Friday, July 29, 2022

మహతీ సాహితీ కవి సంగమంలో

28/7/22
అంశం:- వెన్నెల రాత్రి
ప్రక్రియ:-ఇష్టపదులు .

శీర్షిక:- అందాల చెలికాడు .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

ఆకాశమందున్న  అందాల చెలికాడు
అందరిని మురిపించు ఆ వెన్నెలకు రేడు॥ 
కలలలో మురిపించు కధలెన్నొ చెపుతాడు.
కురిపించ వెన్నెలను కులుకుతుా వస్తాడు ॥

ఆతన్ని రాకతో అవనిలో అందాలు 
అరవిరిసి పుాస్తాయి ఆ కలువ భామలుా ॥
శృంగార తలపులను రంగార పండించి
 విరహాలు రేపుచుా  విందారగిస్తాడు ॥

అందాల జాబిల్లి కురిసేటి వెన్నెల్లు
ఆబాల గోపాలు  కానంద పరవళ్ళు
మల్లి ,జాజులతోడ  వెల్లివిరిసెను తోట 
పసిడి చంద్రుడె కాద పసి పాపలకు పాట॥

హాయి వెన్నెల రేయి ఆట పాటల కోయి
ఆ జంట ప్రేమికుల నలరించు  వలపోయి
జగములో ఈశ్వరీ జాబిల్లిడే హాయి
అనుభవించిన దోయి  అదె నేటి కవితోయి ॥






Monday, July 25, 2022

రుబాయిలు.

26/07/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
మ.సా.క.స : 19.
కవిత సంఖ్య : 2.



మంచి చెడు తేడాలు తెలుసుకొని మసలుకో
మానవత్వ విలువలు నిలుపుకొని  నడుచుకో
మనిషై పుట్టినీవు పశువులాగ మారకు
బంధానుబంధాలను కలుపుకొని నిలుపుకో ॥

కుార్చొని తింటే కొండలే కరుగుతాయి
అతిగా తింటే కండలే పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు మందులే తొలగుతాయి.॥

మనిషిని మనిషిగా ప్రేమించాలి .
కుల మతాలు విధిగా విడవాలి.
ఒకరికి ఒకరై ఆనందంగా  బతకాలి
వసుధైక కుటుంబముగా మెలగాలి ॥

నవ్వితే నాలుగు విధాల చేటంటారు.
ఏడిస్తే , నవ్వడమసలు  రాదంటారు.
మంచితనానికి విలువనివ్వరు ఎవ్వరుా
మనిషికసలు మనసన్నదే లేదంటారు ॥

*************************



Thursday, July 21, 2022

నుాతన ప్రక్రియ హైకుాలు లో

హైకూలు లో
మొదటి పాదంలో 5
రెండవ పాదంలో 7
మూడవ పాదంలో 5 అక్షరాలుండాలని చదివాను. మీ రచన తద్భిన్నంగా ఉంది. దయచేసి నియమాలు చెప్పగలరు.

Wednesday, July 20, 2022

నుాతన ప్రక్రియ : రవి కిరణాలు.

https://chat.whatsapp.com/H4kOITugPVlAxyAR0BU6u9

*ఉస్మానియా తెలుగు రచయితల సంఘం* 
రవికిరణాలు అనే నూతన ప్రక్రియలో నాలుగు లేదా అంతకుమించి పద్యాలతో ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనాన్ని వర్ణించండి.

పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రం అందజేయబడును.

నియమాలను అనుసరించి రాయాలి.
మీ పద్యాలు పంపించవలసిన తేదీ 20-07-2022 మరియు 21-07-2022 సాయంత్రం 5 గంటల లోపు.

*నియమాలు*
1.నాలుగు పాదాలు 
2.ప్రతిపాదములో 12 అక్షరాలు మాత్రమే ఉండాలి
3.మొదటి మూడుపాదాలకు అంత్యప్రాస ఉండాలి
4.చివరిపాదం మకుటం ఉండాలి
రవికిరణాలు వెలిగే జ్యోతులు

ఉదాహరణకు--/

కనిపించే రూపము అమ్మేకదరా
కనిపెంచే దైవం కూడా ఆమేనురా
ఇలపై వెలసిన అమృతమేనురా
*రవికిరణాలు వెలిగే జ్యోతులు*



ఉస్మానియా విశ్వవిద్యాలయం


*నిర్వాహకులు*
సత్య నీలిమ గారు
తేజస్విని గారు

*అధ్యక్షులు*
ప్రశాంత్ కుమార్ ఎల్మల.
9494300188.

Tuesday, July 19, 2022

మీ పాదం నా పంచపదిలో విజేతగా..


27/07/2022.
*మీ పదాలు  నా పంచపది* 116లో
-వి.వి.వి.కామేశ్వరి గారి పదాలు
ఆరాటం, పోరాటం, ఇరకాటం, చెలగాటం, తగలాటం 
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

దేశ సేవకై  అబ్దుల్ కలాం ఆరాటం 
వైజ్ఞానిక శాస్త్ర అభ్యాసానికై పోరాటం 
జాతీయ సమైక్యతా భావాలతో ఇరకాటం.
అంతరిక్ష  క్షిపణి  ప్రయొాగాలతో చెలగాటం.
పురస్కారాలతో పొందిన కీర్తి కిరీటం అతని విజయాలకు చిహ్నమీశ్వరీ ॥

తొిడు*సప్తవర్ణ సింగిడి-పంచపదులు
*మీ పదాలు నా పంచపది-116*ల లో
పేరు:కాటేగారు పాండురంగ విఠల్ గారిచ్చిన-
 పదాలు:*తోడు,జోడు,మోడు, ఈడు, కీడు*

 తోడుా నీడగా జీవిత భాగస్వామి.
 సరి జోడు హితునిగా మనసుతో  చెలిమి .
 మొాడు వారిన చెట్లు చిగురించవా ఏమి ?
 ఈడు వారితో పరాచికాలాడితే నేమి ?
 కీడు తలపెట్టని వాని హితవు కోరుసుమ్మీ ఈశ్వరీ ॥

*సప్త వర్ణ సింగిడి-పంచపదులు*
*మీ పదాలు నా పంచపది*-116
తేది:27.07.2022
*విజేతలు:*
*1.కవి కిరీటి:* SK అమీనా కలందర్ గారు
*2.కవి మణి:* శరత్కవి DVR మూర్తి గారు
*3.కవి వజ్ర:* పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*4.కవి రత్న*: శనగపల్లి ఉమామహేశ్వర రావు గారు
*5.కవి తేజ:* అక్కి నర్సింలు గౌడ్ గారు
*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*




*పంచపది సాహితీ కవన వేదిక*
*మీ పాట నా పంచపది*-108
తేది:19.07.2022
*విజేతలు:*
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
************:::::::**************************
*2.కవి మణి:* శరత్కవి DVR మూర్తి గారు
*3.కవి వజ్ర:* జోషి పద్మావతి గారు
*4.కవి రత్న*: శ్రీ సుధ కొలచన గారు
*5.కవి తేజ:* డా జి భవానీ కృష్ణమూర్తి గారు
*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*
******************************
పంచపది సాహితీ కవన వేదిక
నేటి పంచపది:258
తేది:19.07.2022
అంశం:దేవదాసు(ఏఎన్నార్ సినిమా)

ప్రథమ బహుమతి కవన శ్రేష్ఠ:
పిళ్ళా వెంకట రమణమూర్తి గారు

ద్వితీయ బహుమతి కవన విశిష్ట:
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
*******************************
తృతీయ బహుమతి కవన వరిష్ట:
బులుసు సీతారామ మూర్తి గారు
         
చతుర్థ బహుమతి కవన ఉత్కృష్ట:
సీర సంగీత శ్రీ గారు

పంచమ బహుమతి కవన మణి:
డా జి భవానీ కృష్ణమూర్తి గారు

విశేష ప్రతిభాశాలి కవన వజ్ర:
కొంకేపూడి అనూరాధ గారు

ప్రత్యేక ప్రజ్ఞాశాలి కవన రత్న:
గుడిపూడి రాధికారాణి గారు

నిర్వహణ:కాటేగారు పాండురంగవిఠల్
పంచపది రూపకర్త:హైదరాబాద్
సహ నిర్వహణ:పోరంకి నాగరాజు




మీరిచ్చిన  పాట :
--------------
*ఓ దేవాదా ఓ పార్వత చదువు ఇదేనా మనవాసీ వదిలేసి అసలు దొరల్లే సూటు బూటు* కు
నా మాట: 
--------
ఓ దేవదా స్కుాలుకి వెళ్ళవా ఏమిటి.?
 ఓ పార్వతీ ! నువ్వే చెప్పాలి వీడి సంగతి .॥
ఇదేనా మీరిద్దరుా కలిసి చెప్పేది..? 
చదువుకోకపోతే ఏంది మీగతి..?॥
మనవాసి వదిలేస్తే ఏంటి నీ పరిస్థితీశ్వరీ ?

అసలు పట్నంలో బతకగలవేమిటి ?॥
దొరల్లే వేసమేస్తే చాలా..బతుకుతెరువేమిటి ?
సుాటుా బుాటుా వేస్తే  కాబోదు నీ ఉన్నతి ॥
మనవాసి స్కుాల్ లో పెరగాలి మీ పరపతి.
చదువుతో  పొందాలి కీర్తి అదే మన సంపత్తి ఈశ్వరీ ॥

నేనిచ్చే పాట : 
తోటలో నారాజు తొంగి చుాచెను నాడు
నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు ॥

.

----------------------------------------
మీ పాట నా పంచపదిలో మీరిచ్చినపాట.
 పాట:*
అందాల పసిపాప, అన్నయ్యకు కనుపాప, బొజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీకొరకే, నీకన్నా నాకెవరే...
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

(అందాల పసిపాప )! మా ముద్దుల ముాట.
(అన్నయ్యకు కనుపాప) ! ఆట పాటల బాట.
( బజ్జోవే  బుజ్జాయి) ! అల్లరి మాని ఈ పుాట
( నేనున్నది నీకొరకే) !, నిను నే రక్షించే కోట.
( నీకన్నా నాకెవరే )! మా పలుకు తేనెల ఊటవీశ్వరీ ॥

మీరిచ్చే పాట: 
ఓ దేవదా,  ఓ పార్వతి, చదువు ఇదేనా, మనవాడు వదిలేసి అసలు దొరల్లే సూటు బూటు

(ఓ దేవదా,  ఓ పార్వతి, )స్కుాలుకు వెళ్ళరా ?
(చదువు ఇదేనా )  మొాబైల్ చుాస్తుా కుార్చున్నారా ?
(మనవాసి వదిలేసి) పట్నం లోకి వెళిపోతారా ?
(అసలు దొరల్లే ) ఉండాలంటే చదువుకోవాలిరా !
(సుాటుా బుాటుా )వేసుకుంటే దొరలైపోతారా ?
చెప్పుఈశ్వరీ ॥

నేనిచ్చే పాట : 
తోటలో నారాజు తొంగి చుాచెను నాడు
నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు ॥
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

19/07/2022.
నేటి పంచపది..
అంశం : దేవదాసు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


 ప్రేమ త్యాగమును కోరుతుందని చెప్పే చిత్రము.
వ్యసనములతో సమస్యలు పరిష్కరింపబడవన్న  నిజము. 
సాంప్రదాయ విలువలు తెలిపే భార్యా భర్తల 
బంధము
ప్రేమికులను విడదీసినా వారి  మనసులు మారవన్న సత్యము.
పెద్దలు పెద్దరికంతో సమస్యలను పరిష్కరించాలీశ్వరీ

---------------------------------

పంచపదిలో..
పేరు:కాటేగారు పాండురంగ విఠల్
మీరిచ్చిన పాట:

జననీ శివకామిని జయ శుభకారిణి, విజయ రూపిణీ,  నీ దరినున్నా తొలగు భయాలు*

రచన:  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

శ్రీగణేశ , కార్తకేయ జననీ 
మంగళస్వరుాపిణి శ్రీ గౌరీ  శివకామిని 
సకల లోకాది సన్నుతే జయ శుభకారిణి, 
సర్వోపధ్వి నివారిణీ  విజయ రూపిణీ, 
 నీ దరినున్నా తొలగు భయాలు మానినీ ! జగదీశ్వరీ !॥
 
నేనిచ్చిన పాట : 
నీ లీల పాడెద దేవా ! మనవి అలించ వేడెద దేవా ! న ను లాలించు మా ముద్దు దేవా !

Sunday, July 17, 2022

సేకరణ: విజయచందర్ కొమ్ము*

[8/20, 07:42] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *నువ్వు బాధ పడతావని అబద్ధం*
         *చెప్పేవారి కంటే*
*నువ్వు బాధ పడినా పర్వాలేదని*
*నిజం చెప్పేవారినే నమ్మాలి.*

🌹 *మానవత్వం ఒక సముద్రం వంటిది.*
*సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు.*
*అందుచేత మానవత్వం మీద నమ్మకం వదులుకోకూడదు.*

🌹 *మిమ్మల్ని బలవంతులుగా చేసే*
*ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.*
*బలహీనపరిచే ప్రతి ఆలోచననూ*
       *తిరస్కరించండి.*

🌹 *ఎవరు ఎంత హేళన చేసినా*
*నీవు తొందరపడకు...!*
*హేళన చేసిన వారితోనే "సలాం"*
*కొట్టించే సత్తా ఒక్క "కాలానికే"*
         *ఉంది...!!*

🌹 *జీవితం నీదే, గెలుపు నీదే, ఓటమి నీదే,*
*పడితే లేవాల్సింది నీవే,*
*బాధను భరించాల్సింది నీవే,*
*ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే,*
*అన్నీ నీకు నువ్వే.. నువ్వే..*
*అంటే నువ్వే ఒక శక్తని తెలుసుకో....!*
    
🌹 *జీవితం సైకిల్ పై ప్రయాణం లాంటిది.*
*క్రిందపడకుండా ఉండాలంటే*
*బ్యాలన్స్ చేసికోవాలి..!*
[8/20, 08:22] +91 94409 63004: *జీవితము నాలుగు అక్షరాలేకాని* 
               *అందులో ప్రయాణం* 
            *అంతు చిక్కని అన్వేషణ.*
            *ప్రతి మనిషి చూడడానికి* 
              *బాగానే అనిపించినా*     
          *మనస్సులో ఎన్నో బాధలు..*
             *కావాలన్నది దొరకదు..*
         *దొరికినది మనతో ఉండదు.*
    *ప్రతి క్షణం సంతోషంగా ఉండాలనే*
                    *తపన కానీ*   
        *సంతోషం మనిషి జీవితంలో*
          *కొన్ని నిమిషాలు మాత్రమే..*
           *కష్టానికి అలవాటుపడిన*
    *మనిషికి ప్రతి క్షణమూ సంతోషమే..*
           *కాబట్టి దొరికినదానితో*
     *సంతృప్తిపడటమే జీవితము.*
    🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
  *🎊కృష్ణాష్టమి శుభాకాంక్షలతో🎊*
🪴🙏 శుభోదయం శుభదినం 🪴🙏         
*మీ... విజయచందర్ కొమ్ము*
[8/20, 18:39] +91 94409 63004: *🍃నీ వైఖరిని బట్టే*

*🍃🪷కళ్ళు మంచివైతే ప్రపంచాన్ని నువ్వు ప్రేమిస్తావు.. మనసు మంచిదైతే ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది..*

*🍃🪷చెట్టు నుండి పూలు వేరైనా*
*వాటి అందాన్ని కోల్పోయినా సువాసనను మాత్రం కోల్పోవు*
*అలానే నచ్చిన మనుషులు* 
*మనకు దూరమైనా మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు..*

*🍃🪷మనిషికి వున్న అలవాట్లే.. తన స్థాయిని నిర్ణయిస్తాయి.. మంచివైతే.. సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి.. చెడ్డవైతే.. నలుగురిలో తల దించుకునేలా చేస్తాయి.. బ్రతకడం కోసం.. రాజీ పడడం కంటే.. ఒక లక్ష్యం కోసం.. యుద్ధం చేయడమే.. ఉత్తమం..*

*🍃🪷 ఎవరైనా అవసరానికి మించి ఎక్కువ కోపం చూపిస్తున్నారు అంటే దానికి తను ఎవరితోను పంచుకోలేనంత బాధను అనుభవిస్తూ ఉండాలి.. లేదా.. దాచుకోలేనంతగా ప్రేమిస్తూ ఉండాలి..*

          *🍃🪷శుభ సాయంత్రం*🙏
[8/21, 08:58] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *ఎదుటివాళ్ళని అర్థం చేసుకోడానికి కనీస ప్రయత్నం కూడా చేయకుండా, ఎంతసేపూ...*
*"నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు" అని వాపోయే ధోరణి వల్లే.. బంధాల్లో సగం సమస్యలు, లైఫ్ లో అసంతృప్తి పుడుతుంటాయి...*
*ఆలోచనా దృక్పథం మార్చండి...*
*లైఫ్ ఎంతబాగా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది...!*

🌹 *నచ్చని బ్రతుకులో ఎన్ని వెలుగులున్న...*
*మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది..!!*
*నచ్చిన బ్రతుకు లో ఎంత చీకటి ఉన్నా...*
*గెలుపు వెలుగు మనసుకు తెలుస్తుంది..!!*

🌹 *చీకటి పడుతున్నదని సూర్యుడు*
   *తెల్లవారుతుందని చంద్రుడు*
   *భయపడితే లోకానికి వెలుగే*
                *ఉండదు.*
*అలాగే అపజయానికి భయపడితే*
       *విజయాన్ని అందుకోలేం...!*

🌹 *గుడిలో లక్ష రూపాయలు విరాళం*
*ఇచ్చినా నిన్ను "భక్తుడనే" అంటారు,*
*అదే ఆకలితో ఉన్న వాడికి అన్నం*
*పెడితే నిన్ను "దేవుడు" అంటారు..*

🌹 *అందం తొందరగా కంటికి*
*పాతబడి పోతుంది.*
*సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ*
*నశించని ఆకర్షణ ఉంటుంది.*
[8/22, 07:21] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *అవసరంతో కాకుండా*
*ఆప్యాయతతో ముడిబడిన*
*బంధం శాశ్వతంగా నిలుచుంటుంది..!*

🌹 *నీ జీవిత పుస్తకాన్ని అందరికి*
        *తెరచి  చూపించకు*
            *ఎందుకంటే...!*
  *నీ భాష కొందరికి మాత్రమే*
         *అర్థమవుతుంది.*

🌹 *చెప్పవలసి ఉన్నది కనుకనే*
   *వివేకి మాట్లాడితే.....!*
 *ఏదో ఒకటి చెప్పాలని*
  *అవివేకి మాట్లాడుతాడు...!!*

🌹 *ఉన్నదానితో సంతృప్తి పడడం*
                     *ఉత్తమమే........*
                 కానీ
 *ఉన్న ఙ్ఞానం చాలనుకోవడం*
                     *అఙ్ఞానం...!!*

🌹 *జీవితంలో అన్ని కష్టాలకు*
*రెండే రెండు మందులు*
*ఒకటి శ్రమ చేయడం*
*రెండు సహనంగా ఉండడం.*

🌹 *చేసిన తప్పులకు చింతించడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగదు.*
*ఆ తప్పులు మరల మరల చేయకుండా ఉండటం వల్లనే ప్రశాంతత కలుగుతుంది.*
[8/22, 19:50] +91 94409 63004: *🌹ప్రతి మనిషి జీవితంలో తప్పక గుర్తించుకోదగిన సూచనలు🌹*


🌹)  *చదివినదే కాదు. మనం గుర్తుపెట్టుకున్న విషయాలే మనల్ని నిలబెడుతుంది.*

🌹) *ఏ పనిలోనైనా తాను విజయం సాధించలేనని ముందుగానే నిర్ణయానికి వచ్చే వ్యక్తి ఎప్పటికీ విజేత కాలేడు.*

🌹) *చదివే అలవాటు మనిషినీ పరిపూర్ణుడి గా చేస్తుంది.*
*రాసే అలవాటు అతని ఖచ్చితమైన వ్యక్తి గా చేస్తుంది.*

🌹) *ఉత్సాహం లేని చదువు వెలుగునివ్వని నిప్పులాంటిది.*

🌹) *పుస్తకాలు అనేవి ఈ రోజు మాత్రమే కాదు. కలకాలం మన సంక్షేమం కోరే మిత్రులలాంటివి.*

🌹) *విజయానికి సాధించాలన్న నిర్ణయం తీసుకున్న వ్యక్తికీ ఏదీ అసాధ్యం కాదు...*

             *🌹శుభ సాయంత్రం🌹*🙏
[8/23, 05:36] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *పోరాటము చేయలేని వాడు పిరికివాడు.*
*పారిపోవడానికే తాపత్రయం పడతాడు*

🌹*అలవాట్లు ఆయుధాల్లాంటివి.*
*మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి.*
*చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా*
*క్రింద పడేస్తాయి...!*

🌹 *గెలవడం అంటే రాజ్యాలు కాదు దేశాలు కాదు.*
*ఇంకొకరి దగ్గర చేయి చాచకుండా ఎవ్వరిని*
*మోసం చేయకుండా రాజాలా బ్రతకడం.*
*కడుపుకి తిని కంటి నిండా నిద్రపోవడం.*
*దీన్ని మించిన గెలుపు ఏదీ లేదు...*

🌹 *మనమీద మనకుండే నమ్మకం*
*శత్రువుని భయపెడుతోంది.*
*కానీ*
*మనమీద మనకుండే అపనమ్మకం*
*శత్రువు బలాన్ని పెంచుతుంది....!*

🌹 *మనం పూర్తిగా సుఖపడక*
*పోవడానికి అవరోధం ఒక్కటే.*
*మనకున్నదానిపై నిర్లక్ష్యం.*
*లేనిదానికి ఆరాటం.*

🌹 *వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి.*
*ఎందుకంటే దీపం పూరిగుడిసెలో అయినా*
*ఇంద్ర భవనంలో అయినా ఒకేలాగా*
*వెలుగును పంచుతుంది.*
[8/24, 08:17] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికై*
*పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి.*
*ఎందుకంటే వారు మనలను అనుసరిస్తారు కాబట్టి.*

🌹 *ఆశతో సమానమైన దుఃఖంగాని*
*ఆశను వదలడంతో సమానమైన*
*సుఖంగానీ లేనే లేవు.*
*ప్రాణాలు తీయగల ఘోరమైన రుగ్మత ఆశ.*

🌹 *తెలుసుకోవడానికి ఏదీ అంత*
               *చిన్నది కాదు.*
*ప్రయత్నించడానికి ఏదీ అంత*
              *పెద్దది కాదు.*

🌹 *మిమ్మల్ని వాడుకుని పక్కకు*
*నెట్టేస్తున్నారని గ్రహించినప్పుడే*
             *పక్కకు తప్పుకోండి.*
       *కారణాలు అడగవద్దు!*
            *ఎందుకంటే....*
        *మనం ఇంకా ఎక్కువ*
  *గాయపడడానికి కారణాలు*
       *ఉంటాయి వాళ్ళదగ్గర*

🌹 *అత్యంత ప్రతిభావంతమైన*
  *ఇద్దరు యోధులు ఎవరంటే*
  *ఒకటి సహనం.. రెండోది కాలం!*

🌹 *వందసార్లు పనులు చేస్తే కాదు....*
 *పనిని వంద రకాలుగా ప్రయత్నిస్తే*
 *వచ్చేదే విజయం.....*
[8/25, 07:26] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹  *జీవితంలో ఒత్తిడితో కూడిన*
  *పరిస్థితులు తరచుగా రావచ్చు.*
 *అలాంటి సమయాల్లో మరొకరికి*
   *ఏదో ఒక రూపంలో సహాయం*
*చేయడంపై దృష్టి పెట్టండి. ఒత్తిడి*
 *స్థాయిలు గణనీయంగా, వేగంగా*
                 *తగ్గుతాయి.*

🌹 *తన వృత్తిని పవిత్రంగా భావించే వ్యక్తి*
*ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు.*

🌹 *నూనె లేకుండా*
*దీపం వెలుగదు*
 *నమ్మకం లేకుండా*
*బంధం నిలబడదు*

🌹 *ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి*
*కొన్ని సార్లు మీకోసం..*
*కొన్నిసార్లు మీ వాళ్ళకోసం.*

🌹 *మీ అంతరంగంలో తృప్తిని కలిగి ఉన్నారంటే,*
*మీరు మీ కోరికలను మరియు ఇతరుల కోరికలను,*
*అవసరాలను అవలీలగా తీర్చగలుగుతారు...!*

🌹 *చెట్టుకు, డబ్బుకు మాటలొస్తే*
*పలికేది ఒక్కటే,*
*ఈ రోజు నన్ను కాపాడుకో*
*రేపు నిన్ను కాపాడతా అని..!*
[8/26, 06:22] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *విల్లు వంచితేగాని బాణం*
*దూసుకు పోదు..*
*అలాగే ఒళ్ళు వంచితేగాని*
*జీవితం ముందుకు పోదు....!*

🌹 *దైవము అంటే గుడిలో ఉండే*
*విగ్రహము కాదు..*
*ప్రతిమనిషిలో ఉండే మానవత్వము..!*

🌹 *గమ్యం స్థిరంగా ఉండాలి.*
*మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి.*
*ధృఢ సంకల్పం కావాలి.*
*ప్రయత్నంలో రాజీలేని ధోరణి ఉండాలి.*
*అపుడు విజయం వైపు సాగే నీ పయనాన్ని ఎవరూ ఆపలేరు.*

🌹 *కదలని బొమ్మకు కవితలు చెప్పిన*
*మారని మనిషికి నీతులు చెప్పినా*
*అది వృథా ప్రయాసే అవుతుంది.*

🌹 *ఒకరికొకరు పరిచయం కావడం*
            *ప్రారంభమైతే....*
*కలిసి తిరగడం అభివృద్ధి..!*

🌹 *ఇతరులను విమర్శించే ముందు,*
*నిన్ను ఇతరులు విమర్శించే*
*వీలులేకుండా నిజాయితీగా,*
*నిస్వార్థంగా జీవించు. అప్పుడే*
*నీ విమర్శకు విలువుంటుంది.*
[8/27, 06:29] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *ఎప్పుడు గల గల*
*మాట్లాడేవారి గొంతు*
*మూగబోయిందంటే*
*రెండు విషయాలు....*
*వాళ్ళ మనసు*
*విరిగిపోయి ఉండాలి*
*లేదా వాళ్ళ లోపల*
*మౌనంగా ఒక యుద్ధమే*
*నడుస్తుండాలి.*

🌹 *ఎవరెంత చనువిచ్చినా*
*నువ్వు నీ హద్దులలోనే ఉండు..*
*ఎందుకంటే...*
*కెరటాలు తీరాన్ని*
*తాకితే వినోదం..*
*దాటితే విధ్వంసం..!!*

🌹 *నువ్వు నేను అనే బంధం కన్నా*
*మనమనుకునే బంధం చాలా గొప్పది.*
*కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన అలాంటి బంధం దొరకదు.*
*మనకు వస్తే కష్టం... మన అనే వాళ్ళకి వస్తే  నరకం..*

 *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *మనకున్న అలవాట్లే*
*మన స్థాయిని నిర్ణయిస్తాయి.*
*మంచివైతే సమాజంలో మనకు*
*గౌరవాన్ని పెంచుతాయి...!*
*చెడ్డవైతే నలుగురిలో మనల్ని తల దించుకునేలా చేస్తాయి..!*
 
🌹 *బ్రతకడం కోసం రాజీ పడటం*
                *కంటే....*
*నీకు నచ్చేలా బ్రతకడం కోసం*
*యుద్ధం చేయడమే ఉత్తమం.*

🌹 *మాటలతో కూడిన హృదయం లేని*
*ప్రార్థన కంటే,*
*మాటలు లేకుండా హృదయంతో చేసే*
*ప్రార్ధనే గొప్పది.*

🌹 *భార్య, భోజనం, ధనం ఈ మూడింటి విషయంలో  దొరికిన దానితోనే తృప్తి పడాలి,*
*దానము, తపస్సు, విద్య ఈ మూడింటి యందు మాత్రం ఎప్పటికీ తృప్తి పడరాదు*
  
🌹 *సరైన జీవితం కావాలి అంటే.?*
*సరైన వారితోనే తిరగాలి,*
*సరికాని వారితోనే తిరిగి,*
*సరైన జీవితం కోరుకుంటే...*
*అది సరి కాని కోరిక అవుతుంది..!*
*రెండు పడవల ప్రయాణం,*
*ఎన్నటికైన ప్రమాదమే జాగ్రత్త !!*
*క్యారెక్టర్ ఉన్నోడికి,*
*కావాల్సినోళ్లంటూ ఎవరూ ఉండరు..?*
*వాడి బ్రతుక్కి "వాడే రాజు.. వాడే బంటు.."*
[6/29, 05:39] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *మనుషులు ఇబ్బంది పడేది*
*రెండు సందర్భాలలో...*
*డబ్బులు పొదుపు చేయలేనప్పుడు*
*మాటలు అదుపు చేయలేనప్పుడు...!!*

🌹 *బ్రతకడం కోసం రాజీ పడటం కంటే*
*నీకు నచ్చేలా బ్రతకడం కోసం*
*యుద్ధం చేయడమే ఉత్తమం....!!*

🌹 *మంచి పరిణామం ఎప్పుడూ*
*నత్తనడకనే ఉంటుంది....*
*చెడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా*
*పరుగులు పెడుతుంది....!!*

🌹 *ఎప్పుడూ గతంలోకి చూడటం*
*లేదా... పక్కవారి జీవితంలోకి*
*చూడటం చేస్తావో...*
*అప్పుడు నీ ఆనందానికి*
*అవరోధం కలిగినట్లే....!!*

🌹 *తెగిపోయిన దారానికి*
*ఎన్ని ముడులు వేసినా*
*ముడి అలాగే ఉంటుంది...*
*మునుపటిలాగా అనిపించదు.*
*అందుకే తెంపుకునే ముందే*
*ఆలోచించాలి....*

🌹 *శ్రమించేవాడికే, క్షమించే*
*గుణం ఉంటుంది....*
*పెట్టేవాడికే, మనలను*
*తిట్టే హక్కు ఉంటుంది...*
*తగ్గితే తప్పులేదు, ఆ క్షణం*
*మౌనం కంటే గొప్పది లేదు*
[7/8, 05:46] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *విజేతగా నిలవాలంటే*
 *ఎవరినో ఓడించడం కాదు..*
 *నిన్ను నువ్వు గెలవాలి...!!*

🌹 *కోల్పోయిన వాటిని వెనక్కి*
*తెచ్చుకోవటంలో తప్పు లేదు,*
*కానీ... ఆ ప్రయత్నంలో మనల్ని*
*మనం కోల్పోకూడదు.....!!*

🌹 *నువ్వు కష్టాన్ని కాదన్న రోజు*
*గెలుపు నిన్ను గెంటేస్తుంది...!!*

🌹 *ఒక మనిషి తన జీవితంలో*
*బ్రతకడం వేరు...జీవించడం వేరు.*
*బ్రతకడం అంటే ఆ మనిషి ప్రాణంతో*
*ఉండడం అంతే....*
*జీవించడం అంటే ఆ మనిషికి*
*జీవితం పట్ల సంతృప్తి, అనుభూతి*
*ఉండడం.....!!*

🌹 *ఎదుటి వ్యక్తిని మనం*
*మంచివాడా...కాదా*
*అని అంచనా వేసే ముందు*
*మనకు ఆ వ్యక్తిని*
*పరీక్షించడానికి అర్హత*
*ఉందా..లేదా అనేది*
*ఒకసారి ఆలోచించుకోవాలి....!!*
[7/14, 19:16] +91 94409 63004: *🍃🌺వాళ్ళు నా వాళ్ళు వీళ్లు నా వాళ్ళు అని మనం చెప్పుకోవడం కాదు..*

*అవతలి వాళ్ళు కూడా చెప్పుకోవాలి*
*తను మా మనిషి అని...*
*అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ...*

*కేవలం మనం మాత్రమే అనుకుంటే అది బంధం కాదు మన భ్రమే అవుతుంది...*

*దూరానికి ఆనందంగానూ, దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం.*

*ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది.*

*తాగినప్పుడు మనిషి యొక్క నిజమైన స్వరూపం బయటకు వస్తుంది.*

*మనం అతిగా ఆలోచిస్తాము, చాలా తక్కువగా గ్రహిస్తాము.*

*ఇదే మనకి కర్మదాత అయిన భగవంతుడు తెలియచేస్తారు...*
         
              *శుభ సాయంత్రం*🙏
[7/15, 06:28] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *జీవితము, గడియారం రెండూ ఒక్కటే..*
*వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు,*
*ఒకచోట ఆగిపోయినా ప్రయోజనము ఉండదు...!*

🌹 *మన వారు ఎవరైనా మీ పట్ల*
*గూఢచారిలాగా వ్యవహరిస్తున్నారంటే*
*ఆ బంధాన్ని వదిలివేయడమే ..!*
 
🌹 *ఒక్క క్షణమే క్షణికావేశం..*
*కానీ*
*ఆ ఒక్క క్షణమే విషాదమై*
*మిగులుతుంది జీవితకాలం...!*

🌹 *జీవితంలో కష్టపడకుండా*
*ఏదీ రాదు*
*ఒకవేళ వచ్చినా*
*ఎక్కువకాలం నిలువదు..!*

🌹 *సుఖాల్లో పట్టుకున్న*
*చేతుల కంటే,*
*కష్టాల్లో వదిలేసిన చేతులు*
*ఎప్పటికీ గుర్తుండిపోతాయి.*

🌹 *జీవితాన్ని బహు బాగా జీవించండి.*
*అది  ఎంతగా అంటే*
*మృత్యువు కూడా మీరు*
*జీవించి ఉంటే బాగుండు అనేంతగా...!*
[7/15, 19:16] +91 94409 63004: *🍃🥀శ్రమ*

*🍃🥀శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేని వారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.*

*🍃🥀శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.*

*🍃🥀శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.*

*🍃🥀శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.*
       *🍃🥀శుభ సాయంత్రం*🙏
[7/16, 06:34] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *నువ్వు ఎంత చేసినా...*
*చివరిగా నువ్వు చేయలేని సహాయాన్ని*
*మాత్రమే గుర్తుపెట్టుకుంటారు....*
*వాళ్ల దృష్టిలో నిన్ను నిర్దోషిగా నిలబడతారు...!*

🌹 *చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం,*
*మంచివారి దృష్టిలో తెలివి అంటే*
*తప్పుచేయవలసిన పరిస్థితులనుండి తప్పించుకోవడం...!*

 🌹 *ఎవరి ధనం కోసమో, ఎవరి బంధం కోసమో*
*మనం పాకులాడే అవసరంలేదు.*
*మన మాట, మన గుణం* *బాగుంటే*
*అవే మన దగ్గరకు వస్తాయి."*

🌹 *రోడ్డుమీద రాయిలా ఉండకు...*
*ఎవరో ఒకరు నిన్ను తన్నేస్తారు..*
*ఊరిచివర కొండలా ఉండు...*
*తాకడానికి కూడా ఆలోచిస్తారు...!!*

🌹 *మానవత్వం అనే దీపాన్ని*
*నీ మనసులో వెలిగిస్తే..*
*ఆ దీపపు కాంతిలో నువ్వు*
*ప్రకాశవంతంగా కనిపిస్తావు.*
*నీలో ఉన్న ఆ మానవత్వాన్ని*
*ఎప్పటికీ ఆరిపోనీకు...*
*నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారికి*
*నువ్వు ఇవ్వగలిగే....*
*వెలుతురును కోల్పోకు.....!!*

🌹 *నువ్వు చదివే ప్రతి పుస్తకం*
*నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే*
*ఉంటుంది....*
*దాన్ని నువ్వు గ్రహించినప్పుడే*
*ఒక్కో మెట్టూ పైకి ఎక్కగలవు...!!*

6/24, 07:24] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *గాలివానకు గొడుగు*
*వాడినా ఫలితం ఉండదు.*
*ముళ్ళ కంపను మంచినీళ్లతో*
*పెంచినా ప్రయోజనం ఉండదు.*
*కొన్ని బంధాలు అనుబంధాలు*
*కూడా అంతే...*
*మన జీవితం మనకేదీ*
*నేర్పించదు...*
*జీవితంలో మనకు ఎదురయ్యే*
*మనుషుల ద్వారానే నేర్చుకోవాలి.*

🌹 *పరిస్థితులు ఎంత కఠినంగా*
*ఉన్నా సరే....*
*మనం మనలాగే*
*ఉండడం*
*అసలైన ధైర్యం....!!*

🌹  *కష్టాలు కన్నీళ్ళనే కాదు*
*నిజాలను బయటకు రప్పిస్తుంది*
*దాపరికాల ముసుగును*
*తొలగిస్తుంది....*
*వాస్తవాలను వెలుగు చూసేలా*
*చేస్తుంది......*
*కష్టం కూడా ఒక మంచి*
*స్నేహితుడే....*
*నీలో ధైర్యాన్ని.... నీ సామర్థ్యాన్ని*
*నీకు తెలియజేస్తుంది....*
*నీ భవిష్యత్తుకు... గమ్యాన్ని*
*వెతికేలా చేస్తుంది....!!*

🌹 *జీవితంలో ఎప్పుడూ*
*మంచివాళ్ళను నొప్పించకు*
*ఎందుకంటే....*
*వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు...*
*చేజారితే పగిలిపోరు...*
*నీ జీవితం నుండి*
*జారిపోతారు.....!!*

🌹 *కంటికి నచ్చే ఎన్నో విషయాల*
*గురించి.....*
*పరుగులు తీస్తూ ఉంటాం... కానీ*
*గుండెకు నచ్చే విషయం గురించి*
*వెతకండి......*
*నయనానందం క్షణికం...*
*హృదయానందం శాశ్వతం.*
[6/25, 07:09] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *ప్రమాదమైనా...*
*సింహాన్నే ప్రేమించు.*
*ప్రమాదం లేదనుకుని...*
*నక్కలతో చెలిమి వద్దు.*
*అసలు ప్రమాదం*
*గుంట నక్కలతోనే..!!*

🌹 *ఇతరుల కష్టాలు తీర్చే*
*స్థోమత నీకు లేకున్నా..*
*ఇతరులకు ధైర్యం చెప్పే*
*మనసు ఉంటే చాలు...*
*కష్టాల్లో ఉన్నా వారికి నువ్వే*
*దేవుడివి.*

🌹 *నిర్ణయం తీసుకున్నాక*
*దారి ఎలా ఉన్నా....*
*గమ్యం చేరాల్సిందే....!!*

🌹 *జీవితంలో పదిమందిని*
*బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు...*
*పది మంది బాధను తీర్చి*
*ఎదగడమే గొప్ప....!!*

🌹 *మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర*
*అహంకారం...*
*మనల్ని పట్టించుకోని మనుషుల*
*దగ్గర మమకారం అస్సలు*
*చూపించకూడదు.....!!*

🌹 *సముద్రం మీద వచ్చే*
*అలల మాదిరిగా...*
*కాకుండా... సముద్రమంత*
*లోతుగా ఆలోచించు....!!*
[6/26, 07:18] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*  

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *రాసిన అక్షరం తప్పయితే*
*దాన్ని సరిదిద్దుకోవచ్చు*
కానీ
*జీవితంలో  తప్పు చేస్తే*
*దాన్ని సరిదిద్దడం చాలా కష్టం.*
*అందుకే*
*జీవితంలో వేసే ప్రతి అడుగు ను ఆలోచించి వేయాలి.*

🌹 *అహంకారం, గర్వం, పొగరు..*
*నాదృష్టిలో చాలా ఖరీదైనవి.*
*నాకు వాటిని కొనుక్కునే స్తోమత లేదు.*
*అందుకే*
*చవగ్గా దొరికే*
*సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోవడం... అనేవాటితోనే సరిపెట్టుకుంటున్నాను..*

🌹 *రాలే ఆకు ఈ జీవితం శాశ్వతం కాదని చెబుతుంది*

*వికసించేపువ్వు జీవించే ఒక్కరోజైన గౌరవంగా* 
*జీవించమని చెబుతుంది*

*నీడనిచ్చేవృక్షం తను కష్టాల్లో ఉన్నా పరులకు సుఖాన్ని ఇవ్వమని చెబుతుంది.*

🌹 *జీవితం సైకిల్ పై ప్రయాణం*
                  *లాంటిది.*
*కిందపడకుండా ఉండాలంటే*
*అన్నింటికి బ్యాలన్స్ చేయాల్సిందే!.*

🌹 *విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలకెత్తుతుంది.*
*నీ ఆలోచనలు మంచివైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు.*

🌹 *నీతులు చెప్పే*
*లక్ష నాలుకల కంటే...*
*సాయం చేసే*
*ఒక్క చేయి గొప్పది....!!*
[6/27, 07:34] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *మనకున్న అలవాట్లే*
*మన స్థాయిని నిర్ణయిస్తాయి.*
*మంచివైతే సమాజంలో మనకు*
*గౌరవాన్ని పెంచుతాయి...!*
*చెడ్డవైతే నలుగురిలో మనల్ని తల దించుకునేలా చేస్తాయి..!*
 
🌹 *బ్రతకడం కోసం రాజీ పడటం*
                *కంటే....*
*నీకు నచ్చేలా బ్రతకడం కోసం*
*యుద్ధం చేయడమే ఉత్తమం.*

🌹 *మాటలతో కూడిన హృదయం లేని*
*ప్రార్థన కంటే,*
*మాటలు లేకుండా హృదయంతో చేసే*
*ప్రార్ధనే గొప్పది.*

🌹 *భార్య, భోజనం, ధనం ఈ మూడింటి విషయంలో  దొరికిన దానితోనే తృప్తి పడాలి,*
*దానము, తపస్సు, విద్య ఈ మూడింటి యందు మాత్రం ఎప్పటికీ తృప్తి పడరాదు*
  
🌹 *సరైన జీవితం కావాలి అంటే.?*
*సరైన వారితోనే తిరగాలి,*
*సరికాని వారితోనే తిరిగి,*
*సరైన జీవితం కోరుకుంటే...*
*అది సరి కాని కోరిక అవుతుంది..!*
*రెండు పడవల ప్రయాణం,*
*ఎన్నటికైన ప్రమాదమే జాగ్రత్త !!*
*క్యారెక్టర్ ఉన్నోడికి,*
*కావాల్సినోళ్లంటూ ఎవరూ ఉండరు..?*
*వాడి బ్రతుక్కి "వాడే రాజు.. వాడే బంటు.."*
[6/29, 05:39] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *మనుషులు ఇబ్బంది పడేది*
*రెండు సందర్భాలలో...*
*డబ్బులు పొదుపు చేయలేనప్పుడు*
*మాటలు అదుపు చేయలేనప్పుడు...!!*

🌹 *బ్రతకడం కోసం రాజీ పడటం కంటే*
*నీకు నచ్చేలా బ్రతకడం కోసం*
*యుద్ధం చేయడమే ఉత్తమం....!!*

🌹 *మంచి పరిణామం ఎప్పుడూ*
*నత్తనడకనే ఉంటుంది....*
*చెడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా*
*పరుగులు పెడుతుంది....!!*

🌹 *ఎప్పుడూ గతంలోకి చూడటం*
*లేదా... పక్కవారి జీవితంలోకి*
*చూడటం చేస్తావో...*
*అప్పుడు నీ ఆనందానికి*
*అవరోధం కలిగినట్లే....!!*

🌹 *తెగిపోయిన దారానికి*
*ఎన్ని ముడులు వేసినా*
*ముడి అలాగే ఉంటుంది...*
*మునుపటిలాగా అనిపించదు.*
*అందుకే తెంపుకునే ముందే*
*ఆలోచించాలి....*

🌹 *శ్రమించేవాడికే, క్షమించే*
*గుణం ఉంటుంది....*
*పెట్టేవాడికే, మనలను*
*తిట్టే హక్కు ఉంటుంది...*
*తగ్గితే తప్పులేదు, ఆ క్షణం*
*మౌనం కంటే గొప్పది లేదు*
[7/8, 05:46] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *విజేతగా నిలవాలంటే*
 *ఎవరినో ఓడించడం కాదు..*
 *నిన్ను నువ్వు గెలవాలి...!!*

🌹 *కోల్పోయిన వాటిని వెనక్కి*
*తెచ్చుకోవటంలో తప్పు లేదు,*
*కానీ... ఆ ప్రయత్నంలో మనల్ని*
*మనం కోల్పోకూడదు.....!!*

🌹 *నువ్వు కష్టాన్ని కాదన్న రోజు*
*గెలుపు నిన్ను గెంటేస్తుంది...!!*

🌹 *ఒక మనిషి తన జీవితంలో*
*బ్రతకడం వేరు...జీవించడం వేరు.*
*బ్రతకడం అంటే ఆ మనిషి ప్రాణంతో*
*ఉండడం అంతే....*
*జీవించడం అంటే ఆ మనిషికి*
*జీవితం పట్ల సంతృప్తి, అనుభూతి*
*ఉండడం.....!!*

🌹 *ఎదుటి వ్యక్తిని మనం*
*మంచివాడా...కాదా*
*అని అంచనా వేసే ముందు*
*మనకు ఆ వ్యక్తిని*
*పరీక్షించడానికి అర్హత*
*ఉందా..లేదా అనేది*
*ఒకసారి ఆలోచించుకోవాలి....!!*
[7/14, 19:16] +91 94409 63004: *🍃🌺వాళ్ళు నా వాళ్ళు వీళ్లు నా వాళ్ళు అని మనం చెప్పుకోవడం కాదు..*

*అవతలి వాళ్ళు కూడా చెప్పుకోవాలి*
*తను మా మనిషి అని...*
*అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ...*

*కేవలం మనం మాత్రమే అనుకుంటే అది బంధం కాదు మన భ్రమే అవుతుంది...*

*దూరానికి ఆనందంగానూ, దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం.*

*ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది.*

*తాగినప్పుడు మనిషి యొక్క నిజమైన స్వరూపం బయటకు వస్తుంది.*

*మనం అతిగా ఆలోచిస్తాము, చాలా తక్కువగా గ్రహిస్తాము.*

*ఇదే మనకి కర్మదాత అయిన భగవంతుడు తెలియచేస్తారు...*
         
              *శుభ సాయంత్రం*🙏
[7/15, 06:28] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *జీవితము, గడియారం రెండూ ఒక్కటే..*
*వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు,*
*ఒకచోట ఆగిపోయినా ప్రయోజనము ఉండదు...!*

🌹 *మన వారు ఎవరైనా మీ పట్ల*
*గూఢచారిలాగా వ్యవహరిస్తున్నారంటే*
*ఆ బంధాన్ని వదిలివేయడమే ..!*
 
🌹 *ఒక్క క్షణమే క్షణికావేశం..*
*కానీ*
*ఆ ఒక్క క్షణమే విషాదమై*
*మిగులుతుంది జీవితకాలం...!*

🌹 *జీవితంలో కష్టపడకుండా*
*ఏదీ రాదు*
*ఒకవేళ వచ్చినా*
*ఎక్కువకాలం నిలువదు..!*

🌹 *సుఖాల్లో పట్టుకున్న*
*చేతుల కంటే,*
*కష్టాల్లో వదిలేసిన చేతులు*
*ఎప్పటికీ గుర్తుండిపోతాయి.*

🌹 *జీవితాన్ని బహు బాగా జీవించండి.*
*అది  ఎంతగా అంటే*
*మృత్యువు కూడా మీరు*
*జీవించి ఉంటే బాగుండు అనేంతగా...!*

"క్ష " గుణింత కవిత

*క్ష* గుణింతంతో కవిత
శీర్షిక..క్షీణిస్తున్న మానవత్వం

*క్షణం క్షణం* ప్రకృతిని కాలుష్యంతో నింపేస్తూ మృత్యువునే కొని తెచ్చుకొంటున్న మనిషీ!..
*క్షు* ద్రమైన ఆలోచనలతో పుడమిని నిర్వీర్యం చేస్తున్నావ్..
*క్ష* ణికోన్మాదంతో విలాసాల బాట పట్టి, నీ శక్తులనే  కోల్పోయి దురభ్యాసాల పాలవుతున్నావ్..
*క్ష* ణికావేశానికీ లోనవుతున్నావ్..

*క్షితినీ, క్షితిజనీ* ఏకం  చేయాలనే విజ్ఞాన వీచికలు మానవుని
*క్షేమాన్ని* ఆశిస్తూ ఎన్నో ప్రయోగాలనే చేస్తున్నాయ్
*క్ష*ణమైనా విశ్రాంతి లేని యంత్రాలై అనవరతం శ్రమలనే చిందిస్తున్నాయ్..

*కానీ..*
*క్షీ*రసాగర మధనం లో గరళం పెల్లుబికినట్లు మనిషీ మనిషికి మధ్యన
*క్షీ*ణిస్తున్న 
ఆత్మీయానురాగాలు
*క్షా*మంలా ఎండిపోయిన మనసుల్లో ఆకలి తీరని ఆవేశాలు
*క్షు*ద్రంగా   మదమెక్కిన కామంతో
అమానుష కృత్యాలు
పెడదోవను పట్టిస్తున్నాయి..
*క్షే*మమే మీ *క్షే* మము కోరే పరిపాలనలంటూ
మనిషిని తాకట్టు పెట్టే
పాలనా యంత్రాంగాలు ..
*క్ష*మాగుణములనే మరిచి పగా ప్రతీకారాలతో రగులుతున్న ప్రతిహింసా ధోరణులు
*క్షు* రకత్తులతో మానవ మనుగడనే అంతం చేసే మారణహోమాలు
*క్షి* పణుల ప్రయోగాలతో, రక్తంతో తడిపే ఆగని నరమేధాలు..

*క్ష* ణమైనా ఇకనైనా ఇపుడైనా 
ఓ మనిషీ! స్థిరచిత్తంతో ఆలోచించుకో!
*క్ష*ళణభంగురమే నీ జీవితమంటూ తెలుసుకో
*క్షణం క్షణం* గడిచే ప్రతి క్షణం అమూల్యమైనది తెలుసుకో
*క్షే* మమునే, సంక్షేమమునే కాపాడుకొనుట నీ కర్తవ్యమని
మసలుకో
తక్షణమే నీ జీవితమును ఆనందంగా మలుచుకో..
*************

రుబాయిలు గురించిన వివరణ

🍁రుబాయీలు గురించి కొన్ని నియమాలు🍁

రుబాయీ నాలుగు పంక్తులు గల కవిత. ఇది మాత్రా ఛందస్సుతో కూడిన ప్రక్రియ. ఇందులో ప్రతి పాదం ఒక సంపూర్ణ వాక్యం.   1,2,4 పాదాల చివరి పదాన్ని "రదీఫ్" అంటారు. రదీఫ్ కంటే ముందు ఉండే పదాన్ని "కాఫీయా" అంటారు. రధీఫ్ అంటే అదే పదం అని అర్థం చేసుకోవాలి. మొదటి పాదంలో ఏ పదం రధీఫ్ గా ఉంటే రెండవ, నాల్గవ పాదాలలో అదే పదం రదీఫ్ గా రావాలి.  కాఫీయా అంటే అంత్యప్రాస లాంటిది. కానీ తెలుగులో లాగా పూర్తి అంత్యప్రాస మాత్రం కాదు. మొదటి పాదంలోని కాఫీయా ఆకారాంతమయితే రెండవ నాల్గవ పాదాలలోని కాఫీయా ఆకారాంతమే కావాలి. ఇకారాంతమయితే తర్వాతి పాదాలలో ఇకారాంతమే కావాలి. ఉకారాంతమైతే ఉకారాంతమే కావాలి. హల్లుల ప్రాధాన్యత కాదు. 

మూడవ పాదానికి రదీఫ్ కాఫియాలు ఉండనవసరం లేదు.  అన్ని పాదాలకు సమమైన మాత్రలు ఉండాలి. ఏదో ఒక గతి(లయ)లో కొనసాగడం అభిలశనీయం. ప్రతి పాదానికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఉంటూ నాలుగు పాదాలకు కలిపి ఒక అస్తిత్వం ఉండాలి. మూడవ పాదంలో ఒక శ్వాస తీసుకొని నాల్గవ పాదంలో మెరుపును సాధించడం అభిలశనీయం. 

"రుబాయీలు" పుట్టు పూర్వోత్తరాలు లేకుండా కేవలం నియమాలను మాత్రం తెలియజేశాను.

ఈ రుబాయీలు అనే ఈ ప్రక్రియ  "పర్షియన్" సాహిత్య ప్రక్రియ, "రుబాయీ" అనేది అరబిక్ పదం.

- సేకరణ ......"శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి" గారి "తెలంగాణ రుబాయీలు" నుండి.

ఇప్పుడు మీకు కొందరు ప్రముఖులు రాసిన రుబాయీలను ఉదాహరణకు ఇస్తున్నాను.
.........//............//......

చిత్రశాల చూశారా చిందులేయు మనసు
మధుశాల చూశారా మత్తెక్కును మనసు
భావి పౌరులకు జ్ఞానామృతాన్ని పోసేటి
పాఠశాల చూశారా పారిపోవు మనసు!!
   
   - డా.తిరుమల శ్రీనివాసాచార్యులు
.......//..........//......

వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు ఉన్నా
జనంలో రగులుతున్న అగ్గే లేదు!!

   - శ్రీ ఎండ్లూరి సుధాకర్
......//..............//.........//.......

కనిపించే గాయమైతె తడమకనే తెలిసేది!
లోలోపలి వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని కడదాకా అనాథలే!
సాంధ్యఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!

  - శ్రీ పెన్నా శివరామ కృష్ణ

ఇందులో "తెలిసేది" రధీఫ్. తడమకనే , తలగడకే, పడమరకే ఇవన్నీ కాఫియాలు.

ప్రతి పాదంలోను 23 మాత్రలు ఉన్నాయి.

.........//.............//..........//...........

మాటల్లో మాధుర్యం గుర్తు పట్టవచ్చు
రాతల్లో సుకుమారం గుర్తు పట్టవచ్చు
మనసులోని అందాలకు కొలమానం లేదు
సహజమైన సౌందర్యం గుర్తుపట్టవచ్చు

   - శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి

ఇందులో ''గుర్తు పట్టవచ్చు" అనేది రధీఫ్. మాధుర్యం, సౌందర్యం , కొలమానం ఇవన్నీ కాఫియాలు 
ప్రతి పాదంలోను 21 మాత్రలు ఉన్నాయి. 
.....//........//.........//..........

చివరగా నేను రాసిన రుబాయీ....

హరివిల్లుకు రంగులనే అద్దాలని 'ఉందిలే'
ఆ నింగికి ఊయలేసి ఊగాలని 'ఉందిలే'
తొలకరి చినుకై మరిమనసే గంతులేస్తోందని
కోయిలకే సరిజోడిగ పాడాలని 'ఉందిలే'!!
   - శాంతి కృష్ణ

ఇందులో "ఉందిలే" రధీఫ్. అద్దాలని , ఊగాలని, పాడాలని ఇవన్నీ కాఫియాలు.
ప్రతి పాదంలోను 23 మాత్రలు ఉన్నాయి.
...........//.........//........//........

పైన ఉన్న "రుబాయీలు" లో అందరూ ఒకే ఛందస్సు పాటించినా...ఒక్కో రచయిత కు ఒక్కో శైలి కనిపిస్తుంది.....

ఇప్పుడు మీరు పైన ఇచ్చిన నియమాలను పాటిస్తూ చక్కగా "రుబాయీ"లను రాయడానికి ప్రయత్నం చేయండి. 

ఉత్సాహం ఉండే వాళ్ళు కింద కామెంట్లో మీ రుబాయీలు పెట్టండి.

(మాత్రలు : 
ఒక క్షణంలో పలికే అక్షరం ఒక మాత్ర
రెండు క్షణాలలో పలికే అక్షరాలు రెండు మాత్రలు

లఘువు - ఒక మాత్ర
గురువు - రెండు మాత్రలు

గురువులు :- దీర్ఘమైన అచ్చులు , దీర్ఘమైన హల్లులు
ఉదా: ఆ , ఈ.....
         కా , గా......
సంయుక్తాక్షరాలకు, ద్విత్వానికీ , సున్నాకి ,విసర్గకు, నకారానికి ముందున్న అక్షరాలు....ఇవన్నీ గురువులు

లఘువులు : దీర్ఘము లేని అచ్చులు , దీర్ఘము లేని హల్లులు 
ఉదా: అ , ఇ......
          క , గ......

ఇంకా అర్ధంకాకుంటే వ్యాకరణం పుస్తకం చూడండి. లేదా గూగుల్ లో వెతకండి.)

  ఈవిధంగా మనం నెలకు ఒకసారి ఏదైనా ఒక ప్రక్రియ గురించో,  లేకపోతే ఏదైనా 'సమూహ చర్చలు' , పజిల్స్....ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించుకుందాం.

శాంతి కృష్ణ ✍️

Friday, July 15, 2022

శీర్షిక : ప్లాష్టిక్ పై సమరం .

10/07/2022.
తెలుగు వెలుగు కవితల పోటీ కొరకు,
అంశం : ప్లాష్టిక్  పై సమరం .
శీర్షిక : చేయిా చేయిా కలుపుదాం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర


 ఆకర్షణీయమైన రంగులతో అలరిస్తున్న
హానికరమైన ప్లాష్టిక్ వాడుకలో ప్రమాదాలు .
ఉపయొాగకరమైన వస్తువుల తయారీలలో
మఖ్యమైనవిగా, ప్లాష్టక్ సంచుల వాడకాలు.॥

ప్లాష్టిక్ తయారీలో విచక్షణారహితంగా
 ఉపయోగించే రసాయనాలు. అందువల్ల
 కలుగుతున్న పర్యావరణ సమస్యలు .
 కరగని ప్లాష్టిక్ తో కనిపింని కఠిన రోగాలు ॥
 
పారుదల లేక ముాసుకు పోతున్న కాల్వలు.
మురిగిపోతున్న నీటిలో ముసురుతున్న దోమలు .
వ్యాపిస్తున్న మలేరియా డెంగ్యుా వంటి 
భయంకరమైన విషపుారిత వ్యాధులు. ॥

ఉత్పత్తియౌతున్న కరోనా వంటి విష కణాలు
మందులేని మహమ్మారులతో జన పోరాటాలు.
 ప్లాష్టిక్ వాడకాలు నిషేధమన్న నినాదాలు .
ప్లాష్టిక్  తయారీలను నిలిపివేయని జనాలు ॥

ఎన్నాళ్ళీ కఠిన కాలుష్య పోరాటాలు.
ఆపి వేయండి ప్లాష్టిక్ వస్తు వాడకాలు.
కలసి చేయండి పర్యావరణ రక్షణకై ప్రమాణాలు.
 ప్రత్యామ్నాయంగా వాడండి జనపనార , గుడ్డ
 లేదా కాగితపు సంచులు.॥

అనేక రాష్ట్రాల లో ప్లాష్టిక్ నిషేధాల తీర్మానాలు.
అందరుా మానండి ప్లాష్టిక్  సంచుల వాడకాలు.
మన నడవడికలే మన భవితకు మన మిచ్చే 
ఆరోగ్యకర తీర్మానాలు ॥

హామీ : ఈ వచన కవిత నా స్వీయ రచన.









Sunday, July 10, 2022

శీర్షిక : ప్లాష్టిక్ పై సమరం .

10/07/2022.
తెలుగు వెలుగు కవితల పోటీ కొరకు,
అంశం : ప్లాష్టిక్  పై సమరం .
శీర్షిక : చేయిా చేయిా కలుపుదాం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర


 ఆకర్షణీయమైన రంగులతో అలరిస్తున్న
హానికరమైన ప్లాష్టిక్ వాడుకలో ప్రమాదాలు .
ఉపయొాగకరమైన వస్తువుల తయారీలలో
మఖ్యమైనవిగా, ప్లాష్టక్ సంచుల వాడకాలు.॥

ప్లాష్టిక్ తయారీలో విచక్షణారహితంగా
 ఉపయోగించే రసాయనాలు. అందువల్ల
 కలుగుతున్న పర్యావరణ సమస్యలు .
 కరగని ప్లాష్టిక్ తో కనిపింని కఠిన రోగాలు ॥
 
పారుదల లేక ముాసుకు పోతున్న కాల్వలు.
మురిగిపోతున్న నీటిలో ముసురుతున్న దోమలు .
వ్యాపిస్తున్న మలేరియా డెంగ్యుా వంటి 
భయంకరమైన విషపుారిత వ్యాధులు. ॥

ఉత్పత్తియౌతున్న కరోనా వంటి విష కణాలు
మందులేని మహమ్మారులతో జన పోరాటాలు.
 ప్లాష్టిక్ వాడకాలు నిషేధమన్న నినాదాలు .
ప్లాష్టిక్  తయారీలను నిలిపివేయని జనాలు ॥

ఎన్నాళ్ళీ కఠిన కాలుష్య పోరాటాలు.
ఆపి వేయండి ప్లాష్టిక్ వస్తు వాడకాలు.
కలసి చేయండి పర్యావరణ రక్షణకై ప్రమాణాలు.
 ప్రత్యామ్నాయంగా వాడండి జనపనార , గుడ్డ
 లేదా కాగితపు సంచులు.॥

అనేక రాష్ట్రాల లో ప్లాష్టిక్ నిషేధాల తీర్మానాలు.
అందరుా మానండి ప్లాష్టిక్  సంచుల వాడకాలు.
మన నడవడికలే మన భవితకు మన మిచ్చే 
ఆరోగ్యకర తీర్మానాలు ॥

హామీ : ఈ వచన కవిత నా స్వీయ రచన.