Monday, November 6, 2023

శీర్షిక : మరో ఉద్యమానికి శ్రీకారం చుడదాం.

03/08/2023.
తపస్వి మనోహరం పత్రిక కొరకు ఆగస్టు 15 ,
ప్రత్యేక e బుక్ కొరకు రచన ,
విభాగం :  కథ/ వ్యాసం/ కవిత.
శీర్షిక  : మరో ఉద్యమానికి శ్రీకారం చుడదాం.
(వచన కవిత).

రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్:  మహరాష్ట్ర.


ఒకనాటి తన బానిసత్వపు శృంఖలాల  వెనుక జరిగిన ,
హింసాత్మక అల్లర్లు, జాతి మత భేదాల పేరుతో జరిగే
 మారణ హోమాలు, అతివలపై చేసే, అరాచక చర్యల
 ఆత్మ ఘోషలు , అవమానాలకు , రాజుకున్న మంటలు
 75 సంవత్సరాల స్వాతంత్ర్య జీవిత శాంతి బాటలో
  తిరిగి రాజు కుంటూ, నిప్పులు కురిపిస్తున్నాయి.
 దేశభక్తి గల వీర పుత్రుల ఉద్యమాలతో,
 ఎందరో చేసిన, ఆతత్యాగాల రుధిర ధారలతో,
 సాధించిన నా స్వాతంత్రపు , విజయ వీర రథముపై
  వీర తిలకంతో ఎగురుతున్న మువ్వన్నెల
  ముచ్చటైన నిండా ,వెలసిన రంగులతో వెలవెలబోతోంది.
నాలుగు జాతుల సమైక్యతతో నిలబడి ఉన్న 
నాలుగు చక్రాల విజయ రథం ఇరుసు, నేడు
 జాతి -మత  జాడ్యాల కారణంగా బలహీన పడింది.
అహంకారపూరితమైన పురుషాహిక్యతల, పైసాచిక కృత్యాలకు, అబలల  మానాలు అంగట్లో, నగ్నంగా ఊరేగుతున్నాయి.
స్వార్ధ రాజకీయాల  ముసుగు చాటులో,
మూడు బొమ్మల మూర్తి తత్వం ,
 కళ్ళు , చెవులు, నోరు, మూసుకుని ,
 మంది బాధలకు, మౌనంగా కన్నీరు కారుస్తోంది.
 న్యాయ, ధర్మాల సరి సమాన తూకంలో,
 శాంతి సారాన్ని నింపడానికి వచ్చే సార యోధుల
 కుత్తుకలకు,  ఉరివేయబడుతోంది.
 తిరిగి దేశ స్వాతంత్రానికి సంకెళ్లు పడక ముందే ,
 తనను, తన మానాన్ని, రక్షించడానికి సిద్ధపడే,
  బిడ్డలు,తప్పక వస్తారన్న ఆశతో నిరీక్షిస్తూ ,
  భరతమాత తన   కొన ఊపిరి ప్రాణాలను 
  నిత్య నమ్మకంతో ,నిలుపు కుంటున్నాది
"  దేశం కోసం ,ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే
   వీర పుత్రుల్లారా రండి  ! మన దేశ మాన,ధన,
   సంపత్తిని, వరుస వేలం వేసి , విదేశాలలో
    పూర్తి అమ్మకానికి పెట్టక ముందే ,
   స్వార్థ రాజకీయాల చీడ పురుగుల నుండీ .
   నన్ను, నా దేశాన్ని,,  రక్షించండి." అంటూ
   తల్లి భారతి ఆర్తిగా,వీర పుత్రులను పిలుస్తోంది.
   దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే
 దేశభక్తి నిండిన  భరతమాత బిడ్డల్లారా..!
 రండి .చేయి- చేయి కలిపి ,భారత దేశపు
  దివ్య చరితకు, నవ్య శ్రీకారం -చుడదాం.
   తల్లి భారతి నమ్మకాన్ని, వమ్ము చేయమన్న
  ఉజ్వల నినాదాలతో ఉత్తేజ పూరితంగా ఉద్యమిద్దాం.
  మన దేశాన్ని మనం రక్షించుకుందాం.
   
-------------------------------------------
హామీ :
ఈ వచన కవిత ,నా స్వీయ రచన.

శీర్షిక : సంక్షిప్త తిరుమల చరిత్ర .(వ్యాసం).


శీర్షిక  : సంక్షిప్త తిరుమల చరిత్ర .(వ్యాసం).
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .



భక్తులను తరింపజేయడానికి 
సాక్షాత్తుా వైకుంఠవాసుడైన" శ్రీ మహా విష్ణువు"
కలియుగ దైవంగా "శ్రీ వేంకటేశుడనే "నామంతో 
తిరుమల కొండలపై నున్న "ఆనంద నిలయంలో 
అవతరించేడు."
తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగం.
కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు తిరుమలగా వెలసినవి. ఈ ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఎడు తల లుగా సుాచింపబడతాయి.

ఈ ఆలయ గాలిగోపురం , ప్రాకారాలను  పుార్వ తమిళ 
పాలకుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మించేడని ప్రతీతి.
ఆకాశ రాజు సోదరుడైన "శ్రీ తొండమాన్ చక్రవర్తే "
స్వామి వారి  గర్భగుడైన ఆనందనిలయాన్ని కుాడా  నిర్మించేడని ప్రతీతి.
ఆలయ పవిత్ర జలాశయమైన "శ్రీ స్వామి పుష్కరిణి "
ఏడవ శిఖరమైన వేంకటాద్రిపై యున్నది.
దక్షిణ భారతదేశ రాజులే కాక  , 
పల్లవ రాజుల కాలంనుండీ  అప్పటి రాజులు, ప్రజలు  కుాడా స్వామివారి సేవలోనే తరించినవారై ధన్యతనొందేవారు. ,.
పల్లవ రాణియైన" శ్రీ పెరుందేవి"గా ప్రసిద్ధి కెక్కిన "సామవై" మహారాణి , స్వామి వారిని ఆరాధిస్తుా ఆభరణాలు సమర్పిస్తుా..పరమ భక్త శిరోమణిగా తిరుమలచరిత్రలో నిలచిపోయేరు.
తరువాత పల్లవ రాజులులైన" విజయగండ గోపాలదేవుడు ," చక్రవరతి తిరువేంకటనాధ 
యాదవరాయలు , "హరిహర రాయలు" మొదలైన రాజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించి స్వామివారి
వైభవానికి మరింత వన్నె తెచ్చారు.
అటుపై "సాళువ నరసింహరాయలు" నాలుగు స్థంభాల మండపాలను నిర్మించి ఉత్సవ వేడుకలను జరిపించారు.
విజయనగర రాజైన" శ్రీ కృష్ణ దేవరాయల "కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగిందంటారు..
స్వామివారికి కనకాభిషేకాలు భరణాలు సమర్పించడమేగాక , నిత్య నైవేద్యాలకు ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చి , నిత్యారాధనోత్సవాలకై  తాళ్ళపాక గ్రామాన్ని దానంగా సమర్పించుకున్న
ఘనత శ్రీకృష్ణ దేవరాయలదే.
పల్లవ రాజుల కాలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు 
నేటికీ తిరుమలలో వైభవోపేతంగా జరుగుతుా 
ఉండడం గమనార్హం .
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ 
ఆలయం మొదట మహమ్మదీయులపరమై , పిదప 
మరాఠాల పరమై తదుపరి ఈష్టిండియావారి పరమైంది ఈష్టిండియా వారు హిందుా ముస్లిమ్ ల ధర్మాలను కాపాడుతుా వచ్చారు.
ధర్మాదాయాల సొమ్మును రెవెన్యుాతో పాటు జిల్లా కలెక్టర్ గారు వసుాలు చేసి  దైవ సంబంధిత కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించేవారు.
అటుపై ఇంగ్లాండ్ లో మత పరమైన ఆందోళనలు చెలరేగాయి. ఆంగ్ల ప్రభుత్వం హిందుా మత సంస్థలలో 
జోక్యం చేసుకోవలదన్న చట్టాన్ని తేవడంతో 
ఆలయ నిర్వాహణ "మహంతులకు" అప్పచెప్పబడింది.
అప్పటినుంచీ దేవాలయ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారు లేక , ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుా ఉండడంతో బ్రిటిష్ ఇండియాలో దేవాలయాలన్నీ దెబ్బతిన్నాయి. 
వీరి తరువాత అప్పటి గవర్నర్ కొత్త ధర్మ కర్త మండలిని 
ఏర్పాటు చేయడంతో కొండపైగల  స్వామివారి ఆలయంలో అర్చకులచే స్వామివారికి పుాజలు నిర్వర్తించబడి అలయంతో పాటు ,"హథీ రాంజీ మఠం " కుాడా కొత్తకళ లు సంతరించుకున్నది.

అప్పటిలో భక్తులు గోవింద నామ స్మరణతో గుంపులు గుంపులుగా చేరి నడక దారిన పోతుా  ఏడుకొండలనెక్కి దాదాపు రెండు రోజుల పాటు రాళ్ళు -రప్పలపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకొనేవారట. 
రాను, రాను , భక్తుల  సౌకర్యార్ధం దారిలోవారు విశ్రాంతి తీసుకునేందుకు  విశ్రాంతి మంటపాలు .వంటా వార్పులకు దిగుడు బావులు ఏర్పరచబడ్డాయి.
అటుపై డోలీలతో పాటు ,కావడి కుాలీలు  చేరి , నడవలేనివారిని వాటిలో కుార్చో బెట్టి కొండపైకి చేర్చేవారట.
యాత్రికుల సంఖ్య పెరగడంతో 
యాత్రికుల సౌకర్యార్ధం అప్పటి ప్రభుత్వం  కొండపైకి మెట్ల మార్గాన్ని నిర్మించగా,  టి టి డి బోర్డ్ వారు
ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధిపరచి యాత్రికులకు  మరిన్ని సదుపాయాలు సమకుార్చేరు.
నానాటికీ భక్తుల సంఖ్య పెరుగుతుాండడంతో 
అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని గురించిన ఆలోచన చేసి అమలుపరచడం  వల్ల,...
భక్తుల రాకపోకల సౌకర్యార్ధం ఎన్నో  సదుపాయాలతో పాటు  పల్లకీలు గుర్రపు బళ్ళతో పాటు బస్సుల సదుపాయాలు ఏర్పరచబడి భక్తులను సేదతీర్చేయి..  ఉచిత బస,  భోజన సదుపాయాలు అన్నదాన పథకాలు  అమలుపరచబడ్డాయి.. .
ఘాట్ రోడ్లు నిర్మించ బడ్డాయి. రాను రాను తిరుమలపై 
జనావాసాలతో పాటు,  హోటళ్ళు  , చౌల్ట్రీలు , ఉచిత రుాములు, లాకర్ల వంటి ఎన్నో సదుపాయాలను భక్తుల సౌకర్యార్ధం నెలకొల్పి , భక్తులను సంతృప్తి  పరచేరు.
నిత్య కల్యాణం పచ్చ తోరణంగా నిత్య మంగళ స్వరుాపుడైన శ్రీ వేంకటేశ్వ స్వామి  చిరునగవుతో
భక్తుల మొరలాలిస్తుా , భక్త వత్సలుడై ఏడు కొండలపై 
నిత్య పుాజలందుకుంటున్నాడు.
వేంకటేశ్వరుని దర్శనార్ధం వెళ్ళిన ప్రతీ భక్తుడుా స్వామికి కానుకగా తమ తలనీలాలను సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావడం అచారంగా మారింది .
ఇక ప్రసాదాల విషయానికి వస్తే  తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డుా   చాలా ప్రసిద్ధి చెందినది . 
కమ్మని నేతితో జీడిపలుకులు, యాలకులు, కిస్మిస్ పండ్లతో చుట్టబడిన ఈ లడ్డుా ప్రసాదం భక్తులకు అందించబడడంతో భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందినంతగా ఆనంద పరవశులవడం గొప్ప విశేషం. 
దానితో పాటు పులిహోర అప్పం వంటి ప్రసాదాల వితరణతో , ఉచిత అన్నదాన కార్యక్రమాలతో నేటి "తిరుమల తిరుపతి" భక్త జన సందోహంతో కిట కిట లాడుతుా చుాపరులకు కన్నుల పండుగ చేస్తున్నది   
అత్యంత మహత్యం గల వానిగా ప్రాచుర్యం పొంది 
ఏడు కొండలపై వెలసిన "శ్రీ వేంకటేశుని" కృపా కటాక్షాలు మనందరిపై కుాడా ఉండాలని ప్రార్ధస్తుా..
స్వామివారికి భక్తిపుార్వక పాదాభివందనాలు 
సమర్పించుకుంటుా...... 
రచయిత్రి:
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి . 

మనసు"లో" మాట విను..కధ

*

రచన :శ్రీమతి ; పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :మహారాష్ట్ర.
----------------
కథా ప్రారంభం.

శీర్షిక:  మనసు" లో"మాట విను.. 
-------------

మనోహర్ కష్టపడి చదువుతున్నాడు.
మనసులో నిండా కసి ప్రకాష్ మీద .
వెధవ ,వాడే ఎప్పుడు కాలేజీలోని ఫస్ట్ వస్తూ ఉంటాడు .
కాలేజ్ ఎలక్షన్లో వాడే ఎప్పుడు లీడర్ గా ఎన్నుకోబడతాడు.
ఇప్పుడు ఎలాగైనా సరే వాడిని నేను ఓడించాలి.
 ఓడించాలంటే చదవాలి .కాలేజీలో నాకు మంచి పేరే ఉంది. కానీ ఏం లాభం..?
 తను ఎలాగైనా" లీడర్ "అవ్వాలి  అంతే ....
మనోహర్ "లో" మనసు బాధగా మూల్గింది.
" నువ్వు పైకి రావాలని చదువుకో"...
"ఆ ప్రకాష్ మీద పంతంతో  మాత్రం చదవకు  మనోహర్." అంటూ....
తన బుద్ధిని విమర్శిస్తున్న మనసును కోపంగా
 పక్కకు నెట్టాడు  మనోహర్.
"నువ్వు ముందు నోరుముయ్..."
"ఈసారి నేను లీడ్ లీడర్ అవ్వకపోతే వాడి పని చెప్తా..",..
----------------------
రిజల్ట్స్ వచ్చాయి. మనోహర్ డిష్టెన్షన్ లో పాస్ అయ్యాడు. మనోహర్ ప్రవర్తన, చదువు ,చూసిన మీదట ,ఆ సంవత్సరం కాలేజీ "లీడర్ "గా మనోహర్ ఎన్నుకోబడ్డాడు
తనను కంగ్రాట్స్ చేస్తున్న ప్రకాష్ వైపు, మనోహర్ క్రూరంగా చూశాడు.
-----------------
మనోహర్ ఇంటికెళ్లగానే తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిదనే చెప్పాలి .మనోహర్కి కూడా చాలా ఆనందం వేసింది .
తండ్రి మనోహర్ ని పిలిచి, ఓ" తాళం చెవి "చేతిలో పెట్టాడు ఏంటి నాన్నా.,? అన్నాడు మనోహర్  .
తండ్రి బయటికి చూపించాడు .
"స్కై బ్లూ కలర్" లో ఉన్న కొత్త "బైక్ "తనకు స్వాగతం చెప్తోంది.
మనోహర్ ఆనందం అంతా ఇంతా కాదు .
వెంటనే ,అవునులే..
 తను ఒక్కడే గా కొడుకు. తన తర్వాత ముగ్గురు అప్పచెల్లెళ్లు   ఉన్నారు. వాళ్లకు పెళ్ళవగానే వాళ్ళు వెళ్ళిపోతారు. తనేగా నాన్నని చూడవలసింది. మరి తనకు ఇవ్వక మరెవరికి ఇస్తాడు.
మనసులో స్వార్థంగా ఆలోచించినా , పైకి మాత్రం మనోహర్ 
సంతోషంగా డాడీని హత్తుకున్నాడు.
-------------------
మనోహర్ డాబా మీద నిల్చుని బైనాక్యులర్తో ఎదురింటి
" మీనాక్షిని" అదేపనిగా చూస్తున్నాడు . "మీనాక్షి"  ఎదురింట్లో ఉన్న "చంద్రం". భార్య.
చంద్రం కి తనంటే ఎంతో అభిమానం . తన "క్యారెక్టర్" అంటే చంద్రం కి  ఎంతో ఇష్టంట.   అవును మరి తను అందరి
దగ్గర అలాగే బిహేవ్ చేస్తాడుగా....
తన మనసులో జరుగుతున్న యుద్ధం ఎవరికీ తెలుసు..?
తను రోజూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.   చంద్రం వెంటనే భార్యను పిలిచి , కాఫీ టిఫిన్ తెప్పిస్తాడు .ఇద్దరు కూర్చుని చాలా సరదాగా  తనతో మాట్లాడుతూ ఉంటారు .
తన కళ్ళు మాత్రం , నఖ సిఖ పర్యంతం మీ మీనాక్షి అందాన్ని,.
పరిశీలిస్తూనే ఉంటాయి... దొంగతనంగా.,...
కానీ తను వెళుతుంది మీనాక్షి కోసమే అని చంద్రం కి తెలియదు ఇంతకీ తనకు ప్రత్యేకంగా "మీనాక్షి" అంటే ఏమీ అభిమానం లేదు , 
కానీ ఆమె ఫిగర్ ఉందే.....అబ్బ....
ఏదో రోజు దీని పని పట్టాలి. "తనే "అని తెలియకుండా ,ఏదో చేసేయాలి..... కాఫీ తాగుతూ మనోహర్ "కామ వాంఛతో" 
.. రగిలిపోతున్నాడు.
మనోహర్ "లో" మనసు మళ్లీ బాధగా మూల్గింది.
"నమ్మిన వాళ్లని మోసం చేయకురా"... అంటూ..
నువ్వు " పో " అవతలికి అంటూ, నెట్టేసాడు నిర్లక్ష్యంగా.,

-----------------------
పిల్ల నచ్చిందా మనోహర్..?
 ఎన్నో సంబంధాలు చూసాం రా .కానీ మాకే పిల్లా నచ్చలేదు ఈ పిల్ల నీకు బాగా నప్పుతుందని అనిపించింది .
చూడు ఎంత అందంగా ఉందో. 
కట్నాలు, కానుకలు కూడా మనకు తగ్గట్టుగానే ఇస్తామంటున్నారు ...అంటూ మెల్లగా చెప్పింది మనోహర్ చెవులో..
పెళ్ళంటకు ఏం బాగోలేదు కొంచెం లావు కూడాను అయినా
 మనోహర్ కి , వాళ్ళు ఇస్తున్న కట్నం మాత్రం భలే నచ్చేసింది .
అందుకే ,మనోహర్ కళ్లు దించుకొని అన్నాడు
,మీ ఇష్టమేనమ్మా,! మీరు ఎలా చెప్తే అలా "
పిల్ల పేరు రాజ్యలక్ష్మి. రాజ్యం ,రాజ్యం అని పిలుస్తూ ,కొన్నాళ్లు చుట్టూ తిరిగాడు .కానీ  పై కిటికీ లోంచి మీనాక్షిని చూడడం మాత్రం మానలేదు.

". ఛి..ఛీ .. నీ బుద్ధి మరి మారదా ? మనసు మళ్లీ హెచ్చరించింది ...
"ఏయ్ ! మళ్లీ నన్ను డిస్టర్బ్ చేయకు".. అంటూ మనసు తలుపులను అప్పటికి మూసేశాడు మనోహర్.
-----------------
తన పెళ్లయిన సంవత్సరం తర్వాత ,తండ్రి వీలునామా రాశాడు ఆస్తి తనతో పాటు, ముగ్గురు ఆడపిల్లలకి పంచాడు.
 మనోహర్. మనసులో కుతి కుతలాడిపోయాడు.
" ఏంటి? వాళ్ళు తన దగ్గరే ఉంటారు. కానీ ఆస్తి మాత్రం ఆడపిల్లలకు కూడా ఇస్తాడా ..? ఎంత దుర్మార్గం.
ఈ ఆస్తి మగపిల్లాడినైనా తనకే కదా చెందాలి. తన దగ్గరే ఉంటూ ఆస్తి మాత్రం అందరికీ పంచేస్తే ఎలా..?
  వాళ్ళు చచ్చే వరకు, తనే చూసుకోవాలి కదా!
 ఇంకా ఈ పప్పులేం ఉడకవ్ .
వీళ్ళ పని చెప్తా ..ఏదో ఒకలాగా వీళ్ళని వృద్ధాశ్రమానికి పంపించేస్తా.... హమ్మా.....
ఆ క్షణం నుంచి మనోహర్ కి తల్లిదండ్రుల పైన గౌరవం తగ్గిపోయింది.
మనోహర్ లో అప్పుడు మొదలైన" కసి "క్రూరత్వంగా అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. ఈటెల లాంటి మాటలతో ,తల్లిదండ్రులని అవమానిస్తూనే ఉన్నాడు..
 మనోహర్ లో వచ్చిన ఈ మార్పుని , తల్లిదండ్రులు గమనించారు  గానీ ,ఏమి చేయలేక కళ్ళు నీళ్లు పెట్టుకునేవారు.
మనోహర్ కి మాత్రం, తల్లిదండ్రులని ఇంకా తన దగ్గర ఉంచుకోవడం అనవసరం అనిపిస్తుండేది
"కానీ వాళ్ళని బయటకి పంపడం ఎలా ? భార్య "రాజ్యం" కి ఏమీ అర్థం కాదే ..? వాళ్ళని తన తలిదండ్రుల కన్నా ఎక్కువ గౌరవంగా చూసుకుంటున్నాదే....
బయట తనను , తనను అందరూ పొగుడుతున్నారు.
 పెళ్లయినా తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకొని ఎంత గౌరవంగా చూస్తున్నాడో అని.....
"అందుకే ఎవరికీ పట్టు పడకుండా" ప్లాన్" వెయ్యాలి"  అనుకున్న. మనోహర్  ..
అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు...

మనోహర్ "లో" మనసు మళ్లీ బాధగా మూల్గింది.
"ఒరేయ్.. నీచుడా! వాళ్ళు నిన్ను కన్న తల్లిదండ్రులు రా! 
"వాళ్ళ  ఋణం తీర్చుకోరా" అంటూ ఏదో చెప్పపోయింది.
"నువ్వు లోపలికి పోతావా ?పోవా ? 
 మళ్ళీ నాకు ఇలాంటి సలహాలు ఇవ్వకు." అంటూ లోనికి నెట్టేసాడు.
---------------
మనోహర్ భార్య రాజ్యం, నెల తప్పింది .అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.    ఇదే సాకుగా, భార్య "ఇంట్లో పనులు చేస్తే కష్టం" అని చెప్పి , మనోహరో భార్యని పుట్టింటికి పంపించేశాడు." అమ్మయ్య దీని బాధ తప్పింది" అనుకుంటూ.
భార్య వెళ్ళిన నెలలోనే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో దింపి వచ్చాడు మనోహర్ . తను ఆఫీస్ పనితో వారిని సమంగా చూసుకోలేడని , భార్య వస్తే ,మళ్లీ  ఇంటికి తీసుకొస్తానని చెప్పి మభ్యపెట్టి వచ్చేసాడు ...
కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను "కసిగా" చూశాడు. "ఉండండి ఇక్కడే ..డబ్బంతా ఇచ్చేసారుగా అప్పచెల్లెళ్లకి... 
ఇకపై వాళ్లే చూస్తారు మిమ్మల్ని," అనుకుంటూ,
 పైకి మాత్రం వాళ్లని వదిలి వెళ్ళలేనట్టుగా వెళుతూ,," నటనలో తనను మించిన వారు లేరు "అనుకోని మురిసిపోతూ,
" నాన్న ఇచ్చిన బైక్ " ఎక్కి ,
ఇంటికి బయలుదేరాడు మనోహర్.
"ఛీ...సిగ్గులేని వెదవా" ఉంటూ ఏదో చెప్పబోతున్న మనసుని  మళ్లీ పక్కకు తోసేసాడు.
----------------------------+
భార్య పుట్టింటికి వెళ్ళడం, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడం ,  సాటర్డే సండే ఆఫీసుకు సెలవులు కావడంతో, కాలక్షేపం కోసం చేసే చెత్త ఆలోచనలు బోలెడు స్వాగతం చెప్పాయి మనోహర్ కి.
కనిపించిన ఆడవాళ్ళని ,కళ్ళతోనే ఎక్స్రే తీసేస్తున్నాడు.
ఆలోచనలోనే ఆనంద విహారాలు, శోభనాలు, జరుపుకుంటున్నాడు. 

ఒకరకంగా చెప్పాలంటే ,  "టెన్షన్ "లేని , మా మానసిక వ్యభిచారిగా  మారి ,హాయిగా జీవితం గడుపుతున్నాడు ,  మంచివాడుగా "మాస్క్" వేసుకున్న మనోహర్.

---------------------------------
ఏడవ నెలలో " గాజులు పెట్టిన ఫంక్షన్ కి "వెళ్లి ,
ఫంక్షన్ కి వచ్చిన లేడీస్ ని, చూసి చూడనట్టు చూస్తూ,
తృప్తిగా తిరిగి వచ్చాడు మనోహర్.
"డెలివరీ టైం ", దగ్గర పడగానే, భార్యని ఆస్పత్రిలో జాయిన్ చేసిన చోటికి బాధ్యతగా వెళ్ళాడు మనోహర్.
అక్కడ నర్సులతో మర్యాదగానే ఉంటూ ,మానసికంగా దగ్గరైన ఫీలింగ్స్ తో, మనో యాత్రలో  మలినం పూసుకున్నాడు.
-------------------
టెన్షన్ గా ఉంది . మనోహర్ కి.
భార్యను "డెలివరీ రూమ్" లోకి పట్టుకెళ్ళారు 
కొన్ని క్షణాల్లో తనకి "వారసుడు" పుట్టబోతున్నాడు.
తండ్రిగా చాలా ఆత్రుత పడుతున్నాడు మనోహర్.
పుట్టబోయిన పసికందు,  "మీనాక్షి లా ఉంటుందా..?
 రాగిణిలా ఉంటుందా..? షీలాలా ఉంటుందా..?
 మీనాలా ఉంటుందా.".?  అనుకుంటూ ,ఊహల్లో తేలిపోతున్నాడు. మనోహర్.
------------------
నర్స్  వచ్చి ,పిలిచే అంతవరకు ఈ లోకంలో లేడు మనోహర్. "చూడండి మీకు మగపిల్లాడు పుట్టాడు"  అంటున్న నర్స్ మాటలకు తుళ్లిపడి , ఆ వైపుకు చూశాడు.
"నర్స్" తన చేతిలో ఉన్న బాబును" మనోహర్ కు" అందించింది.
మనోహర్ ఆనందంగా బాబుని, చేతులతో పట్టుకున్నాడు. చూశాడు, మళ్లీ చూశాడు మళ్ళీ మళ్ళీ చూసాడు .ఆశ్చర్యంగా చూశాడు.  అదోలా చూసాడు.. మనసులో అలజడి మొదలైంది ఏంటి బాబు ఇలా ఉన్నాడు..? చిన్న పిల్లలు ఇలాగే ఉంటారా? ఏమో? మనోహర్ లో తండ్రి ప్రేమ తన్నుకొచ్చింది .
నెమ్మదిగా బాబును ముద్దు పెట్టుకున్నాడు .
లేదు ..లేదు.. " తను బాగుంటాడు .తన భార్య బాగుంటుంది.  తల్లిదండ్రులూ అందంగానే ఉంటారు . భార్య వేపు వాళ్లు కూడా చాలా బాగుంటారు.
"బాబు , ఎలాగ, ఇలా పుడతాడు"
" అందంగానే ఉంటాడు " 
మనోహర్ తన మనసుకు తనే, సర్ది చెప్పుకుంటూ పిల్లాడిని
" నర్స్ " కు  అందించాడు..
మనోహర్ "లో" మనసు పెద్దగా నవ్వింది .
ఒరేయ్ బాగోదు నీ రక్తమేరా..? 
ఒరేయ్ నీ వికృత ఆలోచనల భావమే నా కొడుకుగా నీ ముందు కొచ్చింది రా.....
 " అది నిన్ను  జీవితాంతం తరుముతూ, నీతోనే ఉంటుందిరా.... వాడు వచ్చేసాడు గా.‌.ఇక నేను నీతో ఉండను . హహహహహ"అంటూ..
వెళ్ళిపోతున్న మనసును గట్టిగా పట్టుకు లాగాలనుకున్నాడు కానీ మనసు మనోహర్ "వశం" కాలేదు.

----------------------
ఏళ్లు గడుస్తున్నాయి . బాబు పెద్ద అవుతున్నాడు.
 కానీ వికృతంగా....
పక్క నుంచి ఎవరో ,
ఆలోచనలు మంచివి అయితే ,ఆచరణలు మంచివౌతాయి.
ప్రస్తుతం మనుషుల్లో "రాక్షసుడు "ప్రవేశించినట్టు,
మానవత్వం లేకుండా పోయింది .వావి ,వరుసలు, మరిచిపోయాడు.
 ఎక్కడపడితే అక్కడే దొంగలు ,దురాగతాలులూను .
అంటున్నాడు . పక్కనే ఉన్న అతను
అయినా "చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుడతాయట ". 
"ఈ తరం మనుషులు చేసే పనులకి ,వాళ్ళ ఆలోచనలకి,
తగ్గట్టుగానే వాళ్ళ పిల్లలు కూడా, వికృతంగా పుట్టి, వెధవల్లా ప్రవర్తిస్తున్నారు.
 " యద్భావం తద్భవతి" అన్నట్టు,
"మనసులో మంచి భావాల్ని పక్కకు నెట్టి,
 చెడ్డ భావాల్ని ప్రేరేపిస్తూ ఉంటే ,ఈ ప్రపంచం ఇలాగే తయారవుతుంది, ఏం చేస్తాం ఎవరి ఖర్మ వాళ్లది"
 అనుకుంటూ వెళ్లిపోతున్నారు.
మనోహర్ గతుక్కుమన్నాడు అంటే ....
"తన  వికృతమైన ఆలోచనల వల్లే, తనకు ఇలాంటి బాబు పుట్టాడా ? ...
"మనసు "అద్దం" లాంటిదంటారు.
"అది తనని తనకు చూపిస్తూనే ఉంది.
"తనే నిర్లక్ష్యంగా ,ఆ అద్దాన్ని ,ముక్క ముక్కలు చేశాడు కదూ.!

"అంటే తన ప్రవర్తన అంత  బాగోలేదా ? తన ఆలోచనలు తప్పా?"
 "అవును . తను కూడా, మంచి మనసు మాటలను వినకుండా , ఎన్నోసార్లు నెట్టేసాడుగా ! తన వికృత ఆలోచనల వల్లే బాబు ఇలా పుట్టాడా!  "
"నేను ఒక్కడినే నా ఇలా,"
 అనుకుంటూ, మనోహర్ కంగారుగా బయటకు వెళ్లాడు తిరిగినచోట తిరగకుండా తిరిగాడు .తనతో ఉన్న స్నేహితుల్లో చాలామందికి ఇలాంటి పిల్లలే పుట్టారు .
కొంతమంది పిల్లలు చాలా అందంగా ఉన్నారు 
అవును వాళ్ళ బుద్ధి,మనసు  చాలా మంచివి .
తనలా లోపలొక లాగా, పైకొక లాగా,  ఎప్పుడూ
 ప్రవర్తించలేదు."
పక్క మైదానంలో తన కొడుకు" స్కూల్ ఎగ్గొట్టి "పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాడు . అవతలి వాళ్ళతో దెబ్బలు తింటూ...
ఇదివరకు తన లోపల బుద్ధి ఎలా ఉండేదో ,
పుట్టిన బాబు బుద్ధి బయటకు అలా ఉంటోంది .
మరి  అందుకే, అందరి చేత తన్నులు  తింటున్నాడు.
మనోహర్ , బాధతో ఆలోచిస్తున్నాడు. బాబుని  ఉంచుకోవాలా? వద్దా? ఏ అనాధాశ్రమంలోనో వదిలేస్తేనో....
అమ్మో తన" రక్తం పంచుకు పుట్టిన బిడ్డని" తను వదిలేయగలడా?
క్షణంలో అతని మనోగతంలో తల్లితండ్రులు మెదిలారు. 
ఉడిగి పోయిన బడుగు శరీరాలతో, వణుకుతున్న చేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ.
 తనలాంటి వాడికి మంచి సాస్తే అయ్యింది.
. తనకిప్పుడు" మంచి- చెడులు",  చెప్పడానికి
, తన మనసు కూడా తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిందే.,. ఎలా... ఇప్పుడు నేనేం చేయను ? అనుకుంటూ..
ఎటు తేల్చుకోలేని మనోహర్,  పిచ్చివాడిలా "బుర్ర "పట్టుకుని కూర్చున్నాడు కొడుకు తీరును చూడలేక ,చూడలేక, చూస్తూ..
----------------------------
మనసు లోతుల్లో ఎక్కడి నుంచో  లీలగా వినిపిస్తోంది .
"ఇప్పటికైనా మారు".
"మంచిని చూడు"
"మంచి మాట్లాడు"
 "మంచి చేయి"
" మంచి ఆలోచనల బాటలో నడువు"
ఎటు తేల్చుకోలేనప్పుడు "మనసు మాట విను".
మనసు "అద్దం లాంటిది"
" నిన్ను నీకు "చూపిస్తుంది.
 

----------------------------------.

శీర్షిక : శివుడు ,స్వయం భవుడు (. వ్యాసం).


శీర్షిక :   శివుడు ,స్వయం భవుడు (. వ్యాసం).

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



.శ్రీ మహావిష్ణువుకు పేరు, నిర్మాణం మరియు గుణాలు లేవు.
గుణాలు లేకుండా సృష్టి, నిర్వహణ మరియు నాశనం అసాధ్యం గనుక
 మహావిష్ణువు మొదట త్రిగుణాలను  అంటే ,సత్వ, రజస్సు , తమస్సు. లను సృష్టించాడు .ఆతరువాత  అతను
 స్వయంగా ఆ త్రిగుణాలను తీసుకొని త్రిమూర్తులుగా ఉద్భవించాడు,
  సత్వగుణం తో విష్ణువుగా ,  తమో గుణంతో శివునిగా , రజో గుణుడైన బ్రహ్మగా అవతరించాడు.
ఈ త్రిగుణాల ఆధారంగా" సృష్టి , స్థితి  అంటే నిర్వహణ , మరియు లయ  అంటే నాశనం / మరణం ," జరుగుతుంది.
సృష్టిని బ్రహ్మ, స్థితిని విష్ణువు, లయను శివుడు చూసుకుంటాడు.
మహావిష్ణువు విష్ణువుకి పూర్తిగా భిన్నం. మహావిష్ణువుకు గుణాలు లేవు కానీ విష్ణువుకు సత్వగుణం ఉంది.
మహావిష్ణువు నుండి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు జన్మించారు.

సూక్ష్మ దేవతలైన బ్రహ్మ , విష్ణు, మరియు శంకరు లతో సహా అన్ని ఆత్మలకు తండ్రి యైన ,పరమాత్ముడు శివుడు.
 అతను అనంతమైన చిన్న కాంతి బిందువు. 
 ప్రపంచ నాటకం యొక్క ప్రతి చక్రంలో నాలుగు యుగాలు ఉన్నాయి. 
సత్యయుగంలో దేవతలు పాలకులుగా ఉండేవారు మరియు విష్ణువు కృష్ణునిగా జన్మిస్తాడు .. త్రేతాయుగంలో  రామునిగా . 
జన్మించేడు.
కలియుగ ముగింపులో ప్రపంచం మొత్తం నరక భూమిగా మారగా ,.శివుడు ప్రజాపితయైన , బ్రహ్మ శరీరంలో అవతారమూర్తిగా. ఉద్భవించాడు .
ప్రకృతి యొక్క సత్వ, తమో, రజో గుణాలేవీ 
అంటని వాడు శివుడు.
.కాలతీతుడైన  శివుడు జనన,మరణాలుకు అతీతుడు.
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క అర్ధం ఉంది.
రుద్రస్వరూపుడైన శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే, శాంతస్వభావునిగా ఉన్నప్పుడు , పరమేశ్వరుడు 
పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మొదలైన పరిజనులతో... శాంతమూర్తి గా మనకు కనిపిస్తారు.

శివుడు  దుఃఖభూమిగా  మారిన  ప్రపంచాన్ని నాశనం చేస్తాడు  అన్ని ఆత్మలకు విముక్తినిచ్ఛి. , సత్యయుగంలో మళ్లీ స్వర్గాన్ని మరియు దేవతలను సృష్టిస్తాడు.
స్వ‌యంభవుడైన. పరమశివుని "జ్ఞానగురువు" 
అవతారం. శ్రీ దక్షిణామూర్తి .
అంతేకాదు ,  
ద‌క్షుడి యాగాన్ని భ‌క్నం చేసినపుడు  వీరభ‌ద్రుడిగా , మ‌రో స‌మ‌యంలో కాల‌భైర‌వుడుగా 
  హ‌నుమంతునిగా  అవతరించిన శివుడు. వేవేల నామాలతో 
పిలుప బడుతూ పూజింపబడుతుతూ ఉంటాడు.

"శివ" అంటే సుాన్యమైనదని అర్ధం.
సుాన్యమైన ఈ విశ్వంలో గల సకల చరాచర జగత్తును సృష్టించిన వాడు , తిరిగి తనలోనే లయం చేసుకుంటుా
లింగాకారుడై ,సర్వ వ్యాపియై యున్నవాడే  "శివుడు" ॥

త్రినేత్రధారిణి యైన" శ్రీ రాజరాజేశ్వరీదేవి"చే  సృజింపబడిన త్రిముార్తులలో ఒకడై-శ్రీరాజరాజేశ్వరీదేవి కోరికమేరకు 
ఆమెతో వివాహానికి అంగీకరించి , బదులుగా ఆమె ముాడవనేత్రాన్ని వరముగా పొందినవాడు పరమశువుడు॥

వివాహానంతరం అదే ముాడవనేత్రంతో 
శ్రీ రాజరాజేశ్వరీదేవిని భస్మం చేసి , అదే భస్మంతో
 దుర్గ, లక్ష్మి సరస్వతీ అనే ముాడు శక్తి స్వరుాపాలను సృష్టించిన పరబ్రహ్మానందస్వరుాపుడు శంకరుడు ॥

దుష్ట- శిక్షణ, శిష్ట -రక్షణకై  కేశవునిగా జగములేలిన
శివ కేశవముార్తిస్వరుాపుడు శివుడు.॥

పరమశివుని ఆకృతిలో .శివుని" త్రిశూలం"లో నున్న
మూడు నామ సూచికలు 
సత్వ, రజ,-తమో గుణాలకు ప్రతిరూపాలు.. 
"ఢమరుకం" శబ్ద బ్రహ్మ స్వరూపం. 
అతని శిరస్సు నలంకరించిన"చంద్రవంక" 
మనోనిగ్రహానికి, తలపైనున్న-"గంగాదేవి" 
శాశ్వతత్వానికి ప్రతీకలు. 
అతని దేహంపై గల" సర్పాలు" భగవంతుని జీవాత్మలుగాను, 
ధరించిన" పులి చర్మం " , త్యజించమనే అహంకారానికి,
"ఆశీనం "పైన పులిచర్మం , కోరికలకు-దూరంగా ఉండమన్న సత్యానికి ,నిదర్శనం.
 " భస్మం" పరిశుద్ధాత్మకు ,  అతను పట్టుకున్న 
  నాలుగు "జింక కాళ్ళు" చతుర్వేదాలకు, 
 " నందీశ్వరుడు" సత్సాంగత్యానికి, 
  నంది ధర్మదేవతకు, "మూడవ నేత్రం "
  జ్ఞానానికి ప్రతీకలై విశ్వాన్ని నడిపిస్తున్న
  శక్తికి సుాచికలు.॥
క్షేత్ర కారకుడు , క్షేత్ర దర్శకుడు , క్షేత్ర పోషకుడు ఐన శివుడు ,
  జననమరణాలుకు అతీతుడై- వేల నామాలతో స్తుతింపబడుతుా., అనంత రుాపాలతో దర్శింబడుతుా, 
  సృష్టి, స్థితి ,లయ కారక , సకారాత్ముడైన
  నిరాకార లయకారుడు" పరమశివుడు" ॥
కురుక్షేత్ర యుద్ధం ముగిసిసిన తరువాత
 పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి "శివ దర్శననం"
 చేసుకుందామని బయలుదేరగా . 
 శివుడు "నంది" రూపం ధరించి
 వారికి దొరకకుండా  ,  పరుగెత్తి  అంతర్దానమైపోతాడు.

ఆ సమయంలో ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి.. 
శివ పురాణంలో వర్ణించబడిన ఈ "పంచ కేదారాలను" "పంచఆరామా"లని పిలుస్తుంటారు. 
అవి వరసగా
" కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. " లు.
ఇవి. గాక శివుని యొక్క మహా పుణ్య క్షేత్రాలు, 
వాటి స్థల పురాణపు కధనాలు  ఎన్నో ఉన్నాయి .

శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది.
"శి" అంటే,  శాశ్వతానందమని , పురుష  శక్తి అని ,
"వ "అంటే మహిళల శక్తి అని అర్థం. 
శివుడిని" లింగ "రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరించాయి.
ప్రపంచమంతా మాయతో నిండి ఉండి, చావు, పుట్టుకలు చక్రంలా తిరుగుతుంటాయి.
తనువు చాలించిన తరువాత శరీరం ,మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మకు మాత్రం మరణం ఉండదు.
శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన  తర్వాత , మిగిలే బూడిదను ఒంటికి రాసుకుని, కపాలమాలను మెడలో ధరిస్తాడు శివుడు . విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించే శివుడు సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడః .
 ఆయనకు విషమైనా, అమృతమైనా, గుడియైనా స్మశానమైనా
ఒకటే.
శివుడు స్మశానం లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాడు.
ఎందుకంటే ,   శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు, ఎండకు, చలికి, వర్షానికి దేనికి కూడా చలించవు. ఎవరు ప్రతి కర్మను కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగ దేనికీ చలించకుండా ఉంటుంది.
అందుకే శివుడు. స్మశానాన్ని  ఇష్టపడతాడు.

మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం .
ఎంతగొప్పవాడైనా, బీదవాడైన, ప్రతి జీవుని ఆత్మ ,
 ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం .
ప్రపంచంలో ఉన్న  ఆడంబరాలు ,శ్మశానంలో  ఉండవు. కాలుతున్న శవాలు, బూడిద తప్ప. ఆ బూడిదే సత్యంమనీ 
చెప్పే తత్త్వ జ్జనైక మూర్తి  శివుడు. . అందుకే శివుడు ఎప్పుడూ బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం. అందుకే ఆయన నివాసం శ్మశానం.
శివుడు ధరించిన ఈ భస్మం
 ,( విభూది) చాలా మహిమాన్వితమైనది .
పంచభూతాలను ఆధీనంలో ఉంచుకున్న శివుని చూస్తే
 చావు కూడా భయపడుతుందదంటారు.


                     
                       "ఓం , నమఃశివాయ."
                         (   గూగుల్ సేకరణ ).
------------------------------------------------
[
తపస్వీ మనోహరం పత్రిక కొరకు ,
అంశం: గుర్రం జాషువా.  (వ్యాసం).
శీర్షిక .అప్పటికీ , ఇప్పటికీ స్త్రీ ...
రచన:  శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
 కళ్యాణి్ :  మహారాష్ట్ర.
-------------------------------

ఋగ్వేదం లో కొన్ని శ్లోకాల లో స్త్రీ లకు భాగస్వామ్యాన్ని ఎంచుకునే హక్కుందంటుా రాసేరు.

అటువంటపుడు స్త్రీ  ల పరిస్థితి ఎలా , ఎందుకు దిగజారింది..?
మధ్య యుగం నాటికి స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.
సాంప్రదాయాల పేరిట , కన్యాశుల్కాలు, బాల్య వివాహాలు , సతీ సహగమనాలు , దేవదాసి వంటి ఎన్నో దురాచారాలు స్త్రీ ల పాలిటి శాపాలయ్యేయి.

భర్తలు పోయిన భార్యలకు, బలవంతపు సహగమనాలు , యుద్ధంలో  రాజులు ఓడిపోయినా , ప్రాణాలు పోయినా , భార్యలు కుటుంబంతో సహా అగ్ని ప్రవేశం చేయాలి , ఇది "ఔజార్ " సాంప్రదాయ పద్ధతి, ఇది, ఎవరు పెట్టిన సాంప్రదాయం ?

ఐదు సంవత్స రాలకే బాల్య వివాహాలు చేసి, కర్మ చాలక భర్త అనే బాలుడు పోతే ఆ పసిపిల్లకు తలగొరిగి , బ్రతుకంతా వంటంటికే పరిమితం చేయడం ఎంత అమానుషం .ఎందుకంత వివక్షత...?

రజస్వల కాకుండానే  బాలిక కు వివాహం అవసరమా ?

భార్యా సహగమనాల పేరుతో భర్త పోగానే భార్యను
సహగమనం ఆచారమంటుా ,  సజీవంగా చితిలోకి నెట్టడం...ఎంత వరకు న్యాయం...? 

1815 , 1828 ల మధ్య , ఒక్క బెంగాల్ లోనే
8000 మంది అబలలు  , ఈ దురాచారానికి బలయ్యేరన్న వార్త...
ఎవరు పెట్టిన సాంప్రదాయం. ఇది...?.

దేవదాసి పేరుతో ఆడపిల్లకు  "దేవుడే నీభర్తంటుా" , దేవుని విగ్రహంతో పెళ్ళి జరిపించి , జీవితం  అంతా బ్రహ్మచారిణిగా ఉండాలని , "నృత్య -గీతాలతో , దేవుని సేవ చేసుకో" అని చెప్పడం ఎంతవరకు సమంజసం.?

  ఆ ఆచారాన్ని కుాడా రాను రాను పెడదారి పట్టించి, స్త్రీ లను వేశ్యలుగా మార్చే అధికారం ఎప్పుడు , ఎవరికి , ఎవరు , ఎవరికిచ్చేరు..?
 
" ముస్లిమ్" మతాచారాలంటుా "పరదా"  పద్ధతి పెట్టి ,
  స్త్రీ లకు ముసుగులు వేసి వారి స్వేశ్ఛకు అడ్డుతెర కట్టేరు. ఎందుకు స్త్రీ లు ముసుగులౌ...?
 
ఇలాంటి ఎన్నో అకృత్యాలు , అసమానతలను భరించలేని వారు కొందరు , స్త్రీ జనోద్ధరణకై శ్రీకారం చుట్టేరు.

వారిలో ముఖ్యులు రాజా రామ్ మొాహన్ రాయ్ ,
కందుకుారి వీరేశలింగం , సావిత్రీబాయ్ ఫుాళే...
అన్నవారు. వీరేశలింగం గారు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి,  సఫలు లయ్యేరు.
రాజా రామ్ మొాహన్రాయ్ గారు బహు భార్యాత్వము
నేరమని పోరాడి, వితంతు వివాహాలకు మద్దతు పలికేరు.

ఇక్కడ గమనిస్తే స్త్రీ ల  పై జరిగే దురాచారాలకు స్పందించి వారి ఉన్నతికై , పోరాటోద్యమాలు సాగించిన వారు పురుషులే. కొంతమంది నిరంకుశ పాలకుల నిర్దయాపుారిత  పురుషాధిక్యతా నిర్దేశ శాసనాలకు  సాంప్రదాయ  రుాపమిచ్చి స్త్రీ ల విషయంలో  ,ఈ  రకమైన  దురాచారాలు నెలకొన్నాయా...?

నిరక్షరాస్యురాలైన   సావిత్రీబాయి ఫుళే , భర్త దగ్గరే అక్షరాభ్యాసం చేసి , చదువుకొని , పీడిత మహిళల నిక్షరాశ్యతను దుారం చేసి, స్త్రీ ల విద్యాభివృద్ధికి
పోరాటం సాగించి, 1848 లో , "పుానా " లో బాలికల పాఠశాలను ప్రారంభించిన  ప్రధమొాద్యమ కారిణి.
వీరందరి కృషి ఫలితంగా స్త్రీలకు , వివాహ సంబంధిత  కార్యాల లో కొన్ని వెసులు బాట్లు కలగడమేకాకుండా,
విద్యాభ్యాసానికి కుాడా అవకాశం కలిగింది.

స్త్రీ లు విద్యావతులవడమే కాక , వివిధ కళారంగాల లో నిష్ణాతులై రాజ్యాలేలిన దశలోకుాడా , వరకట్నాల వేధింపులుా ,  గర్భంలో ఆడ శిశువు ఉందని తెలియగానే భ్రుాణ హత్యలుా, వరకట్న సాధింపులతో,
ఒక   ఆటబొమ్మగా , పురుషాహంకార వికారాల విలాసాలకు బలైపోతున్న- స్త్రీ  జీవితం మరింత దుర్భర  మయ్యింది.

ఎన్నో సంఘ సంస్కరణోద్యమాలు జరిగేయి.
మహిళా చైతన్యం గురించి ఎంతోమంది కవి దిగ్గజాలు తమ కలం గళంతో సాహిత్య కవన పోరు సల్పేయి.

అటు తరువాత కుాడా స్త్రీల అణచివేతలు , అత్యాచారాల విషయం లో పెద్దగా ఏమీ మార్పు రాలేదు.
అటువంటి సమయంలో నే,  వినుకొండ గ్రామం లో సెప్టెంబర్ 28 / 1895 లో జన్నించారు మరో సంఘ సంస్కర్త , శ్రీ గుర్రం జాషుావాగారు.

తండ్రి , గుర్రం వీరయ్య యాదవుడు,  తల్లి  లింగమ్మ మాదిగ ఐనందున ,
ముాడాచారాలు నిండిన సమాజంలో బాల్యం నుండీ కుాడా, తక్కువ కులంలో జన్మించిన ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కున్నారు.

స్కుాలుకు వెళ్ళిన సమయంలో ఉపాధ్యాయులు, సహవిద్యార్ధులు చేసిన అవమానాలకు తిరగబడేవాడు
అటువంటి సమస్యల తోనే విద్యాభ్యసం పుార్తి చేసి
చాలా చోట్ల ఉద్యోగ విధులను నిర్వహించారు .
అటుపై సాహిత్యాభిలాషతో పలు సభల లో పద్యాలు చదివి అవమానం పొందేడు.
[02/11, 5:29 pm] JAGADISWARI SREERAMAMURTH: అటు తరువాత ఆ కవిత్వాన్నే ఆయుధంగా చేసుకొని,
ముాడాచారాలపై తిరగబడి , ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలనందుకొని , నవయుగ కవి చక్రవర్తగా కీర్తి సాధించి , తిరుపతి వేంకటకవులలో  ఒకరైన చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారిచే , కాళ్ళకు "గండపెండేరం "తొడిగించుకున్నాడు .

ఎన్నో సాహిత్య రచనలకు ఎన్నెన్నో పురస్కారాలను , బిరుదులను పొందిన శ్రీ గుర్రం జాషుావా గారు ,
స్త్రీ జనాభ్యుదయానికి మార్గదర్శిగా నిలచిన శ్రీ
వీరేశలింగం గారి సాహిత్య స్ఫుార్తి తో , అతని కల గళాన్ని, సాహిత్య కవన జోరులతో హోరెత్తించేరు.

పడుచు భార్యలు ముసలి భర్తలతో అనుభవించే కష్టనష్టాలను జాషువా అంగీకారయోగ్యంగా అక్షరబద్ధం చేశాడు. ‘‘జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు.

"మహిళా చైతన్య పరిమళం " తో నిండి ఉన్న ఈతని సాహిత్యంలో , ఎంతో మంది పురుషాధిక్య తీరు తెన్నులను , "నేటి నెలత " ,"వంచిత" వంటి కవితా ఖండికలలో ఆవిష్కరించేరు.

నిన్నాకాశము దాకగ పొగుడుచున్‌ నీ అందచందాలతో/ వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లు కొనుచున్‌, పైపై పరామర్శలన్‌/ నిన్నున్‌, నీదు శరీరమున్‌, హృదయమున్‌ ఛేదించి వేధించి యిం/ తన్నంబున్‌ బడవేయు సంఘమును/ బిడ్డా! యెట్లు హర్షింతువో’’ అంటూ వాత్సల్యంతో స్త్రీని ప్రశ్నిస్తాడు జాషువా.

ఊడిగపు యంత్రంగా స్త్రీ ని ఉపయొాగించుకొనే పురుషాహంకార ప్రవృత్తి ని ఖండిస్తుానే , స్త్రీ లను కామవాంఛలు తీర్చే బొమ్మలుగా , కొట్టి తిట్టిమరీ లొంగదీసుకొనే పురుష దౌర్జన్యాలని  , స్త్రీ ల అణచివేతలను, వారి  ఆవేదననుా జషుావాగారు ఆయన కవితల్లో హృద్యంగా చిత్రించేవారు.

పెండ్లి ఆడిన భార్యల పిప్పిజేసి/ తరుము చున్నవి పురుష భూతములు కొన్ని/ స్త్రీత్వమిడి అట్టి వానిని శిక్షించా’’లని ఆయన ప్రబోధించాడు.


జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు.

పట్టుచీర జిలుగులతో పరిమళించా ల్సిన మల్లెపూల గుత్తిని పీనుగులమీద గప్పే కలుష వస్త్రంలో చుట్టివేశారని చెప్పడం ద్వారా వితంతువు పూర్వోత్తరస్థితిగతులను అద్భుతంగా కవిత్వీకరించాడు.

ఆధునిక సాహిత్య కవిగా ఆయన, కులాధిపత్యం వల్ల కలిగే సామాజిక పతనాలను , విధ్వంసాలని , మతోన్మాదాలు రగిల్చే ముాడదత్వాలను ,  వేల గొంతుకల కవితా ఖడ్గ శక్తి తో, ఎదిరించి పోరాడేరు.

మానవత్వమంటే ఏమిటి అన్నదానిని సమగ్రంగా చవి చుాపించే ఆతని కవితలు ,  ముఖ్యంగా స్త్రీ జనాభ్యుదయ  మార్గదర్శి గా స్త్రీ వాదానికి  , ఎన్నో కవితల రుాపాన్నిచ్చి సమాజంముందుంచేరు.

భావాభ్యుదయ విప్లవ కవుల్లో కనిపించని ' , మహిళాభ్యుదయ చింతన , జషువా గారి కవిత్వం లో గొోచరిస్తుంది.

పురుషాధిపత్యం తీరుతెన్నులను జాషువా ‘నేటి నెలత’, ‘వంచిత’ కవితా ఖండికల్లో ఎంతో సముచి తంగా ఆవిష్కరించాడు.

భావదాసురాలు’, ‘వెర్రి బాగులమ్మ’, ‘పరమ మూఢ’ ‘చపల హృదయ’ వంటి పదబంధాల ద్వారా స్త్రీలలోని పోరాటలేమిని ఎత్తి చూపాడు.

స్త్రీ ల ఉన్నత చైతన్యాన్ని , జ్ఞానాన్ని  హత్య చేసిన విధంగా రుాపొందించిన  సాంప్రదాయాలను ఆయన వ్యతిరేకరించేరు.

నాదు కంటినీరు నా తల్లి దేహాన/ నరనరాన దుఃఖనదులు చిమ్ము’’ అంటూ
తల్లిగా బిడ్డలతో గల అనుబంధం, భార్యగా భర్త తో గల బంధాల ఔన్నత్యాన్ని గురించి జాషుావాగారు తమ రచనల లో విశదీకరించిన రీతి కంట నీరు తెప్పించే   విధంగా అంతరాళను కలచివేస్తుంది.
[02/11, 5:30 pm] JAGADISWARI SREERAMAMURTH: స్త్రీ  అందాన్ని వర్ణిస్తూ , ఆమె శరీరాన్నీ మనసునుా హింశిస్తుా, పిడికెడు అన్నం తప్ప మరే రకమైన గౌరవాన్నీ ఇవ్వని కరకు సమాజాన్ని , పురుశాదిక్యతనుా  ధిక్కరించే కవి జషుావా.

తన భార్య తన ను వీడి పోయినపుడు ,
"నా తనుయష్టి ప్రత్యణువున్‌ గల పుష్టికి కార ణంబు నీ/ చేతి సుధాశనంబె కద! చిక్కునె నా కనరాదుగాని, నా/ మాతకు మారుగా, యనుగు మానిని రూపము దాల్చినట్టి నా/ జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వరప్రదాత్రివో’’ అంటూ భార్యను తల్లిగా అభివర్ణించడం జాషువా ఔన్నత్యానికి తిరుగులేని నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

హిందుా సంఘ సనాతన ఆచారాలను ధిక్కరిస్తుా,
సంఘమంటే మనుష్యులను పీక్కుతినే కృార పిశాచాలతో  పోల్చడంతో , ఆతని కవిత్వం పరాకాష్ట కు చేరుకొంది.

సతుల నైసర్గిక జ్ఞాన సస్యరమను చిత్రచిత్రంబుగా హత్య చేసినారు’’ అంటూ కిరాతకమైన మనుస్మృతిని, హిందూ పితృస్వామ్య సమాజాన్ని తీవ్రంగా నిరసించాడు.

ఆచారాలన్నీ ఆత్మ శాశనాలకు , పర నాశనానికి కారణభుాతాలంటుా  వర్ణించేరు. ధర్మం పేరుతో చేసే   ఆచారాలు , సాంయ్రదాయ అకృత్యాలకు ,
నాలుగు పాదాల ధర్మదేవత ను, నాలుగు పాదాల  పశువుతో పోల్చేరు.

సాహసోపేతమైన ఆతని స్త్రీ వాదాన్ని , చీకటి కోణాల్లో
నిలబడి ఉన్న నిరంకుశత్వాన్నీ ,దృశ్యమసనం చేసిన ఆతని వ్యక్తిత్వాన్ని ఎవరుా ఖండించలేకపోయేరు.

వివేకం లేని విద్య విద్యే కాదని , విద్య యొక్క ఆవశ్యకతను శాస్త్రీయంగా విశదీకరించేరు.

"అబల విద్యా పూర్ణయైు తోడురాకున్నన్‌ దేశము నిద్ర మేలుకొనునే’’ (ప్రబోధం), ‘‘స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీ జేయు దేశాన సిరులు వర్ధిల్లగలవే’’ (బాపూజి) అంటూ ఒక సామాజిక శాస్త్ర వేత్తలా
చదువెరుగని స్త్రీ లు తమ బిడ్డల పురోగతికి అవరోధము కారా అంటుా ప్రశ్నించేరు.

కుల-మత భేధాల కర్కశత్వాన్ని తెరచాటు నాటకంలో చుాపిన జషుావా అంతటితో ఆగలేదు.

బాల్యం నుండే కులమత భేదాలకు అర్ఘ్యం పోస్తున్న తల్లిదండ్రులను నిలదీసి ఆలోచింపజేసేడు.

"ఖండ కావ్యం" లో, నాటి రాజకీయ నాయకుల సంకుచిత్వాన్ని వ్యంగ్యంగా ఎత్తి చుాపేరు.

స్త్రీ  సర్వతోముఖ పురోగమనాన్ని వాగ్దానం చేసిన హిందుా కోవిడ్ బిల్లును వ్యతిరేకించిన మన నాయకులు , వల్లభ్ భాయ్ పటేల్ , డా॥ రాజేంద్రప్రసాద్ , ప్రధాన మంత్రి నెహ్రూ లను నిరసిస్తూ ,
రాజీనామా చేసిన , డా॥ అంబేడ్కర్ , పార్లమెంట్ సాక్షిగా "హిందుా కోవిడ్ బిల్ " హత్య చేయబడిందని ,
దానికోసం రెండు కన్నీటి బొట్లు  కుాడా కార్చిన వారు
లేకపోయేరని , వాపోయిన చారిత్రాత్మక ద్రోహాన్ని
జషువా తన పద్యాల లో సమర్ధవంతంగా అక్షరబద్ధం
చేసేరు.

పురుషులతో పాటు స్త్రీ లకు కుాడా సమాన మర్యాదలివ్వాలని, దళిత స్త్రీ ల దుర్ధర దారిద్ర్య బాధలు తొలగాలని, వాస్తవికత దృష్టి  కోణాల్లో వర్ణించేరు.

వితంతు, గబ్బిలం ,స్మశానం ,చీకటి ,లాంటి సంఘ -
విముఖ అంశాలను తన చాతుర్య కవితా పటిమతో
సౌందర్య శోభితం చేసి , పాఠకలోకాన్ని పరవసింపజేసేరు.

వస్తువు అధమమైనా, ఉత్తమమైనా, వికృతమైనా...
జాషుావా కలం నుంచి జాలువారిన పిదప సుశోభిత కవిత్వమై , లోకోత్తర రుాపమై , సమాజ మేల్కొలుపుకు
శ్రీకారం చుడుతుంది.

కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని ,ముాడాచారాలపై
తిరుగుబాటు చేసిన జషువా , దళిత కులస్తునిగా ఎన్నో
అవమానాలను కుాడా ఎదుర్కొన్నాడు.
ఆపై ఎంతో ఎదిగి , గౌరవ పురస్కారాలను అందుకున్న జషువా స్త్రీ ల స్వతంత్ర్యత పై అక్షరోద్యమాన్ని సల్పిన అమర చరిత్రకారుడు.

జీవిత పోరాటపు సంఘర్షణల ఎగుడు దిగుడు బాటల్లో
ప్రయాణిస్తుానే , ఆంధ్రప్రదేష్ శాశనమండలి సభ్యత్వాన్ని పొందిన  జషువా

నీ మానసము దయారామాభివృద్ధికి అమృతంబు చిల్కు వర్షా గమంబు/ నీ చరిత్రము గాఢనిద్రా దరిద్రాణ కుతల చక్రమునకు కోడికూత’’ (ఖండకావ్యం.4) అని కవి వ్యక్తిత్వ గరిమను కొనియాడిన జాషువా ఈ రకమైన కవితా హృదయంతో, తెలుగు సాహిత్యంలో మేలుకొలుపుల గానం ఆలపించిన జాషుావా

24 జులై  1971  గుంటూరు లో స్వర్గస్తులయ్యి , ఈ నాటికీ కుాడా , స్త్రీ  జనాభ్యుదయ మార్గ దర్శకునిగా, ప్రజల గుండెల్లో అక్షర రుాపమై నినదిస్తున్న  కవనోద్యమకారుడు.
ఎంత మంది ఎన్ని ఉద్యమాలు సల్పినా ,  ఎన్ని   శాశనాల మార్పులు జరిగినా , ఎన్ని ఆరక్షణా కేంద్రాలు స్థాపించినా , స్త్రీ లు ఎంతో  ఎత్తుకు ఎదిగినా,  నేటికిీ స్త్రీ ల విషయంలో జరుగుతున్న అమానుష అకృత్యాలు  ఆగని ఆక్రోశాలై, విలపిస్తునే ఉన్నాయి.

  పురుషాధిక్యతల  అకృత్య సాముాహిక బలాత్కారాల దాడుల ఆత్మహత్యల తో  , ఏసిడ్ దాడుల వంటి వికృత చర్యలకు భయంతో   అల్లలాడుతుానే ఉన్నాయి.
రోజు రోజుకుా పెరుగుతున్న ,  నికృష్ట  దుష్ట చర్యలతో కకావికలమౌతున్న  స్త్రీ సమాజోద్ధరకై ,   స్త్రీ ల కన్నీటిని తుడిచే మరో జషుావా వంటి  స్పందన గల ఉద్యమకారులు  ఉద్భవించాలని కోరుకుంటుా..

"ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు."

--------------------------------------------------------------