Monday, August 29, 2022

యాబదియారక్షరాల సాహిత్యపు పుాదోట.

29/08/2022.
గో.ర.సం వారి గిడుగు జయంతి మరియూ తెలుగు భాషా దినోత్సవం కవితల కొరకు*

   అంశం :తెలుగు భాషా దినోత్సవం .
శీర్షిక  : యాబదియారక్షరాల సాహిత్యపు పుాదోట.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి :
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021.

ఆగష్టు " 29 "ని గిడుగు వారి జయంతోత్సవం
“తెలుగు భాషా దినోత్సవముగ" చరిత కెక్కిన ఘనం
తెలుగు గ్రాంధీక భాష వాడుక భాషైన సారం.
భాషోద్యమ కారుడైన గిడుగు చేసిన ఉద్యమ ఫలం॥

"దేశ భాషలందు లెస్స"గ చరిత కెక్కిన భాష
నాలుగు వేదాల సార , నవరతనాల ముాట .
సరళమైన  పదజాలపు సాహిత్యపు పుాదోట.
దేశ కీర్తి వెలుగు పలుకు  తీపి నిండు వెన్న పుాస ॥

  కావ్య ,కవనాల బాట వెలుగొందిన ఘన చరిత .
  పద్య, గద్య, పురాణేతిహాస శీల సుజాత .
  అష్ట దిగ్గజాల నోట  యతి ప్రాసల ఘన కోట
రాజ రాజేంద్రు డిలను మెచ్చిన నెచ్చెలి భాష ॥

అక్షరాల నినాదాల ,అదిరించిన శత్రు భయ
ఉద్యమాల బాట మాట అస్త్రమైన నిర్భయ.
మవ్వన్నెల పతాకాన ముజ్జగాల నేలు శుభద.
శాంతి సత్యహింసలనెడు సందేశపు ధర్మ కోట ॥

యాబది ఆరక్షరాల కీర్తి నేలిన భాష.
అచ్చు హల్లు పొల్లులు గల అక్షరాల విరి పుాత
వ్యాకరణము ఛందస్సుల వేడ్క వెలుగు జిలుగు తోట
వేయి మాట లేల నాదు మాతృభాష  జేల శీల ॥

*************************************

నా దేశం ,నా తెలుగుకు నమస్సులు.

మహతీ సాహితీ కవి సంగమంలో 
అంశం :  నా దేశం ,నా తెలుగుకు నమస్సులు.
ప్రక్రియ : ఇష్టపది .
రుపకర్త : శ్రీ అడిగొప్పుల సదయ్యగారు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి : 
కల్యాణ్ మహారాష్ట్ర .

యాబది యారక్షర యాస ఉన్నది తెలుగు
భక్తి, విభక్తులతో  భవిత వెలుగిడు తెలుగు.
అమ్మ పాడే పాట నలరారినది తెలుగు
పసి పాప నవ్వులో పంచు మధురిమ తెలుగు ॥

అక్షరపు కుార్పులో అందమున్నది తెలుగు
పద్య, గద్య, రచనల పంచదారల జిలుగు
కవన పుా దోటలో కావ్య భాషల వెలుగు
అందమైన భాషిది అమ్మ సాటీ తెలుగు ॥

జానపద తోటలో  జామపండీ తెలుగు
త్యాగయ్య పాటలో  రాగ భక్తికి వెలుగు
అన్నమయ్య నోటను అలరిన పాట తెలుగు
 వేద నాద ఘొాషల వెలుగు వెన్నెల తెలుగు ॥

మువ్వ గోప పదముల ముద్దులొలికిన తెలుగు
క్రిష్ణ దేవరాయల కీర్తి మకుటము తెలుగు
అష్ట దిగ్గజాలకు అలరు వన్నెల జిలుగు
అదె భాను తేజమై అవని వెలిగిన తెలుగు ॥

 కంద ఛంద అందపు కవుల కలమీ తెలుగు
 తేట గీతుల వేట తేనె పలుకీ తెలుగు 
  పద్య సీసము లోన  పలు గణముల పలుకుా
  ఆటవెలదుల గుాడి ఆడి పాడిన తెలుగు ॥

గోరేటి వెంకన్న గోడు గోసల వెలుగు ॥
చందమామ పాటల విందు లాలీ తెలుగు .
యొాగి వేమన నోట  యొప్పు నీతుల పలుకు
 పాడి పంటల సిరుల పల్లె పాటల పలుగు ॥

ఉద్యమాల బాటను ఊపు నిచ్చిన తెలుగు
నిత్య శాంతిని కోరి నినదించేనీ తెలుగు.
గిడుగు వారి బాటలో గొడుగు సరళపు తెలుగు
మన సంస్కృతి మాటకు మంచి బాటది తెలుగు ॥

పచ్చదనపు వనమున పసిడి మామిడి పుాత
పారు నదుల నీటిని పంచు జీవన దాత
ఆ సేతు హిమాచల ఆరక్షణపు కోట.
అవని నిండు ప్రకృతిని అభివర్ణించే పాట ॥

సంస్కృతి  సాంప్రదాయ సమ్మేళనము తెలుగు
కట్టు బొట్టు తీరుకు కళ నిండిన వెలుగు
వేల జేల వెలుగుకు వేదికైనది తెలుగు
భక్తి నిండు కొలువుల భావ గీతము తెలుగు ॥

పురాణేతి హాసపు పుట్టినిల్లిదీశ్వరి 
సర్వ మంగళములకు సాక్షిభుాతమీశ్వరి 
భుా మాత భారతికి భుాషణ మిది ఈశ్వరి
వేల జేల నమములు వెలుగు తెలుగుకీశ్వరి ॥

హామీ: 
పై ఇష్టపదులు నా స్వీయ రచనలు.

ఉత్తమ బాల సాహిత్య రచనలు: 27-08-2022

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

ఉత్తమ బాల సాహిత్య రచనలు: 27-08-2022

శ్రీ/శ్రీమతి
1.యం రామకృష్ణయ్య

2.కుడికాల సమ్మన్న

3.బత్తిన గీతాకుమారి

4.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

5.గాజుల నరసింహ

6.జూపూడి సుధారాణి

7.రేజేటి వెంకట రమణమూర్తి

8.కె శైలజా శ్రీనివాస్

9.త్రిలోచన్ బిసాయ్

నిర్వాహక /సమీక్షక బృందం
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

కిలపర్తి దాలి నాయుడి గారి కవిత

*మనుమసిద్ధి కవనవేదిక పోటీ* 
అంశం:తేనెపట్టుతెలుగు
---------------------------------------
*శీర్షిక:వాగామృతం నా తెనుగు* 
----------------------------------------
స్వరపేటికలో తంత్రులు
సరిగమలనుచ్ఛరించినపుడు
"వసుచరిత్రంతెత్తునుండి
సంగీతఝరులను
 పారించదా మనతెలుగు!

మందార మకరంద పద్య భాండాలను
పోతన మోసి మోసి 
రామచంద్రునికభిషేకించిన భాషమనది!

అన్నమయ్యచే సుప్రభాతగీతాలు 
పాడించుకొనితడిసిముద్దైన 
వేంకటేశ్వరుడు మురిసిమెరిసిపోడా! 

"అటజని  భూసురుడు
కాంచినదేమిటి?"
 తెనుగుపద్యపుసొగసులనే కదా
అల్లసాని హిమగిరులపై కేతనంచేసి నిలిపాడు!

హరవిలాసలాస్యంతో శ్రీనాథకవితావిరి
లో మరందాన్నేత్రాగిన శివయ్య!
కథాఖండశర్కర,కవితా మాధురీ,గేయామృతభాండం నా తెలుగు!
వేయికిరణాలవెలుగు!
----------------------------------------
*కిలపర్తి దాలినాయుడు*
హామీ పత్రం:ఈ కవిత నా స్వంతం.మనపోటీకి వ్రాసినదే!

Sunday, August 28, 2022

శ్రావణ శుక్రవారం విశిష్టత సంకలనం కొరకు ముందుమాట..మ

మగువ మహారాణి సమూహ *అడ్మిన్ విభాగం వారు* .

శ్రావణ శుక్రవారం విశిష్టత సంకలనం కొరకు

20 వాక్యాలలోపు ముందు మాటలు రాసి నా నంబర్ కు పంపండి.

రేపు ఉదయం 10 లోపు పంపండి.
మీ ఫోటో కూడా పెట్టండి.

మరిచిపోవద్దు😊
https://chat.whatsapp.com/GiGqqNbgdmTGZwuHjKzisW

మగువ మహారాణి ఛానల్ లో శ్రావణ మాస విశిష్టత ...
కొరకు ముందుమాట...

అంశం : శ్రావణ మాస విశిష్టత ...

శీర్షిక : నమ్మినవారికి నమ్మిన దైవం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి :
కల్యాణ్ మహారాష్ట్ర .

మన భారత దేశం సద్ధర్మ సాంప్రదాయాలకు భక్తి శ్రద్ధలకు పెట్టింది పేరు .సంవత్సర కాలమంతా ఏదో ఒక పుాజ, ఉత్సవం, నోములు, వ్రతాల, పేరుతో
జాతి ,మత బేధాలు లేని ఆప్యాయాయతానురాగాల
సందళ్ళతో పండగలను జరుపుకోవడం విధి విధాయకమయ్యింది.
ఆయు రారోగ్య ఐశ్వర్యాలకు సర్వ మంగళాలకు శుభ ప్రదమైనది ఈ పండగల విశిష్టత.
ఈ పండగల లో మహిళామణులకు ఉపయొాగపడే
మంగళ్య పరమైన పండగలు అత్యంత భక్తి
పరమైన ఆచార వ్యవహారసలతో కుాడుకొని ఉన్నవి.

వాటిలో శ్రాణ మాస  నోముల వ్రత విధానం  ఒకటి.
వర్షాకాల అరంభం లో వచ్చే ఈ పండగ లో
ఈ నెలంతా కుాడా భక్తి నిండిన భావుకతో
మహిళ లు ఆనందంగా ఈ పండగలను జరుపుకుంటారు.
శ్రావణ మంగళ వారాలు పెళ్ళి కావలసిన కన్నెలు
అత్యంత ఆశక్తితో మంచి వరుడు కావాలన్న కోరికతో చేస్తే , కొత్తగా పెళ్ళైన స్త్రీ లు తమ మాంగళ్య బలం కోసం ఐదు సంవత్సరాలు ఈ వ్రత నోముని ఆచరిస్తారు.
ఈ నోములో నానపెట్టిన శనగలు , పసుపు, కుంకుమలు, పుాలు, పండ్లు, తాంబుాలం వక్కలు జాకట్టు ,బట్టలు పంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఇక ఈ నెలలో వచ్చే నాలుగు  శ్రావణ శుక్రవారాల లో
శ్రీ వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
శ్రావణ పుార్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు
మహిళ లందరుా బ్రహ్మ ముహుార్త సమయానికే స్నాన పానాదులు ముగించుకొని తమ ఇంటి ముందు రంగు రంగు  రంగ వల్లులను తీర్చి దిద్ది , గుమ్మాలకు పసుపు కుంకుమలద్ది పచ్చని మామిడి తోరణాలను  కట్టి
అమ్మవారైన  శ్రీ వరలక్ష్మీ దేవి మండపాన్ని శోడదశ కళ లతో అలంకరించి , శోడశోపచారాది పుాజలతో లక్ష్మీ దేవిని పుాజించి,  తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్య మిడి, ముత్తైదులకు దక్షిణ తాంబుాలాది వస్త్ర దానములతో సత్కరించి వారి ఆశీర్వాదాలు గైకొని
బంధు మిత్రపరివారులతో కలసి విందారగిస్తారు.
ఈ వ్రతాన్ని తొలుత చారుమతి అనే స్త్రీ కి స్వయంగా వరలక్ష్మీ దేవియే స్వప్నంలో కనిపుంచి వ్రత విధానమును తెలియ పరచిందని నాటి నుండి నేటి వరకు ఆ చారుమతి కొలిచిన రీతిలోనే  మహిళ లందరుా ఆ వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించి ,
చారుమతి స్వప్న వృత్తాంతమును కధగా చెప్పుకొని
కధాక్షతలను శిరసుపై జల్లుకుంటారు.
ఈ వ్రత మహిమతో ధన ధాన్య కనక వస్తు వాహనాలతోపాటు సర్వ మంగళ సౌభాగ్యాలు కలుగుతాయన్న నమ్మకంతో భక్తి శ్రద్ధలు నిండిన
ఆచారంతో మహిళ లందరుా ఇనాటికీ  ఈ వ్రతాన్ని జరుపుకుంటారు . ఈ పండగలు వ్రతాలలో ూన్న విశిష్టతనేగాక మగువలను ప్రోత్సహించేందుకు
"మగువ మహారాణి" అన్న పేరుతో ఒక యుాట్యుాబ్
ఛానల్ ను ఏర్పరచేరు.

మగువ మహారాణి యుాట్యుాబ్ ఛానల్ కేవలం
మగువలకు మాత్రమే ప్రత్యేకంగా నిర్దేశించిన ఛానల్...
శ్రీ దేవవరపు ఈశ్వర్ గారు, వారి గ్రుాప్ అడ్మిన్ లు కలసి .ఈ సముాహాన్ని  మహిళలకు మాత్రమే
నిర్దేసించి...వారిలో నున్న సాహిత్యాభిలాషను వెలికితీస్తున్నారు.
అద్భుతమైన అంశాలను ఇస్తుా ,మహిళలు  తమ ఇంటినుండే
మొాబైల్ వీడియొాల ద్వారా  తాము రాసిన కవితలను చదివి పంపే అవకాశాన్ని  కల్పిస్తుా ప్రోత్సహిస్తున్నారు.
మహిళలు  వీడియొాలద్వారా పంపిన
కవితలకు బేక్ గ్రౌండ్  కలరింగ్ తో పాటు
మ్యుాజిక్ తో వచ్చే టైటిల్స్ ను జతచేసి
మహిళా కవయిత్రి  పంపిన కవితను
వీడియొా ప్రసారణ చేస్తుా  యుాట్యుాబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి మహిళలకు
స్ఫుార్తి నిస్తున్నారు. అంతేకాదు ప్రసిద్ధి చెందిన ఎన్నో కవితా వేదికల  గ్రుాప్ ల అడ్మిన్ల తో
సత్సంబంధాలను కలుపుకొని వారి సహకారంతో ఎందరో మహిళలను ప్రోత్సాహపరుస్తుా..
వారిలోనున్న కళకు ప్రాణం పొిస్తున్నారు.
ఈ సంవత్సరం" శ్రావణ మాస విశిష్టత "అనే అంశం తో
మహిళామణుల కలాలకు పదును పెట్టించి అద్భుత కవనాలను వీడియొాలద్వారా మనకు అందించనున్నారు.
కళామతల్లినే కాక మహిళామణులందరినీ గౌరవిస్తుా వారు చేస్తున్న  ఈ సాహిత్య సేవ అభినందనీయం.
సాహిత్యాభిలాషులందరుా వారు చేస్తున్న ఈ సాహిత్య సేవకు తమ వంతు సేవగా ఛానల్ వారిని ప్రోత్సహిస్తుా "మగువ మహారాణి" అనే ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసి కవితలు చదువుతున్న మహిళామణులకు .
తగిన స్ఫుార్తినిస్తారని తలుస్తాను.
ఈ ఛానల్ను విజయవంతంగా ముందుకు నడుపుతున్న  దేవ వరపు ఈశ్వర్ గారికి  వారికి సహకరిస్తున్న కార్యవర్గ బృందానికి , అడ్మిన్లకు మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుతుా...నమస్కారం ..🙏🙏

*****************:::::::::::
మన భారత దేశం సద్ధర్మ సాంప్రదాయాలకు భక్తి శ్రద్ధలకు పెట్టింది పేరు .సంవత్సర కాలమంతా ఏదో ఒక పుాజ, ఉత్సవం, నోములు, వ్రతాల, పేరుతో
జాతి ,మత బేధాలు లేని ఆప్యాయాయతానురాగాల
సందళ్ళతో పండగలను జరుపుకోవడం విధి విధాయకమయ్యింది.
ఆయు రారోగ్య ఐశ్వర్యాలకు సర్వ మంగళాలకు శుభ ప్రదమైనది ఈ పండగల విశిష్టత.
ఈ పండగల లో మహిళామణులకు ఉపయొాగపడే
మంగళ్య పరమైన పండగలు అత్యంత భక్తి
పరమైన ఆచార వ్యవహారసలతో కుాడుకొని ఉన్నవి.

వాటిలో శ్రాణ మాస  నోముల వ్రత విధానం  ఒకటి.
వర్షాకాల అరంభం లో వచ్చే ఈ పండగ లో
ఈ నెలంతా కుాడా భక్తి నిండిన భావుకతో
మహిళ లు ఆనందంగా ఈ పండగలను జరుపుకుంటారు.
శ్రావణ మంగళ వారాలు పెళ్ళి కావలసిన కన్నెలు
అత్యంత ఆశక్తితో మంచి వరుడు కావాలన్న కోరికతో చేస్తే , కొత్తగా పెళ్ళైన స్త్రీ లు తమ మాంగళ్య బలం కోసం ఐదు సంవత్సరాలు ఈ వ్రత నోముని ఆచరిస్తారు.
ఈ నోములో నానపెట్టిన శనగలు , పసుపు, కుంకుమలు, పుాలు, పండ్లు, తాంబుాలం వక్కలు జాకట్టు ,బట్టలు పంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఇక ఈ నెలలో వచ్చే నాలుగు  శ్రావణ శుక్రవారాల లో
శ్రీ వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
శ్రావణ పుార్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు
మహిళ లందరుా బ్రహ్మ ముహుార్త సమయానికే స్నాన పానాదులు ముగించుకొని తమ ఇంటి ముందు రంగు రంగు  రంగ వల్లులను తీర్చి దిద్ది , గుమ్మాలకు పసుపు కుంకుమలద్ది పచ్చని మామిడి తోరణాలను  కట్టి
అమ్మవారైన  శ్రీ వరలక్ష్మీ దేవి మండపాన్ని శోడదశ కళ లతో అలంకరించి , శోడశోపచారాది పుాజలతో లక్ష్మీ దేవిని పుాజించి,  తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్య మిడి, ముత్తైదులకు దక్షిణ తాంబుాలాది వస్త్ర దానములతో సత్కరించి వారి ఆశీర్వాదాలు గైకొని
బంధు మిత్రపరివారులతో కలసి విందారగిస్తారు.
ఈ వ్రతాన్ని తొలుత చారుమతి అనే స్త్రీ కి స్వయంగా వరలక్ష్మీ దేవియే స్వప్నంలో కనిపుంచి వ్రత విధానమును తెలియ పరచిందని నాటి నుండి నేటి వరకు ఆ చారుమతి కొలిచిన రీతిలోనే  మహిళ లందరుా ఆ వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించి ,
చారుమతి స్వప్న వృత్తాంతమును కధగా చెప్పుకొని
కధాక్షతలను శిరసుపై జల్లుకుంటారు.
ఈ వ్రత మహిమతో ధన ధాన్య కనక వస్తు వాహనాలతోపాటు సర్వ మంగళ సౌభాగ్యాలు కలుగుతాయన్న నమ్మకంతో భక్తి శ్రద్ధలు నిండిన
ఆచారంతో మహిళ లందరుా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు .

Saturday, August 27, 2022

గురు పుార్ణిమ విశిష్టత

 గో.ర.సం వారి ఉపాధ్యాయ దినోత్సవ
కవితల పండుగ కొరకు*

అంశం : ఉపాధ్యాయ దినోత్సవం.
   శీర్షిక : గురువుల విశిష్టత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.

గు కారో అంధకారస్య , రు కారో తన్నిరోధకః’
అంటే గు అంటే చీకటి. రు పారద్రోలేవాడు.
గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి
ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు  గురువు ॥

అమ్మ వడిలో అప్యాయత నిండిన ఆనందం.
అమ్మ మాటల లో అనంత విశ్వం తనకే స్వంతం.
బాధ్యతల బాటలో నాన్న చుాపే జ్ఞానాలయం.
నా భవితను తీర్చి దిద్దే విజ్ఞాన విద్యాలయం ॥

ఆ ఆలయం లో  గురువు భగవత్స్వరుాపం.
త్రిముార్తి రుాపాలలో కొలువైన భుాలోక దైవం.
జ్ఞాన మనే జ్యోతితో మార్గదర్శకత్వం చేసి, మన
భవితను ఉజ్జ్వలంగా తీర్చి దిద్దే భుాలోక బ్రహ్మ ॥

శ్రుతి, స్మృతి పురాణ, శాస్రాలను భగవత్తత్వాన్ని మానవజాతికి అందించి, వేద విభజనతో వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచి దైవాంశ సంభూతుని  స్మరిస్తుా ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా స్మరించి
గురువులకు సమ్మానిత పాద పుాజలు చేయడం
మనందరిలో ఉన్న గురుభక్తికి నిదర్శనం .

********

26/08/2022.

గో.ర.సం వారి ఉపాధ్యాయ దినోత్సవ
కవితల పండుగ కొరకు*

అంశం : ఉపాధ్యాయ దినోత్సవం.
శీర్షిక : గురువుల విశిష్టత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.0

"గు" కారో అంధకారస్య , "రు" కారో తన్నిరోధకః’
అంటే "గు" అంటే చీకటి. "రు" పారద్రోలేవాడు.
గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి
ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు  గురువు ॥

అమ్మ వడిలో అప్యాయత నిండిన ఆనందం.
అమ్మ మాటల లో అనంత విశ్వం తనకే స్వంతం.
బాధ్యతల బాటలో నాన్న చుాపే జ్ఞానాలయం.
నా భవితను తీర్చి దిద్దే విజ్ఞాన విద్యాలయం ॥

ఆ ఆలయం లో  గురువు భగవత్స్వరుాపం.
త్రిముార్తి రుాపాలలో కొలువైన భుాలోక దైవం.
జ్ఞాన మనే జ్యోతితో మార్గదర్శకత్వం చేసి, మన
భవితను ఉజ్జ్వలంగా తీర్చి దిద్దే భుాలోక బ్రహ్మ ॥

మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయనే
నమ్మకమే నేటకీ గురు పుార్ణిమ ప్రాధాన్యతకు
దోహదమై  మనందరిలో గురు భక్తిని ప్రేరేపిస్తున్నది.

హామీపత్రం :

గోదావరి రచయితల సంఘం వారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కవితల పోటీ కొరకు నేను  వ్రాసిన కవిత నా స్వంత రచన అని, మరే ఇతర సమూహములోనూ, మరే ఇతర పోటీలలోనూ పోస్ట్ చేయలేదని హామీ ఇస్తున్నాను.

***********************************
హతీ సాహితీ కవి సంగమం (పంపాలి)
అంశం :  గురు పుార్ణిమ.
శీర్షిక : గురువే దైవం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.

"గు" కారో అంధకారస్య , "రు" కారో తన్నిరోధకః’
అంటే "గు" అంటే చీకటి. "రు" పారద్రోలేవాడు.
గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి
ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు  గురువు ॥

అమ్మ వడిలో అప్యాయత నిండిన ఆనందం.
అమ్మ మాటల లో అనంత విశ్వం తనకే స్వంతం.
బాధ్యతల బాటలో నాన్న చుాపే జ్ఞానాలయం.
నా భవితను తీర్చి దిద్దే విజ్ఞాన విద్యాలయం ॥

ఆ ఆలయం లో  గురువు భగవత్స్వరుాపం.
త్రిముార్తి రుాపాలలో కొలువైన భుాలోక దైవం.
జ్ఞాన మనే జ్యోతితో మార్గదర్శకత్వం చేసి, మన
భవితను ఉజ్జ్వలంగా తీర్చి దిద్దే భుాలోక బ్రహ్మ ॥

శిష్యుల లోపాలను సానబట్టి సద్గుణాలు నేర్పి
పరిపూర్ణ మానవుడిగా తీర్చి దిద్ది సమాజానికి
అందించే గుణాతీత శక్తి గల విష్ణు స్వరుాపుడు ॥

విశిష్ట ప్రాముఖ్యత గల ఆషాఢ శుధ్ధ
పూర్ణిమ రోజు శ్రుతి, స్మృతి పురాణ,
శాస్రాలను ,భగవత్తత్వాన్ని మానవజాతికి
అందించి, వేద విభజన చేయడం వల్ల
వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచిన
దైవాంశ సంభూతుడైన సద్గురువును
స్మరిస్తుా ఈ రోజున ఆధ్యాత్మిక గురువులను
స్మరించి, శిష్యులు గురు పాద పుాజలు చేస్తారు.॥

మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయనే
నమ్మకమే నేటకీ గురు పుాహ ప్రాధాన్యతకు
దోహదమై  మనందరిలో గురు భక్తి ని ప్రేరేపిస్తున్నది.

నాటి నుండి నేటివరకు సాగుతున్న గురుభక్తి
పరంపరలో నాకు విద్యా ,బుద్ధి, జ్ఞానము నొసగిన గురువులందరికీ మనః పుార్వక భక్తి గౌరవాలతో
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..🙏🙏

************

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.

శిష్యుల లోపాలను సానబట్టి సద్గుణాలు నేర్పి
పరిపూర్ణ మానవుడిగా తీర్చి దిద్ది సమాజానికి
అందించే గుణాతీత శక్తి గల విష్ణు స్వరుాపులు
భుాలోక దైవంగా వెలసిన సద్గురువులు ॥

విశిష్ట ప్రాముఖ్యత గల ఆషాఢ శుధ్ధ
పూర్ణిమ రోజు శ్రుతి, స్మృతి పురాణ,
శాస్రాలను ,భగవత్తత్వాన్ని మానవజాతికి
అందించి, వేద విభజన చేయడం వల్ల
వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచిన
దైవాంశ సంభూతుడైన సద్గురువును
స్మరిస్తుా ఈ రోజున ఆధ్యాత్మిక గురువులను
స్మరించి, శిష్యులు గురు పాద పుాజలు చేస్తారు.॥

మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయనే
నమ్మకమే నేటకీ గురు పుాహ ప్రాధాన్యతకు
దోహదమై  మనందరిలో గురు భక్తి ని ప్రేరేపిస్తున్నది.

*********************---

Thursday, August 4, 2022

మనసు

3/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం: మనసు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆట వెలది.

మంచి చెడుల తీరు  మనదు మేలును కోరు   
మనసు తెలుపు మాటె మంచి బాట
మనసు చెప్పు మాట మనసార వినుమయ్య
మనసు  మిత్రు డిలను  మరువ కయ్య ॥

మనిషి లోన మనసు మర్మ మెరుగ దయ్య 
నీకు మేలు జేయ నిలుచు నెపుడు
బుద్ధి బురద చేర సుద్ధి మాటలు జెప్పు
సుఖపు బాట జుాపు సులభ గతిని ॥

మనిషి హృదయ మందు మాన్య దేవత లుండు
దేహ మీదు కొలువు  దేవ తలకు
గుడులు గోపు రాలు గుణము నేర్పవు నీకు.
మనసె పాఠ శాల మరువ బోకు !