Saturday, June 25, 2022

సైనికులకు వందనం

15/06/2022..(.సుారేపల్లి రవికుమార్ వాట్సప్ లో)
నవభారత నిర్మాణ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీల కొరకు,

శీర్షిక : దేశ రక్షకులకు వందనం.
.

రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

దేశ సరిహద్దు సంరక్షకులు,
శత్రు మూకలకు వెన్నుచూపని ధీరులు
ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. '
శౌర్యానికి ప్రతీకలు మన భరత దేశ సైనికులు ॥

శారీరక ధృడత్వము ,మానశిక నిశ్ఛలత్వము
దేశ రక్షకునికి అత్యవసరమైన అర్హతలుగా
తమ ప్రాణాలను సైతం దేశ రక్షణకై
ఆనందంగా అర్పించగలిగిన అమర వీరులు ॥

మాతృదేశ రక్షణే ధ్యేయంగా మన సైన్యం
ప్రకృతి వైపరీత్యాలలో సడలని ఆత్మస్టైర్యం
పగలు రాత్రుల తేడాలేని కర్తవ్య పాలనం.
అదే వారి విలువైన దేశ భక్తికి నిదర్శనం ॥

అనుబంధం ఆప్యాయతలకు అందనంత దుారం.
బంధు మిత్రుల ప్రేమకు నోచుకోని ఒంటరితనం
కంటి మీద కునుకెరుగని కఠిన  జీవితం .
దేశ రక్షణకై అతని పుార్తి జీవితం, అంకితం ॥

అనుక్షణం అప్రమత్తత నిండిన చుాపులు
దేశ రక్షణకై భాద్యత నిండిన కర్తవ్య నిష్టులు
యుద్ధాల్లో శత్రువులను మట్టుపెట్టగల వీరులు
దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు '॥

క్రమశిక్షణ, ఆరోగ్యరక్షణ ,సమయపాలనం
సైనికుల నిత్య జీవితంలో నిష్ట నిండిన నియమం
దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోరాడే ధైర్యం
అమరులైన సైనికులకు చేద్ధాము గౌరవ వందనం ॥

హామీ:
ఈ నా  వచన కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

విశ్వ విఖ్యాతుడు

అంశం : N.T.రామారావు.
శీర్షిక : విశ్వ విఖ్యాతుడు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఎందరో పుడతారు. మరెందరో గిడతారు.
కొంతమంది మాత్రమే చరిత పుటల కెక్కుతారు ॥

నందముారి అందగాడు తారక రామారావు
జీవితాన ఒడిదుడుకుల బాట నడచి గెలిచినాడు ॥

పల్లెటుారి పిల్లగాడు పలు భాషలు నేర్చినాడు
రంగమంచ్ మీదాతడు రంగు లేసి నిలచి నాడు॥

విజయావారి చిత్రాలకు విజయము చేకుార్చినాడు.
బాక్సాఫీస్ విజయాలతొ ప్రజాదరణ పొందినాడు.॥

రాముడతడె భీముడతడె రస భుామికలేలె నతడె.
క్రమశిక్షణ నిండినట్టి కధల నాయకుండాతడె ॥

కుంచెపట్టి పంచకట్టి కుాచిపుాడి నేర్చినాడు
దర్శకత్వ మేలీ ,ఘన చిత్ర సీమ నేలినాడు ॥

తడబడుటలు లేని వాడు మాయాబాజారు తోడు
నలుదెసలా కీర్తుల ఘన నటుడై నిలిచాడు చుాడు ॥

రాముడుా, కృష్ణుడంటి పౌరాణిక పాత్రలతో
తెలుగు వారి హృదయాల లొ శాశ్వతముగ నిలచినాడు॥

పట్టభద్రులైన వారు ప్రగతి బాట నడచినారు
ప్రజల ముఖ్య మంత్రియై తెలుగు గడ్డ నేలి నారు॥

సరి రారసలెవ్వరతని గాంభీర్యపు గొంతు వాని
ప్రజలు మెచ్చు నాయకుడై అన్నగాను నిలచినాడు ॥

పౌరాణిక, జానపదము,సాంఘీకపు చిత్రాల- వై
విధ్యభరిత పాత్రలెన్నో వేసీ గెలిపించినారు. ॥

నవ రసాలు పండించిన నటసార్వభౌముడు
విశ్వ విఖ్యాతుడై  జగతి చరిత కెక్కినాడు ॥

పద్మ శ్రీ ఆవార్డు దక్కె కళప్రపుార్ణ స్వీకరించె
డాక్టరేటు గౌరవముతొ ఘన సత్కారములు పొందె ॥

నందముారి వంటి నటుడు కానరాడు ఇంకెన్నడు
దివిని భువిని అతడొక్కడె నట సార్వబౌముడు ॥

హామీ :
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా
ప్రచురితముకాని నా స్వీయ రచన .

***************************************


అంశం: పతంజలీ యొాగ శాస్త్రము

అంశం: పతంజలీ యొాగ శాస్త్రము 


శీర్షిక :  ఆరోగ్య నిధి .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


పతంజలి యోగ సూత్రాలను మానవాళికి అందించిన  యోగి పతంజలి మహర్షి.
నలభై భారతీయ భాషలలోకి, అనువదించబడిందిన పతంజలి,యొాగ శాస్త్రము అనేక సంస్కృత గ్రంథాలలో యోగరత్నకర, యోగరత్నాసముక్కాయ, పదార్థవిజ్ఞాన, చక్రదత్త భాష్య అని పిలువ బడుతుా  
మానవ జీవితాలకు మహత్తరమైన శరీరిక దారుడ్యానికి మానసిక సంతులనానికి ఉపయొాగ పడుతుాన్న  దివ్య శాస్త్రము .

చిత్తస్థైర్యం సాధించడానికి , ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేస్తుా , ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా  అవయవ పుష్టి ఆరోగ్య వృద్ది
కలిగించేందుకు ఉపయొాగపడే శాస్త్రము .

పతంజలి చేసిన  ఉల్లేఖనాలలో కొన్ని ప్రత్యేకమైనవి.  మరికొన్ని చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి ప్రధాన హిందూ వైద్య గ్రంథాలలో కూడా కనిపిస్తాయి.

పతంజలి రచించిన యోగ సూత్రములు సమాధి, సాధన, విభూతి, కైవల్యమనే 
నాలుగు పాదములుగా విభజింపబడి యొాగ సాధనకు అనుగుణమైన పద్ధతుల లో విశదీకరించబడి
వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించబడినది.

తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలుగా వర్ణంచబడి 
సత్వ, తమో, రజో,గుణాలను అధిగమించడానికి ఓంకార జప సాధన సమాధానమని తెలియజేసిన 
సుాత్ర నిధి పతంజలి శాస్త్రం.

నేటి కాలమాన పరిస్థితుల ఉరుకు పరుగుల 
జీవితంలో,  పర్యావరణ శుద్ధిలేని అనారోగ్య పరిస్థితులను   ప్రాణాయామం వంటి అనేక యొాగ పద్ధతులద్వారా  నివారించుకొనే విధంగా 
ఉపయొాగకరమైన యొాగాశనాల ప్రాశస్త్యాన్ని వివరిస్తుా మానవాళని రోగముక్తులుగా చేసేందుకు ఉపయొాగపడే దివ్య శాస్త్రము పతంజలి .
 
ఏకాగ్రతనిండిన దృడ చిత్తముతో  పతంజలీ యొాగ 
శాస్త్ర పద్ధతులనవలంభించిన ప్రతి ఒక్కరుా
ఆయురారోగ్యాభి వృద్ధిని పొంది ఆనందంగా ఉండగలరనడంలో ఏమాత్రముా సందేహము లేదు.

************************************
ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.

పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి 


సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసత, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకువంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి.

మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవుసరమైన ప్రశాంతత పొందవచ్చు.


చిత్తస్థైర్యం సాధించడానికి  ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా  అవయవ పుష్టి ఆరోగ్య వృద్ది
కలిగించే దివ్య శాస్త్రము .

వైరాగ్యం అంటే
భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. 
అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.

భగవంతునియందు సుస్థిరముగా చిత్తమును నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.

పూర్వవాసనలు, గల వ్యక్తి సాధనలో ఏకాగ్రత, దృఢత  బలంగా పెంపొందించుకోవడం వల్ల అంత త్వరగానుా సమాధిస్థితిని చేరుకోగలడు.

పరమపురుషుని చిహ్నం ఓంకారం.  సమాధికి మార్గం.
సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరువాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.

సత్వ తమో రజోగుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని .

 వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు  పతంజలి మహర్షి .

కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించేరు పతంజలి.
--------------

డాక్టర్స్ డే కవితలు

24/06/2022.
మనుమసిద్ది కవన వేదిక ఆధ్వర్యంలో జులై 1,డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కవితల పోటీ కోసం...


అంశం : ఊపిరి నేతగాళ్ళు.
శీర్షిక  :  నర నారాయణుడు.
ప్రక్రియ : వచన కవిత.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


వైద్యులు, పవిత్ర వైద్య వృత్తికి ప్రతీకలు.
రోగగ్రస్తులను ఆదరించే ఆప్త మిత్రులు .
రోగులకు సరియైన వైద్యాన్నందించే దార్శనికులు. 
ఆరోగ్య జీవితాన్నందించే అభినవ ధన్వంతరులు॥

ఔషధం ఇవ్వడంలో తగిన జాగర్త
ఆపరేషన్స్ చేయడంలో చుాపే నిబద్ధత
అలుపెరుగని నిరంతర సేవాతత్పరత
 జాగురుాకతతో మెలగే వైద్యుని ఘనత ॥

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రెండవ- 
ముఖ్య మంత్రిగా ప్రసిద్ధులు.
స్వాతంత్ర్య సమర  యొాధులు . 
వృత్తి రీత్యా చరిత కెక్కిన వైద్యులు.
డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ధన్యులు. ॥

ఈయన సేవలకు గాను భారత ప్రభుత్వం
ఇచ్చిన దేశ అత్యున్నత "పౌర పురస్కారం,"
" భారతరత్న" గా చేసెను ఘన సన్మానం ॥

ఆతని జయంతి రోజే ఆయన వర్ధంతి .
జూలై 1  భారతదేశమంతటా జరిగే జయంతి.
జాతీయ వైద్య దినోత్సవం నమందరి స్ఫుార్తి 
ఆరోగ్యదినోత్సవం వైద్యులందరి ఘన కీర్తి. ॥

 
హామీ పత్రం : ఈ కవిత అనువాదం,అనుసరణ 
కాని నా స్వీయ రచన . హామీ ఇస్తున్నాను.

********************::::*********
24/06/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం :  ఐచ్చికం 

మ.సా.క.సం.19
కవిత సంఖ్య : 3

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక  : తెల్లకోటులో దాగిన దర్పం .

ఆతని మాటలతో రోగాన్ని జయింగల ధైర్యం
ఆతని స్మర్శతో రోగులలో పెరిగే ఆత్మ స్థైర్యం.
 అలమటిస్తున్న రోగులకు అన్నీ తానైన ఘనం
అతనిచ్చిన ఔషధం రోగాలను బాపే అమృతం ॥

తెల్ల కోటులో దాగిన దర్పం, అతని
స్వశ్ఛత నిండిన  మనసుకు నిదర్శనం  .
 మెడలో స్టెతస్కోప్, విద్యార్హతకు ఫలం.
 అతడే రోగులను గాచే విధాతైన వరం  ॥

శస్త్ర చికిత్సకు నైపుణ్యత నిండిన చెేతి వేళ్ళు.
సునిశిత దృష్టిగల వ్యవస్థీకృత కార్యాచరణలు
 బ్రతుకు ఊపిరినల్లే బలమైన నేతగాళ్ళు.
 సమర్ధవంతమైన కార్య కర్తలు వైద్యులు ॥
 
పగలుా రాత్రీ సేవలందించే వృత్తి , సేద్యం.
బీదా గొప్పా తేడా చుాపని సమానతల భావం
ఆరోగ్యమే మహా భాగ్యమంటుా చేసిన వైద్యం
వైద్యుడే ఇల వెలసిన  దైవానికి ప్రతిరుాపం.॥

"డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ నిలబెట్టెను వైద్యుల ఘనం
ఆతని జయంతి రోజే ఆయన వర్ధంతి దినం
జూలై 1ని జరుపుకొనే జాతీయ వైద్యుల దినోత్సవం 
వైద్యుల సేవాతత్పరతకు  ఇదే నా వందనం ॥


హామీ పత్రం : 
నా ఈ కవిత అనువాదం,అనుసరణ 
కాని నా స్వీయ రచన . 

Monday, June 13, 2022

బిరుదులు , పురస్కారాలు,,

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అన్ లైన్ కవితా పోటీల లో
ఇప్పటి వరకు నాకు లభించిన  బిరుదులు ,  పురస్కారాలు.

2020. నాటి బిరుదులు.
---------------------------------

1. సాహిత్య చక్రవర్తి.

2. స్వర మయుారి.

3.వెలుగు దివ్వె.

4.శత తేనియ పురస్కారము 

5. మధుర కవి భుాషణ .

6. పద ముత్యం బిరుదు.

7. ఇష్టపది శ్రేష్ట.

8. అద్వైత

9.మహతీ సాహితీ చక్రవర్తి 2022.

10  .సుధీ తిలక బిరుదు.

11.కవి కోకిల బిరుదు.
---------------------------------

8.  అక్షర ఝరీ రత్న  ..2021.
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం.
30 పాశురములను  తెలుగులో పాటలుగా రచియించినందులకు

9.సాహిత్య కళానిధి" బిరుదు.( 2021.)

10. అద్వైత పురస్కారం .

11. రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ .

12. సమాజ సార్థక్ అవార్డ్  --2020..నాడు

13. విశిష్ట మహిళా శిరోమణి...బిరుదు.2021

14. రవీంద్రనాథ్ టాగుార్ సేవా పురస్కారం.

15. సాహితీ బృందావన జాతీయ వేదిక వారి

           కాళోజీ సాహితీ పురస్కారం.
          
16.  కవి కోకిల బిరుదు. (సాహితీ బ్రందావన జాతీయ వేదిక)

వృద్ధాశ్రమాలు పోటీ విజేతలు



శీర్షిక : కన్నీటి కథలకు సాక్ష్యాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ఎక్కడ నుండో వస్తున్న కన్నీటి వెక్కిళ్ళు
ఏ తల్లో కోల్పోయిన జ్ఞాపకాల  సుళ్ళు
బిడ్డ పుట్టిన సంబరాన విరిన నవ్వుల పుాలు
నేడు వాడి నలిగిన రాతకు రగిలిన సెగలు ॥

నడక నేర్చిన బిడ్డ అడిగి కోరిన ఆట బండి
అప్పు చేసి కొన్న పాపానికి లేని తిండి
తాము తిన్నా తినకున్నా తెలియనీయని
అమ్మ తనం , ఆకలి కష్టానికి ఆదుకోని శరీరం ॥

కాయ కష్టానికి దొరకని దుడ్డు లేపిన దుమారం  .
మగని పిరికి తనానికి నిండు బావి నీరే సాక్ష్యం .
కొరతబడిన ప్రాణానికి ప్రాణమైన పసి ప్రాణం.
సాకిన ప్రేమకు బిడ్డను చదివించడమే లక్ష్యం ॥

తొమ్మది మాసాలు బరువును మొాసిన శాపం
ఎదిగిన రక్తబంధంలో ఏపుగా పెరిగిన స్వార్ధం .
 మదిర- మగువల చాటున మరచిన మానవత్వం .
 పెంచిన మమతపై చుాపిన  కృుార ప్రతాపం ॥
 
నేడు వృద్ధాశ్రమాల వెలిసిన గోడల బీటల్లో
దాగిన ఎన్నో అపశృతుల గతిలేని గీతాలు
ఎండిన శరీరాలకు నీడనిచ్చే ఓదార్పు గళ్ళు.
పెంచిన మమకారాలకు పేగు బంధాలు వేసిన సంకెళ్ళు॥

నేడు వృద్ధాశ్రమాలు
 "నా" అన్నవారు రాని భాధితుల బందీలు.
నిరీక్షణ నిండిన కళ్ళకు నిదుర రాని శోకాలు .
గది గదిలో నిండిన కధలకు ,కన్నీటి కాల్వల ఊటలు .
చితుకు బ్రతుకు పొిరాటాలకు ఆలంబనైన
కొడిగట్టిన దీపాలు ॥

వృద్ధాశ్రమాలు .....
 కన్నీటి కష్టాలకు స్పందించలేని  నీరుారని
  కన్నీటి  వెక్కళ్ళకు  మారు పేర్లు ॥
 

🥁🌹💐🌹🥁🌹💐🌹🥁
సాహిత్య రంగంలో ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన సంస్థ మన శ్రీ శ్రీ కళావేదిక.🎊

కవులు రావాలి.. కవిత్వాన్ని ప్రోత్సహించాలి అనే ధ్యేయంతో ఎన్నో ప్రత్యక్ష కవిసమ్మేళనాలు, కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కవులను ప్రోత్సహిస్తున్న సంస్థ శ్రీ శ్రీ కళావేదిక.
💐💐💐💐💐💐💐💐
అనేక సామాజిక అంశాలపై అద్భుతమైన ఇతివృత్తాలతో కూడిన అంశాలను ఇస్తూ వర్ధమాన కవులలో నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సామాజిక అభ్యుదయమే ధ్యేయంగా 
కవిత్వంతో సమాజంలో మార్పు తేవాలనే ధృక్పథంతో అవిరళమైన సాహితీ కృషి చేస్తున్న ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత, సాహిత్యభూషణ్, అక్షర తపస్వి శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యంలో నిర్వహించిన వృద్ధాశ్రమాలు అనే అంశానికి కవులనుండి విశిష్టమైన స్పందన లభించింది.
వాట్సప్ 6 గ్రూపుల్లోనూ మరియు ఫేస్ బుక్ లోనూ నిర్వహించిన ఈ పోటీలో దాదాపూ 350 మంది కవులు తమ స్పందనను కవితల రూపంలో తెలియజేసారు.
ఎంపిక కష్టమైనప్పటికీ విజేతలను ప్రకటించక తప్పదు.
4 వగ్రూపులో టాప్ టెన్ లో నిలిచిన విజేతలు..💐💐👏👏
🌹విజయలక్ష్మి పొప్పొచ్చ
🌹సప్రం దినేష్ కుమార్
🌹పి. జగదీశ్వరీ మూర్తి
🌹చింతాడ కృష్ణారావు
🌹వెంకట్
🌹M. రామేశ్వరి
🌹మోటూరి నారాయణరావు
🌹సి.హెచ్. అరుణ్ కుమార్
🌹కొల్లాబత్తుల సూర్య కుమార్
🌹K. ఆకాష్

మునుముందు కూడా మీ స్పందన ఇలాగే వుంటుందని భావిస్తూ..
విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేస్తున్నాము.
శుభాకాంక్షలతో..💐💐
మీ శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కార్యవర్గం & కమిటీ.

Saturday, June 11, 2022

అంశం : ఆధునిక సమాజంలో సాహిత్యం పాత్ర.

12/06/2022.

గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక 3.1 కొరకు

 అంశం : ఆధునిక సమాజంలో సాహిత్యం పాత్ర.
 శీర్షిక : అందరికీ అందుబాఁటులో సాహిత్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర .

తమ మనోగత భావాలను అక్షరాలకు జోడించి కల్పన , కల్పనేతర వర్గాలలో నవరసాలనుా సుాక్ష్మంగా వ్యక్తపరచే వర్ణనాపుారిత అక్షర సాన్నిహిత్య సారాశం కవిత్వం . 

ఒకప్పటి రామాయణ మహాభారతాది చారిత్రాత్మక వర్ణనలు మౌఖిక సంప్రదాయ సంస్కృతులననుసరించి 
ధారణానుకూలమైన కార్యాచరణతో వచన కవిత్వంగా వర్ణింపబడి ఉండేవి.।

మరికొన్ని నియమబద్ధమైన ఛందస్సుతో యతి ప్రాసానుప్రాసలతో కుాడిన  క్రమ బద్ధమైన పాదాలతో పద్యరుాపంలో రచింపబడ్డాయి.I

వాటిలో  ఎన్నో ధార్మిక,సందేశాత్మకత కవిత్వాలు ,  జాతీయ ఇతిహాసాలు, తాత్విక గ్రంథాలు , శృంగార కావ్యాలు వంటి వివిధ సాహిత్యాంశాలు కవిత్వ
రుాపంలో వెలుగు చూశాయి.l

రాను రానుా ,కాలానుకుాలంగా ఈ ఆధునిక యుగంలో గ్రాంధీక భాషా ప్రయొాగాలు తక్కువై  అందరికీ అర్ధమయ్యే రీతిలో వాడుక భాషా శైలి ననుసరించీ సాహిత్యం యొక్క పలు విలక్షణతలు ఉద్ఘాటింపబడ్డాయి .

పలు ప్రక్రియలు  నియమపుారిత లక్షణాలతో వెలువడడంతో సాహిత్యం విలువ ఒక పటిష్టమైన పద్ధతిలో నూతనత్వానికి దోహదమయ్యింది.l

విజ్ఞానం , సరళ భాషా ప్రాధాన్యతల ఆధారంగా, అందరికీ అందుబాటులో గల  సాహిత్య ప్రక్రియల
 విభాగంలో సమీక్షాకరణ అనేది చోటు చేసుకొంది.
 
రాసే ఏ ప్రక్రియ యైనా కవియొక్క భావ ప్రకటనతో 
 పలువురినీ ఆకట్టుకొనే విధంగా ఉండాలన్నదే ఈ సమీక్షయొక్క సారాంశమై ఆధునిక కవిత్వ పురోగతికి
 మాధ్యమమయ్యింది.

ఈ పద్ధతిని ఉపయోగించడం వలన సాహిత్యంలో 
 ఒక నూతనత్వం అభివృద్ధి చెందడమేకాక ,
మనం రాసే  సాహిత్య సారం  కవితాత్మకంగా మెరుగుపడుతుందనడానికి ఏమాత్రముా సందేహం లేదు.l
 
 హామీపత్రం: 
ఈ కథానిక కేవలం గోరసం కొరకు మాత్రమే వ్రాసినది అని  ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన అని తెలుపుతున్నాను .




(ఎంతో అధ్యయనం చేసి ఎన్నో నుాతన  ప్రక్రియలను
  మనకందించి మనలో కవిత్వాకాంక్షను కలిగించిన నేటి ఆధునిక సాహిత్య రుాపకర్తలకు మనఃపుార్వక ధన్యవాదాలతో 🙏🙏 .)


Wednesday, June 8, 2022

నాన్నే నా హీరో

10/06/2022.
మనుమసిద్ధి కవన వేదికలో 
ఫాదర్స్ డే సందర్భంగా రాసిన కవిత.
అంశం : నాన్నే నా హీరో.

శీర్షిక : అలుపెరుగని శ్రామికుడు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర .




చెదరని గంభీరాకృతి
ధృడ సంకల్పానికి ప్రతీతి
 లక్ష్యం నిండిన  బాధ్యతలకు
వెనుకాడని నాన్న ప్రవృత్తి ॥

బంధాలే బాధ్యతగా
అలసటలే సుఖాలుగా
పిల్లల భవితోన్నతులే 
ఆనందాలైన వ్యక్తిత్వ రీతి ॥

 సుఖమన్నది కోరడెపుడు
 అలుపన్నది ఎరుగడెపుడు.
 బాధ్యత నిండినబరువుకు 
 అసహనంతో కుంగడెపుడు ॥
 
 మన జన్మకు కారకుడు
మన కోర్కెలు తీర్చువాడు
 మార్గదర్శి యై మసలెడు
 మంచి గురుని రుాపమతడు.।॥
 
 సంసారము సాకుటకు
 తన పిల్లల భవిత కొరకు
 తన సుఖములు పణముగనిడు
నాన్న నిండు త్యాగముార్తి  ॥

కర్షకుడై కార్మికుడై
 భరత మాత రక్షకుడై
 నిరంతరం కష్టపడే 
 నిదురెరుగని శ్రామికుడు॥
 
నాన్న రుాపములో దేముడు
అవని నవతరించి నాడు
నా పిలుపుకు స్పందించీ
నన్ను  గాచు "హీరో" అతడు॥

 హామీ :
 నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
 ప్రచురితం కాని నా స్వీయ రచన .
 
 ********************


ఫాదర్స్ డే సందర్భంగా రాసిన కవిత.
అంశం : నాన్నే నా హీరో.

శీర్షిక : అలుపెరుగని శ్రామికుడు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర .


నా నవ్వుల తోటకు నాన్న నీరు పొిసినాడు
నేనడిచే బాటలోవబాధ ముళ్ళు తిసినాడు॥
నే కోరిన కోర్కెలన్ని మమత నింపి తీర్చినాడు
నే నెదిగే బాట జుాపి భవిత  తీర్చి దిద్దినాడు ॥

ఎండైనా వానైనా కష్ట మంత ఓర్చునతడు.
అహర్నిశలు శ్రమియించే అలుపెరుగని యంత్రమతడు॥

నా జన్మ దాతగా జగతి మార్గదర్శిగా
నను నడిపే సారధిగా వెంటున్నది నాన్నేగా॥
నా కలలకు సాకారం నా భవితకు సహకారం
నాన్న లేని జీవితమే ఉనికిలేని ప్రయాణం ॥

కడుపు నింపి కాన్కలిచ్చి చదువుా సంస్కారమిచ్చి
నిలకడైన భవిత నొసగు నిత్య శ్రామికుడాతడు॥
నాన్న లేని బ్రతుకు సారో ! నాన్న లేని ఉనికి జోరో
నాన్న మించు వారు లేరు । నాన్నే నా సుాపర్  హీరో ॥
హామీ :
 నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
 ప్రచురితం కాని నా స్వీయ రచన .
 
 ********************
****************:*


ఫాదర్స్ డే సందర్భంగా రాసిన కవిత.
అంశం : నాన్నే నా హీరో.

శీర్షిక : అలుపెరుగని శ్రామికుడు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర .


నా బోసినవ్వులు కురిసే వెన్నెలలను 
తన ఆశల పల్లకిలో పరుచుకొని
నా ఉనికి ఉత్సాహాన్ని  ఆశయాల--
ప్రపంచానికి పరిచయం చేసినది నాన్న ॥

నా చిన్ని చిలిపి చేతల అసహనాన్ని
రాత్రి చెప్పే కధల రుాపాలకు జోడించి 
నా తప్పుల ఆచరణకు ఒప్పుల నడవడిక
 నేర్పిన  మొదటి మార్గదర్శకుడు నాన్న ॥

నా చిన్ని  కలల ప్రపంచాన్ని' నాకై
ఇలలో చుాపించేందుకు తన కష్టాలను
ఇష్టాలుగా మార్చుకొనే పోరాటాల ప్రతి
మాంత్రికుడు మా నాన్న॥

నే నడిచే ఎండకు గొడుగై , నేనాడే మాటకు 
 మంత్రమై, నా ఉజ్జ్వల భవితకు
ఆలంబనై నా నవ్వుల  ఆనందాన్ని
ఆస్వాదించే అనుభవ  సారం నాన్న ॥

అలుపెరుగని అహర్నిశల పోరాటాన్ని
జీవిత ఒడిదుడుకుల ఒరవడి గెలుపుగా
నా ఆశయాల నెరవేర్పుకై  అందించిన
 ఆశయ సాధకుడు మా నాన్న ॥

నాన్న నా అనుభవాల గెలుపుకు వేరు
నాన్న నా జీవిత గమనానికి చుక్కాని జోరు
నాన్న నా ఆనందాల తోటలో మొలకెత్తే నారు
అందుకే నాన్న ,హీరోను మించిన యాక్షన్ ష్టారు.॥


హామీ :
 నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
 ప్రచురితం కాని నా స్వీయ రచన .
 
 ********************
***************