Friday, August 6, 2021

రామప్ప ఆలయ వైభవం

6/08/2021.
ప్రతి రోజుా కవితా పండుగే
ఉమెన్ రైటర్స్ లో..
అంశం : రామప్ప దేవాలయం.
శీర్షిక : రామప్ప ఆలయ వైభవం .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

కాకతీయుల శిల్ప కళా విశ్వరుాప విన్యాసాలు
అపురుాప  కళాఖండాది శిల్ప సౌందర్యాలు
అప్సరసల భంగిమల నలరే అందమైన శిల్పాలు
రామప్ప ఆలయానికి వన్నెతెచ్చిన వైభవాలు ॥

సంగీత  స్వరాలు వినిపించే కంబ నైపుణ్యాలు.
సంస్కృతి ,సాంప్రదాయాలకవి గౌరవ చిహ్నాలు.
నలభై వత్సరాల శ్రమతో రాణించిన కీర్తి కట్టడాలు
తెలంగాణ వైభవానికి వన్నె తెచ్చే నిదర్శనాలు ॥

నీటిపై  తేలియాడు ఇటిక గోడ కట్టడం
ఇసుకపై  కట్టినట్టి మందిరపు  గోపురం
రేచర్ల  రుద్రుని  ఘన ఆలయ నిర్మాణం
అలనాటి శిల్పుల మేటి నైపుణ్యం ॥

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వారిచే గుర్తింపు గౌరవం
అంతర్జాతీయ టుారిజం స్పాట్గా కొనసాగే యత్నం.
పర్యాటకులనాకర్షించే వందడుగుల శివుని విగ్రహం
రామప్ప గుడి  ప్రత్యేక ఆకర్షణకు నిలయం॥

కొండలు,చెరువులు నిండిన ప్రకృతి అందం
రుద్రేశ్వర దేవాలయంగా పేరుగాంచిన క్షేత్రం.
రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్న దైవం
శిల్పి రామప్ప పేరుతో నిర్మించబడ్డ ఆలయం॥

కేంద్రం గుర్తింపుతో యునెస్కోకు నామినేషన్
ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప వైభవం
పునర్వైభవంతో వెలిగిపోతున్న రామప్ప సోయగం
అధునాతన సదుపాయాలతో అలరారే రామప్ప ఆలయ ప్రాంగణం॥

హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

Thursday, August 5, 2021

స్వాతంత్రోద్యమం


సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రతి రోజు కవితా పండగే కార్యక్రమంలో భాగంగా భారత స్వాతంత్ర చరిత్ర కవిత పోటీల్లో పాల్గొని విజేతలైన వారి పేర్ల జాబితా విడుదల

1.గీతారాణి అవధానుల  ప్రథమ 
🤝🤝🌹🌹🎊🎊🥇🏆
2.పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి  ద్వితీయ 
🤝🌹💐🏆🥇🎊🎊
3. రాసపాక   వెంకటాచలం తృతీయ 
🎊🎊🙏🏆🥇
4.డా.రామక కృష్ణమూర్తి ప్రోత్సాహక
🎊🎊🥇🏆🙏

న్యాయ పరిశీలకులు శ్రీమతి బలివాడ తేజస్విని గారు

5/08/2021
సాహితీ బృందావన జాతీయ వేదికలో,

అంశం:భారత ఘనత స్వాతంత్ర్య చరిత.

శీర్షిక : నాదేశం త్యాగనిరతికి నిదర్శనం .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఆంగ్లేయుల పాలనలో అసమానతలు
అస్వతంత్ర్యత , అవమానాలతో 
భారత ప్రజలకు బానిసత్వపు సంకెళ్ళు.
వెరసి  జరిగిన స్వాతంత్రోద్యమాలు ॥

గాంధీజీ బాటలో శాంతియుత సత్యాగ్రగాలు
దాండీమార్చ్ తో మొదలైన  ఆమరణ దీక్షలు.
ఆందోళనల పోరాటాల్లో అసువులు బాసి -
కీర్తి కెక్కిన స్వాతంత్ర్య యొాధుల చరితలు ॥

 ఉద్యమాల శాంతియుత పోరాటాలలో.
 కోల్పోయిన స్వాతంత్ర్య యొాధుల ప్రాణాలు.
 కన్న పేగు కడతేరిన తల్లుల కన్నీటి ధారలు.
 మాంగళ్యాన్ని బాసిన పడతుల జీవితాలు ॥
 
కోల్పోయినారెందరెందరో తమ ప్రాణాలు 
కొల్లగొట్టబడినాయి స్త్రీల గౌరవ మానాలు-
పట్టుబడిన వారికి ఆజీవిత సంకెళ్ళు 
ఎదురు తిరిగినవారి తిరిగిరాని  ప్రాణాలు.॥

పుార్తి స్వాతంత్ర్యానికి కృషిచేసిన గాందీజీ శక్తి
ఆగష్ట్ 15 నాడు  బానిసత్వానికి ముక్తి.
ఎగిరే ఝండా పింగళి వెంకయ్య సృష్టి
సత్యం ధర్మం సాంతి అహింసలకు ప్రతీతి.

ముాడు రంగుల ఝండాలో సర్వ మతసామరస్యం
సత్య అహింసలకు ప్రతీకగా మధ్యన ధర్మచక్రం ..
 భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యానికి చిహ్నం.
ఎగరేద్ధా ఐకమత్యంతో ఆగష్ట్15 న మనమందరం॥

హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

Wednesday, August 4, 2021

మహతీ సంగమం

అందరికీ శుభోదయం🙏🏻🙏🏻🙏🏻

ప్రకటన
🌺 🌺 మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం 🌺🌺
🌹ప్రతి రోజూ కవితా పండుగే🌹

పర్యవేక్షణ: డా౹౹అడిగొప్పుల సదయ్యగారు
నిర్వహన:శ్రీ కుందారపు గురుమూర్తి
తేదీ:20/03/2021(శనివారం)
కవి పేరు:
ఊరు:
కవితా సంఖ్య:
నేటిఅంశం: ఐచ్ఛికము

నేటిప్రక్రియ: ముత్యాల సరాలు

కవి మిత్రులు వారికి ఇష్టమైన ఏ అంశంలో నైనను ముత్యాల సరాలు గేయము అల్లవలెను

సమయం:ఉదయం 9-00గం౹౹ల నుండి రాత్రి 10-00 గం౹౹ల వరకు
ఫలితాల వెల్లడి:మరుసటిరోజు ఉదయం 11-00గంటలకు

నియమములు::
1. కవిత ముత్యాల సరాలు గేయ ప్రక్రియలోనె ఉండాలి.
2. అర్థవంతంగా ఉండాలి. ఏకాంశమును స్వీకరించాలి
3.కనీసం మూడు గేయ భాగాలను ఏకాంశముగా రాయాలి.
4.సవరణ కోరిన గేయ భాగములను తప్పక సవరించి మరలా పంపవలెను
5.లక్షణాలను చదువుకొని గేయమును రాయవలెను
6.పునరుక్తి దోషముండరాదు అనగా ఒకే పదమును అదే అర్థములో పదే పదే వాడరాదు.
7.సూచనలు సహృదయముతో స్వీకరించగలరు.
8.శ్రీ గురజాడ అప్పారావు ముత్యాల సరాలు గేయమును ప్రతిబింబించేలా వ్రాయుటకు యత్నించాలి.

  ముత్యాల సరాలు గేయం లక్షణాలు:

1. నాలుగు పాదాలు ఉంటాయి.
2. మొదటి మూడు పాదాలలో ప్రతి పాదం నందు వరుసగా 3+4,3+4 చొప్పున మొత్తం 14 మాత్రలు ఉండాలి
3. 4వ పాదంలో 7 నుండి 14 మాత్రలు ఉండవచ్చు


ఉదా:1
3   +    4    +      3  +  4 =14
UI     U I   I    U   I   I   I U
పాడి పంటలు పొంగి పొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్

3 +      4  +   3  +    4 =14
U  I   I I  U U I    I   I   U
కండ కలవాడేను మనిషోయ్

ఉదా:2
గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల
క్రొత్త పాతల మేలు కలయిక

 3+.       4  +.      5    =12
U  I    U   I   I    U I   U
క్రొమ్మెఱుంగులు చిమ్మగా

U= గురువు 2 మాత్రలు
I=లఘువు 1 మాత్ర   గా లెక్కించవలెను

మరిన్ని ఉదాహరణలకోసం శ్రీ గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలు పుస్తకమును పరిశీలించగలరు.



!!గమనిక!!
పర్యవేక్షకులు డా౹౹అడిగొప్పుల సదయ్యగారు, శ్రీమతి శైలజా మేడం గారి అధ్వర్యంలో అందమైన ప్రశంసా పత్రము ప్రదానం చేయబడును.

Tuesday, August 3, 2021

బంగారు బోనాలు ( ఉమెన్ వేరియర్స్ వాట్సప్ లో)

[8/2, 13:15] p3860749: శీర్షిక : బంగారు బోనాలు.
వచన కవిత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఆషాడ మాసాన అమరేటి పండగ
ఇంటింట గౌరమ్మ వెలసేను నిండుగా
మమ్ము గాచేతల్లి మాంకాళి ఉండెగా
పసుపు పోలేరమ్మ కాచేను చల్లగా॥

నిమ్మహారాలతో అమ్మొారి తల్లిగా
పసుపు -కుంకాల తల్లి పడతి పెద్దమ్మగా
బోనాల భగవతిగ కట్టమైసమ్మగా
పుాల హారాల నిండు రమణి మాయమ్మగా.॥

భయమేల నోయమ్మ బతుకంత పండెగా
పొలది కుందన బొమ్మ పోచమ్మ ఉండెగా
 దుష్ట జనులను దునుమ మారెమ్మ మంచిగా
 ఎల్లమ్మ గ్రామల గాచేను ధీటుగా ॥

వేప కొమ్మల చలువ ఘటమందు నిండుగా
అమ్మ తల్లుల కొలువు బోనాల పండగా
కోరి మొాక్కేమమ్మ కోర్కెలే తీరగా
పాయసాన్నము తల్లి వేద్యాల ముడుపుగా--॥

మత్తైదులము చేరి మురిసేము విందుగా
పుాలహారాలనిడి మాయమ్మ నిలిచెగా
పట్టు చీరను కట్టి పెద్దముత్తైదుగా
పసుపు రాసిన పెద్ద బొట్టున్న బొమ్మగా॥

గ్రామ దేవతలెల్ల కొలువుండ రక్షగా
తీరంగ కష్టాలు తిరునాళ్ళ కలిమిగా
పాడి పంటలు నిండ పసిడి గౌరమ్మగా
కలిసి చేసితి మేము బోనాల పండగా ॥


హామీ: ఈ  కవిత  ఏ మాధ్యమునందుా ప్రచురుతం కసని నాస్వీయ రచన.
[8/2, 23:05] నెల్లుట్ల సునీత ( ప్రక్రియ సున్నితం. ): *Women writers తెలంగాణా బోనాలు అంశంపై విజేతలు* *

*1..పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు  ప్రథమ* 
*2.జూలూరి శైలజ గారు ద్వితీయ* 

*3.ఎడ్ల లక్ష్మి గారు తృతీయ* 

*4.వలిపే సత్య నీలిమ గారు ప్రశంస*

Sunday, August 1, 2021

ఝండాకు వందనం

శీర్షిక  : ఝండా కు వందనం..

ఆంగ్లేయుల పరిపాలనలో
భారత ప్రజల అవమానాలు
బానిసత్వపుబాటలో 
ఎదుగు బొదుగు లేని జీవితాలు॥

బ్రిటిష్ వారి ఆధిపత్యానికి
తల వంచిన భారతీయులు.
భారత స్వాతంత్ర్య పోరాటానికై
ఉద్యమ బాటలో దేశ భక్తులు ॥

కోల్పోయినారెందరో ప్రాణాలు
కొల్లగొట్టబడిన స్త్రీల మానాలు.
పట్టుబడిన వారికి సంకెళ్ళు
ఎదురు తిరిగినవారి
తిరిగిరాని  ప్రాణాలు.॥

పట్టుబట్టిన గాంధీజీ నడచిన
బాటలో, ఉప్పు సత్యాగ్రహాలు.
దాండీమార్చ్ తో చేసిన
శాంతియుత పోరాటాలు ॥

"పింగళి వెంకయ్య" చేసిన 
స్వాతంత్ర్య ముక్తి "ఝండా సృష్టి".
"బంకిం చంద్ర చటర్జీ "రాసిన 
దేశభక్తి నిండిన"జన గణ మణ"
గీతి,  నిండిన ఉద్యమ స్ఫుార్తి.॥

కులమత వివక్షతల నిరసనలు
ముాడురంగుల జండాలో
సత్యం,ధర్మం శాంతి నిండిన
సమానత్వపు జీవిత సారాలు॥

వెరసి,లభించిన దేశ స్వాతంత్ర్యం
గాంధీ, నెహ్రూల పోరాటాల ఫలితంం
బానిసత్వ ముక్తి పొందన దినం
ఆగష్ట్ 15ను, మరువలేదు జనం.॥

నేటికీ జనం జరుపుకుంటున్న
భారత స్వాతంత్ర్య దినోత్సవం .
ఎగురుతున్న ఝండాకు చేద్ధాం
వందనం,కలసి మనమందరం ॥

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.