నుల గంతలు తను  గట్టి 
అన్నుల మిన్నల యల్లరిఁ దే...

    "సుద్దులనేల "

ఏమా యశోద భాగ్యమిది 
మోమాటంగా నవ్వుతును 
మా మా ఇళ్లను బాలుడిదే 
రామా వెన్నల దోపిడియే... 

    "సుద్దులనేల "

చిక్కము గట్టిన లేగలకూ 
ఫక్కున నవ్వి తొలగించీ 
మక్కువ యావుల పొదుగులకు 
చక్కగ దూడల  తోలంగా.. 


      "సుద్దులనేల "
************************
✍️. ఎం. వి. ఉమాదేవి 
        నెల్లూరు