Wednesday, February 17, 2021

వసంతపంచమి....

సరిగ్గా 302 సంవత్సరాల క్రితం నేటి వసంత పంచమి రోజున 14 సంవత్సరాల ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు "వీర హకీకత్ రాయ్ బలిదానమైన రోజు".
            1719వ  సంవత్సరంలో జన్మించిన హకీకత్ రాయ్ ఫారసీ భాష మాధ్యమంగా చదువుకోడానికి స్థానిక మదర్సా వెళ్తుండేవాడు. మదర్సాలో చదువుకుంటున్న మొత్తం విద్యార్థులలో ఇతడే అత్యుత్తమ విద్యార్థి అయినందున అతనితోపాటు చదివే ముస్లిం విద్యార్థులు ఈర్ష్యాసూయలతో రగిలి పోతూ ఉండేవారు.
            ఒకరోజు ముస్లిం విద్యార్థులందరూ కలిసి  బాలుడైన హకీకత్ రాయ్  దగ్గరికి వచ్చి భవాని మాత గురించి ఆపశబ్దం పలికారు, అవమానిస్తూ హేళన చేశారు. దానికి జవాబుగా మీరిలా భవానీమాతను అవమానించడం సబబు కాదని, ఒకవేళ నేనే ఈ విధంగా బి బి ఫాతిమా గురించి మాట్లాడితే మీకేమనిపిస్తుంది అంటూ ప్రశ్నించాడు.

        ఈ మాటతో మరింత రెచ్చిపోయిన ముస్లిం విద్యార్థులు విషయాన్ని చిలువలు పలవలు చేసి బీబీ ఫాతిమాను అవమానిస్తూ మాట్లాడినాడనీ ప్రచారం చేయసాగారు. ఈ విషయం పాఠశాలను నడిపే మౌల్వీ దగ్గరికి వెళ్ళింది అతడు స్థానిక 'ఖాజీ' దగ్గరికి విషయాన్ని చేరవేశాడు. ఇంకేం రాజస్థాన్లో ముస్లిం శాసనం నడుస్తున్న ఆ సమయంలో.., విషయం మతం రంగు పులుముకున్నది, చివరికి 14 సంవత్సరాల బాలుడు హకీకత్ రాయ్ ను విచారణకై పిలిపించి నీవు తప్పు చేశావని దీనికి శిక్షగా ఇస్లాంను స్వీకరించాలనీ హుకుం జారీ చేశారు. హుకుంను అనుసరించి ధర్మ పరివర్తన చెంది ముస్లింగా మారడానికి అంగీకరించలేదు, దానితో అతనికి అనేక విధాలుగా నచ్చ చెబుతూ ప్రలోభం కూడా చూపినప్పటికీ  ససేమిరా అన్నాడు.

   అతని ధర్మనిష్ఠ చూసి మతం మారలేదని ఆగ్రహోదగ్రుడై న ఖాజీ శిరచ్ఛేదనానికి ఆజ్ఞ ఇచ్చాడు.

     సరిగ్గా 302 సంవత్సరాల క్రితం 1734 వ సంవత్సరం వసంత పంచమి రోజు ధర్మంకోసం ప్రాణం ఇవ్వడానికి సైతం వెనుకకు జంకని, మడమతిప్పని వీరుడు హకీకత్ రాయ్ యొక్క శిరచ్ఛేదం చేశారు.      

        చిన్నతనంలోనే వివాహమైన కారణంగా అతని చిన్నారి పత్ని  లక్ష్మి సైతం హకీకత్ రాయ్  తో పాటు చితిమంటల్లోనే కూర్చుండి నేటి వసంత పంచమి రోజున తల్లి స్వరూపమైన సరస్వతీదేవి జన్మించిన రోజున బలిదానం అయిపోయింది.

      ఇలా ధర్మ రక్షణ కోసం ప్రాణాలిచ్చిన "వీరహకీకత్ రాయ్ అతని భార్య వీరబాల లక్ష్మీబాయి"  యొక్క అమర గాధను కూడా ఈరోజు స్మరణకు తెచ్చుకోవాలి.    
                           🙏 🙏 🙏

Monday, February 15, 2021

తిరుప్పావై ప్రశ్నావళి- జవాబులు.

*తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*
(పి.యల్.నరసింహాచార్య)
(14/12/20)

*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.* శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.

*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?
=గోదాదేవి.

*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
= సుప్రభాతం బదులుగా.

*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.

*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
=శ్రీ విష్ణు చిత్తులు.

*5.* ఆళ్వారులు ఎంతమంది?
=12మంది.

*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
=భూదేవి.

*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
=తమిళ భాష.

*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
=నాలాయిర్ దివ్యప్రబంధము.

*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
=108.

*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
=శ్రీవిల్లిపుత్తూరు.

*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.

*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
=196 అడుగులు.

*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
=మూడవ పాశురం.

*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
=తిరుసాదము.

*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
=కోదై (గోదా)

*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
=గరుడాంశము.

*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
=శ్రీవ్రతము.

*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
=పరమాత్మ చేతిలోని శంఖమువలే.

*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
=మన్మధుని

*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
=సింహం పిల్లవలె.

*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
=ధృడమైన కోరిక, పట్టుదల.

*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
=మొదటి పాశురం.

*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)

*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
=రెండవ పాశురం.

*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
=వామన అవతారం.

*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?
=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.

*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
=మూడు.

*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.

*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?
=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).

*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
=యమునా నది.

*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
=దానగుణం.

*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
=వర్షానికి.

*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.

*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
=ఐదవ పాశురం.

*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=నమ్మళ్వారు.

*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=బుద్ధివ్రతం.

*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
=పిళ్ళాయ్ (పిల్లా).

*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
=ఆళ్వార్లతో.

*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వారు.

*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.

*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
=భరద్వాజ (చాతక) పక్షులు.

*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.

*43.* మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?
=పక్షులు.

*44.* ఎనిమిదవ  పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?
=నమ్మళ్వారు.

*45.* పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?
=శిరువీడు.

*46.* భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.

*47.* అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?
=కుంభకోణం.

*48.* పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=ప్రీతి వ్రతం.

*49.* కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వార్.

*50.* పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?
=శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.

*51.* పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?
=బకాసుర వధ.
 
*52.* సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?
=త్యాగం.

*53.* శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?
=తిరుప్పాణి.

*54.* తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?
=భగవద్రామానుజులు.

*55.* తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?
=నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు”.

*56.* శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?
=అహంకారమును హతమార్చుట.

*57.* పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?
=దాస్య వ్రతము.

*58.* గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?
=నందగోపుని (భగవానుని అందించారు కనుక)

*59.* కోయిల్ అనగా ఏమి?
=కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.

*60.* నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?
=దాన గుణము.

*61.* గోపికలు ఎంబెరుమాన్ (మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?
=నందుడు.

*62.* భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?
=తిరుమంగై యాళ్వారు. 

*63.* గోపికలు తమ వంశమునకు ‘మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?
=యశోద.

*64.* శెంపొర్కజలడి-ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?
=బలరాముడు. 

*65.* నీళాదేవి ఎవరు?
=కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.

*66.* యశోద తమ్ముడు ఎవరు?
= కుంభుడు.

*67.* భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?
=పేయాళ్వారు.

*68.* ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?
=ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.

*69.* భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?
=18 వ పాశురం.

*70.* లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?
=18వ పాశురం.

*71.* శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?
=కువలయాపీడము.

*72.* అశ్వినీ దేవతలు ఎవరు?
= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.

*73.* గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?
=అద్దము, విసనకఱ్ఱ.

*74.* తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?
=కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.

*75.* ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?
=మృగరాజగు సింహము.

*76.* ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?
=అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.

*77.* పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?
=సర్వగంథః -సర్వవిధ పరిమళములు.

*78.* పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?
=సింహ గర్జన.

*79.* కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?
=మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.

*80.* కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?
=వెలగ చెట్టు.

*81.* ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=భోగవ్రతము.

*82.* ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?
=శ్రీవిల్లిపుత్తూరు.

*83.* పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?
=పాంచజన్యము.

*84.* ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు?
=సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.

*85.* ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?
=కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)

*86.* భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?
=గోవింద.

*87.* భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?
= తిరుమొళిశై యాళ్వారు.

*88.* కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?
=సూర్యునికి, కాంతికి గల సంబంధము.

*89.* గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?
=ఆవుల వెనుక.

*90.* ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?
=27 వ పాశురం.

*91.* పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?
=శ్రీకృష్ణునివి.

*92.* భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?
=దాసుని లక్షణములు.

*93.* 'అజాయమానః' (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?
='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)

*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
=విష్ణుపోతము

(విష్ణువనే ఓడ)

*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
=ఆయన దాసులే గొప్ప.

*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
=ఎన్ని జన్మలకైనా అని అర్థము.

*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
=అయోధ్య.

*98.* వజ్గం అంటే ఏమిటి?
=ఓడ.

*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
=అమృత కలశం.

*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.

*101.* గోపికల దివ్యాభరణములేవి?
=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.

*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.

*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.

*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
 
*105.* తిరుప్పావై ఎటువంటి మాల?
=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.

*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.

*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=తొండరపడిప్పొడి
యాళ్వార్.

*జై శ్రీమన్నారాయణ!*
*ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్*

మనం ఎదుగుతున్నాం

*నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం...*💐
ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం...👹

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం... 💐
అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం...👹

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...💐
“నేనే హీరో”...  నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం...👹

నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...💐 
చిల్లరబుద్ధులతో... సంపాదనలో అవే“చిల్లర” కూడా తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచుకుంటున్నాం..👹

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం... 💐
ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం👹

బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం...💐 
ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక “కుటుంబాన్ని చిన్నదిగా” మల్చుకుంటున్నాం...👹

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం.. 💐
ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!👹

మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి... కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం... కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం... మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!
మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం...@!!
నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!

ఎందుకంటే... 
మనం ఎదుగుతున్నాం...!💪
మనం మనకే అందనంతగా...
మనం ఎదుగుతున్నాం...!💪
మనం, మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం
నిజంగా...🤫🤫🤫
మనం... ఎదుగుతున్నామా...???🤦‍♂️

ద్విపద పద్యాలు.


శీర్షిక : తెలుగు వెలుగుల తల్లి.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

వెల్లి విరిసినదౌ  వేద సంభాషి
తల్లి భారతి నిత్య ధర్మ -సంవాసి  ॥

శోభ లేలెడు తల్లి  సౌభాగ్య రాసి 
శుభ సంప్రదాయాల సుగుణాల శ్రేష్ఠి ॥

కట్టు బొట్టుల తీరు కనువిందు  జేయు 
జుట్టుసిం గారమ్ము చుాపుకే తీరు ॥

దేశ  కీర్తిని పెంచ  తెలుగింటి నాతి ॥ 
దేశ సౌభాగ్యమే  తెలుగింటి కీర్తి ॥

నిగమసా రసుమొాద  నిత్యసం తోషి
జగతి సార్ధక నామ జయ సౌమ్య రాశి ॥

సిరి సంపదల వల్లి  శీల సజ్జనని
సరి సంప్రదాయాల సంస్కృుతుల ధని ॥

తెలుగు భాషకును రాదేదియుా సాటి 
వెలుగు  సంస్క్రుతదేను  పెంచుగా కీర్తి  ॥

అక్షర మ్ములకుార్పు  నలరు ఛందస్సు
లక్షణ మ్ములనేలు  లలిత వర్చస్సు ॥

పద్య-  గద్యములంటి పలుశ్రేష్ట  నిధులు
విద్యల్లొ మాన్యమౌ  వివిధసం పదలు ॥

ఫల పుష్పములు  నిండు  పచ్చని వనులు
జలరాసి  తోనిండు  చలనదీ  ఝరులు॥

సత్సాంప్రదాయాల సరినేలు శీల  
ఉత్సాహముల నింపు  ఉత్తేజ బాల ॥

మహినేలు  తల్లికీ  మల్లెపుా దండ
సుహిమాద్రి శోభల సుజన బ్రహ్మాండ ॥

నీమాట  నీబాట  నీపాట  తలపు
జైమాల  లొసగేటి  జయమొందు  గెలుపు ॥

తల్లి సేవను నీవు  తధ్యమ్ము  విడకు
తల్లి కంటను నీటి  తడిని రానీకు॥

సమత మమత తోడ సరివారి జుాడు
సమ దృష్టినిడి మను సజ్జన్మ  మేలు ॥

Monday, February 8, 2021

రక్ష....రక్షణ

అంశం:సాంకేతిక పురోగతి:మానవ సంబంధాలు.
శీర్షిక:
దేశ ప్రగతి పుాల బాట కావాలి.
-----------------------------------------

సాంకేతిక రంగాలలో  మనిషి సాధించిన ప్రగతి-

మానవుడే మహనీయుడు అన్న మాటకు నిదర్శనం .

భుామిపై ఉన్న మనిషి అంతరిక్షాన్వేషణ లో

సాధించిన  విజయాలే అందుకు  నిదర్శనం .

సైన్స్ & టెక్నాలజీల అభివృద్ధి తో పాటు మానవుడు 

అత్యున్నత విజ్ఞాన  అభివృద్ధి పథానికి 

 శ్రీకారం చుట్టేడు. సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో
 
 ఎన్నో మౌలిక సదుపాయాల మనకు సమకుారేయి.
 
కోవిడ్ 19 మహమ్మారి సంక్షోభం లో ఈ 

విజ్జాన ఫలితాలు మనిషి క్రియాశీలక పురోగతికి

 దోహద పడుతున్నాయి. ఆన్ లైన్ లావా-దేవీలు,
 
 ఆన్ లైన్ ద్వారా విద్యా బోధన, బేంకింగ్ , రైల్వే, నెట్ 
 
 పేమెంట్స్ ఇలా ఎన్నో సదుపాయాలతో 
 
  మానవ మేధస్సు ముందడుగు వేసింది.
  
 అయితే ఈ విషయంలో మనిషి ఎంత పురోగతి
 
 సాధించేడో అంత అధోగతి పాలౌతున్నాడు.
 
పెరిగిన పర్యావరణ కాలుష్యం, దాంతో క్షీణిస్తున్న 

ఆరోగ్యం .రసాయనిక వాడకాల వల్ల వచ్చేవింత 

రోగాలు..దుార వాణి ,చరవాణి ల దురుపయొాగాల 

వల్ల మనుషుల్లో లోపించిన మానవత్వం.మారుతున్న 

మనస్తత్వాలకు మానభంగాలతో మంట కలుస్తున్న

 మహిలళల మాన-సమ్మానాలు.పుట్ట గొడుగుల్లా 
 
లేస్తున్న వృద్ధాశ్రమాలు. ఇలా ఎన్నో
 
అంతులేని అవక తవకలు చోటు చేసుకున్నాయి.

మనిషి విజ్ఞాన విషయాల పురోగతి తో పాటు

ఇటువంటి సమస్యల సమాధానాల్ని కుాడా

తెలుసుకో గలిస్తే మన దేశ ప్రగతి బాట పుాల బాటే ఔతుంది.
 ----------------------
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక .
పవిత్ర బంధం.
-------------------
దేవతల కాలం నుండి ఆచరింపబడుతుా 
పవిత్రమైన బంధాలకు ప్రతీక గా నిలచిన
ఈ రాఖీ పౌర్ణమి పండగ అత్యంత శ్రేష్టమైనది.

శ్రావణ మాసపు పౌర్ణిమ రోజున వచ్చే ఈ
పండగను రాఖీ పౌర్ణమిగా, జంఝాల పౌర్ణమిగా 
వ్యవహరిస్తారు.

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నిదర్శనంగా, 
రాఖీ అనబడే రక్షణ సుాత్రాన్ని , అన్నదమ్ముల 
 చేతికి  కట్టి, తమ రక్షణ కై, వారి నుండి సోదరి పొందే , "భరోసా "ఈ రాఖీ పండగ.

 హిందుా ధర్మం లో గాయత్రీ మంత్రం జపిస్తుా..
 కొత్త జంఝం అనే రక్షక  సుాత్రాన్ని   ధరించి, తమ స్వ పరివార రక్షణ కై , గాయత్రీ శక్రిని ఉపాసించే పవిత్రమైన
 పండగ ఈ రాఖీ పండగ. 
 
 ఆపత్కాల సమయంలో భర్తకు భార్య కట్టే రక్ష.
 
ఈ పండగను హిందువులుా జైనులు సిక్కులుా
ముస్లిములు , బౌద్ధులుా, క్రైస్తవులు కుాడా, వారి వారి ఆచార విధానాలతో ఆనందంగా 
 జరుపుకొనే పవిత్రమైన పండగ  ఈ రాఖీ పండగ.
 ----------------------

Saturday, February 6, 2021

తేటగీతి పద్యాలు.

తల్లి దండ్రుల నిలనుసా
దరము  నేల
తలచ కున్నను రాముని   ధరణి లోన
ధన్యు డతడుగా దెగుణుడు  తధ్య ముగను
దైవ ములుగవా రెకొలువ  తలువ ॥

సాంప్ర దాయము లెల్లను  జక్క నేలి
సత్య  ధర్మము తోడను సాగు నడత
మాన వత్వము  తోడను మసలు చున్న
 తపము  జపములే  టికినిల ధన్యు డతడు ॥

జాతి మతముల  నెంచుచు జడుని గాను
 ధనము  రుాపము జుాచియు తరలు వాడు
గుణుడు అతడుకా డుకడకు  కులము 
చెరచు
నమ్మ బోకుమ వానిది  నడత చేటు ॥

తోడ పుట్టిన వారిప్రే మగజుాచు వాని 
తండ్రి వలెనుసా కుచునున్న వాని ఘనుని
ఇంటి పెద్దవానిని అన్నదమ్ము  నెపుడు
మొాసగింపరాదు ధనము  కొరకు నీవు॥

తోడ పుట్టిన వారిప్రే మగజుాచు వాని 
తండ్రి వలెనుసా కుచునున్న వాని ఘనుని
ఇంటి పెద్దవానిని అన్నదమ్ము  నెపుడు
మొాసగింపరాదు ధనము  కొరకు నీవు॥



Wednesday, February 3, 2021

సాహిత్యం ఎందుకంటే....

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
*ప్రతిరోజు కవితాపోటీలు*
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు*
తేది: *02-02-2021: మంగళవారం*
అంశము: *సాహిత్యం ఎందుకు?*
పేరు: బి. వి. వి. సత్యనారాయణ 
ఊరు: అమలాపురం 
ప్రక్రియ: ఐచ్ఛికము- వచనం
శీర్షిక: సాహిత్యమెందుకు ?
                -@-
సాహిత్యం సామాజిక చైతన్యం కావాలి
సాహిత్యం ప్రజాహితం ప్రజాపక్షం కోరాలి!

కవి ప్రజలకోసం కలం పట్టాలి
జరిగే మంచిచెడులపై పోరు సల్పాలి!

మూఢనమ్మకాలపై సమరశంఖం పూరించాలి
అంధవిశ్వాసాలపై యుద్ధం ప్రకటించాలి!

సాహిత్యం ప్రభువుల మెప్పుకోసం వెంపర్లాడరాదు
సాహిత్యం అనునిత్యం  సమరభేరిలా కొనసాగాలి!

సాహిత్యం చదువరిని తనలోకి కొనిపోవాలి
మనస్సుకు ఉల్లాసము తనువుకు ఆహ్లాదాము అందించాలి !

సాహిత్యం అన్యాయాలపై బిగించిన పిడికిలి కావాలి
సామాజిక రుగ్మతలపై గొడ్డలిపెట్టు కావాలి !

సాహిత్యం ఉత్సాహం ఉల్లాసం ఉద్వేగం కలసి ప్రవహించాలి
మనిషిని మలినంలేని ఆవలివడ్డుకు చేర్చాలి !
—————————-
ఇది నా స్వీయ రచన. దేనికీ అనువాదము అనుకరణ కాదు.

Tuesday, February 2, 2021

సాహిత్యం ఎందుకు..?

మహతి సాహితీ కవిసంగమం కరీంనగరం- ప్రతిరోజు కవితా పోటీలు
పర్యవేక్షణ: డా.శ్రీ అడిగోప్పుల సత్తయ్య గారు
నిర్వహణ: బీరప్పల అనంతయ్య గారు
తేది ;2-2021(మంగళవారం)
అంశం :సాహిత్యం ఎందుకు?
పేరు :పి. లక్ష్మీ భవాని
ఊరు: విశాఖపట్నం
ప్రక్రియ: ఐచ్ఛికం
శీర్షిక: సాహిత్యం ఎందుకు?
(వ్యాసరచన)
"తెలుగు సాహిత్య మూలాలు"

తెలుగులో సాహిత్యం ఎలా పురుడుపోసుకుంది,
తెలుగు సాహిత్య నిర్మాణం వెనుక ఉన్న మూలాలేంటి?వాటి పునాదులేంటి?క్రీ.పూ 200 ప్రాంతంలోనే తెలుగు భాష మొగ్గుతొడిగితే,సాహిత్య నిర్మాణం ఎందుకు అంత ఆలస్యమైంది? నన్నయని ఆదికవి అని ఎందుకు అంటారు?అంటే తెలుగులో అంతకన్నా ముందు కవులు లేరా? నన్నయ తరువాత వచ్చిన శైవ కవులు మహాభారత నిర్మాణం ఎందుకు చేపట్టలేదు?
  తెలుగు సాహిత్యం పదకొండవ శతాబ్దానికి చెందిన ఆదికవి నన్నయతో ప్రారంభమైందని చెప్పవచ్చు. నన్నయను ఆదికవి అనడానికి గల కారణం,అంత కన్నా ముందు తెలుగులో కవులు లేరని కాదు. తెలుగు సాహిత్యానికి ఒక మార్గం చూపి తెలుగు సాహిత్య సృష్టి చేసిన వారు నన్నయ. అందుకే నన్నయని ఆదికవి అన్నారు.నన్నయ కాలం నాటికే సంస్కృతంలో చతుర్వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,ఉపపురాణాలు,మహాభారతం,రామాయణం వాడుకలో ఉన్నాయి.సంస్కృత ఆధిపత్య జాడలు సుస్పష్టంగా ఉన్న రోజులవి.నన్నయ సమకాలీనులుగా మల్లియ రేచన,వేములవాడ భీమకవి తెలుగులో రచనలు చేస్తున్నారు.మల్లియ రేచన కవిజనాశ్రయం, పావులూరి మల్లన గణితసార సంగ్రహం,భీమకవి కావ్యాలను రచించారు.అంటే క్రీ.శ 11 వ శతాబ్దం నాటికే తెలుగు వాళ్లకు ఒక స్పృహ కలిగింది. అసలు సాహిత్యాన్ని,పురాణాలను,ఇతిహాసాలను,కావ్యాలను సంస్కృతంలో చదవడమేంటి?నా మాతృ భాషలో,జాను తెలుగులో ఆ గ్రంథాలను చదుకుంటే బాగుంటుంది కదా అని.తరచి చుస్తే నన్నయ తరువాత వచ్చిన శివ కవులు,తిక్కన,ఎఱ్ఱన మొదలగు వారు,అంటే తెలుగు సాహిత్యం ప్రారంభమైన 300 సంవత్సరాల వరకు ఆనాటి కవుల ప్రధాన ఉద్దేశం,నా తెలుగులో రచించాలన్న స్పృహ.
  ఇవన్నీ ఇలా ఉండగా,నన్నయ మాహాభారతాన్నే ఎందుకు రచించాలి?రామాయణ భాగవతాలను ఎందుకు రచించలేదు అని తరచి చూస్తే, నన్నయ తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో కవిగా ఉండేవాడు.ఒక రోజు ఆ రాజు నన్నయను పిలిచి సంస్కృత పండితులు,వ్యాకరణులు కొలువు దీరిన సభలో,నన్నయా నీవు మహాభారతాన్ని తెలుగులో రచించు అని ఆదేశిస్తారు.అందుకు రెండు కారణాలు ఉన్నాయి.తెలుగు భాష అస్థిత్వాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకటయితే,మరోటి వైదిక తత్వాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం.ముందుగా తెలుగు భాష విషయానికి వస్తే,ఆ కాలంలో తెలుగు లిపి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. పదజాలం,భాష ఉత్కృష్ట దశలో లేదు.ఇదే సమయంలో అప్పటికే కన్నడ,తమిళ భాషల్లో మహాభారత రచన జరిగి,దేశీ సాహిత్యం స్థానిక ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.దీంతో తెలుగులో సాహిత్యం లేదని తెలుగు వాడు బాధపడుతున్న రోజుల్లో,తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతిష్ట జరగాలంటే,తెలుగు సాహిత్య రచన జరగాలని,అందుకు మహాభారత రచనను చేపట్టాలని రాజరాజ నరేంద్రుడు నన్నయని కోరతారు.దీంతో తెలుగులో సాహిత్య రచన ప్రారంభమైంది.
  అయితే రాజు మహాభారతాన్నే రచించమనడానికి గల కారణాలలో ముఖ్యమైనది వైదిక మత పటిష్టత.ఈయన కాలంలో బౌద్ధ,జైన మతాలు తమ తమ అస్తిత్వ పోరాటాలు చేస్తున్నాయి.రాజు వైదిక మతాభిమాని.ఆయా మతాల భావాలు వైదిక మతానికి పూర్తిగా వ్యతిరేకం.దీంతో వైదిక మతానికి సంబంధించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని కోరతారు.దీంతో తెలుగు సాహిత్య సృష్టికి బీజాలు పడ్డాయి.
  నిజానికి తెలుగులో సాహిత్యం 2000 సంవత్సరాల కిందటే సృష్టించబడి ఉండేది.ఆ విషయమేంటో ఒక సారి చూద్దాం.ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టిన సందర్భమిది. శాతవాహన రాజైన కుంతల శాతకర్ణి కాలంలో దేశీ భాషలే రాజ్య భాషలు.కుంతల శాతకర్ణి ప్రేమ వివాహం చేసుకున్నారు.ఒక రోజు తన సతీమణితో కలిసి నదిలో జలకాలాడుతుండగా,తన భార్యపై శాతకర్ణి నీళ్లను చల్లడం మొదలుపెడతాడు. అప్పుడు రాణి 'మొదకై తాళహ' అనే సంస్కృత పదాన్ని పడే పదే పలుకుతుంది.ఆ సంస్కృత పద అర్ధం తెలియని రాజు,తన ఆస్థానంలోని మంత్రివర్యులని పిలిపించి ఆ పదానికి అర్ధం ఏంటని అడుగుతారు.మంత్రికీ సంస్కృతంపై పట్టు లేకపోవడంతో కష్టంగా ఒక అర్ధాన్ని చెబుతారు.మొదకై అంటే ఉడ్రాళ్లని,తాళహ అంటే కొట్టండి అని.అంటే ఉండ్రాళ్ళని బహుమతిగా ఇవ్వండి అని రాణి గారు చెప్పారు ప్రభు అని సెలవివ్వగానే,బుట్టలు బుట్టలుగా ఉండ్రాళ్ళని బహుమతిగా రాణికి ఇస్తారు రాజు. అవి చూసిన రాణి ఇవేమిటని ప్రశ్నించగా, జలకాలాడుతున్నప్పుడు నీవే ఉడ్రాళ్లని బహుమతిగా ఇవ్వమని అడిగావు కదా అని రాజు బదులివ్వగానే రాణి పక్కున నవ్వి,మొదకై తాళాహా అంటే నీళ్లతో నను కొట్టొద్దు అని అర్ధమని, సంస్కృతం వచ్చి ఉంటే నీకు అర్ధం అయ్యేదని రాజు అజ్ఞానాన్ని చూసి రాణి ఎగతాళి చేసింది.దీంతో చిన్నబోయిన రాజు అప్పటి వరకు రాజ్య భాషగా ఉన్న ప్రాకృతాన్ని కాదని సంస్కృతాన్ని రాజ్య భాషగా ప్రకటిస్తారు.సంస్కృత వ్యాకరణ సృష్టికి పూనుకుంటారు. దాంతో రాజ్య భాష ముందు దేశీ భాషలు అణగారిపోయి తిరిగి పునరుద్ధరింపబడడానికి వెయ్యేళ్ళు పట్టింది.అంటే నన్నయతో తెలుగు సాహిత్య పునరుద్ధణ ప్రక్రియ ప్రారంభమైంది.
   మహాభారత రచనలోకి వస్తే,వ్యాసుడు రచించిన మహాభారతంలో 100 పర్వాలున్నాయి.వాటిని నన్నయ 18 పర్వాలుగా విభజించి,చివరి రెండు పర్వాలను పక్కనపెట్టారు.అంటే 98  పర్వాలను 18 పర్వాలుగా మార్చారు.ఆదిపర్వం,సభాపర్వంతో మొదలుకుని స్వర్గారోహణ పర్వంతో మహాభారతం ముగుస్తుంది. ఇందులో విశేషమేమంటే నన్నయ మొదటి పద్యాన్ని సంస్కృతంలో రచించడం.అందుకు గల కారణాన్ని నన్నయ పద్యంలోనే చెబుతారు.ఓ సంస్కృత భాషీయుల్లారా,నా దేశీ భాషలో కావ్యం రచిస్తున్నాను,దానికి మీ చేదోడువాదోడు కావలి అని అనడం,సంఘంలో సంస్కృత ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో విశదీకరిస్తుంది.సరైన లిపి,పదజాలం లేని అలాంటి రోజుల్లో తెలుగు భాష సృష్టి జరగాలంటే వారి సహాయ సహకారాలు తప్పనిసరి.నన్నయ సమన్వయ వాదాన్ని అనుసరించారు.
    నన్నయ తరువాత వచ్చిన వారు శైవ కవులు.వారిలో ప్రముఖులు పాల్కురికి సోమన్న,నన్నె చోళుడు,మల్లికార్జున పండితుడు .వీరు పన్నెండవ శతాబ్దానికి చెందినవారు.సంస్కృత ఆధిపత్య చెర నుండి తెలుగు భాషని తప్పించిన తొలి యుగం కూడా ఇదే. నన్నయ మణిప్రవాహ శైలిని అనుసరించగా, కేవలం తెలుగులో మాత్రమే రచనలు చేస్తాము,అని చెప్పి సంస్కృతాన్ని బహిష్కరించిన కవులు శైవ కవులు. నన్నయ పూరించని మహాభారతాన్ని వీరు  కొనసాగించకపోవడానికి ముఖ్యకారణమిదే.వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వారు పాల్కురికి  సోమన్న.ఈయన ఓ విప్లవకారుడు,తెలుగు జాతి గర్వించదగ్గ పునాది వేసినవారు.సంస్కృతాన్ని నేను ఎదిరిస్తాను అని మొదటిసారిగా తెగేసి చెప్పిన వారు పాల్కురికి.శతకం,ద్విపద,రగడ,ఉదాహరణం వంటి గానబద్ధమైన ప్రక్రియలను సృష్టించారు.శైవ కవులు మొదటి సారిగా దళితులకు,నిమ్న వర్గాలకి పెద్ద పీఠ వేశారు.స్త్రీ చైతన్యానికి,సంఘంలో వారికి సముచిత స్థానం కోసం కృషి చేశారు.అయితే శైవ కవులు అందించిన సాహిత్యంలో ఎక్కువగా మతపరమైన అంశాలు ఉండి,సంకుచిత తత్వాలతో ముందుకు సాగడం నకారాత్మక అంశం. అయినా ఎన్నో సాహిత్య ప్రక్రియలను వీరు పరిచయం చేసి,తెలుగు వారి అస్తిత్వం కోసం పోరాడారు.
    పాల్కురికి తరువాత వచ్చిన 13 వ శతాబ్దపు కవి తిక్కన.ఈయన తన ముందు వారైన శైవ కవులు సృష్టించిన ప్రక్రియలను కొనసాగించకుండా,నన్నయకు కొనసాగింపుగా విరాట పర్వం నుండి మహాభారతాన్ని రచించారు.మరి తిక్కన మహాభారతాన్నే ఎందుకు రచించారు?దానికి సమాధానం విరాటపర్వంలోని అవతారికలో తిక్కనే చెబుతారు.'తెలుగు భాష వినిర్మింప' అంటే తెలుగు భాషని పునర్నిర్మించడం కోసం అని అంటారు.అలాగే 'ఆంధ్రావళి మోదం ఒరయునట్లుగా' అని చెప్పడం ద్వారా నా తెలుగు జాతి గర్వం కోసం,ఉనికి కోసం,తెలుగు ప్రజల గుండె చప్పుడు కోసం నేను మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నాను అని అంటారు.తిక్కన పామరులకు అర్ధమయ్యే భాషలో తన రచనలు రచించారు.
    తిక్కన తరువాత వచ్చిన 14 వ శతాబ్దపు కవి ఎర్రన. ఈయన అరణ్యపర్వ శేష భాగాన్ని పూర్తి చేయడంతో పాటుగా,వ్యాస మహాభారతంలో వదిలివేయబడిన హరిపర్వం,భవిష్యపర్వాలను తెలుగులోకి అనువదించారు.అదే హరివంశం. ఎర్రన సమకాలీనుడు నాచర్ల సోమన ఉత్తర హరివంశాన్ని అనువదించారు.ఎర్రన్నతో మొత్తంగా సంస్కృత మహాభారతం తెలుగులోకి వచ్చింది.రామాయణం అప్పటికే తెలుగులోకి రావడం జరిగింది.
మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం అనే దాంతో తెలుగు సాహిత్యం ప్రారంభమైoది